Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#97
ఎపిసోడ్ 34


గోకుల్ వాళ్ళు జీపు దిగి డ్రైవర్ డేంజర్ అని చెబుతున్న వినకుండా బేరా అనే అడవి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యారు.

అందరూ అడవిలోకి వెళ్లడం చూసి జీప్ దిగి ఆకాశం వైపు చూసి వింత శబ్దం చేసి సిగ్నల్ ఇచ్చాడు డ్రైవర్.

**********************

దట్టమైన బేరా అడవిలోకి ఎంటర్ అయ్యి అడ్డుగా ఉన్న కొమ్మలని నరుకుతూ దారిని సరి చేస్తూ ముందుకి వెళుతూ  ఉన్నాడు జాకి.

వెనకాలే వెళుతూ నిశ్శబ్దంమైన వాతావరణం లో పక్షుల అరుపులు, సెలయేళ్ల శబ్దం రావడం వింటూ నెమ్మదిగా నడుస్తూ
"ఇక్కడ ఇంత సైలెంట్ గా ఉంది ఏమిటి? మనం వదిలిన ఊపిరి సౌండ్ మనకే వినపడుతుంది." అని చుట్టూ చూస్తూ అన్నాడు అభిజిత్.

"ఎస్! ఇలాంటి డీప్ ఫారెస్ట్ అమేజన్ల్ లో ఉంటాయి ఇండియాలో కూడా ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు గోకుల్.

అడవిలో నెమ్మదిగా ముందుకు వెళుతూ ఎదురుగా  చెట్టుకు వేలాడుతున్న కొండచిలువని చూసి కంగారుపడి "అసలు ఇక్కడ మనుషులు ఉండే జాడలేదు మనం రాంగ్ ప్లేస్ కి వచ్చాము అనిపిస్తుంది." అని  చెప్పాడు సర్పరాజ్.

"అవును భయ్యా! ఇక్కడ జంతువులు ఉంటాయి అని చెప్పారు ఇప్పటివరకు ఒక్కటి కూడా కనపడలేదు, మనం బాగా లోపలికి వెళ్ళిపోతున్నాము దారి తప్పితే వెనక్కి కూడా వెళ్లలేము ఫోన్ సిగ్నల్ కూడా రావడం లేదు." అని చెప్పాడు జాకి.

అందరూ అంటున్న మాటలు విని బ్యాగ్ లో నుంచి మ్యాప్ తీసి చూసి "మనం కరెక్ట్ గానే వెళుతున్నాము కచ్చితంగా ఇక్కడ నివసించే వాళ్లే అభిర్ సేన, నాకు తెలిసి మనల్ని వాళ్ళు గమనిస్తేనే ఉంటారు ఎవరో ఒకరు ఎదురుపడతారు చూడండి." అని చెప్పాడు శివమణి.

"ఈ అడవిలో చెట్ల నుంచి వచ్చే సౌండ్ వింటేనే గుండె దడ పెరిగిపోతుంది ఇప్పుడు ఎవరైనా ఎదురుపడితే గుండె ఆగిపోతుంది." అని చెప్పి
జాకీ బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ చెట్ల మధ్యలో నుంచి లైటింగ్ కంట్లో పడడంతో ఒక్కసారి ఉల్లిక్కిపడి "అక్కడ ఎవరో ఉన్నారు." అని కంగారుగా అరిచాడు అభిజిత్.

ఆ అరుపు విని అందరూ ఒక చోటకి వచ్చి గన్స్ బయటకు తీసి అభిజిత్ వైపు చూసి "నీకు ఎవరు కనిపించారు?" అని అడిగాడు గోకుల్.

"నేను మంచినీళ్లు తాగుతుంటే ఆ తుప్పల మధ్యలో నుంచి నా కంట్లో లైటింగ్ పడింది అక్కడ కచ్చితంగా ఎవరో ఉన్నారు." అని కంగారుగా చెప్పాడు అభిజిత్.

"మీరు ఇక్కడే ఉండండి." అని బ్యాగ్ లో నుంచి స్టిక్ తీసి పెద్దదిగా చేసి ముందుకు వెళ్లి అక్కడ ఉన్న చెట్లను పక్కకు జరిపి ఉంగరం కనిపించడంతో దగ్గరికి వెళ్లి తీసుకుని
"ఈ ఉంగరం ఇక్కడికి ఎలా వచ్చింది?" అని ఆశ్చర్యంగా చూస్తూ తీసుకువచ్చి సర్పరాజ్ చేతిలో పెట్టాడు జాకి.

తన చేతిలో ఉన్న ఉంగరం బురద పట్టేసి ఉండడంతో  వాటర్ పోసి క్లీన్ చేసి భూతఅద్దంలో చూసి గోకుల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "సార్! ఇది ఔరంగజేబు కాలంనాటి రాజముద్రిక!" అని చెప్పాడు సర్ఫరాజ్.

"ఎస్! నేను ముందే చెప్పాను కదా, మనం కరెక్ట్ ప్లేస్ లోకి వచ్చామని, అభిర్ సేన కోసం వెతుకుతూ ఏ సేనాధిపతో వచ్చి ఇక్కడ చనిపోవడంతో ఆ ఉంగరం పడి ఉంటుంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు శివమణి.

