Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#93
ఎపిసోడ్ 32


జారువా తెగ గురించి రీసెర్చ్ చేసి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను అని శివమణి చెప్పడంతో వారి గురించి చెప్పమని ఆత్రుతగా అడిగాడు గోకుల్.

*****************

"నేను ఈ తెగ వారి గురించి తెలుసుకోవడానికి బామ్రఘడ్ ఆడవిల్లోకి వెళ్లాను, అక్కడ శ్యామ్ అనే ఆదివాసి గైడ్ పరిచయమయ్యాడు, అతన్ని ఈ జారువ తెగ గురించి వివరాలు అడిగాను.

అతను నన్ను ఒక పెద్ద కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న కొన్ని గుహలను చూపించి, ఆ ప్రదేశంలోనే ఆ తెగవారు నివసించే వారని లోపలికి వెళ్లినవారు వెనక్కి తిరిగి రాలేదు. అందుకే అప్పటినుంచి ఎవరు వెళ్లడానికి ప్రయత్నించడం లేదు అన్నాడు." అని చెప్పాడు శివమణి.

తను చెప్పింది విని "అంటే! ఆ గుహల లోపల ఇంకా ఆ తెగవారు నివసిస్తున్నారా? వాళ్లే లోపలికి వెళ్ళిన వాళ్ళని చంపేస్తున్నారా ఏంటి?" అని అనుమానంగా అడిగాడు అభిజిత్.

"కాదు! ఆ గుహల లోపాలా ఆ తెగవారి పూర్వీకులు ఆత్మలుగా తిరుగుతూ ఆ ప్రదేశానికి రక్షణగా ఉన్నారని ఆ చుట్టుపక్కల వారు నమ్ముతారు." అని చెప్పాడు శివమణి.

"ఆ గుహలకు రక్షణగా పూర్వీకుల ఆత్మలు ఉన్నాయి అంటే లోపల కచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది." అని చెప్పాడు గోకుల్.

"నాకు కచ్చితంగా అదే అనుమానం వచ్చింది. కానీ లోపల ఆత్మలు ఉన్నాయన్న విషయం నేను నమ్మలేదు, ఆక్సిన్ సిలిండర్ అరేంజ్ చేసుకుని నా నడుముకి తాడు కట్టుకొని శ్యామ్ చేతికి ఇచ్చి, నేను బలంగా లాగితే వెంటనే నన్ను బయటకి తీసుకురమ్మని చెప్పి లోపలికి బయలుదేరాను." అని చెప్పాడు శివమణి.

తను చెప్పేది ఇంట్రెస్ట్ గా వింటూ "గుహల లోపల ఆ తెగ వాళ్ళు నివసించారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం ఉండదు, ఎవరైనా మనుషులు కానీ జంతువులు గాని ఉండి ఉండాలి, అందుకే వెళ్లిన వారు తిరిగి రావడం లేదు అక్కడ మీకు ఏం కనిపించింది?" అని ఆసక్తిగా అడిగాడు సర్పరాజ్.

"నేను వెళ్ళిన గుహలోపల ఎవరు కనిపించలేదు, కానీ కాస్త దూరం వెళ్లిన తర్వాత నా ఒళ్ళు మంటలు రావడంతో వెంటనే వెనక్కి వచ్చేసాను." అని చెప్పాడు శివమణి.

"అవునా? అసలు మీకు ఒళ్లంతా మంటలు ఎందుకు వచ్చాయి? లోపల ఏదైనా కెమికల్ ఎవబైడ్ అవుతుందా?" అని అడిగాడు గోకుల్.

"కాదు సార్! లోపల గుహల గోడల మీద కొన్ని రంగురాళ్లు అమర్చి ఉన్నాయి వాటి మీద వెలుతురు పడగానే విషషవాయువులు బయటికి వస్తున్నాయి, అందువల్లే లోపలికి వెళ్ళిన వారెవరు బయటికి రాలేకపోతున్నారు. ఆ విషయం తెలుసుకోవడానికి నాకు నెల రోజులు పట్టింది." అని చెప్పాడు శివమణి.

"వండర్ఫుల్! అంటే ఆ తెగ వాళ్ళు చాలా తెలివైన వారు మాత్రమే కాదు వాళ్ళ దగ్గర చాలా రకాల విద్యలు కూడా ఉన్నాయి, మరి ఆ గృహ లోపలికి ఎలా వెళ్లారు? అక్కడ ఏం కనిపించింది?" అని ఆత్రుతగా అడిగాడు సర్పరాజ్.

"ఆ విషయం తెలుసుకుని లైట్స్ ఏమి వాడకుండా నైట్ మోడ్ స్పెట్స్ తో లోపలికి వెళ్లాను, అక్కడ రహస్యంగా దాచిన కొన్ని వస్తువులు దొరికిన తర్వాత అర్థమైంది.

ఆ తెగ వారికి గురించి నమూనాలు కానీ వివరాలు కానీ ఎవరికి తెలియకుండా ఉండడం కోసం, గుహలను ఆ విధంగా ఏర్పాటు చేసి అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు." అని చెప్పాడు శివమణి.

