19-01-2026, 07:41 AM
(This post was last modified: 19-01-2026, 07:42 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 52
శ్రీ, రాజ్ వైపు తిరిగి నా పిల్ల నన్ను షాపింగ్ కి తీసుకువెళ్లమంది. అందుకే ఈ సంతోషం. అయినా లవర్ లేని సింగిల్ ఫేస్ గాడివి. నీకేం తెలుస్తుంది రా ఇలాంటి ఆనందాలు అంటే..
అబ్బో ఇంకా నువ్వు ప్రపోజ్ చేయలేదు. తను ఒప్పుకోలేదు.. అప్పుడే లవర్ అని ఫిక్స్ అయిపోయావా అని అడుగుతాడు.
ఫిక్స్ అవ్వడం ఏంటి ఫిక్స్.... తనే నా ఫ్యూచర్ లో నా పిల్లలకు కాబోయే తల్లి అని చెబుతాడు. చాలా సెకలు ఉన్నాయి రా నీ దగ్గర.
ముందు వెళ్ళు లేకపోతే నేహా ఎవరితో అయినా షాపింగ్ కి వెళ్ళిపోయిందనుకో మళ్ళీ దేవదాసు లాగా గదిలోకి వచ్చి పడతావు అని బయటికి తోస్తాడు.
నీకు కుళ్ళు రా అని అనుకుంటు నేహా దగ్గరికి వెళతాడు. రెడీనా వెళదామా అని అడుగుతాడు. పదండి సార్ అని చెప్పి నేహా కూడా బయటకి వస్తుంది.
కార్ ఎక్కిన తర్వాత ఎక్కడికి తీసుకు వెళ్ళమంటావు అని అడుగుతాడు. నాకు ఇక్కడ మాల్స్ పెద్ద ఐడియా లేదు సార్. మీకు తెలిసిన చోటికి తీసుకు వెళ్ళండి అని చెబుతుంది.
అదేంటి నువ్వు ఇక్కడే కదా చదువుకున్నావు అని అడిగితే.. నేను ఎప్పుడూ పెద్ద మాల్స్ కి వెళ్లలేదు అందులో డిజైన్ వేర్ షాప్స్ అంటే అసలు వెళ్ళలేదు.
ఇప్పుడు అవని విక్రమ్ సార్ వైఫ్ కదా.. వాళ్లకు తగ్గట్టుగానే తీసుకోవాలి కదా అని చెబుతోంది. ఆ మాటలకి నేహా వైపు చూస్తూ విక్రమ్ ఎప్పుడు అలాంటి తారతమ్యాలు చూడడు అని చెబితే...
ఆయన చూడరు కానీ... అవిని కి పుట్టిల్లు అంటే ప్రస్తుతం నేనే కదా... రేపు దత్తత అయిన తర్వాత మాధవి ఆంటీ కూతురు అవుతుంది. అప్పటి వరకు నేనే చూసుకోవాలి కదా సార్ అని చెబుతోంది.
ఆ మాటలకి శ్రీ ఇంప్రెస్ అవుతూ ప్రేమలో ఒక మెట్టు పైకి ఎక్కుతాడు. అయితే ఒక పని చేద్దాం అని అంటాడు. ఏం పని సార్ అనగానే...
నేను కూడా ఏమైనా గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మనిద్దరం కలిసి మన బడ్జెట్లో బట్టలు తీసుకుందాం. ఇద్దరం కలిసి పెట్టేద్దాం ఏమంటావు అని అడుగుతాడు.
మీ ఐడియా బాగానే ఉంది గాని సర్. మనిద్దరం కలిసి పెడితే బాగుంటుందా అని అడుగుతుంది. ఎందుకు బాగోదు.
చేసే పని మంచిదైతే చాలు అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అంటాడు.
చెప్పండి సార్ అనగానే.. మాటకు ముందు సార్,మాట తర్వాత ఒకసారి సార్ అనొద్దు ప్లీజ్. ఆఫీసులో అంటే అది వేరు.
ఇలా బయట కూడా అంటే నేనేదో లెక్చరర్ నువ్వు స్టూడెంట్ అన్న ఫీలింగ్ వస్తుంది. లెక్చరర్ పోస్టుకి నేను చాలా దూరం అని చెబుతాడు.
సరే సార్ ట్రై చేస్తాను అని చెబుతుంది. మళ్లీ సార్ అంటున్నావు అని రాగం తీస్తాడు. మరి ఏమని పిలవమంటారు అని అడుగుతుంది.
గుడ్ క్యూస్షన్ అందరూ శ్రీ అని పిలుస్తారు కాబట్టి నువ్వు శ్రీ అని పిలువు. ఏదైనా నిక్ నేమ్ పెట్టి పిలుస్తా అన్న నాకు ఏమీ ఇబ్బంది లేదు అని ఇండైరెక్టుగా నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతూనే ఉంటాడు .
అయ్యో మిమ్మల్ని నిక్ నేమ్ పెట్టి పిలిచే అంతా చనువు, చొరవ మనిద్దరి మధ్యన లేదు కదా...శ్రీ గారు అని పిలుస్తాను సరేనా అని అంటుంది.
