Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#96
ఎపిసోడ్ 33


శివమణి చెప్పిన వివరాలు విని "మనం రాజస్థాన్ లో ఉన్న గొర్వర్ వెళ్లి ఆ తెగ వారి ఆచూకీ తెలుస్తుందేమో చూద్దాము." అని చెప్పాడు సర్పరాజ్.

********************

రూమ్లో తమ ఎదురుగా ఉన్న ముగ్గురు వైపు చూస్తూ బుక్స్, గుహలో దొరికిన జంతు చర్మాలు తీసి లోపల పెడుతూ చిన్నగా నవ్వి
"సార్! మీకు సినిమా తీయడానికి వాళ్ల చరిత్ర కావాలి అంతేగాని వాళ్లతో పనేముంది?" అని అడిగాడు శివమణి.

ఆ మాట విని ఫేస్ ఫీలింగ్ మార్చి "మీరు చెప్పింది కరెక్టే! మనం వాళ్ళని కలిస్తే ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవచ్చు కదా!" అని చెప్పాడు అభిజిత్.

"మీరు సినిమా తీయడం కోసం నా దగ్గరకు రాలేదని అర్థమైంది. అభిర్ సేనని ఎందుకు కలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు క్లారిటీ ఇస్తే, మరి కొన్ని విషయాలలో నేను మీకు క్లారిటీ ఇస్తాను." అని వ్యంగంగా చూస్తూ చెప్పాడు శివమణి.

"గుడ్! మీరు మా ఫీలింగ్స్ తెలుసుకున్నారని అర్థమైంది. ఆ అభిర్ సేనాని వెతకడానికి మాకు హెల్ప్ చేయండి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి." అని అడిగాడు గోకుల్.

"ఆ అభిర్ సేన దగ్గర ఉన్న ఏ వస్తువు కోసం మీరు వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా?" అని అడిగాడు శివమణి.

"ఆ తెగ వారి దగ్గర దైవికమైన శక్తి గల కొన్ని వస్తువులు ఉన్నాయని మాత్రమే మాకు తెలుసు ఏమి ఉన్నాయో వివరాలు కూడా మాకు తెలియదు." అని చెప్పాడు సర్పరాజ్.

"మిస్టర్ శివమణి! ఆ తెగ వారి దగ్గర శక్తివంతమైన వస్తువులు ఏమున్నాయో మీకు తెలుసు అని నాకు అర్థమైంది. కానీ దానిని సాధించడానికి మీ దగ్గర ఉన్న శక్తి సరిపోలేదని కూడా అర్థమైంది. మాతో కలిసి పని చేయండి దానిని సాధిద్దాం అందరం పంచుకుందాము." అని చెప్పాడు అభిజిత్.

"మినిస్టర్ గారు కరెక్ట్ గా చెప్పారు." అని నవ్వుతూ అన్నాడు శివమణి.

"అంటే! మీకు దొరికిన ఆధారాలను బట్టి వారి దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో కూడా తెలుసుకున్నారు కదా!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గోకుల్.

"నాకు దొరికిన ఆధారాల్లో అటువంటిదేమీ లేదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకున్నను అది నిజమో కాదో వాళ్ళని కలిస్తేనే చెప్పగలను." అని చెప్పాడు శివమణి.

"మరి ఇంకెందుకు ఆలస్యం మాతో కలిసి రండి." అని చెప్పాడు సర్ఫరాజ్.

"అభిర్ సేనాను చేరుకోవడంఅంత సులభమైన పని కాదు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా తెలుసుకునే గూడాచారి వ్యవస్థ ఉన్న మొగలలు వల్లే అవలేదు, వారిని వెతుక్కుంటూ వెళ్లిన వారెవరు వెనక్కి తిరిగి రాలేదు, కానీ నా దగ్గర ఒక మార్గం ఉంది." అని చెప్పాడు శివమణి.

