Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#92
ఎపిసోడ్ 31




ఇండియా వచ్చిన గోకుల్ ని రిసీవ్ చేసుకుని గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లాడు అభిజిత్.

అక్కడకు వచ్చిన గోకుల్ మనిషి సర్పరాజ్ కొన్ని ఆధ్యాత్మిక వస్తువులు గురించి చెబుతూ జారువా తెగ గురించి చెప్పాడు.

**************************

"ఆ తెగ వాళ్ళ దగ్గర అటువంటి ఆధ్యాత్మికమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా?" అని అడిగిన జాకీ వైపు చూసి

"ఎస్! నాకు దొరికిన ఆధారాలను బట్టి కొన్ని పవర్ఫుల్ వస్తువులు ఆ జారువా తెగ వాళ్ళ దగ్గర ఉన్నాయి." అని చెప్పాడు సర్ఫరాజ్.

"అవునా? ఆ తెగకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిస్తే చెప్పండి వెంటనే ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాటు చేస్తాను." అని చెప్పాడు అభిజిత్.

"ఆ తెగవారి గురించి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటి వివరాలు మీకు చెబుతాను తరువాత వాటి ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం కనిపెడదాము." అని చెప్పాడు సర్పరాజ్.

"అంటే! వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీకు కూడా తెలియదా?" అని అడిగాడు జాకి.

"నో! కానీ వాళ్ల దగ్గర కొన్ని ఆధ్యాత్మికమైన శక్తులు కలిగిన వస్తువులు ఉన్నాయని ఖచ్చితంగా తెలుసు! ఆ జారువా తెగవారు అమ్మవారి శక్తితో ఉద్భవించారు అని చెబుతూ ఉంటారు.

వాళ్ల గురించి తెలుసుకోవాలి అంటే, చత్రపతి శివాజీ మహారాజ్ గురించి రీసెర్చ్ చేసి పూర్తి వివరాలు తెలిసిన ఒక ఆర్కియాలజిస్ట్ తో మనం మాట్లాడాలి అటువంటి వాళ్ల గురించి మీకేమైనా తెలుసా?" అని అడిగాడు సర్పరాజ్.

"శివాజీ మహారాజ్ గురించి రీసెర్చ్ చేసిన వారు అంటే, శివమణి అని ఒక వ్యక్తి తెలుసు! కానీ ఆయన మనకు హెల్ప్ చేస్తారో లేదో కన్ఫర్మ్ గా చెప్పలేను." అన్నాడు జాకీ.

"శివమణి పేరు నేను కూడా విన్నాను ఆయన మనకి హెల్ప్ చేస్తే కచ్చితంగా ఆ తెగవారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు!" అని చెప్పాడు సర్ఫరాజ్.

"నేను సెంట్రల్ మినిస్టర్ నాకు కూడా వాడు హెల్ప్ చేయకపోతే, ఇంక వాడికి లైఫ్ ఏ ఉండదు, నా ఫ్రెండ్ కోసం నా పవర్ మొత్తం ఉపయోగిస్తాను." అని చెప్పాడు అభిజిత్.

"గుడ్! వెంటనే ఆయనతో మాట్లాడే ఏర్పాట్లు చేయండి. ఆ చరిత్రలోనే ఈ తెగ వారికి గురించి ఆధారాలు లభిస్తాయి." అని చెప్పాడు సర్ఫరాజ్.

"ఓకే!" అని జాకి కి వైపు చూసి "మనం ఈ రోజే శివమణితో మాట్లాడాలి, అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకో!" అని చెప్పాడు అభిజిత్.

"సరే భయ్యా!" అని ఫోన్ తీసుకుని బయటికి వెళ్లాడు జాకీ.

సర్పరాజ్ వైపు చూస్తూ "ఆ తెగ వాళ్ళ దగ్గర ఏ వస్తువు ఉందని మీకు అనుకుంటున్నారు?" అని అడిగాడు అభిజిత్.

"నాకు తెలిసి ఆ తెగ వారి దగ్గర చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక వస్తువులు భద్రపరిచారు అని తెలుసు! వాటిని చూస్తేనే కాని మనం ఏ విషయం చెప్పలేము, ఉదాహరణకి ఒక జీవికి ప్రాణం పోసే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉంది అంటారు." అని చెప్పాడు సర్పరాజ్.

"ఏంటి? ప్రాణం పోసే శక్తి ఉందా?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అభిజిత్.

"అంతేకాదు అమ్మవారు శివాజీ మహారాజ్ కి ప్రసాదించిన శక్తివంతమైన ఖడ్గం చంద్రహాస్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది." అని చెప్పాడు గోకుల్.

