24-01-2026, 05:43 PM
మర్నాడు పొద్దున్నే లేచి బయలు దేరాం అమ్మ మ్మా వాళ్ళ ఊరికి. తాతయ్యా వాళ్ళ యింటికి చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంటైంది.ముందుగానే మేం వస్తున్నట్టు తెలుసు గాబట్టి తాతయ్య వంటావిడ చేత వంట చేయించనట్టు ఉన్నారు. వెళ్ళగానే చక్కగా అరిటాకూల్లో వంటావిడే అందరికీ భోజనాలను వడ్డించింది..నేనేదో మాట్లాడ బోతుంటే ముందు భోజనాలు కానీద్దాం రా అమ్ములూ అన్నాడు.తాతయ్య మామ్మ కూడా మాతోనే భోజనాలకు కూర్చున్నారు. మామిడి కాయ పప్పు, ఊర మిరపకాయలు, గుత్తివంకాయ కూర, పనసపొట్టు కూర దోసకాయ పచ్చడి, పులుసు కేసరి , పెరుగుతో నాకు పెళ్ళి భోజనంలా అనిపించింది.భోజనం చేయగానే అందరూ ఓ కునుకు తీశారు.నాకైతే నిద్రపట్టలేదు. ఆ సాయంత్రం తోట నుండి మల్లెపూలను తెప్పించాడు తాతయ్య.అమ్మ ,అమ్మ మ్మ కడుతుంటే మల్లెల పరిమళం ఇల్లంతా వ్యాపించింది.
నేను మామ్మకు నే తెచ్చిన వన్నీ ఇచ్చాను .నా బంగారు తల్లే అంటూ కావలించుకుని ముద్దు పెట్టుకుంది.ఆవిడ. కబుర్లతో సందడి సందడిగా గడిచిపోయింది ఆ సాయంత్రం. ఆ రాత్రి శనివారం సాయంత్రం కావడం వలన అందరికీ ఇడ్లీలను పెట్టింది అమ్మమ్మ.
*********
మర్నాడు నే లేచేసరికి అందరూ లేచి కాఫీలను తాగుతున్నారు..నేను లేచి దేవుడికి దణ్ణం పెట్టుకుని అమ్మ మ్మకు బర్తడే విషెష్ చెప్పాను.. కాసేపటికల్లా అమ్మమ్మ చక్కగా తలంటుకుని దేవుడి గదిలో పూజ చేసుకుంటోంది.ఈ లోపల మే మందరం స్నానాలను చేశాం..తాతయ్య వంటావిడను రమ్మన్నాడేమో అమ్మ మ్మ పుట్టీన రోజని వంటావిడ వచ్చేసింది.వస్తూనే మా అందరి కి టిఫెన్ గా పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది అందరికీ మరోమారు కాఫీలను ఇచ్చి తాను కాఫీ మాత్రమే తాగి వంటకుపక్రమించింది .అమ్మ అమ్మ మ్మ నడుగుతూ ఆవిడకు కావాల్సినవి అందిస్తూ సాయం చేస్ పుట్టినరోజు సందర్భంగా పులిహోర , బొబ్బట్లు , గారెలు, పాయసం, చేయిస్తోంది.
తాతయ్య స్నానం జపం అన్నీ పూర్తి చేసుకుని అమ్మ అందరినీ హాల్లోకి రమ్మని పిలిచారు . అక్కడ వరుసగా అందరూ కూర్చోటానికి వీలుగా కుర్చీలు వేసి ఉన్నాయి..
అందరూ వచ్చాక తాతయ్య అమ్మ మ్మను చూస్తూ ..
" అదేంటి మామూలు చీరలో ఉన్నావు..అమ్ములు కొనిచ్చిన పట్టుచీర కట్టుకుని , పూలు పెట్టుకొని రా .." అని అన్నాడు..ఆశ్చర్యంగా తాతయ్య వంక చూసింది అమ్మమ్మ. నేను నవ్వు కున్నాను..ఎందుకంటే ఆవిడ పెళ్ళైన ఇన్నేళ్ళలో ఆవిడను ఫలానా చీరను కట్టుకోమని ఎప్పుడూ తాతయ్య అనే వారు కాదట ..
అదేంటే . ఇంకా అలా నిలబడ్డావు . వెళ్ళుకొత్త చీర కట్టుకుని రా అంటూ ....పుట్టినరోజు రోజు పాపాయికి అర్థం కాలేదేమోరా అమ్ములూ...అన్నాడు నవ్వుతూ..
