24-01-2026, 05:41 PM
ఇంతలో గడియారం రెండు గంటలు కొట్టింది ఆలోచనలలో ఉన్న నేను ఇక నిద్రకుపక్రమించాను.
********
మర్నాడు కొంచెం లేటుగా ఎనిమిదింటికి లేచాను ఆసరికే అమ్మ, అమ్మ మ్మ లేచి స్నానాలను చేసి పూజ ముగించుకుని కాఫీ తాగుతున్నారు. నేను లేచి ఇద్దరికి గుడ్మానింగ్ చెప్పి మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి ఇడ్లీల టిఫెన్ రడీ గా ఉంది టిఫెన్ తింటుంటే ..అమ్ములూ...ఎల్లుండి అమ్మ మ్మ పుట్టినరోజే ..అని చెప్పింది అమ్మ..అవునా..సరే అయితే ఇంకో గంటలో మనం బయటకు వెళుతున్నాం ..వంట గింటా పెట్టుకోకు అమ్మా ..అని చెప్పాను..
"ఎక్కడికే ?..అనడిగింది అమ్మ సాలోచనగా
ముందు మీ రిద్దరూ రెడీ అవ్వండీ...అని తొందర చేశాను.
ఎందుకే అమ్ములూ ఇప్పుడు ...రేపు నేను ఊరెళ్ళిపోతాను అంది అమ్మ మ్మ.
అదేం కుదరదు.. మీరు తొందరగా తెమలండీ అంటూ నేను డ్రస్ వేసుకుని బిర్లా మందిర్ కి క్యాబ్ బుక్ చేశాను ..
అమ్మా అమ్మ మ్మ రడీ అయ్యారు..ఆరు గజాల జరీ అంచున్న ఆకుపచ్చ కలనేత
చీర లో పావలా కాసంత బొట్టుతో జట్టుముడి పెట్టుకున్న కొప్పులో పూల చెండుతో మోముపై చెదరని చిరునవ్వుతో ప్రశాంత వదనంతో అమ్మ మ్మ సాక్షాత్తు ఆ జగన్మాతలా చూడగానే చేతులెత్తి నమస్కరించే అమ్మవారిలా ఉంది.
మెరూన్ కలర్ బెనారస్ సిల్క్ చీరలో లూజుగా వేసుకున్న జడలో పూలచెండు తురుముకొని గలగలా నవ్వుతూ అమ్మ లక్ష్మీ దేవిలా ఉంది ఇద్దరూ లక్ష్మీ పార్వతుల లాగా నడచుకుంటూ వచ్చి క్యాబ్ ఎక్కారు.క్యాబ్ ఎక్కాక అమ్మ అమ్మ మ్మ ఊరి విషయాలను గలగలా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు
******
అమ్మకు తాతయ్య పోలిక వచ్చింది..తెల్లగా ఉంటుంది. అమ్మమ్మది ఛామన ఛాయ. నేనూ ఛామన ఛాయే..నాకు మాత్రం అమ్మ మ్మ పోలిక వచ్చిందంటారు అమ్మా నాన్న..చిన్నప్పుడు అమ్మ మ్మ ఎలా ఉండేదో నేనూ అలాగే ఉన్నానని అమ్మ మ్మ అంటూ ఉండేది.ఎప్పుడూ ఇంటెడు చాకీరీ వచ్చిపోయే వాళ్ళకు వంటలు, వడ్డనలు, ఇంట్లో అత్తా, ఆడపడుచుల సూటీపోటీ మాటలు, పండుగలకు, పబ్బాలకు , పిండివంటలు, చేయడం, అందరికీ అన్నీ అందింపులు,అమర్చి పెట్టడం తరువాత చిన్నాడబడుచు, మరుదుల పెళ్ళిళ్ళు, తరువాత తన పిల్లల చదువులు పెళ్ళిళ్ళు , అత్తగారి , మావగారి సేవలు , ఇలా గడిచిపోయింది కాలమంతా ఆవిడకు. అత్తగారు, మావగారు కాలం చేశాక ఇక అప్పుడప్పుడు ఊళ్ళో పొరుగూళ్ళో పెళ్ళిళ్ళకు తప్ప దాదాపు ఎక్కడకూ కదిలేది కాదు. అమ్మా , మామయ్యలు పెద్ద వాళ్ళై వాళ్ళ పెళ్ళిళ్ళైయ్యాక మావయ్యల తో , అమ్మ గురించి అప్పుడప్పుడూ ఆవిడకు ఈ భాగ్య నగరానికి వచ్చేది .అదీ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు..