"ఏంటి? చంద్రహాస్ కూడా వాళ్ళ దగ్గరే ఉందా? అలా అయితే వాళ్ళని కనిపెట్టి తీరాల్సిందే!" అన్నాడు అభిజిత్.

**************

లంచ్ చేస్తున్న అభిజిత్ వాళ్ళ దగ్గరికి వచ్చి "భయ్యా! శివమణి గురించి తెలుసుకున్నాను, నువ్వు ఓకే అంటే ఫోన్ చేసి మన గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్తాను, రాకపోతే నా స్టైల్ లో వెళ్లి తీసుకువస్తాను." అని చెప్పాడు జాకీ.

"నో నో! అలా చేయకూడదు మనం బలవంతం చేస్తే చరిత్ర గురించి తెలిసిన నిజాలు కొన్ని చెప్పకుండా దాస్తాడు, మనమే ఆయన దగ్గరికి వెళదాము.

అప్పుడు గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. ఒక సెంట్రల్ మినిస్టర్ ఆయన దగ్గరికి వచ్చాడు అన్న దానిమీద మనకి నిజాలు దాయకుండా చెబుతాడు." అని చెప్పాడు సర్పరాజ్.

"కరెక్ట్! మనం అతనితో ఒక మంచి పని కోసం మాత్రమే ఇదంతా అన్నట్లు నమ్మించాలి." అని చెప్పాడు గోకుల్.

"నువ్వు దాని గురించి అంత టెన్షన్ పడకు, ఇక్కడ ఉంది ఒక పొలిటికల్ లీడర్! అందితే జుట్టు, లేకపోతే కాళ్లు ఇవన్నీ మాకు మామూలే!" అని నవ్వుతూ చెప్పి

జాకి వైపు చూసి "మనం కలవడానికి వస్తున్నామని శివమనికి చెప్పు, వాడి ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చెయ్!" అని చెప్పాడు అభిజిత్.

"సరే భయ్యా!" అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు జాకీ.

లంచ్ కంప్లీట్ అయిన తర్వాత జాకీ తో కలిసి శివమణి ఇంటికి బయలుదేరారు ముగ్గురు.

**********

ఇంటి ముందు మూడు కార్లు ఆగడం చూసి బయటికి వచ్చి అభిజిత్ ని చూసి దగ్గరకు వెళ్లి "నమస్తే సార్! మీరు వస్తున్నారని ఫోన్ చేశారు, చెబితే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా, మీకెందుకు అంత శ్రమ!" అని వినయంగా అడిగాడు శివమణి.

భుజం మీద చెయ్యి వేసి "కొంతమంది గొప్ప వ్యక్తులను కలుసుకోవడానికి స్వయంగా రావడమే కరెక్ట్!" అని చెప్పి పక్కనే ఉన్న గోకుల్ సర్పరాజ్ లని పరిచయం చేస్తూ

"తను నా ఫ్రెండ్ గోకుల్, నంద గ్రూప్ చైర్మన్! ఆయన పేరు సర్పరాజ్ మహంతి ఆర్కియాలజిస్ట్! ఇద్దరి గురించి మీరు వినే ఉంటారు." అన్నాడు అభిజిత్.

"ఎస్ సార్! నిన్న న్యూస్ చానల్స్ మొత్తం గోకుల్ గారి పేరు చెబుతూనే ఉన్నారు కదా తెలియకుండా ఎలా ఉంటుంది. అలాగే సర్పరాజ్ గారి గురించి తెలియని ఆర్కియాలజిస్టు ఉండడు, మీతో పాటు వారిని కూడా తీసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది." అని చెప్పాడు శివమణి.

హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చుంటూ కాలేజ్ డ్రెస్సులో "డాడీ!" అనుకుంటూ లోపలకి వస్తున్న పాపని చూసి "మీ అమ్మాయా? చక్కగా ఉంది పేరేమిటి?" అని అడిగాడు గోకుల్.

"అవును సార్! తన పేరు మిత్ర! నా భార్య ఝాన్సీ! ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో టీచర్ గా చేస్తుంది." అని పరిచయం చేసాడు శివమణి.

"మా అమ్మాయికి కూడా ఇంతే వయసు ఉంటుంది. ఈసారి ఇండియా వచ్చినప్పుడు తీసుకువస్తాను మీ అమ్మాయికి మంచి ఫ్రెండ్ అవుతుంది." అని చెప్పాడు గోకుల్.

"థాంక్యూ సార్!" అని సంతోషంగా చెప్పాడు శివమణి.