తాతయ్యలా అంటుంటే అమ్మ మ్మ బోలెడు సిగ్గుపడి పోయి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో లోపలికి వెళ్ళిపోయింది .వెను కనే అమ్మ కూడా వెళ్ళింది.కాసేపట్లో మామిడి చిగురు రంగు పట్టుచీర కట్టుకుని కొప్పులో మల్లె పూలతో వచ్చింది అమ్మ మ్మ..
ఈ చీర నీకు బాగా నప్పిందోయ్...అమ్మమ్మను ఉద్దేశిస్తూ తాతయ్య అంటే సిగ్గుల మొగ్గైంది అమ్మమ్మ.నేను వెంటనే ఫోన్ తో ఫోటోలు తీశాను .అందరం అమ్మ.మ్మకు స్వీటు తినిపించాం
ఇంతలో మామ్మ అమ్మ మ్మని దగ్గరకు రమ్మని పిలిచింది.ఏవిటని దగ్గరకెళ్ళిన అమ్మ మ్మ చూస్తూ...
"నేను నీకేనాడు పుట్టినరోజు రోజు కానుక ఈయలేదు. అసలు నాకు నీ పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు.నిజానికి నిన్నెప్పుడూ ఆడిపోసుకుంటూనే ఉన్నాను..నీవేనాడూ నాకు ఎదురు చెప్పలేదు .దానిని నీ మంచితనంగా భావించక నా స్థితికి జాలి పడుతున్నావని ఇంకా కోపంతో రగిలిపోయేదాన్ని. కాని క్రమేణా నీ మంచితనంతో నా కోపం మంచులా కరిగింది. ఆనాడు నేనెందుకలా మూర్ఖంలా ప్రవర్తించానో నాకే తెలియదు.నన్ను మన్నించు ..ఇంద ఇది తీసుకో. .మనస్ఫూర్తిగా ఇస్తున్నాను చూడు...అంటూచేతితో ఒక కవరు పెట్టింది. కలలా అయోమయంలా అనిపిస్తుంటే అమ్మ మ్మ కవరు విప్పి చూసేసరికి లోపల తళతళలాడే వెండి పట్టీలు, అమ్మ మ్మ కిష్టమైన చిన్న చిన్న మామిడి పిఃదెలతో పెట్టుకునే చోట మూడు చిన్న మువ్వలున్న అందమైన వెండి పట్టీలు.
అమ్మమ్మ కళ్ళు ఆనందంతో ఒక్కసారిగ మెరిశాయి.మామ్మ సైగ చేయగా అమ్మ అమ్మమ్మ పాదాలకు పట్టీలను పెట్టింది
చాలా ఏళ్ళ తరువాత తన పచ్చని పాదాలకు పట్టీలు..!! తన కళ్ళను తానే నమ్మలేకపోతోంది అమ్మ మ్మ..ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న వేదనో, పట్టీలు పెట్టుకున్న ఆనందమో కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలై జల జలా రాలుతుంటే అటూ ఇటూ అడుగులేస్తోంది చంటి పిల్లలా అమ్మమ్మ.. లక్ష్మీ దేవే చిరుమువ్వల సవ్వడితో తిరుగుతున్నట్టు ఉందంటూ అటూ ఇటూ తిరుగుతున్న అమ్మ మ్మని చూసి మురిసిపోయింది మామ్మ..అమ్మైతే అనందగా ఆశ్చర్యంగా నాకేసి ప్రశంసా పూర్వకంగా చూస్తోంది.
ఇంతలో..తాతయ్య అమ్మమ్మతో ..ఇలా అన్నాడు..
నా జీవిత సహధర్మచారిణిగా నీవు ఈ ఇంట్లో అడుగుపెట్టావు. బాధ్యతలు , బంధాలు, అప్పులు, కష్టాలు , సుఖాలు ..అన్నీ కలిసే పంచుకున్నాం .కాకపోతేఎవరి వంతు బాధ్యతను వారు నిర్వర్తించాం . ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను మరవకుండ పెద్దలు చెప్పినవన్నీ పాటించాం.మనకంటూ చూసుకునే సరికి మనం ముసలితనానికి వచ్చేశాం. నాకు కావలసింది అమర్చటంలో నీవే నాడూ లోటు చేయలేదు. నాకే కాదూ నా తల్లిదండ్రులను , నా తోబుట్టువులకు , నాతమ్ముళ్ళకు కూడా ఎప్పుడూ ఏ లోటూ రాకుండా చూసుకున్నావు.అడక్కుండానే అన్ని అమర్చి పెట్టే దానివి. నీవు నాకు ఇల్లాలు కావడం నేను ఏనాడో చేసుకున్న అదృష్టం. ఈ మాటలు నాకు మనసులో ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి .కానీ ఎప్పుడూ నేను నీతో అనలేదు.
