Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
 ఎపిసోడ్ 38





జారువ జాతి వాళ్లు ఉండే గూడానికి వెళ్లి శంభు ద్వారా అభిర్ సేన గురించి అన్ని విషయాలు తెలుసుకుని, క్రిష్ణ కి జరగబోయే నామకరణం చూసి వెళతామని అడిగాడు గోకుల్.

*****************°

ఆ మాట విని వాళ్ళు ఉండడానికి ఒక గుడిసె చూపించి అన్ని ఏర్పాట్లు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంభు.

గుడిసెలో గడ్డి తో చేసిన పరుపులు మీద పడుకున్న గోకుల్ ని చూసి "ఒరేయ్! నువ్వు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను, నాకు తెలిసి ఇక్కడ ఏమీ లేదు మనకు ఏమీ దొరకదు ప్రశాంతంగా ఇంటికి పోదాము." అని చెప్పాడు అభిజిత్.

"సార్! కంగారు పడకండి శంభు దొర చెప్పింది మొత్తం విన్నారు కదా, ఆ పచ్చబొట్టుతో మళ్లీ చాలా కాలం తర్వాత క్రిష్ణ పుట్టాడు, రేపు అతనికి రాబోయే శక్తులు ఏమిటో మనతోపాటు వాళ్లకి కూడా తెలియదు అసలు అవి ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకుందాము." అని చెప్పాడు శివమణి.

"అవును! క్రిష్ణకి నిజంగా శక్తులు వచ్చాయి అంటే ఇక్కడ ఏదో ఉన్నట్లు, లేక పోతే మనం ఇక్కడి నుంచి బయలుదేరి పోదాము." అని చెప్పాడు గోకుల్.

కిటికి లోనుంచి చూస్తూ, "ఒక్కసారి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం చూడండి చీకటిలో కూడా  ఎలా మెరిసి పోతుందో, ఆ విగ్రహం కింద కచ్చితంగా ఏదో ఉంది. " అని చెప్పాడు సర్పరాజ్.

అక్కడికి వచ్చి చూస్తూ "అంటే! మనం వెతుకుతున్న ఆ వస్తువులు ఆ విగ్రహం కింద ఉన్నాయని మీ అనుమానమా?" అని అడిగాడు గోకుల్.

"ఆ వస్తువులు ఉన్నాయో లేదో తెలియదు కానీ, మొత్తానికి ఆ విగ్రహం దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది." అని చెప్పాడు సర్పరాజ్.

"సరే! అసలు ఇక్కడ ఏముందో రేపు తెలిసిపోతుంది కదా! ప్రశాంతంగా పడుకోండి." అని చెప్పాడు అభిజిత్.

****************

ఉదయం గట్టి గట్టిగా మాటలు వినపడడంతో ఉలిక్కిపడి లేచి బయటకు చూసి అభిజిత్ వాళ్ళని లేపి "అన్న! ఇక్కడ మనం ఎంతోమంది లేరు అనుకున్నాం చాలామంది ఉన్నారు చూడు." అని చెప్పాడు జాకి.

"అవునా?" అని లేచి అక్కడ ఉన్న జనాన్ని చూసి బయటకి వస్తున్న గోకుల్ వాళ్ల దగ్గరికి వచ్చి, "దొర! కాసేపటిలో కార్యక్రమం మొదలవుతుంది. మీరు స్నానాలు చేయడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి." అని చూపించాడు  సహాదేవుడు.

"సరే!" అని చెరువు దగ్గరికి వెళ్లి స్నానం చేస్తూ, "ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అనేది అర్థం కావడం లేదు." అని చెప్పాడు శివమణి.

అంతలో చెట్టు మీద ఉంగరం పట్టుకున్న కోతి కనిపించడంతో, "జాకీ! ఆ కోతి దగ్గర ఉన్న ఉంగరం ఏదో విధంగా తీసుకో, అది నాకు కావాలి." అని చెప్పాడు అభిజిత్.

"సరే అన్న!" అని చెప్పి చెట్టు మీద ఉన్న కోతి దగ్గరకంటూ వెళ్లి "ఆ ఉంగరం వేయవే నీకు వేరే ఉంగరం ఇస్తాను." అని అడిగాడు జాకి.

ఆ మాటకి ఎక్కిరించి దూరంగా ఉన్నా గుట్ట మీదకి వెళ్ళింది ఆ కోతి.

అది చూసి "ఇది మాటలతో వినదు." అని అక్కడ ఉన్న రాళ్లు తీసుకుని దాని మీద గిరాటు వేశాడు జాకీ.

రాళ్లు మీదకు రావడంతో కొంచెం వెనక్కి వెళ్లి, కొండమీద నుంచి ఒక పెద్ద బండరాయి దొర్లించింది ఆ కోతి.

