Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
 ఎపిసోడ్ 39


శంభు దొర తీసుకు వెళ్లిన గూడెంలో చెరువులో స్నానం చేస్తూ అక్కడ ఉన్నా రాళ్ళను చూసి వీటికి ఏదో ప్రత్యేకత ఉంది అని వాటిని జాగ్రత్త చేసి, అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాల గురించి తెలుసుకుని వాటిని ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాడు గోకుల్.

**************

శివమణి చూపించడంతో కొండల్లో నుంచి రంగు రంగులుగా శక్తి వచ్చి అమ్మవారి పాదాల దగ్గరకు చేరి అక్కడి నుంచి అభీర్ శరీరంలోకి ప్రవేశించడం ఆశ్చర్యంగా చూస్తూ "అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది." ఆని కళ్ళు ఆర్పకుండా చూస్తూ అడిగాడు గోకుల్.

"అమ్మవారి పాదాల దగ్గర ఉన్న పంచరత్నాలు పంచభూతాల శక్తిని తీసుకుని అభీర్ శరీరంలోకి పంపించాయి." అని చెప్పాడు శివమణి.

"ఆ శక్తీ అభిర్ శరీరంలోకి వెళ్ళింది కదా, ఇప్పుడు అతనికి ఎటువంటి పవర్ వస్తుంది?" అని డౌట్ గా అడిగాడు అభిజిత్.

"ఆ విషయం మనం కళ్ళతో చూస్తేనే కాని చెప్పలేము సార్!" అని చెప్పాడు శివమణి.

"అటువైపు చూడండి మరొక శక్తి అతనిలోకి వస్తుంది ఈసారి మనకి రాళ్లు కనిపించిన కొండల దగ్గర నుంచి వస్తుంది." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు సర్పరాజ్.

ఆ మాటకి కొండల వైపు చూస్తూ "ఎస్! అవే నవగ్రహాల కొండలు." అని చెప్పాడు శివమణి.

"మరి అక్కడ 7 కొండలు మాత్రమే కనబడుతున్నాయి మరి మిగిలిన రెండు ఎక్కడ ఉన్నాయి." అని అనుమానంగా చూస్తూ అడిగాడు గోకుల్.

ఆ మాటకి మ్యాపులో చూస్తూ "సార్" మనం స్నానం చేసిన చెరువు చంద్రుడికి సంబంధించింది. అందులో ముత్యాలు ఉంటాయి, అందుకే దాంట్లో స్నానం చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతతా వచ్చింది. దాని పక్కన ఉన్న చెరువు పగడాల చెరువు." అని చెప్పాడు శివమణి.

"అంటే! మిగతా ఏడుకొండలలో మామూలు రాళ్లు కాదు నాచురల్ జేమ్స్ ఉంటాయి." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు అభిజిత్.

"ఎస్ సార్! శంభు దొర, అభీర్ మెడలో వేస్తున్న పచ్చ చూడండి ఎలా మెరిసిపోతుందో, అటువంటిది మనకి ఎక్కడ దొరకదు." అని ఆశగా చూస్తూ చెప్పాడు సర్పరాజ్.

"ఈ ప్లేస్ ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి." అని ఆశగా చూస్తూ చెప్పాడు అభిజిత్.

"ఈ తెగ వాళ్ళు ఇక్కడ ఉండగా మీ ఊహలలో కూడా ఈ ప్లేస్ ని ముట్టుకోలేరు." అని చెప్పాడు శివమణి.

"ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది దీనికోసం ఏమైనా చేయొచ్చు!" అని చెప్పాడు జాకి.

"ఈ ప్లేస్ గురించి మనం  క్షుణ్ణంగా తెలుసుకోవాలి అప్పుడు  ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ రావచ్చు!" అని చెప్పాడు అభిజిత్.

అభీర్ మేడలో  గొలుసుని వేసి, అక్కడ నుంచి గోకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి "దొర! ఇప్పుడు నా బిడ్డ వేదం చదువుతాడు నా చిరకాల వాంఛ తీరపోతుంది." అని సంతోషంగా చెప్పాడు శంభు.

ఆ మాటకి నవ్వుతూ "చాలా సంతోషం! ఇప్పుడు అభీర్ మెడలో ఒక పచ్చ రాయిని వేశావు కదా అది ఎక్కడి నుంచి సంపాదించావు? చాలా అందంగా ఉంది." అని అడిగాడు అభిజిత్.

"ఆ పచ్చ, దొర! కనిపించే దేవత కొండలో నుంచి తీసుకుని వచ్చాము, అది మెడలో ఉంటే దక్షిణామూర్తి అనుగ్రహంతో నా బిడ్డ జ్ఞానం సంపాదించగలుగుతాడు." అని చెప్పి అక్కడి నుంచి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లి పాదాలకి నమస్కరించి అక్కడ ఉన్న వేదాలు తీసి అభీర్ చేతికి ఇచ్చాడు శంభు.