"అవునా? మరి ఇక లేట్ ఎందుకు అది ఏమీతో చెప్పండి?" అని ఆత్రుతగా అడిగాడు గోకుల్.

"మనం ఉదయం గొర్వర్ బయలుదేరి వెళదాము అక్కడ అబీర్ సేనలో ఒక్కరినైనా మనం కలుసుకోగలిగితే అప్పుడు వారితో పరిచయం ఏర్పారుచుకోవడానికి నా దగ్గర ఉన్న ఉపాయం బయట పెడతాను." అని చెప్పాడు శివమణి.

"ఓకే షూర్! దీనికి నేను ఓకే ఉదయం బయలుదేరుదాము." అని మాట్లడబోతున్న సర్పరాజ్ చెయ్యి పట్టుకున్నాడు అభిజిత్.

"నాది ఇంకొక షరతు ఉంది వాళ్ళ దగ్గర దొరికిన వస్తువులలో నాకు నచ్చింది ఒకటి మాత్రమే తీసుకుంటాను మిగతావి మీరే ఉంచుకోండి. తరువాత నన్ను మోసం చేయాలని చూస్తే మీరే ఇబ్బంది పడతారు." అని చెప్పాడు శివమణి.

"మనం ఆ తెగ వారి దగ్గర ఉన్న వస్తువులు సాధించలేకానీ మీకు ఏది కావాలంటే అది ఉంచుకోండి. నాకు ఎవరు సాధించలేని సాధించడం మాత్రమే కావాలి, డబ్బు మీద ఆశ లేదు." అని చెప్పాడు గోకుల్.

"ఓకే సర్! ఉదయం గోర్వర్ స్టార్ట్ అవుదాము." అని చెప్పాడు శివమణి.

"థాంక్యూ! మార్నింగ్ రెడీగా ఉండండి." అని చెప్పి చైర్ లో నుంచి లేచి బయటికి వెళ్లారు నలుగురు.

అక్కడినుంచి బయటికి వెళ్లి కారులో గెస్ట్ హౌస్ కి వెళుతూ, గోకుల్ వాళ్ళ వైపు చూసి "సార్! శివమణి చెప్పిందానికల్లా మీరు ఇద్దరు ఓకే అన్నారు ఎందుకు? మనం పూర్తి విషయాలు తెలుసుకోవాల్సింది." అని అడిగాడు సర్పరాజ్.

"శివమణికి ఆ తెగవారి దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో కచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే ఒక్క వస్తువు మాత్రమే తీసుకుంటాను అని చెబుతున్నాడు, మనం ప్రెజర్ చేసినా చెప్పడు, ఒప్పుకోవడం తప్పితే వేరే మార్గం లేదు." అని చెప్పాడు గోకుల్.

"ముందు ఆ తెగ వారి దగ్గరికి చేరుకున్న తర్వాత, మనకి అనుకూలంగా ఉంటే ఉంటాడు, లేకపోతే అడవిలోనే కలిసిపోతాడు, విశ్వాసంగా ఉండడానికి మనం ఏమైనా వాడు పెంచుకున్న కుక్కలామా!" అని నవ్వుతూ

డ్రైవింగ్ చేస్తున్న జాకీ వైపు చూసి "మన మనుషుల్ని వాడి పెళ్ళాం పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచమను అవసరమైతే వాడిని దారిలోకి తెచ్చుకోవడానికి వీళ్ళు ఉపయోగపడతారు." అని చెప్పాడు అభిజిత్.

"సరే భయ్యా! మిచల్ గాడిని ఆ ఇంటి దగ్గరే ఉంచుతాను." అని చెప్పాడు జాకీ.

*********************

రెండు రోజుల తర్వాత శివమణితో కలిసి గొర్వర్ ఫారెస్ట్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ కి చేరుకొని రెస్ట్ తీసుకుంటూ

"శివమణి గారు అసలు ఆ అభిర్ సేన ఈ ప్రాంతానికి వలస వచ్చినట్లు మీరు ఎలా అంచనా వేస్తున్నారు?" అని  అడిగాడు సర్పరాజ్.

