17-01-2026, 11:41 PM
Part - 49
ధనుంజయ్ ఏడుపు ను చూసి అందరికీ బాధ అనిపించిన అవని పడిన కష్టాలు గుర్తు వచ్చి అందరూ సైలెంట్ అయిపోతారు.
అవని మాత్రం ఆ ఏడుపు కి కొంచెం కూడా చలించదు. శేషగిరి గారికి మనసుఒప్పక కొడుకు దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి ఏంట్రా ఇది అని బాధగా అడుగుతారు.
తండ్రిని కౌగిలించుకుని నిజంగా నాన్న నాకు ఇవన్నీ తెలియదు. వాళ్ళు నాకు చెప్పింది ఒకటి. జరిగింది ఒకటి. నిజంగా తప్పంతా నాదే.
నేను ప్రతి రోజు అవిని తో మాట్లాడుతూ తను ఇబ్బంది ఏంటో తెలుసుకోవాల్సింది. మొండిగా తయారైంది ఎవరి మాట వినడం లేదు. నాతో మాట్లాడటం కూడా ఇష్టపడడం లేదు అంటే నిజమే అనుకున్నాను...
కానీ ఏ రోజు కూడా అవిని దగ్గర కూర్చుని ఏమిటి నీ సమస్య అనే మృదువుగా మాట్లాడలేదు. నా కూతురు నా కోసం ఎదురు చూస్తున్నప్పుడల్లా భార్గవి ఏదో ఒకటి చెప్పేది. అదే నిజమనుకుని కోప్పడేవాడిని.
అవిని అన్నది నిజమే కదా నాన్న. శిల్పతో మాట్లాడినట్టుగా ఏ రోజు నేను అవిని తో మాట్లాడలేదు.
శిల్పకి ఏం కావాలి అన్న ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాను. కానీ అవని విషయం వచ్చేటప్పటికి ఎందుకు భార్గవి మాటలు విన్నానో నాకే అర్థం కావడం లేదు.
శిల్ప కాలేజ్ కి పేరెంట్స్ మీటింగ్ కూడా వెళ్లే వాడిని. ఒక్కసారి కూడా అవనితో వెళ్ళలేదు. మరి అలాంటప్పుడు నా కూతురు నన్ను ఎలా నమ్ముతుంది.
ఆఖరికి నా కూతురు ఏమి చదువుతుందో... ఎలాంటి బట్ట కడుతుందో కూడా నేను పట్టించుకోలేకపోయాను. శిల్ప ప్రతి పని దగ్గర ఉండి జాగ్రత్తగా చేశాను.
అవని విషయంలో చేయలేకపోయాను. అవని తో వెళ్ళాలి అనుకున్నప్పుడుల్లా ఏదో ఒక ఆటంకం కలిగించేవారు.
అవని పనినీ భార్గవి కి అప్పగించి వెళ్ళేవాడిని. రాగానే అడిగేవాడిని. ఆఖరికి కాలేజీ డీటెయిల్స్ కూడ నాకు ఫేక్ చూపించారు.
అవే నిజం అనుకున్నాను. నాతో మాట్లాడకపోయినా బాగానే చదువుకుంటుంది అనుకున్నాను కానీ అసలు అవని చదివే కాలేజే వేరే అని నేను తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది.
ఈ ఇంటి సంబంధం కూడా నేను అవిని కోసమే తెచ్చాను. ఇంతమంది మధ్యలో ఉంటే అయినా ఆ మొండితనం వదిలి సంతోషంగా ఉంటుందని ఆలోచించాను.
కానీ అవని అందరు ముందు కూడా వద్దు అని చెప్పే లాగా చేశారు. అది కూడా నేనే చేశాను అన్నట్టుగా ఆ రాక్షసి చేసింది.
నేను నిజమే చెబుతున్నాను నాన్న నాకు తెలియకుండానే ఇన్ని ఘోరాలు జరిగిపోయాయి నాన్న అని బోరున ఏడుస్తాడు. కానీ అవని ఆ ఏడుపుకి కొంచెం కూడా చెలించదు అలానే చూస్తూ ఉంటుంది.