"ఇంట్రెస్టింగ్! మీకు ఆ గుహలోపల దొరికిన వస్తువులు ఏమిటి? దాని ద్వారా వాళ్ల గురించి ఏం తెలుసుకున్నారు?" అని అడిగాడు గోకుల్.

"నాకు అక్కడ కొన్ని జంతువుల చర్మాలు దొరికాయి, వాటి మీద ఆ తెగ వారి గురించి వివరాలు రాసి ఉన్నాయి, కానీ ఆ భాష ఏమిటో నాకు అర్థం కాలేదు, ట్రాన్స్లేట్ చేయడానికి నాకు సంవత్సరం పట్టింది." అని చెప్పి బీరువాలో నుంచి అక్కడ దొరికిన వాటిని టేబుల్ మీద పెట్టాడు శివమణి.

జంతు చర్మాల మీద రాసి ఉన్న అక్షరాలని చూస్తూ "ఈ లాంగ్వేజ్ ఇప్పటిది కాదు చాలా ప్రాచీనమైనది. అంటే ఈ తెగవారు కూడా బీసీ కాలం నాటివారు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు సర్ఫరాజ్.

"ఎస్ సార్ కరెక్ట్!" అని చెప్పాడు శివమణి.

"మీరు ట్రాన్స్లేట్ చేశాను అని చెప్పారు కదా, దానిమీద ఏమి రాసి ఉంది?" అని అడిగాడు అభిజిత్.

"జారువ తెగవారు అమ్మవారి శక్తి నుంచి ఉద్భవించినట్లు వారు భావించేవారు, వాళ్లలో ఎవరు  బాహ్య ప్రపంచంలోకి వచ్చేవారు కాదు మనుషులు ప్రవేశించలేని దీవులలో అడవులలో నివసించేవారు.

ఆ తెగలో కూడా చాలా శాఖలు ఉన్నాయి, వారిలో బాగా తెలివైన వారు అన్ని కళలో నైపుణ్యం ఉన్నవారు అభిర్ అనే శాఖకు సంబంధించిన వారు, అమ్మవారి ఆజ్ఞ రావడంతో వారి స్వస్థలం వదిలి 1500 సంవత్సరంలో  బామ్రఘడ్ అడవులలో నివాసం ఏర్పరచుకున్నారు." అని చెప్పాడు శివమణి.

ఆ మాట విని కుర్చీ లోనుంచి లేచి సంతోషంగా చూస్తూ "ఎగ్జాట్లీ కరెక్ట్! నా రీసెర్చ్ లో కూడా శివాజీ మహారాజ్ గారికి రహస్యంగా సహాయం చేసిన దళం పేరు అభిర్ సేన అని తెలిసింది." అని చెప్పాడు సర్పరాజ్.

"థాంక్యూ సార్!" అని జంతు చర్మం మీద ఉన్న ఒక ముద్రను చూపించి "అభిర్ శాఖలో ఈ ముద్ర చేతి మీద పచ్చబొట్టుగా ఉండి జన్మించిన వారిని అమ్మవారు నాయకుడుగా నియమించింది అని వాళ్ళ ఉద్దేశం.

అంతేకాదు ఆ పచ్చబొట్టుతో పుట్టిన వాళ్ళ నాయకుడికి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టిన అతనికి 14 సంవత్సరాలు నిండిన తర్వాత అభిర్ అని పిలుస్తారు, అప్పటినుంచి అమ్మవారి అనుగ్రహంతో అతనికి కొన్ని శక్తులు కూడా వస్తాయి.

ఆ వ్యక్తి నాలుగు వేదాలు స్పష్టంగా చదవగలడు, ఏ జీవికైనా ప్రాణదానం చేసే శక్తి వస్తుంది. అడవిలో నివసించే ఏ జంతువు అయినా సరే అతని మాట వింటుంది. ధర్మ పరిరక్షణ కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు." అని చెప్పాడు శివమణి.

"గ్రేట్! మరి అభిర్ సేన శివాజీ మహారాజ్ కి ఎలా కలిశారు?" అని అడిగాడు గోకుల్.

"శివాజీ మహారాజ్ 17 ఏళ్ళ వయసులో మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.

శివాజీ మహారాజ్ కొలహపూర్ లో ఉన్న భవాని మాత భక్తుడు ఆయన ప్రతి యుద్ధానికి ముందు అమ్మవారి దర్శనం చేసుకునేవారు, అఫ్జల్ ఖాన్‌ మీద యుద్ధానికి సిద్ధమయ్యే ముందు భవాని మాత ప్రత్యక్షమై ధర్మపరి రక్షణ చేయమని చంద్రహాస్ అనే ఖడ్గాన్ని ప్రసాదించి,అభిర్ సేన కూడా నీకు తోడుగా ఉంటుంది అని ఆశీర్వదించారు.

అభీర్ సేన నాయకుడికి అమ్మవారి ఆదేశం రావడంతో శివాజీ మహారాజ్ ని కలిసి తోడుగా ఉంటాము అని ప్రమాణం చేసి అప్పటినుంచి గూడచారులుగా వ్యవహరించడం మొదలుపెట్టారు.

