20-01-2026, 06:45 AM
ఎపిసోడ్ 35
బేరా అడవిలో కోతుల ట్రాప్ లో పడి లోపలికంటూ వెళ్లి ఒక కొండ దగ్గర రెస్ట్ తీసుకుంటూ అక్కడికి వచ్చిన పులి పిల్లల్ని ఫోటో తీస్తూ పక్కనే ఉన్న పెద్దపులిని చూసి భయంతో వెనకడుగు వేశారు గోకుల్ వాళ్ళు.
*********************
అడవిలో ఒకవైపు పెద్దపులి ఒకవైపు ఏనుగులు రావడం చూసి భయంతో "అభిర్, అభిర్!" అని గట్టిగా అరిచాడు శివమణి.
ఆ అరుపు విని శివమణి వైపు చూసి "నువ్వేంటయ్యా! ఎవరైనా భయమేస్తే బాబోయ్ అంటారు, నువ్వు అభిర్ అని అరుస్తున్నావు ఎందుకు?" అని అయోమయంగా అడిగాడు అభిజిత్.
"సార్! అభిర్ పేరు వింటే ఇక్కడ జంతువులు మనల్ని ఏమీ చేయవు, అందరూ గట్టిగా అరవండి వెనక్కి వెళ్ళిపోతాయి." అని దగ్గరకు వస్తున్న పెద్దపులిని చూసి కంగారుగా చెప్పాడు శివమణి.
ఆ మాట విని "అవునా?" అని అందరూ "అభిర్, అభిర్!" అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు.
అంతలో కొండమీద నుంచి చేతిలో చిన్న కర్ర పట్టుకుని కిందకి దిగుతూ గోకుల్ వాళ్ళ వైపు చూసి "ఓయ్..! ఎందుకు అరుస్తున్నారు?" అని నడుం దగ్గర చేతులు పెట్టుకుని చూస్తూ అడిగాడు ఒక కుర్రాడు.
దూరంగా రాయి మీద బక్క పల్చగా చొక్కా లేకుండా తల పాగా కట్టుకొని మాసిపోయిన పంచ కట్టుకుని ఉన్న కుర్రాడిని చూసి "హెల్ప్ మీ హెల్ప్ మీ!" అని అరిచాడు గోకుల్.
ఆ మాట విని రాయి దిగి దగ్గరికి వచ్చి పెద్దపులి మీద కర్రతో ఒక్కటి ఇచ్చి దాని చెవ్వు దగ్గరికి వెళ్లి "పక్కకు వెళ్ళు భయపడుతున్నారు కదా!" అని గట్టిగా అరిచాడు ఆ కుర్రడు.
ఆ మాట విని పెద్దపులి వెనక్కి వెళ్లడం చూసి ఊపిరి పీల్చుకుని "దానికి చెవిలో చెప్పావు ఎందుకు?" అని కంగారుగా అడిగాడు గోకుల్.
"మా లచ్చికి కి కాన్పు అయిన తర్వాత సరిగ్గా వినపడటం లేదు అందుకే చెవి దగ్గరికి వెళ్లి గట్టిగా చెప్పాను." అని చెప్పాడు ఆ కుర్రాడు.
"ఏంటి? దీని పేరు లచ్చి ఆ..! దీనికి వినపడడం లేదా?" అని ఆశ్చర్యంగా చూస్తూ వెనకాల వస్తున్న ఏనుగులను చూసి "వాటిని కూడా కొంచెం ఆపవా?" అని రిక్వెస్ట్ గా అడిగాడు సర్పరాజ్.
"సరే! ఇంతకీ మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని దగ్గరికి వెళ్లి గోకుల్ చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఏనుగుల వైపు చూసి "పక్కకి వెళ్ళండి." అని కర్ర ఆడించాడు ఆ కుర్రడు.
ఏనుగులు పక్కకి వెళ్లడం చూసి 'వారిని వేలుడంత లేడు వీడికి మాట వింటున్నాయి.' అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అభిజిత్.
ఏనుగులు పక్కకి వెళ్లడంతో ఊపిరిప్పించుకుని బ్యాగ్ లో నుంచి ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆ కుర్రాడికి ఇస్తూ "నీ పేరేమిటి బాబు?" అని అడిగాడు శివమణి.
"నా పేరు సహదేవుడు! ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదు?" అని శివమణి చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాడు.
"అవునా? పేరుకు తగ్గట్టే మాకు సహాయం చేయడానికి వచ్చావు, ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అని అడిగాడు సర్పరాజ్.
ఆ మాటకి వెటకారంగా చూస్తూ "ఆ... మా భూమి మీద నుంచుని నేను ఇక్కడకి ఎందుకు వచ్చానని అడుగుతున్నావా? ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో ముందు చెప్పు!" అని అడిగాడు సహదేవుడు.
"మేము సరదాగా అడవిలో ఉన్న జంతువులని చూడడానికి వచ్చాము, అవును అవి నీ మాట ఎందుకు వింటున్నాయి?" అని డౌట్ గా అడిగాడు గోకుల్.