సర్పరాజ్ చేతిలో ఉన్న ఉంగరం తీసుకుని చూస్తూ "దీనిని ఆక్షన్ లో పెడితే మంచి డబ్బులు వస్తాయి, ఇలాంటి విలువైన వస్తువులే చెట్ల మధ్య పడేసి ఉన్నాయి అంటే లోపల ఇంకా విలువైనవి ఉంటాయి." అని ఆశగా చూస్తూ చెప్పాడు గోకుల్.

అంతలో సడన్గా చెట్టు మీద నుంచి దూకి  గోకుల్ చేతిలో ఉన్న ఉంగరం తీసుకుని వేగంగా చెట్టు మీదకు వెళ్ళి కింద ఉన్న వాళ్ళ వైపు చూసి పళ్ళు ఇక్కిలించింది ఒక కోతి.

సడన్ గా మీదకి దూకేసరికి ఉలిక్కిపడి వెనక్కి వెళ్లి గన్  తీసి తల పైకి ఎత్తి చెట్టు మీద ఉన్న కోతిని చూసి నవ్వుతూ "ఇదేనా నువ్వు చెప్పిన అభిర్ సేన!" అని శివమణి వైపు చూసి నవ్వుతూ అడిగాడు గోకుల్.

అంతలో వేగంగా ఇంకొక కోతి వచ్చి గోకుల్ చేతిలో ఉన్న గన్ లాక్కుని చెట్టు ఎక్కింది.

అది చూసి "మన వస్తువులు మొత్తం బాగ్స్ లో పెట్టి గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఆ కోతి చేతిలో గన్ ఉంది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అని చెప్పాడు శివమణి.

చెట్టుమీద గన్ పట్టుకుని ఉన్న కోతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్ జాకి! దాని చేతిలో గన్ ఎలాగైనా తీసుకో  అది షూట్ చేస్తే, కోతి చేతిలో చచ్చాము అంటారు, పరువు కూడా పోతుంది." అని చెప్పాడు అభిజిత్.

"సరే భయ్యా!" అని భయం భయంగా చెట్టు కిందకు వెళ్లి బ్యాగ్ లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ చూపించి "ఇది తీసుకో అది ఇవ్వు!" అని అడిగాడు జాకి.

నెమ్మదిగా కోతి కిందకి దిగడం చూసి "హమ్మయ్య!" అని ఊపిరి పీల్చుకున్నాడు అభిజిత్.

కిందకు వచ్చి జాకీ చేతీలో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని మళ్ళీ వేగంగా పైకి వెళ్లి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళుతూ గోకుల్ వాళ్ళ వైపు చూసి వెక్కిరిస్తూ ఉంది కోతి.

"ఓర్ని.. ఈ కోతికి తెలివి బానే ఉంది. మనల్ని పిచ్చోళ్లను చేస్తుంది. ఎలాగైనా దాని పట్టుకోండి లైసెన్స్ గన్ పోతే పెద్ద గోల అవుతుంది." అని చెప్పాడు గోకుల్.

రెండు కోతులు కాస్త ముందుకు వెళ్లడం వెనక్కి తిరిగి చూసి వెక్కిరించి మళ్ళీ ముందుకు వెళ్లడం చేస్తూ ఉండడం చూసి

"ఆగండి అవి మనల్ని కావాలని ఎక్కడికో తీసుకు వెళుతున్నాయి మనం వాటి ట్రాప్ లో పడకూడదు." అని చెప్పాడు శివమణి.

వెనక్కి తిరిగి చూసి "అవును భయ్యా! ఈ కోతుల గోలలో  పడి మనం వేరే రూట్ వచ్చేసాము, ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చామో ఎటువైపు వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు." అని అయోమయంగా చూస్తూ చెప్పాడు జాకీ.

"నేను ఊహించిందే జరిగింది మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు, కావాలని రూటు మార్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు." అని చెప్పాడు శివమణి.

అంతలో అక్కడికి వచ్చి బిస్కెట్ ప్యాకెట్, గన్ కిందపడేసి వేగంగా వెళ్ళిపోయాయి రెండు కోతులు.

కింద పడ్డ వాటిని తీసుకుంటూ "ఆ ఉంగరం కింద పడయలేదు, అంటే దానిని ఆ కోతులు పెట్టి మనల్ని ట్రాప్ చేసి రూటు మార్చాయి." అని చెప్పాడు సర్ఫరాజ్.

"అవునా?" అని ఆశ్చర్యంగా చూస్తూ "అయ్యితే కోతి నుంచి మనిషి పుట్టిన మాట నిజమే! వీటికి మనకన్నా ఎక్కువ తెలివి ఉంది." అని చెప్పాడు అభిజిత్.