అది చూసి "వామ్మో! ఇది మామూలు కోతి కాదు." అని వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు జాకీ.

కొండమీద నుంచి దొర్లుకుంటూ వస్తున్నారు రాళ్లు, వెనక్కి పరిగెడుతున్న జాకిని చూసి నవ్వుతూ ఉన్నారు చెరువులో ఉన్న గోకుల్ వాళ్ళు.

అంతలో దొర్లుకుంటూ వస్తున్న రాళ్లు అక్కడ ఉన్న పెద్ద బండరాయికి తగిలి ముక్కలు అవడంతో, మెరుస్తూ ఉండడం చూసి అనుమానం వచ్చి చెరువులో నుంచి పైకి వెళ్లి వాటిని చేత్తో పట్టుకుని సూర్యకిరణాలు తగిలేటట్లు పెట్టి గోకుల్ వైపు చూసి "సార్! ఈ స్టోన్ లో ఏదో ప్రత్యేకత ఉంది." అని చెప్పాడు సర్పరాజ్.

ఆ మాట విని హడావుడిగా చెరువులో నుంచి బయటకు వచ్చి సర్పరాజ్ చేతిలో ఉన్న పగిలిన రాళ్లు తీసుకుని చూస్తూ "అవును! చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వీటిని ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించాలి అప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది." అని చెప్పాడు గోకుల్.

అంతలో అక్కడికి వస్తున్న సహదేవుడిని చూసి" టాపిక్ మార్చండి." అని చెప్పాడు అభిజిత్.

ఆ మాట విని సైలెంట్ అయ్యి సహదేవుడి వైపు చూసి నవ్వుతూ, "ఏంటి? ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా?" అని అడిగాడు గోకుల్.

"అవును! తొందరగా రండి మిమ్మల్ని తీసుకురమ్మని శంభో దొర పంపించాడు." అని చెప్పాడు సహదేవుడు.

"సరే! నువ్వు వెళ్ళు ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాము." అని చెప్పి అక్కడ దొరికిన రాళ్లు తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్లి క్లాత్ లో చుట్టి బ్యాగులో పెట్టాడు సర్ఫరాజ్.

రూమ్లో హడావుడిగా రెడీ అయ్యి తన బ్యాగ్ లో ఉన్న బుక్ తీసి ఓపెన్ చేసి చూస్తూ, అభిజిత్ వాళ్ళని పిలిచి "సార్! ఈ మ్యాప్ చూడండి దేవతలు సృష్టించిన నగరం అని చెప్పాను కదా అది ఈ స్థలమే!" అని చెప్పాడు శివమణి.

"సరే! ఈ ప్లేస్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఏముంటుంది?" అని అడిగాడు గోకుల్.

"ఈ కొండమీద 9 ప్రదేశాలు ఉంటాయి, అవి నవగ్రహాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి, మనం వెళ్లే లోపు ఆ ప్లేస్ ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి." అని చెప్పాడు శివమణి.

"నవగ్రహాలు ఆధీనంలో ఉంటే, మనకి తిరుగు ఉండదు, అలా నవగ్రహాలను ఆధీనంలో పెట్టుకోబట్టే రావణాసురుడు అంతటి వీరుడు అయ్యాడు, అతను స్త్రీలోలుడు అవడం వల్ల నాశనమయ్యాడు లేకపోతే, ఈ విశ్వాన్ని జయించిన మహారాజు అయ్యేవాడు." అని చెప్పాడు సర్ఫరాజ్.

ఆ మాట విని మనసులో ఆశ మొదలై "నవగ్రహాలు ఆధీనంలో ఉండడానికి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి ఏదిఏమైనా అది నాకు కావాలి." అని చెప్పాడు గోకుల్.

"ముందు జరిగే కార్యక్రమం చుస్తే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనకి కూడా ఒక ఐడియా వస్తుంది. దాని బట్టి ఏం చేయాలో ప్లాన్ చేద్దాం." అని చెప్పాడు అభిజిత్.

"సరే!" అని రెడీ అయ్యి కార్యక్రమం జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్లారు అందరు.

అక్కడికి గోకుల్ వాళ్ళు రావడం చూసి చెట్టు కింద ఏర్పాటు చేసిన ప్లేస్ చూపించి "దొర! ఇక్కడ కూర్చోండి ఇప్పుడే నా బిడ్డకు అమ్మవారి పాదాల నుంచి వచ్చే గంగతో స్నానం చేయిస్తున్నారు తరువాత కార్యక్రమం మొదలవుతుంది." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని సర్పరాజ్ తో కలిసి శంభు వెనకాలే వెళ్లి, అమ్మవారి పాదాల దగ్గర నుంచి నీళ్లు రావడం ఆశ్చర్యంగా చూస్తూ "మనం చూసినప్పుడు అక్కడ వాటర్ ఏమీ లేదు కదా!" అని డౌట్ గా అడిగాడు శివమణి.