నేను నీకు తిండికి బట్టకు లోటు లేకుండా చూసుకున్నానే కానీ ఎనాడూ నీ మనసెరిగి ప్రవర్తించలేదు.నీ చిన్ని చి చిన్ని కోరికలను గాని నీ ఇష్టాలను పట్టించుకోలేదు.నూటికి తొంభై శాతం కుటుంబాలలోని మగవాళ్ళలాగానే నేనూ ఉన్నాను.
"బంగారం కొనిబడితే భార్య సంతోషిస్తుందనుకుంటారు మగవాళ్ళు. కానీ భర్త పది రూపాయలతో కొని తెచ్చే ఒక మూర మల్లెపూలకు ఎంతో సంతోషిస్తుందని తెలుసుకోరు."
"భార్యని మేడల్లో ఉంచామా , మిద్దెల్లో ఉంచామా అనే చూస్తారు గానీ తన మనసులో ఉంచాలనే భావన ఉండదు.చాలా మంది మగవాళ్ళకి . అందరినీ వదిలేసి కాపరానికి వచ్చిన భార్యను పనిచేసే , పిల్లల్ని కనే యంత్రం లా చూస్తాము కాని మనసున్న మనిషిగా చూడరెవరు .దీనికి నేనేమీ అతీతుడను కాను..."
ఇవన్నీ నేను ఈ రోజు నేను ఎందుకు చెబుతున్నానంటే ..కారణం నా మనవరాలు బంగారు తల్లి అమ్ములు..తన అమ్మమ్మ కోరిక గ్రహించి ఆవిడ తన తల్లి తోమనసు విప్పి చెప్పే మాటల ద్వారా ఆవిడ మనసులో పట్టీలంటే ఉన్న ఇష్టాన్ని అవి పెట్టుకోలేని ఆవిడ పరిస్థితి తెలుసుకొని నాకు అర్థం అయ్యేటట్లు చేసి నేనే కొంటానన్నా తానే పట్టీలను కొని తెస్తాననీ మామ్మను కన్విన్స్ చేయమని ఆ పట్టీలను మామ్మ చేతే అమ్మమ్మకు ఇప్పిస్తే బాగుంటుందని నాకు చెప్పింది. నా కూతురు కూడా ఏనాడూ నాతో చెప్పలేదు వాళ్ళమ్మకు సంబంధించిన దేదీ . వాళ్ళ అమ్మ మ్మ కోరిక తీర్చాలని ఎంత తపన పడ్డది అమ్ములు ..నిజానికి ఆ విషయం నేనప్పుడు చాలా తేలికగా తీసుకున్నాను.తరువాత మర్చిపోయాను.
"ఆడవాళ్ళ మనసు చాలా సున్నితం .వాళ్ళ మనసు నెరిగి వాళ్ళ చిన్న చిన్న ముచ్చట్లను తీరిస్తే చాలా సంతోషిస్తారు"
ఈ విషయాన్ని ఇక మరచి పోనమ్మా బంగారు తల్లి . సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తున్నా సంప్రదాయం, బంధాలను , విలువలను మరిచి పోని నీకు తాతయ్యనై నందుకు నేను గర్విస్తున్నాను. అంటూ నా భుజం తట్టారు తాతయ్య.
నేను అమ్మ మ్మ వంక చూశాను. ఒక్కసారిగా నన్ను కౌగిలించుకుంది అమ్మమ్మ.
మితంగా మాట్లాడే అమ్మ మ్మ ఒకే ఒక మాటంది ...
"నువ్వు నా మనవరాలి రూపంలో ఉన్న మా అమ్మవి అంది గద్గద స్వరంతో "
************
మనసు పొరల్లో ఎక్కడో మడతపడి పోయిన చిన్ని చిన్ని కోరికలు తీరని మలి వయసు వారిని మురిపించాలంటే పెద్దగా డబ్బులేం ఖర్చుపెట్టక్కర్లేదు .
మనసుంటే చాలు .....!!!!!
#### శుభం###
కధా రచన
@హంసగీతి

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)