Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 42


మురళీ జోషి వాళ్ళు  డ్రోన్ కెమెరాస్ పంపించి అడవిలో జరిగేది చూసే విధంగా ఏర్పాటు చేయడంతో, వీడియో చూస్తూ కోతులు ట్రాప్ చేస్తున్నాయి ఆ తెగ వాళ్ళు మంద గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు అని సర్పరాజ్ చెప్పడంతో నేను వాళ్ళ ఎటాక్ స్టేటాజీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు ముకుల్.

***********************

గెస్ట్ హౌస్ రూమ్ లో వీడియోలో చూస్తూ "కోతి ట్రాప్ చేసి వీళ్ళని తీసుకువెళ్లింది ఇంకా ఎవరు రాలేదేంటి!" అని అన్నాడు అభిజిత్.

అంతలో రెండు పెద్ద పులులు గంభీరంగా నడుచుకుంటూ రావడం చూసి "అదిగో! మనకి పులి పిల్లలు ఎంట్రీ ఇచ్చాయి వీళ్ళకి డైరెక్ట్ గా పెద్దపులులే ఎంట్రీ ఇస్తున్నాయి." అని చూస్తూ చెప్పాడు గోకుల్.

రెండు పెద్ద పులులు రావడం చూసి "ఒరేయ్ పైడి! వాటిని కాల్చి అవతల పారేయండి." అని చెప్పాడు మంద.

"సరే అన్న!" అని తన మనుషుల్ని పిలిచి బేరల్ గన్ తీసుకుని లోడ్ చేసి పెద్దపులలా వైపు గురి పెట్టి "షూట్ చేయండి రా.." అని చెప్పాడు పైడి.

అంతలో అక్కడికి వచ్చి గన్ ముందు నుంచుని దాని గొట్టంలో కన్ను పెట్టి చూస్తూ "దొర! దీంట్లో గోళీ ఉంటుందా?" అని అడిగాడు సహదేవుడు.

వీడియోలో చూస్తూ "ఆ కుర్ర నా కొడుకు వచ్చేసాడు, మంద గ్యాంగ్ వీడిని దాటుకుని వెళితే సగం గెలిచినట్లే!" అని చెప్పాడు జాకి.

"ఏంటి సార్! వాడిని అంతలా మెచ్చుకుంటున్నారు? గన్ సౌండ్ కి భయపడి పోయేటట్లు ఉన్నాడు." అని నవ్వుతూ చెప్పాడు జనార్ధన్.

గన్ ముందు నుంచున్న సహదేవుడిని చూసి "ఎవడ్రా నువ్వు? బుల్లెట్ తగిలితే పిట్టల ఎగిరిపోతావు, కొండమీద నుంచి వస్తున్నావా? మిగతా వాళ్లు కూడా అక్కడే ఉన్నారా?" అని కోపంగా చూస్తూ అడిగాడు పైడి.

"ఆ కొండ మీద ఎవరు లేరులే కానీ దొర! ఇంతకీ మీరు ఇక్కడకు ఎందుకు వచ్చినారు? కొంపతీసి పెద్దపులిని వేటాడడానికా?" అని అడిగాడు సహదేవుడు.

ఆ మాట విని అక్కడికి వస్తూ "కాదు మీ గూడెం దొరని వేటాడడానికి!" అని సహదేవుడు తల మీద గన్ పెట్టి చెప్పాడు మంద.

"అవునా?" ఏంటి మా నాయకుడిని వేటాడేది నువ్వేనా?" అని నవ్వుతూ ఉన్నాడు సహదేవుడు.

నవ్వుతున్న సహదేవుడి వైపు కోపంగా చూస్తూ చేతిలో ఉన్న గన్ వెనక్కి తిప్పి కొట్టడానికి మీదకి వెళ్ళాడు మంద గ్యాంగ్లో ఒకడు.

అంతలో వేగంగా అక్కడికి వచ్చి సహదేవుడు మీదకి వచ్చిన వాడిని రెండు కాళ్ళతో పట్టుకుని  దూరంగా ఉన్న కొండమీదకు తీసుకు వెళ్లిపోయింది సింబా.

అది చూసి "ఒరేయ్ కుమారు! ఆ పక్షిని షూట్ చేయండిరా..!" అని గట్టిగా అరిచాడు పైడి.

"సరే బాస్!" అని షూట్ చేయడానికి గన్ పైకి ఎత్తిన కుమార్ ని చూసి చేతిలో ఉన్న కర్ర నేలకి అదిమి పెట్టి పైకి ఎగిరి కాలుతో పీక మీద ఒక తన్ను తన్నాడు సహదేవుడు.

ఆ దెబ్బకి రెండు కళ్ళు తేలేసి కిందపడి కదలకుండా ఉండిపోయాడు కుమార్.

వీడియోలో అది చూసి ఒక్కసారి షాక్ అయ్యి "సార్! మీరు చెప్పింది నిజమే! వీడు మామూలు వాడు కాదు, వాడి మీద నాలుగు రేట్లు ఉన్న వాడిని ఒక్క దెబ్బతో కింద పడేసాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు మురళి జోషి.