"మిస్టర్ శివమణి! మీతో ఒక చిన్న పని ఉండి వచ్చాము, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను." అన్నాడు అభిజిత్.

"అయ్యో సార్! మీరు అంతగా అడగాలా నేను ఏం చేయాలో చెప్పండి మీ అంతటి వారికి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను." అని చెప్పాడు శివమణి.

"ఏమీ లేదు! నా ఫ్రెండ్ ఒక మంచి హిస్టారికల్ మూవీ తీయాలి అనుకుంటున్నాడు, అప్పుడు నేను చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర తీయమనిచెప్పాను, దానికి ఓకే అన్నారు.

కానీ ఆయన చరిత్ర తప్పుగా తీస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు అందుకే పూర్తి వివరాలు తెలిసినా మీ హెల్ప్ కోసం వచ్చాము." అని చెప్పాడు అభిజిత్.

"ఈ విషయంలో మీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను సార్! శివాజీ మహారాజ్ చరిత్రలో చాలామందికి తెలియని కోణాలు కూడా నాకు తెలుసు, నేను వారి గురించి వారి సైన్యం గురించి చాలా రీసెర్చ్ చేశాను." అని చెప్పాడు శివమణి.

"మీరు వెంటనే ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్!" అని సర్పరాజ్ వైపు చూసి

"మీకు కావాల్సిన విషయం ఏమిటో ఆయనకి వివరంగా చెప్పండి మనకి పూర్తిగా సహకారం అందిస్తారు." అని చెప్పాడు అభిజిత్.

"ఓకే సార్!" అని శివమణి వైపు చూసి,

"శివాజీ మహారాజ్ చరిత్ర గురించి నాకు కూడా తెలుసు కానీ ఆయన సైన్యంలో ఎవరికి తెలియని ఒక తెగ కి చెందిన దళం ఉండేది దాని గురించి వివరాలు కావాలి." అని అడిగాడు సర్పరాజ్.

"సరే సర్!  మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందామా?" అని అడిగాడు శివమణి.

"తప్పకుండా!" అని సోఫాలో నుంచి లేచి గోకుల్ తో కలిసి శివమణి వెనకాలే వెళ్ళుతు అభిజిత్ వైపు చూసి

"మనకు కావలసిన విషయం శివమణి దగ్గర తెలుస్తుంది అనుకుంటున్నాను జాగ్రత్తగా డీల్ చేయండి." అని చెప్పాడు సర్పరాజ్.

రూమ్లో కూర్చోవడానికి కుర్చీలు చూపించి లోపలి నుంచి కొన్ని బుక్స్ బయటకు తీసి

"నేను చాలా సంవత్సరాలుగా శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న వీరుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, కొంతమందికి వారసులు ఉన్నారు, కొంతమంది ఏమైపోయారో కూడా తెలియదు.

మీరు అడిగినట్లు బయట ప్రపంచానికి తెలియని ఒక తెగ శివాజీ మహారాజ్  గారికి కి సహాయం చేసింది అనే విషయం నిజమే, కానీ ఎక్కడ కూడా ఇప్పుటీ వరకు వాళ్ళ ప్రస్తావన రాలేదు.

కానీ నాకు దొరికిన కొన్ని ఆధారాలలో, అభిర్ సేన గురించి తెలుసుకున్నాను, వారు చాలా శక్తివంతులని, అమ్మవారి అనుగ్రహం తో శివాజీ మహారాజ్ కి ఆ దళం దగ్గర అయిందని తెలిసింది.

ఆ సేన కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను వారు జారువా తెగకు చెందిన వారిని నా రీసెర్చ్ లో తెలిసింది. వాళ్లని కలిసి ఇంకా వివరాలు సేకరించడం కోసం ఆ తెగవారు నివసించారు అని చెప్పే బామ్రఘడ్ అడవుల్లో చాలా సంవత్సరాలు వెతికాను."  అని చెప్పాడు శివమణి.

"అక్కడ జారువ తెగకు చెందిన వాళ్ళని మీరు కలిసారా?" అని ఆతృతగా అడిగాడు సర్పరాజ్.

"నాకు ఆ తెగకు చెందిన వాళ్ళు ఎవరు కనపడలేదు కానీ, వాళ్ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిసాయి వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారో కొన్ని ఆధారాలు తెలుసుకున్నాను." అని చెప్పాడు శివమణి.

"అవునా? మీరు తెలుసుకున్న విషయాల గురించి వివరంగా చెప్పండి." అని ఆసక్తిగా అడిగాడు గోకుల్.
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 17-01-2026, 11:50 PM



Users browsing this thread: 1 Guest(s)