26-01-2026, 12:00 AM
ఎపిసోడ్ 43
అడవిలోకి వచ్చిన మంద గ్యాంగ్ ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ వస్తువులు తీసుకుని తగలబెట్టమని తన వాళ్లకి చెప్పాడు అభీర్.
వీడియోలో జరిగేదంతా చూస్తూ అభీర్ చాలా తెలివైనవాడు అని చెప్పాడు ముకుల్.
************************
అభీర్ చాలా తెలివైనవాడు అని చెప్పిన ముకుల్ దగ్గరికి వచ్చి "అంకుల్! మనం అడివిలోకి వెళ్లి వాళ్ళని ఒకసారి కలిసి వద్దామా?" అని అడిగాడు అభిజిత్.
"నో! ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళితే కచ్చితంగా మనమీద అనుమానం వస్తుంది. మనం హెల్ప్ చేశామని వాళ్లే మన దగ్గరికి రావాలి, అప్పటివరకు ఎవరు అటువైపు వెళ్ళకండి. ఆ అభీర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు ముకుల్.
"డాడ్! మరి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి?" అని అడిగాడు గోకుల్.
"మన ప్లేస్ కి వెళ్లి మాట్లాడుకుందాము ఇక్కడ మన మాటలు పక్షి విన్నాసరే వాళ్ళకి చేరిపోతుంది. లెట్స్ గో!" అని చెప్పాడు ముకుల్.
"సరే!" అని చెప్పి అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరారు అందరు.
*******************
మరుసటి రోజు బేర అడివిలో కొండమీద అక్కడ ఉన్న జనాలు అందరిని పిలిచి సమావేశం ఏర్పరిచి,
"ఈరోజు నుంచి మాన తెగకు నాయకుడు, అమ్మవారు సూచించిన మన అభీర్! మనలో కొంతమంది ఈ ప్రదేశం వదిలి బయటకు వెళ్ళవలసి వచ్చిన సమయం వచ్చింది. దాని విషయమై మనం నాయకుడు మాట్లాడతాడు." అని చెప్పాడు శంభు.
అక్కడ ఉన్న అందరి ముందుకు వచ్చినా అభీర్ మాట్లాడుతూ "మనం బయట ప్రపంచంతో సంబంధాలు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాము ఎవరు ఏది చెప్పినా నమ్మవలసిన పరిస్థితి వస్తుంది.
ఈరోజు మన మీద జరిగిన దాడి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఇలానే ఉంటే మన తెగ అంతరించిపోతుంది. మన పూర్వీకులు ధర్మం కోసం నిలబడతాము అని దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతాము.
అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మన తెగలో 14 సంవత్సరాలు నిండిన యువకులను ఐదు శాఖలుగా విడదీస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలతో కలిసి జీవిస్తూ వారి జీవన విధానాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి.
ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకి మనం కలుసుకుందాము, మన జాతి మనుగాడా కొనసాగాలి అంటే మనం దూరం అవ్వక తప్పదు, అలాగే మన భూమిని కాపాడుకోవాలి అన్న మనం పోరాటం చేయక తప్పదు." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! నువ్వు ఏది చెబితే అది మాకు వేదవాక్కు! నీ మాటకి ఇక్కడ ఉన్న వారందరూ కట్టుబడి ఉంటారు." అని చెప్పాడు అక్కడ ఉన్న ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి.
ఆ మాటకి సంతోషంగా చూస్తూ "నేను ఐదుగురు పేర్లు చెప్తాను ఒక్కొక్కరితో 50మంది చొప్పున ఒకో ప్రదేశానికి బయలుదేరి వెళ్లాలి." అని చెప్పి అమ్మవారి పాదాల ముందు చీటీలు తీశాడు అభీర్.
ఆ చీటీలో ఎవరి పేర్లు వస్తాయా అని టెంక్షన్ గా చూస్తూ ఉన్నారు అందరూ
చీటీలు తీసి పేర్లు చదువుతూ "రాజన్, అగస్త్య, అరుల్, రియా, బైరి వారితో పాటు ఎవరిని తీసుకువెళ్లాలో వారే నిర్ణయించుకుంటారు.
అలాగే ఈ 250 మంది మన ప్రాతం చుట్టూ ఉన్న ఐదు ప్రాంతాలకు వెళ్లి అభీర్ సేన అని తెలియకుండా రహస్యంగా జీవిస్తారు ఎటువంటి వార్త ఉన్నా సరే వెంటనే నాకు చేరవేస్తారు.
కలికాలంలో ధర్మం రక్షించబడడానికి మనం ఈ త్యాగం చేయక తప్పదు, ఇది ఆ అమ్మ ఆజ్ఞ అనుకోండి." అని చెప్పాడు అభీర్.
"నాయకుడా! నీ ముందు మాట్లాడుతున్నందుకు క్షమించు మన ప్రదేశం మీద దాడి జరగడం ఇది మొదటిసారి కాదు, కానీ ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? మన గుండె బలం, ఖండ బలంతో ధర్మాన్ని నిలబెడుతున్న ఈ దేవా భూమిని కాపాడుకోలేమా?" అని అడిగాడు బైరి.
