Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
ఎపిసోడ్ 37


అడవిలో శంభు దొర మీదకి వస్తున్న సింహాలను ఒక కుర్రాడు ఎదిరిస్తూ ఉండగా తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసి అభీర్ అని  మనసులో అనుకున్నాడు శివమణి.

********************

రెండు సింహాలు ఎత్తిన పంజాలను పట్టుకుని పక్కకు తోసి వాటి వైపు కోపంగా కళ్ళు ఎర్ర చేసి గట్టిగా అరిచాడు ఆ కుర్రాడు.

రెండు సింహంలు కోపంతో ఉన్న ఆ కుర్రాడి కళ్ళ వైపు చూసి గర్జించడం ఆపి వెనకడుగు వేసి నిలబడి చూస్తూ ఉండిపోయాయి.

అంతలో అక్కడ ఉన్న దుప్పులు, జింకల గుంపు సింహాల మీదికి వెళ్లడంతో వచ్చిన దారివైపు వేగంగా పరిగెత్తాయి.

అది చూసి "ఏంటి? సింహాలను దుప్పులు జింకలు కలిపి తరుముతున్నాయా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్.

"మా క్రిష్ణని చూస్తే, పిల్లి కూడా పులి అవుతుంది. పులి కూడా పిల్లి అవుతుంది." అని గొప్పగా చెప్పాడు సహదేవుడు.

ఆ మాటకి కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరతను శంభు దొర!" అని అడిగాడు గోకుల్.

"వీళ్ళకి కాబోయే నాయకుడు అభీర్!" అని చెప్పాడు శివమణి.

"ఏంటి అతను అభీర్ ఆ.. మరి క్రిష్ణ అని పిలుస్తున్నారు?" అని డౌట్ గా అడిగాడు జాకి.

"అతని భుజం మీద పచ్చబొట్టు చూడండి. అతనే అభీర్!" అని చెప్పాడు శివమణి.

"అవును! ఆయన చెప్పింది నిజమే! వాడు నా బిడ్డ క్రిష్ణ కాబోయే నాయకుడు, మా జాతికి రక్షకుడు." అని చెప్పాడు శంభు.

"అంటే! రేపు యువరాజుగా చైర్ లో కూర్చోబోయేది అతనేనా?" అని అడిగాడు గోకుల్.

"మేము అడిగిన పచ్చబొట్టు గల మనిషి కూడా అతనే కాదు, ఆ మనిషికి దివ్య శక్తులు ఉంటాయని తెలిసింది నిజమేనా దొర!" అని అడిగాడు శివమణి.

"మీరు చెప్పిన మాట మేము కూడా వినడమే తప్పితే ఇప్పటివరకు చూడలేదు, ఏం జరుగుతుందో చూడడానికి మా జాతి మొత్తం ఎదురుచూస్తుంది." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని అయోమయంగా చూస్తూ, "శంభు దొర! మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు." అని చెప్పాడు సర్పరాజ్.

"మీకు మా గురించి అన్ని విషయాలు చెబుతాను అని మాట ఇచ్చాను తప్పకుండా చెబుతాను మా గూడెనికి వెళ్లి మాట్లాడుకుందాము." అని చెప్పి తన దగ్గరికి వస్తున్న క్రిష్ణాన్ని చూసి "బిడ్డ! నీకు ఎలా తెలిసింది ఆకాశంలో నుంచి ఊడి పడ్డావు." అని అడిగాడు శంభు.

"సింబా చెప్పాడు నాయనా!" అని పక్కన ఉన్న గోకుల్ వాళ్ళ వైపు చూసి "వీళ్లంతా ఎవరు?" అని అడిగాడు క్రిష్ణ.

"రేపు జరగబోయే కార్యక్రమానికి వచ్చిన అతిదులు మన గూడానికి తోలుకు పోతున్న!" అని చెప్పాడు శంభు.

"అవునా!" అని శివమణి వాళ్ళ వైపు చూసి "మా గురించి తెలుసుకోవడానికి వచ్చారని అర్థం అయింది. పూర్తిగా తెలుసుకోండి. కానీ తర్వాత మనసు మలినం చేసుకోకండి మీకే ప్రమాదం." అని చెప్పి అక్కడకు వచ్చిన సింబా తో కలిసి వేగంగా వెళ్ళిపోయాడు క్రిష్ణ.

ఆ మాట విని "అంటే! వీళ్ల దగ్గర మనసు మలినం అయ్యే అన్ని విచిత్రాలు ఉన్నాయా?" అని మనసులో అనుకున్నడు సర్పరాజ్.

సింబతో కలిసి వెళుతున్న క్రిష్ణ వైపు చూస్తున్న గోకుల్ వాళ్ళను చూసి "ఇంకా వెళదామా?" అని అడిగాడు శంభు.

"సరే!" అని వెనకాలే నడుస్తూ ఉన్నారు గోకుల్ వాళ్ళు

కాసేపటికి కొండా మీద ఉన్న వాళ్ళ గూడెం దగ్గరికి తీసుకువెళ్లి "ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి మీకు ఆహారం పంపిస్తాను తిన్న తర్వాత మాట్లాడుకుందాం." అని చెప్పాడు శంభు.