పక్కనే ఉన్న ఆభిజిత్ వైపు చూసి "ఇతను నీ మాట వింటాడా?" అని అడిగాడు సహదేవుడు.
"హా.. వింటాడు అతను నా ఫ్రెండ్!" అని చెప్పాడు గోకుల్.
ఆ మాట విని "మీరు ఇంగ్లీషు దొరలా!" అని తల ఊపుతూ "మరి ఆ పెద్దపులి, ఏనుగులు కూడా నా ప్రెండ్స్ అందుకే నా మాట వింటున్నాయి." అని చెప్పాడు సహదేవుడు.
"నీకు అభిర్ తెలుసా?" అని నెమ్మదిగా అడిగాడు శివమణి.
"అభిర్ ఆ.. ఇక్కడ ఎవరూ లేరు, ఆ పేరు ఉన్నవాళ్లు ఎవరన్నా అడవిలో తప్పిపోయారా?" అని అడిగాడు సహదేవుడు.
"హ..అలాంటిదే! మాకు ఈ అడవి మొత్తం చూపిస్తావా నీకు డబ్బులు ఇస్తాము." అని జేబులో నుంచి పర్స్ బయటకి తీసాడు శివమణి.
చేతిలో ఉన్న డబ్బులు వైపు చూసి "ఆ చిత్తు కాగితాలతో నేను ఏమి చేసుకోను." అని గోకుల్ వైపు చూసి "అతని మెడలో ఉన్న బొమ్మలు పెట్టి ఇవ్వమను అప్పుడు సుపిత్తాను." అని చెప్పాడు సహదేవుడు.
"అడివిలో ఉండడం వల్ల వీళ్ళకి డబ్బులు విలువ తెలీదు." అని తన మెడలో ఉన్న కెమెరా తీసి సహదేవుడు మెడలో వేసాడు గోకుల్.
ఆ మాటకి తలపైకి ఎత్తి గోకుల్ వైపు చూస్తూ "నాకు డబ్బులు విలువ తెలుసు దొర, మీకే పట్టణంలో ఉండి డబ్బుల విలువ తెలియకుండా పోయింది.
ఇక్కడ ఆ చిత్తు కాగితాలు ఉంటే గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకవు నాతో రండి." అని అక్కడ ఉన్న రెండు పులి పిల్లల్ని ఎత్తుకొని ముందుకు వెళ్ళాడు సహదేవుడు.
సహదేవుడు ముందుకు వెళ్లడంతో వాళ్ళ వైపు చూసి గర్జిస్తున్న పులిని చూసి "పదండి పదండి ఆ బుడ్డోడు లేకపోతే మనల్ని మింగేసేటట్లు ఉంది." అని కంగారుగా చెప్పాడు అభిజిత్.
సహదేవుడు వెనకాలే వెళుతూ శివమణి వైపు చూసి "ఇక్కడ అభిర్ సేన ఉంటారు అన్నావు, అతను అసలు ఆ పేరే తెలియదు అని చెబుతున్నాడు." అని డౌట్ గా అడిగాడు సర్ఫరాజ్.
"సార్! నా అంచనా తప్పు కాదు, కచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఉంటారు, లేకపోతే ఈ జంతువులు అంత తేలికగా వీళ్ళ మాట వినవు, నాకు తెలిసి ఆ సహదేవుడు కూడా అభిర్ సేన మనిషే అయి ఉంటాడు." అని అనుమానంగా చెప్పాడు శివమణి.
ఆ మాట విని కాసేపు ఆలోచించి సహదేవుడి దగ్గరికి వెళ్లి "నీతో పాటు ఇక్కడ ఇంకా ఎంతమంది ఉంటారు, మీ గూడెం ఎక్కడ?" అని అడిగాడు సర్ఫరాజ్.
ఆ మాట విని అందరి వైపు అనుమానంగా చూస్తూ "ఇంతకీ మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు ముందు ఆ విషయం చెప్పండి." అని అడిగాడు సహదేవుడు.
"మేము చత్రపతి శివాజీ మహారాజ్ గారికి చెందిన మనుషులము, ఆయన సైన్యంలో పనిచేసిన ఒక దళం వారు ఇక్కడ ఉన్నారు అని తెలిసి వాళ్ళ వస్తువులు ఇవ్వడానికి వచ్చాము." అని బ్యాగ్ జిప్ తీసి చూపించాడు శివమణి.
"ఓహో..అవునా? మీరు అబద్ధం చెబుతున్నారని నాకు బాగా అర్థమైంది. శివాజీ మహారాజ్ గారి మనుషులైతే పెద్ద పులిని చూసి భయపడరు ధైర్యంగా రొమ్ము చూపించి నుంచుంటారు." అని చెప్పాడు సహదేవుడు.
"అంటే! మేము సైన్యంలో పనిచేసే వాళ్ళము కాదు, సమాచారం అందించే వాళ్ళము అందుకే భయపడ్డాము." అని చెప్పాడు శివమణి.
"అలా అయితే మీరు ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారు." అని అడిగాడు సహదేవుడు.
