Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం - 10
#22
అప్పుడు వచ్చింది ఆమెకు
స్పృహ అంత వరకు 
మొని తిరిగిన కండలతో మెరిసిపోతున్న బంగారు వర్ణపు ఆరడుగుల అందగానీ దేహం
అలా దర్శనం ఇచ్చే సరికి 
ఆమె మతి పోయింది.... 
అలా చూస్తూ 
ఉండిపోయింది 
 
*"" పెద్ద అయ్యగారి కేక తో శాంతి
స్పృహ లోకి వచ్చి సిద్దు
వైపు ఒక స్మైలి లుక్ ఇచ్చి 
పరుగు తీసింది.
 
అంతే సిద్దు ఇబ్బంది ఇంకా
సిగ్గు గా ఫీల్ అవుతూ 
సారి డాడ్ ఇంపార్టెంట్ థింగ్
ఒకటి పాకెట్ లో మరచి పోయా అని చెప్పి అతడి గదిలోకి
పరుగు తీశాడు.
 
ఆయన చిరాకు పడుతూ 
వీడు ఒకడు అన్ని తిక్క పనులు అనుకుని అక్కడి నుండి 
బైటకు వెళ్లిపోయారు .
 
****సిద్దు గదిలోకి వచ్చి ఆమె
పట్ట గొలుసు అందుకుని 
నవ్వుతూ ఎం మాయ చేసావే సుందరి 
వంటి మీద బట్టలున్నాయో
లేదో కూడా తెలియకుండా 
పరుగు తీసాను
అంతా నీ సొగసు మహిమ.... 
అని ఆమెను మరింత గా
ఇష్ట పడుతూ.... 
ఒక విషయం గుర్తు వచ్చేసరికి ఆలోచన లో పడ్డాడు. 
 
అవును నువ్వు భూషణ్ అంకుల్ కూతూరువి ఈ సిటీలో అత్యంత ధనవంతుల జాబితాలో మీ
నాన్న ఒకడు 
ఆఫ్కొర్స్ మా నాన్న కూడా 
ఉన్నాడు అనుకో
నువ్వు మీ నాన్నకి ఒక్కత్తే 
కూతురు రిచ్ ఫ్యామిలీ రిస్క్
లేని ఫ్యామిలీ లో 
అమ్మాయివి నువ్వు
 
అలాంటిది ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావ్
ఓహ్ గాడ్ సమయానికి నేను అక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది
లేదంటే నో అని టెన్షన్ గా ఆ ఇమేజన్ థింక్ చేయడానికి
కూడా ధైర్యం చేయలేక పోయాడు....
 
*"""అతడిలో ఒక డౌట్ మొదలైంది ఆమె లవ్ లో ఉందా అందుకు భూషణ్ అంకుల్ అడ్డు పడ్డారా అందుకే సూసైడ్ అని కంగారు పడి
లేదు లేదు అలా అయి ఉండదు నేను అలా థింక్ చేయడం 
కరెక్ట్ కాదు
మరి ఎందుకు
అని జుట్టు పిక్కుంటు ఉంటే....
 
*"" అతడి మొబైల్ రింగ్ అయ్యింది దాంతో సార్ నార్మల్ అయి ఫోన్ లిఫ్ట్ చేశాడు 
కాలేజ్ లో ఫ్రెండ్ అతడి పేరు శ్రీరామ్... 
నిన్న నైట్ సిద్దు కి కాల్ చేసి
మ్యాటర్ చెప్పింది అతడే 
అందుకే కాలేజ్ కి వస్తున్నావు గా నిన్న అంత ఇంపార్టెంట్ మ్యాటర్ చెబితే రిప్లై లేకుండా సైలంట్ అయిపోయావు ఎంటి బ్రో 
అని అడిగాడు
 
*"" అందుకు సిద్దు ఎం చెప్పలేక
అరే యార్ నైట్ కాస్త ఎక్కువ అయ్యింది లే అయినా
నువ్వు అర్ధరాత్రి కాల్ చేస్తే ఎట్లా వస్తున్నా వచ్చాక మాట్లాడు
కుందాం అని చెప్పి కాలేజ్ కి పయనం అయ్యాడు... 
 
*""శ్రీరామ్ నవ్వుతూ సరే అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు...
 