సరేలే అలా కానీ ప్రస్తుతానికి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు.
తనకు తెలిసిన ఒక డిజైనర్ బోటిక్ కి తీసుకువెళ్తాడు.. వెళ్లడానికి ముందే ఆ బోటిక్ వాళ్ళకి మెసేజ్ చేస్తాడు. ఏదైనా సరే బిలో 5000 అని మాత్రమే చెప్పమని.
ఆ బోటిక్ ని చూడగానే నేహ కి భయం వేస్తుంది. ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా అని అడుగుతుంది. లేదు పైకి చూడడానికి అలా ఉంటుంది గాని అన్ని రీజనబుల్ ప్రైస్ సే.
నేనున్నాను కదా అని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మేనేజర్ వచ్చి విష్ చేసి తీసుకువెళ్లి కూర్చోబెడతాడు.
ఆ సారీస్ అన్ని చూస్తుంటే చాలా కాస్ట్లీ గా కనిపిస్తూ ఉంటాయి. ప్రైస్ మాత్రం అన్ని బిలో 5000 చెబుతూ ఉంటారు.
ఏంటి శ్రీ గారు ప్రైస్ ఇంత తక్కువ చెబుతున్నారు అంటే... చెప్పాను కదా పైన మాత్రమే పొష్ గా ఉంటుంది లోపల అంతా కాస్ట్ తక్కువే అని.
నీకు నచ్చినవి సెలెక్ట్ చేస్తూ ఉండు. విక్రమ్ కి నేను చూస్తాను అని జెంట్స్ వేర్ వైపు వెళ్తాడు. విక్రమ్ డ్రెస్ సెలెక్ట్ చేసి వస్తూ ఉంటే శ్రీ కి ఒక చీర బాగా నచ్చుతుంది.
ఆ చీర కూడా ప్యాక్ చేపిస్తాడు. నేహా కూడా షాపింగ్ అయిపోయిందని చెప్పగానే అన్నింటికీ కలిపి బిల్ చేయిపిస్తాడు.
సార్ నా షేర్ అనగానే.. ఇందులో 50% అంతే కదా అని చెప్పి అమౌంట్ చూపిస్తాడు ఓకే అని అది ట్రాన్స్ఫర్ చేస్తుంది.
కారులో కూర్చోగానే నేహా ఇది నీ కోసం నేను తీసుకున్నది ప్లీజ్ తీసుకోవా అని ఇస్తాడు. దానికి ఇబ్బంది పడుతూ ఎందుకు శ్రీగారు అని అడుగుతుంది.
అవినినీ చూసిన తర్వాత ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటారా అనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు అని అనిపిస్తుంది.
ఇది నా తృప్తి కోసం నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్. ప్లీజ్ తీసుకో అని ఇస్తాడు. అంత అలా చెబుతుంటే కాదు అనలేక థాంక్యూ సార్ అని చెప్పి తీసుకుంటుంది.
ఈ గిఫ్ట్ మాత్రం ఇప్పుడు ఓపెన్ చేయవద్దు. నీకు నేను ఎప్పుడైనా బాగా గుర్తుకొచ్చినప్పుడు, నన్ను మిస్ అవుతున్నాను అని ఫీల్ కలిగినప్పుడు ఓపెన్ చెయ్యి.
ఆ టైంలో కట్టుకుని మాత్రం నాకు కనపడు అని చెబుతాడు. శ్రీ అన్న మాటలకి మనసులో నేనెందుకు మిస్ అవుతాను. ఏం మాట్లాడుతున్నారు శ్రీ గారు అన్నట్టు..ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది.
ఆ ఎక్స్ప్రెషన్ చూసిన శ్రీ కి నేహ ఏమనుకుంటుందో అర్థమయ్యి.. ఎలా చెబితే నా పిల్లకి అర్థమవుతుంది. ఉఫ్ అనుకుని కార్ స్టార్ట్ చేస్తాడు.
ధనుంజయ్ జైలుకు వెళ్లి భార్గవిని కలుస్తాడు. భర్తని చూడగానే ఆనందంతో నాకోసం వచ్చారా అని అడుగుతుంది.
భార్గవిని ఒక్కసారి అసహ్యంగా చూసి మొఖం పక్కకు తిప్పుకొని నీతో పది నిమిషాలు మాట్లాడాలి అని చెబుతాడు.
భర్త అసహ్యాన్ని చూసి మనసుకు కష్టంగా అనిపించినా ఏదో విధంగా భర్త మనసు మార్చి ఈ జైలు నుంచి బయటపడాలి అని అనుకుంటుంది.
చెప్పండి అని ముసలి కన్నీరు కారుస్తూ అడుగుతుంది. ఈ పేపర్స్ మీద నీ సైన్ కావాలి అని పేపర్స్ ముందుకి జరుపుతాడు.
ఏం పేపర్స్ ఇవి అని అడుగుతుంది. చూడు అని చెబుతాడు . ఆ పేపర్స్ లోని మేటర్ చదవగానే ఇది అబద్దం అని గట్టిగా అరుస్తుంది.