"సుమారు 2000 BCE, వేద కాలంలో ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతం బ్రహ్మావర్త అంటే  దేవతలచే సృష్టించబడిన భూమి, దొరికిన ఆధారాలనుబట్టి ఆ జారువ తెగ ఏర్పడింది ఈ ప్రదేశంలోనే అని అంచనా వేశాను నాకు తెలిసి కచ్చితంగా వాళ్ళు ఇక్కడే స్థిరపడి ఉండాలి.

ఈ ఏరియాలో ఉన్న గిరిజనులతో జంతువులు స్నేహితులలా కలిసి తిరుగుతూ ఉంటాయి అది చూడడానికి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు అక్కడినుంచి నుంచి 25 కిలోమీటర్ల లోపలికి వెళితే దట్టమైన అడవులు ఉన్నాయి కచ్చితంగా ఆ ప్రదేశంలోనే అభిర్ సేన ఉండి ఉంటుంది." అని చెప్పాడు శివమణి.

"ఇన్ని విషయాలు తెలిసిన మీరు ఆ తెగ వాళ్ళని కలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదా?" అని అనుమానంగా అడిగాడు గోకుల్.

"నో! అది నా శక్తికి మించిన పని, ఒకవేళ నేను వెళ్లి వాళ్ళని కలిసిన మాట్లాడి రాగలను కానీ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ముట్టుకోను కూడా ముట్టుకోలేను.

మీలాంటి పెద్ద వాళ్ళ అండ ఉంటే అది కుదురుతుంది దానికి బుర్ర ఒక్కటే సరిపోదు  పలుకుబడి, డబ్బు కూడ ఉండాలి అప్పుడే సాధ్యమవుతుంది." అని చెప్పాడు శివమణి.

అంతలో గెస్ట్ హౌస్ లోకి వచ్చి "భయ్యా! ఫారెస్ట్ లోకి వెళ్లడానికి డిపార్ట్మెంట్ వాళ్ళ అబ్జెక్షన్ చెప్తున్నారు లోపల ఏ జంతువుని వేటాడబోవమని లెటర్ ఇవ్వాలి అని అడుగుతున్నారు." అని చెప్పాడు జాకీ.

"అవునా? హంటింగ్ చేస్తే ఏమవుతుంది అంట!" అని అనుమానంగా అడిగాడు గోకుల్.

"అక్కడ నివసించే కొన్ని జాతులు వాళ్ళు ఎదురు తిరుగుతారు అంట!" అని చెప్పాడు జాకి.

"అక్కడ హంటింగ్ చేయకూడదు అన్నారు అంటే, నాకు తెలిసి కచ్చితంగా మనం వెతుకుతున్న వాళ్ళు ఉండే ఉంటారు, ఎందుకంటే అభిర్ సేన వేటకి విరుద్ధం వాళ్ళు జంతువుల్ని ప్రేమిస్తారు." అని చెప్పాడు శివమణి.

"సరే! నేను ఈ ఏరియా మినిస్టర్ తో మాట్లాడతాను నువ్వు హంటింగ్ చేయము అని చెప్పి లెటర్ ఇవ్వు, లోపలికి వెళ్ళిన తర్వాత మన పని మనం చేసుకుందాము." అని చెప్పాడు అభిజిత్.

"సరే భయ్యా!" అని చెప్పి బయటకు వెళ్ళాడు జాకి.

****************

ఉదయం సెక్యూరిటీ జీప్ లలో ఆర్వార్ పర్వత శ్రేణి దగ్గర ఉన్న గొర్వర్ అడవి ప్రాంతంలోకి సఫరికి బయలుదేరారు గోకుల్ వాళ్ళు.

జీప్ డ్రైవ్ చేస్తూ పక్కన కూర్చున్న  శివమణి వైపు చూసి "సార్! ఈ ప్రాంతంలో చిరుతపులు  గిరిజనులతో కలిసి తిరుగుతూ ఉంటాయి." అని కొండ మీద ఉన్న జంతువులని చూపించాడు డ్రైవర్.