"ఆ మత అనుగ్రహంతో పుట్టిన బిడ్డకి 14 సంవత్సరాల నిండిన తర్వాత నామకరణం రోజున అమ్మ పాదాల దగ్గర గంగ వస్తుందని మా పూర్వీకులు రాసిన గ్రంథాలలో ఉంది. అదే విధంగా ఇప్పుడు జరుగుతుంది. అంతా అమ్మ మహిమ!" అని చెప్పాడు శంభు.

"అవునా?" అని అమ్మవారి పాదాలు దగ్గర నీళ్లు వస్తున్న ప్లేస్ ని చూస్తూ, సర్పరాజ్ దగ్గరకు వెళ్లి "నీళ్లు వచ్చే ప్లేస్ ని బాగా గమనించండి?" అని చెప్పాడు శివమణి.

"ఎస్! పాదాల దగ్గర ఏవో ఐదు రంగు రాళ్లు ఉన్నాయి." అని చూస్తూ చెప్పాడు సర్పరాజ్.

"ఎస్! వాటిని పంచరత్నాలు అంటారు." అని చెప్పాడు శివమణి.

ఆ మాట విని శంభు దొర దగ్గరికి వెళ్లి, కెమెరా చూపించి "మేము ఫోటోలు తీసుకోవచ్చా!" అని అడిగాడు సర్పరాజ్.

"మీరు ఏమీ అనుకోకండి దొర! ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చిత్రీకరించడం నిషేధం! మీకు మాటిచ్చాను కాబట్టి చూడడానికి అనుమతించాను కానీ దీనికి అనుమతించలేను." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని దగ్గరికి వస్తూ "మీకు ఇష్టం లేకుండా మేము ఏ పని చేయము." అని కెమెరాని వెనక్కి తోసి "అమ్మవారి పాదాల దగ్గర రంగులు రంగులుగా ఉన్నాయి ఏమిటి?" అని అడిగాడు శివమణి.

"మా పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి, శ్రీకృష్ణుల వారు తమ ఆత్మ శక్తితో వాటిని సృష్టించి అమ్మవారి పాదాల దగ్గర ప్రతిష్టించారని చెబుతూ ఉంటారు, ప్రతి పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పడగానే అవి ప్రకాసిస్తాయి. ఆ వెలుగు ఈ కొండంతా వస్తుంది." అని చెప్పాడు శంభు.

"అవునా?" అని వాటి వైపు ఆశ్చర్యంగా చూస్తూ గోకుల్ వాళ్ళ దగ్గరికి వచ్చి, "రాత్రి మనం అమ్మవారి విగ్రహం మెరిసిపోతుంది అనుకున్నము కదా దానికి కారణం తెలిసింది." అని దూరం నుంచి అమ్మవారి పాదాల వైపు చూపించడు శివమణి.

తను చెప్పింది విని పాదాల వైపు చూస్తూ "అక్కడ ఏముంది." అని అడిగాడు గోకుల్.

"శ్రీకృష్ణుల వారు తమ ఆత్మ శక్తితో సృష్టించినా పంచరత్నాలను అక్కడ ప్రతిష్టించారు అంట!" అని చెప్పాడు సర్పరాజ్.

"అలా అయితే! అవి నాకు కావాలి." అని ఆశగా చూస్తూ అడిగాడు గోకుల్.

ఆ మాటవిని "ఒరేయ్! సైలెంట్ గా మాట్లాడు, ఎవరైనా విన్నారు అంటే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాము." అని భయంగా చెప్పాడు అభిజిత్.

అంతలో అక్కడకు వచ్చి "సార్! ఒక్కసారి అటువైపు చూడండి." అని చెప్పాడు శివమణి.

అమ్మవారి పాదాల ముందు కూర్చున్న క్రిష్ణ గుండెల మీద అమ్మవారి కత్తిని కుంకంలో ముంచి అభీర్ అని రాశాడు శంభు.

అలా రాయగానే అక్కడ ఉన్న కొండలలో నుంచి రంగు రంగుల గాలి అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి అభీర్ శరీరంలోకి వెళ్లడం ఆశ్చర్య చూస్తూ ఉండిపోయారు అందరూ.

అక్కడ జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ "వాట్ ఏ మేరకీల్!" అని చెప్పాడు గోకుల్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 21-01-2026, 11:38 PM



Users browsing this thread: 9 Guest(s)