చుట్టుపక్కల శివాజీ మహారాజ్ కి శత్రువులుగా భావించిన వారి రాజ్యాలలో అభిర్ సేనకు సంబంధించిన వారు వెళ్లి విషయాలు తెలుసుకుని పక్షుల ద్వారా జంతువుల ద్వారా వాళ్ళ నాయకుడికి సమాచారాన్ని అందించేవారు.

ఆ విషయాన్ని వెంటనే శివాజీ మహారాజ్  గారికి అందించి సహాయం చేస్తూ ఉండేవారు, కానీ అభిర్ సేన ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు." అని చెప్పాడు శివమణి.

"అంటే! అభిర్ సేన కి యుద్ధం రాదా? వాళ్లు గూడచార్యులుగా మాత్రమే ఉండేవారా?" అని అడిగాడు అభిజిత్

"కాదు సార్! మీరు వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, శివాజీ మహారాజ్ ఎదుగుదలను సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను దొంగ చాటుగా వెళ్లి అంతం చేయాలని ఆదేశించాడు.

అప్పుడు కొల్హాపూర్ దగ్గర శివాజీ మహారాజ్ తో పాటు మూడు వేల మంది సైన్యం మాత్రమే ఉన్నారు అనే విషయం తెలుసుకున్న అభిర్ సేన నాయకుడు తన వాళ్ళతో కలిసి శివాజీ మహారాజ్ దగ్గరికి చేరుకున్నాడు.

అప్పుడు 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ మహారాజ్ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం భయం పుట్టింది.

తన గూడాచారుల సహాయంతో శివాజీ మహారాజ్ సైన్యంలో అభిర్ సేన అనే ఒక తెగవారు ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళని బంధించడానికి ప్రత్యేకమైన సైన్యాన్ని బామ్రఘడ్ అడవులకి పంపించాడు ఔరంగజేబు.

కానీ అక్కడకు వెళ్లిన ఒక్క సైనికుడు కూడా వెనుతిరిగి వెళ్లలేదు, వారి శవాలు కూడా దొరకలేదు మళ్లీ ఆ ప్రాంతానికి సైన్యాన్ని పంపడానికి కూడా ఔరంగజేబు భయపడ్డాడు." అని చెప్పాడు శివమణి.

తను చెప్పింది మొత్తం ఆసక్తిగా వింటూ "మరి అంతటి వీరుల గురించి ఎవరికీ తెలియకపోవడం ఏమిటి? వారు బామ్రఘడ్ ప్రాంతాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు?" అని అడిగాడు సర్పరాజ్.

"అభిర్ సేన భవాని మాత దయతో తనకు పరిచయమయ్యారు, వారి గురించి బాహ్య ప్రపంచానికి తెలిస్తే వారికి ఉన్న శక్తులను ఉపయోగించుకోవడానికి శత్రువులు ప్రయత్నిస్తారు అని శివాజీ మహారాజ్ వారి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకువచ్చేవారు కాదు.

అంతేకాదు అభిర్ సేన ధర్మ పరిరక్షణకు సహాయం చేయడం మాత్రమే కాకుండా, కొన్ని దైవీకమైన వస్తువులకు రక్షణగా ఉండేవారు వారి గురించి బయటకు తెలిస్తే ప్రమాదం అని కూడా అనుకుని ఉండవచ్చు!" అని చెప్పాడు శివమణి.

"అవునా? వారి దగ్గర ఆ దైవీకమైన వస్తువులు ఏమున్నాయో దాంట్లో వ్రాసి ఉందా?" అని అడిగాడు సర్పరాజ్.

"నాకు దొరికిన జంతు చర్మాల మీద కొన్ని రాసి ఉన్నాయి కానీ వాటి గురించి తెలుసుకోవడం నావల్ల కాలేదు, కానీ శివాజీ మహారాజ్ మరణానికి ముందు ఏకాంత ప్రదేశంలో అభిర్ సేన నాయకుడికి కలిసి చంద్రహాస్ ఖడ్గంన్ని అందించారని దానిని తీసుకుని తన వాళ్లతో కలిసి ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయాడని ఉంది." అని చెప్పాడు శివమణి.

"అవునా? అభిర్ సేన ఆ ఖడ్గాని తీసుకుని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో తెలిసిందా?" అని ఆత్రుతగా అడిగాడు గోకుల్.

"నాకు తెలిసి అక్కడ దొరికిన ఆధారాలు ప్రకారం రాజస్థాన్లో ఉన్న గొర్వర్ ప్రాంతానికి వెళ్లారు అనుకుంటున్నాను." అని చెప్పాడు శివమణి.

ఆ మాట విని "మనం రేపు ఉదయమే రాజస్థాన్ బయల్దేరి వెళ్లి గొర్వర్ ప్రాంతంలో అభిర్ సేన ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో చూద్దామా?" అని అని అడిగాడు సర్ఫరాజ్.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 17-01-2026, 11:51 PM



Users browsing this thread: 9 Guest(s)