*"" అతడికి శ్రావణి అంటే ఇష్టం అమే కోసం తెంత్ నుండి 
వెయిటింగ్ 
మేడం ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యింది అని తను కూడా
ఇక్కడికి చేరాడు ఇప్పుడు
ఆమె ఇందు తో క్లోజ్ గా ఉంది
ఆమె కోసం సిద్దు ఇంట్రస్ట్ చూపుతున్నాడు 
సో ఇలా ఈ ఇద్దరినీ ఒకటి చేసి 
తన లైన్ క్లియర్ చేసుకోవాలి 
అన్నది అతడి ఇంటెన్షన్ 
అందుకే నైట్ కాలేజ్ వచ్ మ్యాన్ కి మస్కా కొట్టి రికార్డింగ్ రూం లో ఇందు వివరాలు సేకరించి
మరీ సిద్దు కి తెలియ చేశాడు
 
*"" అతడితో ఉన్న మిగిలిన గ్యాంగ్ సిద్దు ఇస్తాను అన్న పార్టీ కోసం శ్రీరామ్ కి సహాయం చేశారు 
సో అదండీ విషయం. 
 
శ్రీరామ్ వెడ్స్ శ్రావణి 
ఆ టైటిల్ కోసం ఇతగాడు
ఓ ప్రేమ జంట కి హెల్ప్ చేస్తున్నాడు కానీ ముందు ముందు ఎం జరగనుంది ఎవరికి తెలుసు...??
***************
 
*"" సిద్దు కాలేజ్ కి రీచ్ అయ్యాడు అతడి ఫ్రెండ్స్ అంతా ముందుగా అక్కడికి చేరి సిద్దు కోసం 
వెయిటింగ్ 
 
సిద్దు వాళ్ళ దగ్గరకు వెళ్లి థాంక్స్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి థాంక్స్ చెబుతూ ఉంటే వాళ్ళు 
అంత లేదు అమ్మ 
నీ మాట ప్రకారం ఇవ్వాళ నైట్ పార్టీ ఇచ్చి తీరాలి లేదంటే ఊరుకోం 
అని గోల చేశారు 
ఆ గోల లో శ్రీరామ్ లేడు
అది సిద్దు అబ్జర్వ్ చేస్తూ ఓకే 
అని వాళ్ళకి మాట ఇచ్చాడు
అంతా హుషార్ గా 
వెళ్లిపోయారు.
 
*"" సిద్దు శ్రీరామ్ నీ చూస్తూ బ్రో నీ ఇంట్రస్ట్ పార్టీ కోసం కాదు అని 
అర్థం అవుతుంది ఎంటి మేటర్ 
అని అడిగాడు
అతడు దాపరికం లేకుండా
సిద్దు నాకు శ్రావణి అంటే చాలా ఇష్టం ఒక విధం గా నా ఊపిరి అనుకో బట్ దానికి చదువు
ఒక్కటే ఉంటే చాలు
ఈ బావ కంటికి కనిపించడు గా అని అసలు విషయం
రివిల్ చేశాడు 
 
సిద్దు ఆశ్చర్యం గా చూస్తూ
ఎవరా శ్రావణి ఎంటా కదా అని అడిగాడు
 
*"" శ్రీరామ్ సిగ్గు పడుతు 
నా మావ కూతురు 
చిన్నప్పుడు ఊరిలో ఉండేది
తెంత్ లో ఇక్కడికి వచ్చింది అదేంటో చూడగానే
లవ్ లో పడిపోయాను
కానీ ఆ రాకా
సి నన్ను బావా అని కాదు కదా శ్రీరామ్ అని కూడా పిలవదు 
ఓయ్ హేయ్ అంటూ
పిలుస్తుంది అమ్మ వాళ్ళకి మా ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే
చదువు పూర్తి కాగానే 
పెళ్లి అన్నారు కానీ ఈ రాకాసి
నన్ను గుర్తిస్తే గా 
అందుకే ఇదిగో చేతికి గాయం అయినా పట్టించు కోలేదు నీ కోసం ఇన్ఫర్మేషన్ తెచ్చాను 
అందుకు నువ్వు నా లవ్ కి హెల్ప్ చేస్తే చాలు నీ లవ్ తో పాటు నా లవ్ కూడా అనమట 
నా శ్రావణి తో
ఇందిర ఫ్రెండ్షిప్ చేస్తుంది 
అందుకే రిస్క్ తీసుకున్నా
అని అతడి ప్రేమ గాథ సిన్సియర్ గా చెప్పాడు శ్రీరామ్...!
 
*""అంతే సిద్దు కి అతడు బాగా నచ్చేసాడు వావ్ శ్రీ...సూపర్ 
నీ లవ్ సక్సస్ నేను చేస్తాను
ఇంతకీ శ్రావణి అంటే
ఆ నిన్న నాతో రేష్ గా మాట్లాడింది ఆమె గా అని అడిగాడు
 
అతడు అవును అని తలాడిస్తూ దూరం గా శ్రావణి రావడం చూసి అమ్మో వచ్చేస్తుంది రాకాసి 
అని అక్కడి నుంచి
వెళ్ళిపోయాడు.
 