"సరే కానీ! మనల్ని ఈ రూట్లో ఆ కోతులు ఎందుకు తీసుకువచ్చాయి?" అని చుట్టూ చూస్తూ దూరంగా జింకలా గుంపు కనపడడంతో
"ఇప్పటికి మనకి అడవిలో జంతువులు కనిపించాయి." అని సంతోషంగా మెడలో ఉన్న కెమెరాతో ఫోటోలు తీస్తూ చెప్పాడు గోకుల్.

జింకల గుంపు వైపు చూసి దూరంగా వాటర్ ఫాల్స్ కనిపించడంతో "ఆహా..! ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా చూడడానికి ఎంత అందంగా ఉంది. దీనిని టూరిస్ట్ స్పాట్ గా ఎందుకు చేయలేదు?" అని అడిగాడు సర్పరాజ్.

"సార్! ఆ ప్రశాంతత ఇక్కడ ఉండే మనుషుల వల్ల జంతువుల వల్ల వస్తుంది. మనలాంటి వాళ్ళు ఎంటర్ అయితే ఆ ప్రశాంతత పోతుంది." అని నవ్వుతూ చెప్పాడు శివమణి.

"కరెక్ట్! ఈ ప్లేస్ లో గన్ బయటికి తీయాలి అన్న మనసు ఒప్పుకోవడం లేదు, అందుకనే హంటింగ్ నిషేధించారు అనుకుంటా!" అని బైనోక్లోర్ లో చూస్తూ చెప్పాడు అభిజిత్.

కొంచెం ముందుకు వెళ్లి చూస్తూ వెనక్కి తిరిగి "భయ్యా! ఇటువైపు రండి కాస్త అడవి తక్కువగా ఉంది ఆ కొండవైపు వెళదాము కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు!" అని చెప్పాడు జాకి.

"సరే!" అని మైదానం లాంటి ప్లేస్లో నడుచుకుంటూ కొండ దగ్గరకు వెళ్లి కూర్చుని బ్యాగ్ లో ఉన్న ఫ్రూట్స్ బిస్కెట్స్ తీసుకొని తింటూ
"ఇంత అడవి మధ్యలో ఈ ప్లస్ ఇలా ఉంది అంటే, దీనిని మనుషులు ఎవరో బాగు చేసి వ్యవసాయం చేస్తున్నారు." అని చెప్పాడు సర్ఫరాజ్.

"అవును సార్! కచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ద్వారా మనం అభిర్ సేన వాళ్ళని కలవచ్చు అనే నమ్మకం నాకు ఉంది." అని చెప్పాడు శివమణి.

వాటర్ తాగుతూ కొండ మీద నుంచి నిదానంగా దిగుతున్న రెండు పులి పిల్లని చూసి "హే..! అటు చూడండి." అని కెమెరాతో ఫోటోలు తీస్తూ చెప్పాడు గోకుల్.

దూరంగా ఉండి వాళ్ల వైపే చూస్తున్న రెండు పులి పిల్లల్ని చూసి బిస్కెట్స్ బయటికి తీసి "రండి రండి." అని పిలుస్తూ ఉన్నాడు అభిజిత్.

"అవి మనల్ని చూసి భయపడి దగ్గరకు రావడం లేదు." అని లేచి నడుచుకుంటూ వెళ్లి దగ్గర్నుంచి ఫోటోలు తీస్తూ ఉన్నాడు గోకుల్.

అటువైపే చూస్తూ "గోకుల్! ఒక్కసారి పక్కకు చూడు." అని భయంతో గట్టిగా అరిచి గన్ బయటికి తీసాడు అభిజిత్.

ఆరుపు విని "ఏమైంది?" అని తల పక్కకు తిప్పి భారీ ఆకారంలో ఉన్న పెద్ద పులిని చూసి ఒక్కసారి షాక్ అయ్యి కింద పడి నెమ్మదిగా వెనక్కి జరుగుతూ అభిజిత్ వాళ్ళ దగ్గరికి వచ్చి
"ఒక్కసారి నా గుండె ఆగినట్లు అయింది." అని భయంగా చూస్తూ చెప్పాడు గోకుల్.

అంతలో మరొకవైపు నుంచి ఏనుగుల గుంపు రావడం చూసి "సార్! మనం ఇరుక్కుపోయాము ఆ కోతులు మనల్ని కావాలని ఇక్కడికి తీసుకువచ్చి ఈ జంతువులకు అప్పచెప్పాయి." అని కంగారుగా చూస్తూ చెప్పాడు జాకి.

ఒకవైపు ఏనుగులు ఒకవైపు పెద్దపులి చుట్టుముట్టడంతో గన్ బయటికి తీసి షూట్ చేయబోతున్న గోకుల్ ని అపి "సార్! కంగారు పడకండి బుల్లెట్ సౌండ్ వింటే అవి రెచ్చిపోయి మీద పడతాయి." అని చెప్పాడు సర్పరాజ్.

వాళ్ల వైపే కోపంగా చూస్తూ మీదకి వస్తున్న పెద్దపులిని చూసి భయంతో "అభిర్!" అని గట్టిగా అరిచాడు శివమణి.
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 19-01-2026, 07:44 AM



Users browsing this thread: 9 Guest(s)