అందరికీ అన్నీ అమర్చి పెట్టే అమ్మ మ్మ కు ఆవిడ ఇష్టాఇష్టాలను గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు. తీర్ఛే వాళ్ళు లేరు..
పెద్ద మావయ్యకూ చిన్న మావయ్యకూ ఇద్దరికీ ఇద్దరిద్దరు అబ్బాయిలే..అమ్మకు మాత్రం నేనొక్కదాన్నే ఆడపిల్లను. అందుకే ఒక్క మనవరాలినని అమ్మ మ్మ కు నేనంటే ప్రాణం ..నాక్కూడా అమ్మ మ్మంటే ప్రాణం.అప్పడప్పుడూ అమ్మ మామూలుగా మాట్లాడుతూ అమ్మ మ్మ గురించి చెప్పిన విషయాల వలన నాకీ విషయాలన్నీ తెలిశాయి...తాతయ్యకూ ఒక్క మనవరాలినని నేనంటే చాలా ప్రేమ . చిత్రంగా తాతయ్యా వాళ్ళ అక్కకూ నేనంటే ఎందుకో అమిత మైన ప్రేమ .నేను అమమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆవిడకు కావలసిన కొన్ని ఫ్రూట్ జ్యూసులను, బిస్కెట్లు, చప్పరింతల బిళ్ళలను ఇలా తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని.ఒకసారి ఆవిడ కళ్ళజోడు విరిగిపోతే గోల్డ్ ఫ్రేమున్న ఖరీదైన కళ్ళజోడును కొనిచ్చాను ఇంకా చేతి కర్ర, కొనిచ్చాను. పైగా వెళ్ళినప్పుడల్లా మామ్మా , మామ్మా అంటూ , నీ ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించేదాన్ని దానికే ఆవిడ ఎంతో పొంగిపోయేది.ఏదో అలా ఉన్నానే అమ్ములూ, ఆ దేవుడి పిలుపింకా రాలేదు నా మీదింకా ఆయనకు దయ రాలేదు అనేది.
నిజానికి ఆవిడకు అన్నేళ్ళు వచ్చినా షుగరు బీపీ ఏవీ లేవు.పెద్దతనం వలన వచ్చిన బలహీనత తోనే .ఆవిడ బాధ పడేది ఎప్పుడన్నా .ఆవిడ కంటి చూపు బాగానే ఉందిఈ వయసులో కూడా. రామాయణ , భాగవతాలను చదువుతూ ఉంటుంది రోజూ కాసేపైనా . మొత్తానికి వాళ్ళ తమ్ముడు అంటే మా తాతయ్య తరువాత ఆవిడకు నచ్చిన ఒకే ఒక ప్రాణిని నేనే...
********
ఇలా నేను ఆలోచనలో ఉండగానే బిర్లా మందిర్ దగ్గర దింపేసింది క్యాబ్..ముగ్గురం వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాం తరువాత తిన్నగ అక్కడ నుండి బయలు దేరి కళామందిర్ కు వెళ్ళాము అక్కడ అమ్మ మ్మకు నచ్చిన పట్టుచీరను అమ్మను చూడమన్నా ఇప్పుడెందుకే అనవసరంగా డబ్బులు దండగని.అమ్మ మ్మ సణుగుతుంటే..