"ఆ సేన నాయకుడు అభిర్ ని కలవడానికి వచ్చాము." అని చెప్పాడు సర్పరాజ్.
"ఆ పేరుతో మా గూడెంలో ఎవరూ లేరు, ఈ జంతువుల్ని చూసి వెనక్కి పోండి. మిమ్మల్ని మా సింబా చూశాడు అంటే కాళ్లతో పట్టుకెళ్ళి అక్కడ కనిపిస్తున్న కొండ మీద పెడతాడు, అప్పుడు మీకు దిగడం కూడా కుదరదు అక్కడే సత్తారు." అని చెప్పాడు సహదేవుడు.
"సింబా అంటే మీ నాయకుడా?" అని అడిగాడు గోకుల్.
"సింబా అంటే ఇక్కడ ఉన్న జంతువులని కాపలాకాసేవాడు మీరు వల్ల ఒక జింక పిల్ల అరుపు వినబడితే చాలు క్షణాల్లో మీ ముందు వాళ్లతాడు." అని చెప్పాడు సహదేవుడు.
'ఓహో. అందుకే ఇక్కడ హంటింగ్ చేయకూడదు అన్నారు.' అనుకున్నడు జాకి.
"మరి మీ గూడెం నాయకుడు ఎవరు? ఆయనను మేము ఒక్కసారి కలవచ్చా?" అని అడిగాడు శివమణి.
"మా నాయకుడి పేరు శంభు దొర! ఆయన్ని ఎవరు చూడడం కుదరదు." అని చెప్పాడు సహదేవుడు.
"మమ్మల్ని ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు విషయం చెప్పి ఈ వస్తువులు ఇచ్చి వెళ్ళిపోతాము." అని రిక్వెస్ట్ గా అడిగాడు శివమణి.
సైలెంట్ గా ఉన్న సహదేవుడు వైపు చూసి "మీకు మీ నాయకుడు ఎలాగో, నేను పట్టణంలో ఉన్నా ప్రజలకి నాయకుడిని కాబట్టి నువ్వు నా మాట వినాల్సిందే!" అని చెప్పాడు అభిజిత్.
"నువ్వు నా నాయకుడివి కాదు కదా నేను ఎందుకు వినాలి, అయ్యినా ఒక పెద్ద పులిని, రెండు ఏనుగుల్ని చూసి భయపడ్డ మీరు, మా నాయకుడి దగ్గరికి వెళ్లాలంటే ఇలాంటివి 100 కనపడతాయి వాటి మధ్యలో నేను లేకుండా వెళ్లే ధైర్యం ఉందా చెప్పండి దారి చూపిత్తాను." అని అడిగాడు సహదేవుడు.
ఆ మాటకి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని" మనం అభిర్ సేన నాయకుడితో మాట్లాడడానికి వచ్చాము కనీసం ఈ బుడ్డోడు తోనే మాట్లాడలేకపోతున్నాము. " అని పెదవి విరిచాడు అభిజిత్.
అంతలో వెనకాలే నడుస్తూ కాసేపు ఆలోచించి బ్యాగ్ లో నుంచి అభిర్ భుజం మీద ఉండే పచ్చ బొట్టు బొమ్మ తీసి సహదేవుడికి చూపించి "ఈ గుర్తు ఉన్న మనిషిని మేము కలవాలి." అని అడిగాడు శివమణి.
తన చేతిలో ఉన్న గుర్తువైపు చూసి ఆకాశంలో శబ్దం రావడం వినబడి "సింబా వస్తున్నాడు, వాడు నా మాట వినడు వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి." అని చెప్పాడు సహదేవుడు.
"సింబా వస్తున్నాడు అని చెప్తున్నాడు అసలు సింబా అంటే ఎవరు?" అని డౌట్ గా తలపైకెత్తి చూసి ఆకాశంలో నుంచి కిందకి వేగంగా వస్తున్న పెద్ద పక్షిని చూసి "ఓ మై గాడ్!" అని కంగారుగా అన్నాడు గోకుల్.
భయంకరంగా వస్తున్న అరుపు విని చెవులు మూసుకుని వేగంగా కిందకు వస్తున్న పక్షిని చూసి "ఈ సింబల్ చూసి అది నేల మీదకు దిగుతుంది మనం కరెక్ట్ ప్లేస్ కి వచ్చాము." అని చెప్పాడు శివమణి.
"అది సరే! ఆ పక్షి మనల్ని రెండు కాళ్ళతో ఎత్తుకు వెళ్ళిపోయేటట్లు ఉంది. ముందు ఆ సంగతి చూడండి." అని భయంగా చూస్తూ చెప్పాడు జాకి.
ఆ పక్షి వేగంగా మీదకి రావడం చూసి భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు అందరూ.
అంతలో దూరం నుంచి "సింబా ఆగు!" అని అరుపు వినిపించి వేగంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ పక్షి.
"మనకి ఎవరో హెల్ప్ చేసారు." అని ఆనందంగా కళ్ళు తెరిచాడు గోకుల్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)