అది చూసి "అసలు! వేదాలు అంటే ఏమిటి? దాంట్లో ఏం రాసి ఉంటుంది? దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా?" అని అడిగాడు గోకుల్.

"సార్! వేదాలని ఎవరు రచించలేదు దేవతలు మనుషులకు ఇచ్చిన బహుమతిగా చెబుతూ ఉంటారు, మన జీవన విధానం సంస్కృతి, జ్ఞానం వాటి ద్వారా లభిస్తుంది.

భారతదేశంని వేద భూమి అంటారు, 500 బిసి కి ముందు యూరోపియన్స్ మన మీద దండయాత్ర చేయకముందు, మన విద్యా విధానం చాలా మెరుగుగా ఉండేది.

మన సంస్కృతిని మన విద్యా విధానాన్ని చాలా దేశాల వారు అనుసరించేవారు, ఇప్పుడు కొత్త కొత్తగా కనిపెడుతున్నవి అన్ని వేద కాలంలో ఆల్రెడీ మన భారతదేశంలో ఉన్నవే, ఆ వేదాలను చదవడం అందరికీ సాధ్యం కాదు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది." అని చెప్పాడు సర్పరాజ్.

ఆ మాట విని "నువ్వు చెప్పింది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు." అని చెప్పాడు గోకుల్.

"సర్! మీకు అర్థమయ్యేటట్లు మన లాంగ్వేజ్ లో చెప్తాను వేదాలు నాలుగు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం
అథర్వవేదం వీటిలో ఏముంటుంది అంటే, విద్య, వైద్యం యుద్ధం, కళలు,శాస్త్రాలు,పూజలు గురించి వివరంగా ఉంటుంది." అని చెప్పాడు శివమణి.

"ఓకే! ఇప్పుడు కొంచెం అర్థమైంది అయ్యినా ఇప్పటివరకు అడవిలో పెరిగిన వాడు అవి ఎలా చదవగలడు?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.

"అతనికి ఇప్పుడు వచ్చిన శక్తి అదే సార్!" అని అమ్మవారి ముందు వేదం చదువుతున్న అభీర్ ని చూసి చెప్పాడు శివమణి.

"ఏంటి? ఇది చదివే శక్తి వస్తుందని మనం ఇప్పటివరకు ఎదురుచూస్తూ ఉన్నామా?" అని వెటకారంగా అడిగాడు అభిజిత్.

"సరే! పదండి వెళ్లి కూర్చుందాం, అయిన తర్వాత ఆ కొండల దగ్గరికి వెళ్లి ఒకసారి మొత్తం చూసి బయలుదేరుదాము." అని చెప్పాడు గోకుల్.

వేదం చదువుతున్న అభీర్ ని సంతోషంగా చూస్తున్న శంభు దగ్గరికి వెళ్లి "దొర! నామకరణం చేసిన తర్వాత ఏవో శక్తులు వస్తాయని అనుకున్నాము కదా మరి ఏమి రాలేదేమిటి?" అని అనుమానంగా అడిగాడు శివమణి.

"జ్ఞానం కన్నా గొప్ప శక్తి ఏముంది? నా బిడ్డకు అది వచ్చింది చాలు!" అని సంతోషంగా చెప్పాడు శంభు.

"అవునవును మీరు కరెక్ట్ గా చెప్పారు." అని సహదేవుడు చేతిలో ఉన్న జింక పిల్లను చూసి "దానికి ఏమైంది?" అని అడిగాడు శివమణి.

"నిన్న సింహం పంజా తగిలింది కదా దొర! అప్పట్నుంచి దీనికి బాలేదు ఇంకా కాసేపట్లో ప్రాణం పోతుంది అందుకనే అమ్మ వారి దగ్గరికి తీసుకు వచ్చాను." అని చెప్పాడు సహదేవుడు.

అంతలో అభీర్ వేదం చదవడం విని అడవిలో ఉన్న రకరకాల పక్షులు, జంతువులు అక్కడకి రావడం ఆశ్చర్యంగా చూస్తూ "వీటికీ ఏమీ అర్థం అవుతుందని ఇక్కడికి వచ్చాయి?" అని అడిగాడు గోకుల్.

"అవి వేదం వింటూ వచ్చాయి అని నేను అనుకోవడం లేదు ఆ జింక పిల్ల చనిపోయింది కదా అందుకు వచ్చాయి అనుకుంటున్నాను." అని చెప్పాడు సర్ఫరాజ్.

అభీర్ వేదం చదవడం పూర్తవడంతో దగ్గరకు వెళ్లి జింక పిల్లని చేతిలో పెట్టి "నువ్వు కాపాడిన బుజ్జి చనిపోతుంది." అని బాధగా చెప్పాడు సహదేవుడు.

జింక పిల్లని చేతిలోకి తీసుకునే అమ్మవారికి వైపు చూసి నమస్కరించి ఆకాశంలోకి చూపిస్తూ కళ్ళు మూసుకుని చదువుతూ ఉన్నాడు అభీర్.