తన మనిషి కింద పడిపోవడం చూసి దగ్గరకు వెళ్లి తల ఊపి చూసి "అన్న! మాన కుమార్ చచ్చిపోయాడు." అని కంగారుగా చూస్తూ చెప్పాడు పైడి.

ఆ మాటకి సహదేవుడి వైపు కోపంగా చూస్తూ "ఒరేయ్ ఈ కుర్ర నా కొడుకుని రెండుగా చీల్చి చెట్లుకి కట్టండి." అని ఆవేశంగా చెప్పాడు మంద.

ఆ మాట విని కోపంగా గాండ్రిస్తూ వస్తున్న రెండు పెద్ద పూలులను చూసి "ఆగండి." అని చెప్పి ఆకాశం వైపు చూసి వింత శబ్దంతో గట్టిగా అరిచాడు సహదేవుడు.

ఆ సౌండ్ ఆగే లోపల దూరం నుంచి 4 బళ్ళాలు వచ్చి అక్కడ ఉన్న మంద మనుషుల గుండెల్లో దిగాయి.

చచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్లి కాలితో తంతు మంద వైపు చూసి "లోపలికి వెళ్లాలని చూస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది. మర్యాదగా వెనక్కి వెళ్లిపోండి." అని వార్నింగ్ ఇచ్చాడు సహదేవుడు.

"మీరేం తెగ వాళ్ళు రా..! పిరికినా కొడుకుల్లాగా ఎక్కడో దాక్కుని బళ్ళాలు విసురుతున్నారు దమ్ముంటే ముందుకి రమ్మని మీ వాళ్ళతో చెప్పు!" అని రెచ్చగొడుతూ చెప్పాడు మంద.

"మా సైన్యం బయటికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లలేరు." అని చెప్పాడు సహదేవుడు.

వీడియోలో చూస్తూ "ఏంటి సార్ వీడు, వాళ్ల దగ్గర ఉన్న గన్ అంత లేడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు జనార్ధన్.

"ఆ తెగవారు శివాజీ మహారాజ్ గారి తో పాటు యుద్ధం చేసిన వీరుల వారసులు! ఆ మాత్రం ధైర్యం ఉంటుంది." అని చెప్పాడు ముకుల్.

"డాడ్! మంద కూడా వాడిని బానే రెచ్చగొడుతున్నాడు, కోపంతోనైనా అందరూ బయటికి వస్తారు అనుకుంటున్నాను."  అని చెప్పాడు గోకుల్.

అంతలో అక్కడికి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని వీడియో లో చూసి "సార్! అతనే అభీర్! ఆ తెగకి కాబోయే నాయకుడు." అని చెప్పాడు శివమణి.

"అవునా? యుద్ధానికి నాయకుడే ముందు వస్తున్నాడేమిటి?" అని డౌట్ గా అడిగాడు ముకుల్.

"సార్! అది వీరుల లక్షణం! తను ముందుండి సైన్యానికి ధైర్యం నింపుతాడు, అవసరమైతే తన వాళ్లకోసం ప్రాణం కూడా ఇస్తాడు." అని చెప్పాడు శివమణి.

"గ్రేట్! నువ్వు చెప్పింది నిజమే, అభీర్ ఇక్కడ ఉండగా మనం లోపలికి ఎంటర్ అవ్వలేము, ముందు వీడిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో ఆలోచించాలి." అని చెప్పాడు ముకుల్.

రెండు పులుల మీద చేతులు వేసుకుని నడుచుకుంటూ వస్తున్న అభీర్ ని చూపించి "చూశావా దొర! మా నాయకుడి బిడ్డ  ఎలా ఉన్నాడో,  మీకు దమ్ముంటే మా అభీర్ కళ్ళల్లో బేరుకు తెప్పించండి చాలు మీరు గెలిచినట్లే!" అని గొప్పగా చెప్పాడు సహదేవుడు.

"ఏంటి? వీడిని చూసి మేము భయపడాలా?" అని గన్ తీసి షూట్ చేశాడు పైడి.

వేగంగా తన మీదకి వస్తున్న బుల్లెట్ ని చూసి  పక్కకి తప్పుకొని చేతిలో ఉన్న కత్తిని బలంగా విసిరాడు అభీర్.

వేగంగా వస్తున్న కత్తిని చూసి తప్పుకునే లోపు పైడి తలలో దిగి రెండు ముక్కలుగా చీల్చింది.

అది చూసి "తమ్ముడు!" అని గట్టిగా అరుస్తూ "ఒరేయ్! వాడిని చంపేయండి రా.!" అని తన మనుషులకి చెప్పాడు మంద.

గ్యాంగ్ లో ఉన్న మనుషులు గన్స్ పైకి తీసేలోపు చెట్ల మీద నుంచి కొండల మీద నుంచి దూకి బల్లెలతో పొడిచి చంపుతు ఉన్నారు అభీర్ సైన్యం.

తన మనుషులు దారుణంగా చనిపోవడం చూసి వెనుకడుగు వేసి భయంగా చూస్తూ ఉండిపోయాడు మంద.

