21-01-2026, 11:35 PM
(This post was last modified: 21-01-2026, 11:35 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 56
ఎలా ఉంది భార్గవి నా గిఫ్ట్ అని పొగరుగా అడుగుతాడు. దానికి విక్రమ్ అని గట్టిగా అరుస్తుంది. ష్... అరవకు నాకు సౌండ్ ఎలర్జీ...
బంగారంలాంటి నా పెళ్ళాన్ని టార్చర్ చేసి నా నుంచి దూరం చేయాలి అనుకుంటావా..ఎవరెవరుతో తిరిగిన నీ కూతురుని నాకు అంటగట్టాలి అనుకుంటావా...
నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆడుకోవాలి అనుకుంటావు... నా ఇంటిలో పనిమనిషి గా ఉన్నాన్ని రోజుల్లోనైనా నీ కూతురు రియలైజ్ అవుతుంది అనుకున్నాను.
పనిమనిషి నుంచి ఓనర్ అవ్వడానికి ప్రయత్నాలే చేసింది గాని రియాలిటీలోకి రాలేదు.
రియాలిటీ లోకి వచ్చి తన తప్పు తెలుసుకుని ఉండుంటే ఎట్లీస్ట్ మనిషిగా నైనా బయట ఉండేది. ఇప్పటికీ కూడా ఇది నా ప్లేస్ అని అరుస్తుంది అంటే మీలో మార్పు వస్తది అన్న నమ్మకం నాకు లేదు.
నీలో మార్పు వచ్చేదాకా మీరు అక్కడే చెక్కభజన చేసుకోవాల్సిందే అని వెటకారంగా అంటాడు. దానికి భార్గవి కోపంగా ఊగిపోతుంది.
నేను బయటికి రావాలి... నీ పెళ్ళాన్ని మళ్ళీ మునిపటి స్థితికి తీసుకు రాకపోతే నా పేరు భార్గవి ఏ కాదు..
అబ్బఅబ్బా.... ఏమి పగటి కలలు కంటున్నావు... నేను పక్కన ఉండగా కూడా... నా భార్యకి ఆ స్థితి వస్తుంది అనుకుంటున్నావా..
పెళ్లికి ముందు అంటే అందరూ ఉండి కూడా ఏకాకిలా బతికింది. ఇప్పుడు అత్తింటి బలంతో పాటు పుట్టింటిబలం కూడా ఉంది.
ఏమిటి అన్నట్టుగా చూస్తుంది. ఇంకా నీ కన్నింగ్ బుర్రకి అర్థం కాలేదా అని... ఈ రోజు దత్తత కార్యక్రమం జరిగింది కదా అంటే ...
నా భార్యకి పుట్టిల్లు ఉన్నట్టే కదా... తల్లి తండ్రి తో పాటు ఒక అన్న కూడా ఉన్నాడు. ఇంక నీ భర్తగాని భర్త కూడా రియలైజ్ అయ్యాడు.
అవని వద్దు వద్దు అని దూరంగా గెంటేసిన సరే... బంక లాగా వచ్చి అంటుకుని ఉంటాడు.
ఇప్పుడు చెప్పమ్మా నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. భార్గవి పళ్ళు నూరుకుంటూ చూస్తూ.. ఇల్లు అలకగానే పండగ కాదు విక్రమ్.
నా భర్తకి అన్ని నిజాలు తెలిసి తట్టుకోలేక ఏదో ఇప్పుడు అలా బిహేవ్ చేస్తున్నారు కానీ... ఒక్క వారం రోజుల్లో చూడు...
నా భర్త ఏదో ఒక విధంగా నన్ను బయటికి తీసుకుని వెళ్తారు. అప్పుడు మళ్లీ నేనేంటో మీ భార్యాభర్తలిద్దరికీ చూపిస్తాను అని పొగరుగా మాట్లాడుతుంది.
దీనినే చింత చచ్చిన పులుపు చావలేదు అని అంటారు. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా... నీ భర్త కానీ భర్త ఆస్తి మొత్తం ఎప్పుడో అవని పేరు మీద రాసేసాడు.
ఇంక మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఏం చేస్తాడు చెప్పు. ఊరు తీసుకెళ్ళి అక్కడ కూలి పనులకు పంపించాలి మిమ్మల్ని లేదు అంటే...
ఇక్కడ ఎవరింట్లో అయినా సర్వెంట్ డ్యూటీ ఇప్పించాలి. అసలే మీరు సుకుమారులు కదా.. బయటకు వచ్చి ఆ పనులు చేయలేరు ఏమో...
జైల్లో అయితే కాస్త ఫుడ్ అయినా దొరుకుతుంది కదా చాలా ఎగతాళిగా మాట్లాడుతాడు.
ఆ మాటలకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తల పట్టుకుని ఏం చెబుతున్నావ్. మొత్తం అవిని పేరు మీద రాసేసారా...
అలా ఎలా కుదురుతుంది. ఆస్తిలో సగం వాటా నా కూతురికి కూడా ఉంది కదా.. నేను వెంటనే కోర్టులో కేసు వేస్తాను.