కాసేపటికి చేతుల్లోంచి కిందకు దూకి చెంగుచెంగున ఎగురుతూ దాని తల్లి దగ్గరికి వెళ్ళింది జింకపిల్ల.

అది చూసి జంతువులతో పాటు అక్కడ ఉన్న గూడెం ప్రజలందరూ సంతోషంతో గట్టిగా అరుస్తూ ఉండడంతో అది విని "ఏమైంది? అందరూ ఒక్కసారిగా అంత గట్టిగా అరుస్తున్నారు?" అని అనుమానంగా శివమణి దగ్గరికి వస్తూ అడిగాడు అభిజిత్.

"సార్! ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది చనిపోతుందనుకున్న జింక పిల్లని అభీర్ తన శక్తితో బతికించాడు." అని చూపించాడు శివమణి.

అక్కడికి వస్తు "అవునా?"అని ఎగురుతున్న జింక పిల్లని చూసి "నువ్వు చెప్పినట్లే అతనికి పవర్ వచ్చింది. నాకు తెలిసి ఆ శక్తి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న  పంచరత్నాల వల్ల వచ్చింది." అని చెప్పాడు గోకుల్.

అక్కడ ఉన్న వారితో ఆనందంలో ఉన్న శంభు దొర దగ్గరికి వెళ్లి "దొర! మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంక మేము బయలుదేరిదారి అనుకుంటున్నాము." అని చెప్పాడు శివమణి.

"మా గూడానికి అతిథులుగా వచ్చినందుకు చాలా సంతోషం దొర!' అని అమ్మవారి పక్కన ఉన్న గిన్నెలో నుంచి కొన్ని రాళ్లు తీసి అందరికీ ఇచ్చి "ఇది మీ దగ్గర ఉంచుకోండి  మంచి జరుగుతుంది." అని చెప్పాడు శంభు.

ఆ రాయిని చేత్తో పట్టుకుని అభీర్, శంభు వైపు చూస్తూ "మీ ఆచారాలు, మీ మనస్తత్వాలు నాకు చాలా బాగా నచ్చాయి త్వరలో మళ్ళీ ఇక్కడికి వస్తాను.

మీలాంటి మంచి మనుషులు ఇక్కడే ఉండి పోకూడదు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళని కూడా మీ విధంగా మార్చాలి." అని చెప్పాడు అభీజిత్.

"నేను కూడా అదే అనుకుంటున్నాను దొర! రోజులు మారిపోతున్నాయి కానీ మా పిల్లలు మాలాగే అడవిలో ఉండి ఈ జీవన విధానానికి అలవాటు పడి వెనక పడిపోతున్నారు అనిపిస్తుంది.

అది కాకుండా ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలను కాపాడడానికి ఇదివరకు రోజుల్లో రాజులు ఉండేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజులే, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు.

అందుకే మాలో కొంతమందిని ఇక్కడి నుంచి పంపించి ఆ జీవ విధానానికి అలవాటు చేసి మా జాతిని, ఈ ప్రదేశాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నాను." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని  దగ్గరికి వస్తూ "మీ ఆలోచన చాలా బాగుంది దొర! తప్పకుండా మేము కూడా హెల్ప్ చేస్తాము, అప్పుడు ఇక్కడ ఉన్న ప్రశాంతత మాకు కూడా దొరుకుతుందేమో!" అని నవ్వుతూ చెప్పాడు గోకుల్.

"సరే దొర! మేము ఇంకా బయలుదేరుతాము త్వరలో మళ్లీ వచ్చి మీకు మంచి విషయం చెబుతాము." అని చెప్పాడు శివమణి.

"నా బిడ్డను ఆశీర్వదించినందుకు వందనాలు!" అని చెప్పాడు శంభు.

ఆ మాటకి నవ్వి అక్కడ నుంచి బయలుదేరారు గోకుల్ వాళ్ళు.

అక్కడినుంచి అందరూ వెళ్లడంతో శంభు దగ్గరికి వచ్చి "అయ్యా! వాళ్లని మరి ఎక్కువగా నమ్మకు ఏదో ఆశించే ఇక్కడికి వచ్చారు అనిపిస్తుంది." అని చెప్పాడు అభీర్.

"బిడ్డ! వాళ్లు మన వస్తువులు ఇవ్వడానికి వచ్చారు అంతేకానీ ఏమీ ఆశించి ఎక్కడికి రాలేదు. మనం ఈ అడవిలో  ఉండిపోవడం వల్ల ప్రతి ఒక్కరి మీద అనుమానంతో బతుకుతున్నాము మనలో కొంతమంది పిల్లలు వాళ్లతో కలిసి చదువుకుంటే ఇటువంటి అపోహలు అనర్ధాలు ఉండవు ప్రశాంతంగా జీవిస్తాము." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని ఆలోచిస్తూ 'అయ్యా చెబితే నిజమే! నేను జంతువుల మనసు అర్థం చేసుకుంటున్నాను కానీ మనుషుల మనసు అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి?' అనుకున్నాడు అభీర్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 23-01-2026, 08:09 AM



Users browsing this thread: 1 Guest(s)