జీప్ లో నుంచి అక్కడ ఉన్న చిరుతలను చూసి ఫోటోలు తీస్తూ "ఈ ప్రాంతమంతా కొండలే ఉన్నాయి అడవి ప్రాంతం కనిపించడం లేదు ఈ జంతువులు మొత్తం ఎక్కడ ఉంటాయి?" అని అడిగాడు గోకుల్.

"ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు వెళితే 'బేరా' అనే అడవి ప్రాంతం వస్తుంది సార్! కానీ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు." అని చెప్పాడు డ్రైవర్.

"అవునా? ఆ అడవిలోకి వెళ్లడానికి ఎందుకు పర్మిషన్ లేదు?" అని డౌట్ గా అడిగాడు అభిజిత్.

"ఆ ప్రాంతంలో చాలా రకాల క్రూర మృగాలు ఉంటాయి సార్! పెద్దాపులులు, సింహాలు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అందుకే దాన్ని డేంజర్ జోన్ గా అనౌన్స్ చేసి లోపలికి ఎవరికి ఎంట్రన్స్ ఇవ్వడం లేదు." అని చెప్పాడు డ్రైవర్.

"అంటే! బేరా అడవి ప్రాంతంలో జంతువులు మాత్రమే జీవిస్తాయా అక్కడ  మనుషులు ఎవరు ఉండడం లేదా?" అని అడిగాడు సర్పరాజ్.

"అక్కడ కూడా కొన్ని గిరిజన జాతులు వాళ్ళు ఉంటారు అని చెబుతారు కానీ వాళ్ళని ఇప్పటివరకు నేను చూడలేదు." అని చెప్పాడు డ్రైవర్.

"సరే! ఇక్కడ చూడడానికి పెద్ద థ్రిల్లింగ్ గా ఏమీ లేదు, బేరా ఏరియాకు తీసుకువెళ్లు సరదాగా ఫోటోలు తీసుకుని వెంటనే వెనక్కి వచ్చేద్దాము." అని చెప్పాడు గోకుల్.

"సార్! అక్కడికి వెళ్లడం చాలా డేంజర్! అయ్యినా లోపలికి జీప్ వెళ్ళదు నడిచి వెళ్లడమే!" అని ఎదురుగా కనిపిస్తున్న సన్నటి దారిని చూపించాడు డ్రైవర్.

అడవిలో దూరంగా కనిపిస్తున్న దారిని చూసి "సరే! నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్, మేము సరదాగా లోపలికి వెళ్లి వస్తాము." అని జీప్ దిగాడు శివమణి.

జీపు దిగుతు సూట్ కేసులో నుంచి గోకుల్, అభిజిత్ లు గన్ బయటికి తీయడం చూసి
"సార్! ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏ జంతువుని షూట్ చేయకండి మీ మంచికే చెప్తున్నాను." అని చెప్పాడు డ్రైవర్.

"సరే సరే! సేఫ్టీ కోసం తీసుకువెళుతున్నాము అంతే హంటింగ్ చేయకూడదని మాకు తెలుసు! బ్యాగ్ లో మందు బాటిల్ ఉంది కావాలంటే తీసుకుని ఎంజాయ్ చెయ్!" అని చెప్పాడు జాకి.

జీప్ దిగి కనిపిస్తున్న దారి నుండి బేరా అడవి ప్రాంతంలోకి అడుగు పెట్టారు గోకుల్ వాళ్ళు

గోకుల్ వాళ్ళు అడవిలోకి వెళ్లడం చూసి జీప్ దిగి ఆకాశంలోకి చూస్తూ వింత శబ్దం చేస్తూ సిగ్నల్ ఇచ్చాడు డ్రైవర్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 19-01-2026, 07:43 AM



Users browsing this thread: 1 Guest(s)