అమ్మ మ్మా...నేను ఇప్పుడే మీకు ఇంత ఫ్రీగా కొనిపెట్టగలను .అమ్మా నాన్న చక్కగా ఇంజనీరింగ్ చదివించారు.చదవగానే క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్ వచ్చింది నాకు ఒక సంవత్సరం చేశాక శాలరీ ఇంకా పెరిగింది.ఇంకా రెండు సంవత్సరాలు జాబ్ చేసి అమ్మా నాన్నతో మీ అందరితో హ్యాపీ గా ఉండాలని నిర్ణయించుకున్నాను.పెళ్ళైయ్యాక నేను స్వంతంగా సంపాదిస్తున్నా ఖర్చు పెట్టేడబ్బు గురించి నా భర్త ఆరా అడగవచ్చు అడగగపోనూ వచ్చు. అది చెప్పలేము.కనుక నీ పుట్టినరోజు సందర్భంగా నీకు నచ్చిన పట్టుచీర తీసుకోమని చెప్పాను. అమమ్మ తనకు నచ్చిన మావిడి చిగురు రంగు పట్టుచీర తీసుకుంది.నేను అమ్మతో తాతయ్యకు , మామ్మ కు కూడా బట్టలు తీయమని చెప్పి ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్ళి నేననుకున్న పని ముగించుకుని వచ్చాను .ఇంతలోగా అమ్మనే చెప్పిన బట్టలు తీసింది
అమ్మను కూడా చీర కొనుక్కోమంటే మొన్ననేగా పండు క్కి నాకు కొన్నావుగా అని, సోఫా కవర్స్ తీసుకుందామే మనం అంటూ చక్కని సోఫా కవర్స్ తీసింది .బిల్ పే చేసి సంచులతో ముగ్గురం స్వాగత్ గ్రాండ్ కి వెళ్ళి చక్కగా లంచ్ చేసి ఇంటికొచ్చే సరికి నాలుగైంది .ఇక అలసి పోయిన ముగ్గురం హాయిగా ఓ కునుకు తీశాం.
*****
ఆ సాయంత్రం నిద్ర లేచాక అమ్మా అమ మ్మా కాఫీ తాగుగుంటే నేను నా కాఫీ కప్పు పట్టుకుని పైకి వచ్చాను..కాఫీ తాగాక తాతయ్యకు ఫోను చేసి ఓ గంట సేపు మాట్లాడాను.కిందకు దిగి వచ్చి నేను తాతయ్యతో మాట్లాడానని రేపు పొద్దున్నే బయలు దేరి అమ్మ మ్మా వాళ్ళింటికి వెళుతున్నామని చెప్పాను .
ఇంక అమ్మ అమ్మమ్మ హడావిడి మొదలైంది .అమ్మమ్మ చేత, కారంపొడి , అల్లంచట్నీ చేయించుకుంది అమ్మ.అమ్మమ్మ వేయించి ఇస్తే అమ్మ మిక్సీ వేసింది.తరువాత ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి వంట పనిలో పడ్డారు. నేను తన పుట్టినరోజు కు పట్టుచీర కొన్నానని నా మనవరాలు అమ్ములు బంగారు తల్లి అని అమ్మమ్మ మురిసిపోతూ అమ్మతో అంటోంది.ఇప్పుడే వస్తానని చెప్పి .నేను బయటకు వెళ్ళి అమ్మ మ్మకు ఇష్టమైన పుల్లా రెడ్డి స్వీట్స్, హాటు, తాతయ్యకు ఇష్టమైన కాజుబర్ఫీ , మామ్మకు మాదీఫల రసాయనం, హాజ్మోలా ,చప్పరింతల పనసతొనలు కొనుక్కొచ్చాను. వచ్చేసరికి రాత్రి తొమ్మిదైంది.ఇలోగా వంట రెడీ ఆలుగడ్డ వేపుడు, ములక్కాయ చారు, ఆవకాయ, పెరుగు తో భోజనం చేశాము .చేశాక అమ్మ మ్మ బ్యాగు సర్దుకుంది .అమ్మ కూడా తనవో రెండు చీరలు నావో రెండు డ్రసెలను పెట్టి బ్యాగును సర్దింది మరో బ్యాగులో స్వీట్లు పళ్ళు, ఏవో చెట్నీలు, ఇంకా ఏవో కావల్సినవి సర్దింది..ఇంక ముగ్గురం పొద్దుట నుండీ అలసి పోయి ఉన్నా వేమో .పడుకోగానే వెంటనే నిద్ర పట్టేసింది.

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)