"అవును! నాయకుడా మేము ఒక్కొక్కరం 100 మందిని ఎదుర్కోగలము, మనకి అడవిలో ఉన్న జంతువులు కూడా సహాయం చేస్తాయి, మనల్ని దాటి ఈ ప్రదేశానికి ఎవరు రాగలరు?" అని అడిగాడు ఆగస్త్య.
"మేమందరం మా ప్రాణాలకి తెగించి ఈ ప్రదేశానికి అడ్డుగోడగా నిలబడతాము అంతేగాని నిన్ను చూడకుండా మాత్రం ఉండలేము." అని చెప్పాడు రాజన్.
అంతలో పైకి లెచి "నాయకుడు చెప్పాడు అంటే అది అమ్మవారి నోటి నుంచి వచ్చిన వాక్కు దానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది." అని చెప్పింది రియా.
"అవును! మన మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు మనల్ని అంతం చేయడానికి మాత్రమే కాదు, ఈ ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు అని నాకు అనిపించింది." అని చెప్పాడు అరుల్.
వాళ్ళ మాటలు విని "ఇప్పటివరకు మీకు చెప్పని ఒక రహస్యం చెబుతాను, నా నామకరణం జరిగిన రోజు వేదాలు పట్టిస్తూ ఉండగా అమ్మవారి పాదాల దగ్గర మరొక గ్రంథం కనిపించింది." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "అవునా బిడ్డ! ఆ గ్రంథంలో ఏముంది?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు శంభు.
"ఆ గ్రంథంలో శ్రీకృష్ణుల వారు మన పూర్వీకులకు చెప్పిన మాటలు వ్రాసి ఉంచారు. చేతి మీద మన తెగ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి మూడోసారి జన్మించినప్పుడు ఈ ప్రదేశానికి ఆపద వస్తుంది. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాల కోసం ధర్మ యుద్ధం చేయవలసి ఉంటుంది.
దాంట్లో రాసిన దాని బట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు దొంగలించబడతాయి, మన ప్రదేశానికి ఆపద వస్తుంది. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పక్షంలో ఈ ప్రదేశం నశిస్తుంది అప్పుడు ధర్మం కూడా నశిస్తుంది." అని చెప్పాడు అభీర్.
ఆ మాట విని "అయ్యో మహా పాపం చేయబోతున్నారు, ఆ దుర్మార్గులు ఎవరో కాని వారి వంశం మొత్తం నశిస్తుంది." అని బాధపడుతూ చెప్పింది అభీర్ తల్లి.
"అమ్మవారి దగ్గర నిజంగా ఆ పాపం ఎవరైనా చేస్తే నువ్వు అన్నమాట కచ్చితంగా జరిగి తీరుతుంది." అని చెప్పాడు అభీర్.
"మన నాయకుడు చెప్పినట్లు రేపే మీ ప్రయాణం, ఇక్కడి నుంచి బయలుదేరుతున్న విషయం కూడా ఎవరికీ తెలియకూడదు. ధర్మం నిలబడాలి అంటే మన జాతి ఈ ప్రదేశం రెండు నిలబడాలి." అని చెప్పాడు శంభు.
"మన మీద దాడి చేయడానికి వచ్చిన వారి దగ్గర చాలా సొమ్ము దొరికింది దానిని అందరూ సమానంగా తీసుకుని బయలుదేరండి." అని చెప్పాడు అభీర్.
"సరే నాయకుడా! మా బుద్ధి బలంతో ఒక శక్తిగా ఎదుగుతాము అభీర్ సైన్యం అడవిలోనే కాదు, పట్టణంలో కూడా చెట్లు వేరు పాకినట్లు పాకుతాము ధర్మానికి రక్షణగా ఉంటాము." అని చెప్పారు ఐదుగురు.
*******************
వారం రోజుల తర్వాత ఢిల్లీ తన గెస్ట్ హౌస్ లో కంపెనీ ఫైల్స్ చూస్తూ ఉన్న ముకుల్ దగ్గరికి అభిజిత్ తో కలిసి వచ్చి
"డాడ్! బేరా అడవి నుంచి అభిజిత్ దగ్గరికి మనిషి వచ్చాడు, మనం సరైన సమయంలో వాళ్ళకి సమాచారం అందించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని అభీర్ ఒక లేఖ రాసి బహుమతిగా ఈ రాయిని పంపించాడు." అని చూపించాడు గోకుల్.
"అంకుల్! మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే! మనం ఆరోజు వెళ్ళినట్లయితే బుక్ అయిపోయే వాళ్ళము, ఇప్పుడు మన మీద వాళ్ళు ఫేవర్ గా ఉన్నారు మనం ఏది చెప్పిన నమ్ముతారు ఇంక మీ ప్లాన్ బి బయటకు తీయండి." అని చెప్పాడు అభిజిత్.