*"" అంతే సిద్దు నవ్వుతూ ఇంత భయపడే వాడు రేపు ఈమెను
పెళ్లి చేసుకుంటే కాపురం ఎలా చెస్తాడో ఎంటో అని ఆమెను పట్టిక్లియర్ గా చూస్తూ ఉంటే
శ్రావణి సిద్దు వైపు చూసి
నువ్వు ఎంటి ఇక్కడ కాపు కాసవ్ అన్నట్టు లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది.
 
*"" సిద్దు ఆమె రికాక్షన్ చూసి 
హు.... ఈమెకు రాకాసి సరైన పేరు పెట్టాడు ఈ శ్రీ అనుకుని 
ఇందిర వస్తుదా రాధా అన్నట్టు చూస్తుంటే 
అంతలో అక్కడికి చేరుకుంది
ఇందు
 
*"" ఆమె కార్ దిగి రావడం చూసి సిద్దు చాలా హ్యాపీ అయ్యాడు 
ఆమె వైట్ చుడీదార్ వేసుకుని హంస లా నడుస్తూ ఆమె
వస్తుంటే సిద్దు ప్రాణం గాల్లో తేలినట్టు అయిపోయింది 
ఆమెకు ఆత్రం గా వెళ్లి అడ్డం పడబోయి
మరీ ఎంట్రన్స్ దగ్గరే ఎందుకు అన్నట్టు వెనకడుగు వేశాడు 
 
*"'ఇందు అతడ్ని గమనించ కుండా ముందుకు వెళ్లిపోయింది.
 
*"" కానీ యాది అతడ్ని చూసి కార్ దిగి బైటకు వచ్చి అతడ్ని
కలిశాడు.
 
సిద్దు అతడు తన దగ్గరకు 
రావడం చూసి ఎంటి విషయం అన్నట్టు కళ్ళెగరేసాడు.
 
యాది అతడికి ఎంతో 
మర్యాదా ఇస్తు బాబు మీతో మాట్లాడాలి అలా పక్కకి వెళ్లి మాట్లాడుకుందాం అని 
అడిగాడు
 
సిద్దు సరే అని వెళ్ళాడు
అతడు విషయం చెప్పాడు
ఇందు అమ్మ అమాయకురాలు
ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది....
నిన్న సాయంత్రం కూడా 
దేన్నో చూసి భయపడి 
అలా పరుగులు తీసింది సమయానికి మీరు వచ్చి 
ఆమెను కాపాడారు అందుకు.... థాంక్స్ కానీ 
 
*""అమ్మాయి 
గారు భూషణ్ గారి కూతురు 
అంటే మీ నాన్నగారి శతృవు కూతురు అందుకే మీరు 
ఆమెకు దూరం గా ఉండండి
ప్లీజ్ నిన్న జరిగిన సంఘటన అమ్మాయిగారికి అలాగే అయ్యగారికి చెప్పలేదు 
అనవసర గొడవ ఎందుకు 
అని ఊరుకున్నా 
మీరు మంచి వారులా ఉన్నారు అందుకే విషయం అంతా
చెప్పాను ఇంక మీరు మాకు 
దూరం గా ఉంటే మీకే 
మంచిది
లేదంటే సమస్యలు వస్తాయి 
అని రిక్వెస్ట్ చేస్తూనే 
వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు
 
*"" సిద్దు ముందే మొండి అలాంటి వాడ్ని బెదిరిస్తే ఊరుకుంటాడా..... పైగా అమ్మాయి గారికి లవ్ మ్యాటర్ అని ఏమి లేదు
దేన్నో చూసి భయ పడింది 
అంతే ఓహ్ సూపర్ ఇందు......
నైస్ నేమ్ సిద్దు ఇందు.... 
సూపర్ అరే డ్రైవర్ టెన్షన్ లేకుండా క్లియర్ గా మ్యాటర్ చెప్పెసావు 
ఇంక నేను చూసుకుంటా గా 
అని ఇందు ఇన్నోసెంట్ అని తెలుసుకుని ఆమెను ఎలా డీల్ చేయాలో ఆలోచిస్తూ తను
ఆమెను సేవ్ చేసిన సంగతి 
ఆమెకు తెలియదు 
ఇట్స్ ఓకే నేను కూడా ఎదో తనని సేవ్ చేశాను అని సింపతీ తో పడేయాలి అనుకోవడం లేదు
ఈ సిద్దు నీ చూసి తానుగా
నన్ను ఇష్టపడాలి హు...
అని ఫిక్స్ అయ్యి ఆమె వెనకే కదిలాడు... 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం - 10 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:46 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:48 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:50 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:53 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 15-01-2026, 05:27 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:15 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:18 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:19 PM
RE: శక్తి ఆగమనం - 6 - by Uday - 06-02-2026, 04:01 PM



Users browsing this thread: 1 Guest(s)