ఎలా నా కూతురికి ఇవ్వకుండా ఉంటారో చూస్తాను కోపంలో పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఉంటుంది. శిల్ప మాత్రమే బిగుసుకుపోయి అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది.
ఆ మాటలకు విక్రమ్ గట్టిగా నవ్వుతూ అయ్యో పిచ్చి భార్గవి.. మీ ఆయన అంత పకడ్బందీగా నీతో సంతకాలు తీసుకున్న తర్వాత కూడా నీ కూతురికి ఆస్తిలో వాటా వస్తుంది అనుకుంటున్నావా...
చిల్లి గవ్వ కూడా రాకుండాఉండే విధంగా డాక్యుమెంట్స్ తయారు చేయించి మీ ఇద్దరు చేత సంతకాలు తీసుకున్నాడు. అయినా నీకు 100 కోట్లు అప్పజెప్పాడు కదా.. ఇంకేంటి నొప్పి.
ఎక్కువగా అరిచే గోల చేసావే అనుకో.. ఆ వంద కోట్లు కూడా ఉష్ కాకి అయిపోతాయి. ప్రశాంతంగా జైల్లో చిప్ప కూడు తింటూ...
చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ.. కృష్ణా, రామా అనుకుంటూ..కూతిరి జీవితం ఎలా ఒక గాడిన పెట్టాలని ఆలోచిస్తూ గడిపేసేయ్.
అసలే ఈరోజు మాకు తొలిరేయి. బోళ్ళు పనుంది అబ్బా నాకు అని సిగ్గుపడుతూ ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే స్క్రీన్స్ అన్ని ఆఫ్ అయ్యిపోతాయి.
భార్గవికి ఒక నిమిషం మాట్లాడాలో, ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. మమ్మీ అని శిల్పా కదుపుతుంది.
హ... ఏంటి అని కూతురు వైపు చూస్తుంది. మనిద్దరం ఇంకా ఇలా జైల్లోనే మగ్గి పోవాల్సిందే నా... ఇంత చేసింది నువ్వు ఆస్తిని అనుభవించాలి, నేను మోడల్ గా ఎదగాలి అని... కానీ ఇద్దరం ఇక్కడ కూర్చుని మన భవిష్యత్తు ఏమిటా ఆలోచిస్తున్నాము.
మనిద్దరం ఇక్కడే ఉండిపోతే నేను టాప్ మోడల్ గా ఎప్పటికి ఎదుగుతాను మమ్మీ అని ఇంకా భవిష్యత్తు మీద ఆశ చావక అడుగుతుంది.
కూతురి అమాయకత్వానికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక భార్గవి తల పట్టుకుంటుంది. మాట్లాడవేంటి మమ్మీ అని.. నాకు ఒక ఐడియా వచ్చింది అని తల్లి వైపు మెరిసే కళ్ళతో చేస్తుంది.
ఏమిటి అని నీరసంగా చూస్తుంది. నీకు డాడీ వందకోట్లు ప్రాపర్టీ ఇచ్చారు కదా.. అందులో కొంత అమౌంట్ తో మనం బెయిల్ అరేంజ్ చేసుకుని బయటికి వెళ్లి పోదాము.
వెళ్ళిన తర్వాత డాడీ ని ఎలాగోలా కన్విన్స్ చేసి నువ్వు ఆ ఇంట్లో ఉండు. నేను మోడల్ గా ట్రై చేస్తాను ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతుంది.
నీ ఐడియా వినడానికి బాగానే ఉంది కానీ మన దగ్గర అంత డబ్బు ఉండాలి కదా అని అంటుంది. అలా అంటావేంటి..
డాడీ నీకు ఇచ్చారు కదా అంటే.. అవి పేపర్ల వరకే నా చేతికి ఏమీ ఇవ్వలేదు. వాటి గురించి అడిగితే ఇన్ని సంవత్సరాలు మనం అనుభవించిన లగ్జరీ లైఫ్ ఆ 100 కోట్లు కన్నా ఎక్కువే అని చెప్పారు అని తల పట్టుకుంటుంది.
లేదు లేదు నువ్వు అబద్దం చెబుతున్నావు మమ్మీ. డాడీ నాకు చాలా క్లియర్ గా చెప్పారు. ఆ ప్రాపర్టీ మొత్తం నీకు హ్యాండ్ అవర్ చేశాను.మొత్తం అంతా నీ దగ్గరే ఉంది ఉన్నారు.
ఆఖరికి నీకు కూతురికి ఇవ్వడానికి కూడా మనసుప్పడం లేదా. ఈ జైలు నుంచి మనం బయటకు వెళ్లడం కన్నా నీకు డబ్బే ఎక్కువైపోయిందా మమ్మీ అని ఏడుస్తుంది.
అయ్యో శిల్పా నేను నిజమే చెబుతున్నాను. మీ డాడీ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆ పేపర్స్ మీద సంతకం చేయకపోతే నీ లైఫ్ నాశనం చేస్తాను చెప్పారు అని బాధగా ఉంటుంది.