ఇద్దరికి వైపు చూసి నవ్వుతూ "ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనం తొందరపడ్డామో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. అ ఆఫీసర్స్ ని, శివమణిని పిలిపించండి. నా ప్లాన్ ఏమిటో ఎలా అమలు చేయాలో చెబుతాను." అని చెప్పి గోకుల్ వైపు చూసి
"ఇక్కడ మినిస్టర్ తో పరిచయమైంది కదా! మన మీటింగ్ కి అతన్ని కూడా తీసుకురండి." అని చెప్పాడు ముకుల్.
"సరే డాడ్! టుడేస్ లో మీటింగ్ అరేంజ్ చేస్తాను." అని చెప్పి అభిజిత్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళాడు గోకుల్.
****************
రెండు రోజుల తర్వాత ఆఫీసులో మీటింగ్ కి తనతో పాటు మినిస్టర్ ని తీసుకువచ్చి తండ్రి దగ్గరికి తీసుకెళ్లి "డాడ్! ఆయన పేరు జావీద్ గనుల శాఖ మంత్రి!" అని పరిచయం చేశాడు గోకుల్.
"హాయ్ ప్లీజ్ సిట్ డౌన్! మాతో చెయ్యి కలిపారు ఇంక మీ ఫ్యూచర్ మారిపోతుంది. సెంటర్లో అభిజిత్, స్టేట్ లో మీరు చక్రం తిప్పుతారు." అని చెప్పాడు ముకుల్.
"థాంక్యూ సో మచ్ సార్! మీలాంటి వారితో పరిచయం అవ్వడమే ఎక్కువ, పాట్నర్ షిప్ అంటే నా ఫ్యూచర్ నాకు అర్థం అవుతుంది." అని సంతోషంగా చెప్పాడు జావిద్.
అంతలో అక్కడికి శివమణి, మురళీ జోషి, జనార్ధన్ సర్ఫరాజ్, అభిజిత్ తో కలిసి రావడంతో "డాడీ! ఇంకా స్టార్ట్ చేద్దామా? మనవాళ్ళందరూ వచ్చేసారు." అని చెప్పాడు గోకుల్.
"ఎస్!" అని తన పక్కన ఉన్న వ్యక్తిని అక్కడ ఉన్న వారికీ పరిచయం చేస్తూ "అతని పేరు జేమ్స్ రాథోడ్! బ్రిటిష్ ఆర్మీలో మేజర్ గా వర్క్ చేశాడు, వార్ స్టాటజీలో తలపండిన వ్యక్తి, ఇప్పుడు మన ప్లానింగ్ ఏమిటో అతను వివరంగా చెప్తాడు." అని చెప్పాడు ముకుల్.
"హాయ్ ఫ్రెండ్స్! నేను శివమణి గారు, సర్పరాజ్ గారు ఆ తెగ గురించి రీసెర్చ్ చేసిన రిపోర్ట్ మొత్తం చదివాను, ఆ తెగ వాళ్ళ వార్ స్టేటజి వీడియోలో డైరెక్ట్ గా చూశాను.
యుద్ధంలో అయితే ఎయిర్ ఫోర్స్ తో మొత్తం క్లోజ్ చేయొచ్చు, కానీ ఇది యుద్ధం కాదు ప్రైవేట్ ఆక్రమణ మనకి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయదు,
కాబట్టి మనం ఆ ప్లేస్ ఆక్రమించుకోవాలని అంటే మనం ఒకే దెబ్బలో అక్కడ ఉన్న వారందరినీ చంపగలగాలి." అని చెప్పాడు జేమ్స్.
ఆ మాట విని "ఇంపాజిబుల్! అది అయ్యే పని కాదు." అని చెప్పాడు శివమణి.
"ఎస్! అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది వాళ్ళని సైక్లాజికల్ గా దెబ్బ కొట్టాలి." అని చెప్పాడు జేమ్స్.
"సైక్లాజికల్ గా దెబ్బ కొట్టాలంటే, అక్కడ మనం ఏం చేయాలి?" అని అడిగాడు అభిజిత్.
"ఆ తెగ వాళ్ళు అమితంగా ప్రేమించి కుటుంబంతో సమానంగా చూసుకునేది అక్కడ ఉన్న జంతువులని, ఫస్ట్ ఎటాక్ మనం వాటి మీద చెయ్యాలి, అప్పుడు వాళ్లు మానసికంగా కృంగిపోతారు." అని చెప్పాడు జేమ్స్.
"అంటే! మనుషుల్ని పంపించి అడవిలో ఉన్న జంతువుల్ని వేటాడి చంపేయాలా?" అని అడిగాడు మురళి జోషి.
ఆ మాటకి నవ్వుతూ "అలా చేయడం కూడా సాధ్యం కాదు, ఆ జంతువుల్ని మనం చంపము, అవే చనిపోతూ ఉంటాయి." అని ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాడు జేమ్స్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)