"సరే!" అని చెట్టు కింద ఉన్న నులక మంచాల మీద కూర్చుని  శివమణి వైపు చూసి "ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి వస్తువులు తీసుకుందామని వచ్చామా? కనీసం ఇక్కడి నుంచి జింక పిల్లని కూడా పట్టుకు వెళ్ళలేము." అని చెప్పాడు జాకి.

"ఎస్! వెరీ పవర్ ఫుల్ పర్సన్స్! ఇక్కడ నుంచి  దేన్నైనా తీసుకువెళ్లడం ఇంపాజిబుల్!" అని చెప్పాడు సర్ఫరాజ్.

"మీరు తీసుకువెళ్లడం గురించి ఆలోచిస్తున్నారు, అసలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవా అని నేను ఆలోచిస్తున్నాను." అని చెప్పాడు అభిజిత్.

"మీరు ఇప్పుటీ వరకు ఇక్కడ చూసిన విచిత్రాలు ఎక్కడైనా చూశారా? " అని అడిగాడు శివమణి.

"ఇది కరెక్ట్ పాయింట్! ఇక్కడ పవర్ ఫుల్ అయింది ఏదీ లేకపోతే వీళ్లకు అంత శక్తి ఉండదు, నాకు కావాల్సింది కూడా అదే ఎంత బలవంతుడైన శాసించగలిగే శక్తి, అది వీళ్ళ దగ్గర ఎక్కడో కచ్చితంగా ఉంది." అని చెప్పాడు గోకుల్.

"మీరు చెబుతుంది కరక్టే కానీ, ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తికి, కొన్ని నాచురల్ పవర్స్ ఉంటాయని అన్నారు, కానీ ఆ విషయం శంభు దొర కూడా  తెలీదు ఏం జరుగుతుందో చూడాలి అంటున్నాడు అదే నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా అన్నాడు సర్ఫరాజ్.

"మనం ఇక్కడికి కరెక్ట్ టైం లో వచ్చాము, వాళ్లే అన్ని విషయాలు మనకి చెబుతారు, వీళ్ళు ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నారు మాట ఇచ్చారు అంటే తప్పక చేస్తారు అది కూడా మనకి అదృష్టమే, ఏం చెబుతాడో విందాము." అని నవ్వుతూ చెప్పాడు శివమణి.

అంతలో అక్కడికి వస్తున్న శంభు దొరని చూసి "సైలెంట్ గా ఉండండి." అని చెప్పాడు అభిజిత్.

అక్కడికి వచ్చి "రండి మా గూడెం ప్రజల్ని చూపిస్తాను ఇక్కడ విశేషాలు కూడా తెలుసుకుందరు గాని, అలాగే మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో అడగండి." అని చెప్పాడు శంభు.

ఆ మాట విని వెనకాలే నడుచుకుంటూ వెళుతూ అక్కడ ఉన్న జనాలని చూస్తూ, "శంభు దొర! మీ అబ్బాయి క్రిష్ణ చేతి మీద ఉన్న పచ్చబొట్టు వల్ల వచ్చే అతీత శక్తుల గురించి మేము కూడా తెలుసుకోవాలి అన్నావు అంటే ఆ విషయాలు మీకు కూడా తెలియదా?" అని డౌట్ గా అడిగాడు శివమణి.

అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకువెళ్లి నమస్కరించి, "మేము జారువ తెగకు సంబంధించిన ఒక శాఖకు సంబంధించిన వాళ్ళము, మా జాతి ద్వాపర యుగం నుంచి ఉంది అని మా పెద్దలు చెబుతూ ఉండేవారు.

మా పూర్వీకులు పుట్టిన గడ్డ ఇది, ఇక్కడి నుంచి మా తెగకు సంబంధించిన వారు కొంతమంది విడిపోయి వేరు వేరు ప్రదేశాలకి వెళ్లిపోయారు మా శాఖకు సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు.

మేము కొలిచే అమ్మవారి దయవల్ల ఒకరోజు మా దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ములవారు వచ్చి, మేము ధర్మ పరిరక్షణ కోసం పుట్టాము అని కలికాలంలో కూడా మా జాతి నిలిచి ఉంటుంది అని వరం ఇచ్చారు,

అంతే కాదు ధర్మన్ని ర్రక్షించడానికి మా జాతిని కాపాడడానికి భుజం మీద మీరు చూపించిన పచ్చబొట్టుతో ఒక మనిషి జన్మిస్తూ ఉంటాడని, అతను ధర్మం కోసం పోరాడుతాడని,

అలా పుట్టిన బిడ్డకు గోవు లాంటి మనసు ఉన్న మీ జాతికి నాయకుడు అవుతాడు కాబట్టి గోవుల మందను కలిగిన వాడు కాబట్టి అతనికి 14 సంవత్సరాలు దాటిన తర్వాత అభీర్ అని నామకరణం చేయండి అమ్మవారి శక్తి అతనికి అండగా ఉంటుంది అని శ్రీకృష్ణ వారు సెలవిచ్చారు.