నాశనం చేయడం అంటే మోడల్గా ఎదగనివ్వకపోవడం అని అయోమయంగా అడుగుతుంది.
భార్గవి విసుగ్గా మోడల్గా ఎదగకకపోతే లైఫ్ లేదు అనుకుంటున్నావా.. అంతకన్నా నీచమైన పని చేస్తాను అన్నారు అంటే.. క్లియర్ గా చెప్పు మమ్మీ అని అడుగుతుంది.
నీకు ఎలా చెప్పను శిల్ప.. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి నీ రూమ్ లోకి ప్రతిరోజు ఒక ఎయిడ్స్ పేషెంట్ ని పంపిస్తాను అన్నారు అని కళ్ళు తెరుస్తుంది.
ఆ మాటలకి శిల్పా షాక్ కొట్టిన కాకి లాగా బిరుసుకుపోయి భార్గవి వైపు చూసి ఏమంటున్నావు మమ్మీ అని వణికే స్వరం తో అడుగుతుంది.
నేను నిజమే చెబుతున్నాను శిల్ప. మీ నాన్నగారు అన్నా మాటలు తట్టుకోలేకే నేను సంతకం చేశాను. అంతేగాని ప్రాపర్టీ ఏమీ మనకు ఇవ్వలేదు అని చెబుతుంది.
నువ్వు అబద్ధం చెబుతున్నావు మమ్మీ. డాడీ అంతా నీచమైన వర్డ్స్ యూస్ చేయరు నాకు తెలుసు అని అంటుంది.
నేను నిన్నటి వరకు అలాగే అనుకున్నాను కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట నాకు నరకం లాగా ఉంది. నన్ను భార్య కాదన్నారు. నిన్ను కూతురు కాదన్నారు. అవని ఒక్కతే కూతురు అన్నారు అని బాధగా శిల్ప వైపు చూస్తూ ఉంటుంది.
ధనుంజయ్ అన్న మాటలను కూడా శిల్ప గుర్తు చేసుకుంటుంది. భార్గవి వైపు చూసి నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెబుతావా సూటిగా అడుగుతుంది.
అడుగు శిల్ప అనగానే...నిజంగా డాడీ నా రూమ్ లోకి అలాంటి పేషెంట్స్ ని పంపిస్తాను అన్నారా అని అడుగుతుంది. నేను నిజమే చెబుతున్నాను శిల్పా అని చెయ్యి పట్టుకుని బాధగా ఉంటుంది.
ఎందుకు మమ్మీ అన్ని అబద్ధాలు చెబుతున్నావు. డాడీ నాతో కూడా చెప్పారు అవని ఒక్కతే నా కూతురు. అప్పుడు ఎంత బాధ పడ్డారో నేను చూసాను.
మనం అవని విషయంలో చేసిన తప్పుకి డాడీ బాధపడ్డారు గాని.. నా విషయంలో అంతా బాడ్ వర్డ్స్ అయితే మాట్లాడరు.
నువ్వే కావాలని చెబుతున్నావు. ఎందుకు మమ్మీ.. కూతురు కన్నా నీకు డబ్బే ఇంపార్టెంట్ అయిపోయిందా..
అవునులే ఆ డబ్బు కోసమే డాడీని చీట్ చేసావు.
ఇంక నన్ను చీట్ చేయడానికి ఏముందలే అని భార్గవి చేయు విదిల్చుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి డోర్ నాక్ చేస్తుంది.
ఆ మాటలు వినగానే భార్గవి బిరుసుకుపోయి కూతురు వైపు చూస్తూ ఏమంటున్నావు నువ్వు అని తడబడుతూ అడుగుతుంది.
నేను నిజమే కదా చెబుతున్నాను.డాడీ మనల్ని ఏమీ చీట్ చేయరు. ఆయన మాటంటే మాట మీద నిలబడతారు.
నీకు 100 కోట్లు ఇచ్చిన సరే ఆ డబ్బులు నాకు ఇవ్వడానికి నీకు మనసు రావడం లేదు.ఏం చేసుకుంటావు మమ్మీ ఐ హేట్ యు అని ఏడుస్తుంది.
నిజంగా నాకు ఇవ్వలేదు శిల్పా అని బాధగా ఉంటుంది.. ప్లీజ్ మమ్మీ ఇంకా అబద్ధాలు చెప్పొద్దు నేను వినలేను అని అంటూ ఉండగానే డోర్స్ ఓపెన్ అవుతాయి.
శిల్పా ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా తనకి కేటాయించిన రూమ్ లోనికి వెళ్ళిపోతుంది.
వెళుతున్న కూతురు వైపే చూస్తూ నిలబడిపోతుంది. ఇంకా నువ్వు కూడా వెళ్లొచ్చు అని జైలర్ వచ్చి చెబుతాడు.
భార్గవి గమ్యం ఎటువైపు...
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)