ష్.. గట్టిగా అరవకు ఇదేమి నీ ఇల్లు కాదు. నా ఇంటిలో నాకు తెలియకుండానే ఒక్క అరుపు నువ్వు అరవకుండానే అన్ని ఘోరాలు చేసిందానివి ఒక సైన్ చేయడానికి ఎందుకు అలా అరుస్తున్నావు అని విసుగ్గా అంటాడు.
ఇందులో ఏమి రాసిందో మీకు అర్థం అవుతుందా అని ఏడుస్తూ అడుగుతుంది. ఈసారి ముసలి కన్నీరు బదులు రక్త కన్నీరు వస్తూ ఉంటుంది.
దగ్గరుండి నేనే రాయిపించింది నాకు తెలియదా అని వెటకారంగా అంటాడు. ఎందుకండీ మీకు నా పైన ఇంత కోపం. నేను మీ విషయంలో ఎటువంటి అన్యాయం చేయలేదు కదా..మీతో నేను ఎంతో ప్రేమగా ఉన్నాను కదా అని ధనుంజయ్ చెయ్యి పట్టుకుని అడుగుతుంది.
భార్గవి చెయ్యి తగలగానే గొంగళి పురుగు పడినట్టుగా అసహ్యించుకుని విదిలించుకుంటాడు. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఏమంటున్నావ్? నువ్వు.. నాకు ఎటువంటి అన్యాయం చేయలేదా నా భార్య ని చంపి ఆ స్థానంలోకి నువ్వు వచ్చావు. అది నాకు అన్యాయం చేయడం కాదా...
నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురి చేత నన్ను అసహ్యించుకునేటట్టు చేసావ్ అది అన్యాయం కాదా...
స్వర్గం లాగా ఉండే నా ఇల్లు ని నరకం చేసి ఆ నరకాన్ని స్వర్గము అని నాకు చూపించావు అది అన్యాయం కాదా అని కోపంగా అరుస్తాడు.
భార్గవి కూడా అంతే కోపంతో అవును రజితను నేనే చంపాను. కానీ మీ విషయంలో ఎప్పుడూ నేను మోసం చేయలేదు. రజిత కన్నా ఎక్కువ ప్రేమనే చూపించాను.
శిల్ప మీకు కూతురి ప్రేమను పంచింది అలాంటి మా ఇద్దరినీ కాదని ఎప్పుడో చచ్చిపోయిన రజితని, మీరు వద్దు అనుకున్న అవనినే కావాలి అనుకుంటున్నారు.
మేమేం అయిపోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. మీరు ఏమైపోతారో అన్నది మీ ఇష్టం కానీ.. ఈ పేపర్ల మీద సైన్ చేస్తే నా ఇంటికి నేను వెళ్ళాలి అంటాడు. నా ఇంటికి పట్టిన దరిద్రం ఈరోజుతో వదిలిపోయిందని శుద్ధి చేపించాలి అని చెబుతాడు.
మాట్లాడితే నా ఇల్లు నా ఇల్లు అంటున్నారు.అది నా ఇల్లు కూడా ... ఇన్ని రోజులు నా భర్త నా కూతురుతో కలిసి ఉన్న ఇల్లు అని భయం కలిసిన బాధతో అంటుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అది నీ ఇల్లు కాదు. అది కేవలం రజిత ధనుంజయ్ నివాసం. అవని హక్కు. కొన్ని సంవత్సరాలు దయ్యాలు సంచారం చేసినంత మాత్రాన.. అది నా దేవత తిరిగిన ఇల్లు కాకుండాపోదు.
నాకు చాలా పనులు ఉన్నాయి తొందరగా సైన్ చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెబుతాడు. ఈ మేటర్ చదివిన ఏ ఆడదైనా సంతకం చేయగలుగుతుందా బాధగా అడుగుతుంది.
నువ్వు అన్నది నిజమే..ఆడవాళ్లు అయితే సంతకం చేయలేరు కానీ మీరు కామపిశాచులు కదా... సంతకం చేయగలుగుతారు. నీ దారిలోనే కదా నీ కూతురు కూడా నడుస్తుంది అని అసహ్యంగా తిడతాడు.
శిల్ప మీకు కూడా కూతురే నండి ఎందుకు అంత దారుణంగా మాట్లాడుతున్నారు అనగానే.... అవిని కూడా నా కూతురే కదా...
ఇన్ని సంవత్సరాలు అవిని విషయంలో ప్రవర్తించగా లేనిది ఇప్పుడు నీ కూతురిని ఒక మాట అనడంలో తప్పు లేదులే...
సంతకం చెయ్యి ఎంత సేపు నేను ఇక్కడ నిలబడాలి. నాకు నీ మొఖం చూస్తుంటేనే విసుగ్గా ఉంది.
ఆ మాటలకి భార్గవికి కోపం వచ్చి చెయ్యకపోతే....
ధనుంజయ్ రియాక్షన్ ఏమిటి....
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)