శ్రీకృష్ణుల వారి ఆశీస్సులు వల్ల పచ్చబొట్టు ఉన్న బిడ్డ మా తెగలో మూడుసార్లు పుట్టాడు ,మొదటి సారి ధర్మం కోసం కురుక్షేత్రంలో పాల్గొన్నారు మా పూర్వీకులు,

రెండోసారి ధర్మం వైపు నిలబడ్డ శివాజీ మహారాజ్ గారి వెనక ఉన్నారు మా పూర్వీకులు. మళ్లీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత నా బిడ్డ క్రిష్ణ పుట్టేడు, ఇప్పుడు ధర్మం కోసం ఏ యుద్ధం చేయవలసి వస్తుందో అర్థం కాలేదు." అని చెప్పాడు శంభు.

"మరి మీరు ఇక్కడ ఉంటే, మీ చరిత్ర ఆధారాలు మాకు బామ్రఘడ్ లో దొరికాయి ఏంటి? మీరు అక్కడికి వలస వెళ్లారా?" అని అనుమానంగా అడిగాడు సర్ఫరాజ్.

"అమ్మవారి ఆజ్ఞ మీద మా పూర్వీకులు అక్కడికి వెళ్లారు శివాజీ మహారాజ్ గారి మరణం తర్వాత మళ్లీ మా ప్రదేశానికి వచ్చేశారు." అని చెప్పాడు శంభు.

"మరి ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తికి ఎటువంటి శక్తులు ఉంటాయి." అని అడిగాడు గోకుల్.

"ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తికి అమ్మవారి దయతో అతీతమైన శక్తులు ఉంటాయి అని మేము వినడమే కానీ ఇప్పటివరకు చూసినవాళ్లు ఎవరూ లేరు ఇప్పుడు నా బిడ్డకు 14 సంవత్సరాలు రేపటితో నిండుతాయి  అతనికి వచ్చే శక్తి ఏమిటా, ధర్మం కోసం ఎక్కడికి వెళ్లి మేము పోరాడవలసి వస్తుందా అని  అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము." అని చెప్పాడు శంభు.

అమ్మవారి ముందు కనిపిస్తున్న తాళపత్ర గ్రంధాలు చూసి "అవి ఏమిటి? చాలా పురాతన గ్రంథాలు లాగా ఉన్నాయి." అని డౌట్ గా అడిగాడు శివమణి.

"అవి నాలుగు వేదాల సారాంశం! మా పూర్వీకుల నుంచి వస్తున్నాయి ఆ పచ్చబొట్టు ఉన్న వ్యక్తి 14 సంవత్సరాల నిండిన తర్వాత అమ్మవారి దయతో వేదాలు పటిస్తాడని చెబుతూ ఉంటారు నా బిడ్డ చదువుతుంటే చూడాలని చాలా ఆశగా ఉన్నాను." అని చెప్పాడు శంభు.

"నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను మీరు ఏమీ అనుకోరు కదా!' అని అనుమానంగా చూస్తూ అడిగాడు శివమణి.

"మీరు ఏమి అడగాలి అనుకుంటున్నారో సంకోచించకుండా అడగండి  మీకు మా గురించి అన్ని విషయాలు చెబుతాను అని మాటిచ్చాను." అని చెప్పాడు శంభు.

"మీ దగ్గర దైవీకమైన వస్తువులు కొన్ని ఉన్నాయని వాటికి మీరు రక్షణగా ఉంటారని,చత్రపతి శివాజీ మహారాజ్ గారి చంద్రహాస్ కూడా మీ దగ్గరికి వచ్చిందని మాకు తెలిసింది అది నిజమేనా!" అని అడిగాడు శివమణి.

ఆ మాటకు నవ్వి "ఈ విషయం గురించి నేను కూడా విన్నాను కానీ ఇప్పటివరకు నాకు ఒక దైవీకమైన వస్తువు ఎక్కడ కనపడలేదు, మీకు ఒక విషయం చెప్పనా మా వాళ్ళ స్వచ్ఛమైన మనసే మా దగ్గర ఉంది." అని చెప్పాడు శంభు.

"మీకు అభ్యంతరం లేకపోతే రేపు మీ అబ్బాయికి అభీర్ అనే నామకరణం జరగడం మేము కూడా చూడాలి అనుకుంటున్నాము." అని అడిగాడు గోకుల్.

ఆ మాటకి అక్కడ ఉన్న గుడిసె చూపించి "ఇక్కడ మీరు నిశ్చింతగా ఉండొచ్చు, మేము కూడా మీలాంటి వాళ్ళమే కాకపోతే, మేము ప్రకృతి ఒడిలో ఉంటున్నాము, మీరు దానికి దూరంగా ఉంటున్నారు." అని చెప్పాడు శంభు.

ఆ మాటకి నవ్వుతూ అక్కడ ఉన్న గుడిసెలోకి వెళ్లారు అందరూ.
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 21-01-2026, 11:37 PM



Users browsing this thread: 9 Guest(s)