జరిగేదంతా వీడియోలు చూస్తూ "ఏంటి? అందరూ అభీర్ వయసులో ఉన్న కుర్రవాళ్లే ఉన్నారు, అక్కడ పెద్ద వాళ్ళు ఎవరు లేరా?"  అని అనుమానంగా అడిగాడు ముకుల్.

"సార్! వాళ్ళ తెగ ఆచారం ప్రకారం 14 సంవత్సరాలు దాటిన వాళ్ళు ముందుగా యుద్ధానికి వెళతారు." అని చెప్పాడు శివమణి.

"14 సంవత్సరాల ఉన్నవాళ్లే ఇలా ఉన్నారు అంటే, పెద్ద వాళ్ళు ఇంకెలా ఉంటారు." అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు మురళి జోషి.

భయంతో వెనుక అడుగులు వేస్తున్న మంద ముందుకు వెళ్లి "మిమ్మల్ని ఎవరు పంపించారు?" అని అడిగాడు శంభు.

వీడియోలో శంభుని చూసి "సార్! అతనే ప్రస్తుతం ఆ తెగ నాయకుడు, అభీర్ తండ్రి శంభు దొర!"  అని చెప్పాడు సర్పరాజ్.

వీడియోలో శంభుని చూస్తూ "మనిషి మంచి దిట్టంగా  మిలట్రి కమాండోలాగా ఉన్నాడు, వీళ్ళతో డైరెక్ట్ ఫైట్ చేయడం చాలా కష్టం!" అని చెప్పాడు జనార్ధన్.

"ఎస్! వీళ్ళకి చావు అంటే భయం లేదు, డైరెక్ట్ ఫైట్ చేస్తే ఓడిపోవడం ఖాయం!" అని చెప్పాడు ముకుల్.

"అంకుల్! అలా అయితే నా ప్లాన్ బి కూడా వేస్ట్!" అని చెప్పాడు అభిజిత్.

"ప్లాన్ బి నా దగ్గర ఉంది. దానిని అమలు చేద్దాం కంగారు పడకు!" అని నవ్వుతూ చెప్పాడు ముకుల్.

"మా డాడీ వాళ్ళ స్టేటజి చూసి నవ్వారు అంటే, మనం పని ఈజీగా అయిపోతుంది." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు గోకుల్.

"సార్! ఇప్పుడు ఆ మంద మన పేరు చెబుతాడేమో!" అని డౌట్ గా అడిగాడు శివమణి.

"అసలు! వాడికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరో కూడా తెలియదు మన పేరు ఎలా చెబుతాడు, మీరేం కంగారు పడకండి." అని చెప్పాడు అభిజిత్.

భయంతో వెనక్కి వెళుతూ శంభుని షూట్ చేయడానికి గన్ పైకి ఎత్తడు మంద.

తమ ఎదురుగా ఉన్న గన్ ని చేత్తో పట్టుకుని "దొర! వీటిల్లో ఉన్న గోళీలు మమ్మల్ని ఏమి చేయలేవు, నిన్ను ఎవరు పంపించారో చెప్పు ప్రాణాలతో వదులుతాను." అని అడిగాడు శంభు.

"మీ స్థలం మీద పరదేశి వాళ్ళ కళ్ళు పడింది నన్ను చంపిన మీరు తప్పించుకోలేరు వాళ్ళు కచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తారు." అని భయంగా చూస్తూ చెప్పాడు మంద.

"మా పూర్వీకులు శివాజీ మహారాజ్ గారితో కలిసి ఎడతెరిపి లేకుండా 25 సంవత్సరాలు యుద్ధాలు చేశారు ఆ రక్తమే మాలో కూడా ఉంది." అని కసిగా చూస్తూ తన చేతిలో ఉన్న కత్తితో మంద తల నరికి

తన మనుషుల వైపు చూసి "మొండెం, తల వేరువేరుగా మన గూడానికి వచ్చే దారిలో చెట్టుకి వేలాడు తీయండి. దీనిని చూసి మనతో కయ్యానికి ఎవరైనా సరే  భయపడాలి." అని చెప్పాడు శంభు.

మంద చనిపోవడంతో అక్కడికి వచ్చి, తన దగ్గర ఉన్న ఫోను కాగితాలు తీసుకుని తన మనుషుల వైపు చూసి "చనిపోయిన వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మొత్తం తీసుకుని వాళ్ళ శరీరాలను ఇక్కడే తగలబెట్టండి ఆనమాలు కూడా దొరకకూడదు." అని చెప్పాడు అభీర్.

"సరే!" నాయకుడా అని చెప్పి చనిపోయిన వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, గన్స్ తీసుకుని శరీరాలను నూనె పోసి తగలబెడుతు ఉన్నారు అభీర్ సైన్యం.

వీడియోలో చూస్తూ "అభీర్ చాలా తెలివైనవాడు." అని చెప్పాడు ముకుల్.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 24-01-2026, 07:49 AM



Users browsing this thread: 1 Guest(s)