విక్రమ్ మాత్రం అవిని నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి స్టెప్ తీసుకుంటుందా అని చూస్తూ ఉంటాడు. అవని ఏ నిర్ణయం తీసుకున్న తను సపోర్ట్ గా నిలబడాలి అని ఫిక్స్ అయిపోతాడు.
అలాగే భార్గవి టీం మొత్తానికి కూడా ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో కూడా డిసైడ్ అయిపోతాడు.
అవని ధనుంజయ్ ముందుకు వచ్చి నిలబడి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్ అని అడుగుతుంది. తనకు ఏమి తెలియదనిచెప్పిన సరే అవని సార్ అని పిలుస్తూ ఉంటే...
ధనుంజయ్ మనసు బాధతో విలవిల్లాడుతుంది. కష్టంగానే చెప్పు అని అంటాడు. మీరు చాలా పెద్ద బిజినెస్ మాన్ కదా చాలా మందితో చాలా రకాల డీల్స్ చేసి ఉంటారు కదా అని అడుగుతుంది.
అవును అని సమాధానం చెబుతాడు. మీరు వాళ్లతో డీల్ చేసేటప్పుడు వాళ్లు జెన్యూన్ అవునో కాదో కూడా వాళ్ళు మాటలు బట్టి మీకు అర్థమవుతుంది కదా అని మళ్ళీ ప్రశ్నిస్తుంది.
అవని ఏమి అడగబోతుందో చూచాయిగా అర్థమవుతూ ఉంటే.... అనుమానంగా అవును అని సమాధానం చెబుతాడు.
మరి మీ ఇంటిలో జరిగేది మీకు ఎలా తెలియకుండా ఉంది. మీ ఇంటిలో ఉన్న ఆ ఐదుగురు మీతో జెన్యూన్ గా మాట్లాడుతున్నారు లేదో కూడా మీకు అర్థం కాలేదు అంటే నమ్మమంటారా...
పోనీ మీ భార్యని పక్కన పెడదాము. మీ బావమరిది ఫ్యామిలీ మాటలు కూడా మీకు జెన్యూన్ గానే అనిపించాయా... ఆ ఉదయ్ చెప్పిన మాటలు కూడా మీకు జెన్యూన్ గానే ఉన్నాయా అని ఎటువంటి భావం లేకుండా అడుగుతుంది .
ఏమని సమాధానం చెప్పగలడు. అవని అడిగేది ప్రతీది నిజమే కదా... అంత బిజినెస్ రన్ చేసే తను ఇంటిలో భార్య చేసిన మోసాన్ని కనిపెట్టలేకపోయాడు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ప్రతిరూపమైన కూతురు బాధపడుతూ ఉంటే తెలుసుకోలేకపోయాడు. బాధ అన్నది చిన్న మాటేమో.. నరకం అంతకన్నా పెద్ద మాట ఏదైనా ఉంటే ఆ మాట అనుకోవాలి ఏమో అనుకుంటూ చూస్తూ ఉంటాడు.
ఏంటి సార్ నేను అడిగింది నిజమే కదా అని..ఇప్పుడు చెప్పండి నానమ్మ జరిగిందేదో జరిగిపోయింది అని అంటున్నారు కదా..ఈయనకి తెలియకుండానే ఇన్ని జరిగినాయి అంటే నమ్మేటట్టు ఉందా అని అడుగుతుంది.
సత్యవతి గారు కూడా ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. జరిగిన విషయంలో కొడుకు తప్పు లేకపోయినా.. ఏమీ తెలుసుకోకుండా ఉండడం మాత్రం వాడిది చాలా పెద్ద తప్పే.
అందుకు శిక్ష కూడా అనుభవించాలి అని పెద్ద వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు.
విక్రమ్ గారితో నేను ఉన్నది రెండు రోజులే. అప్పుడు కూడా నా రూపం ఆయనకు తెలియదు. కానీ శోభనం రోజు రాత్రి నేను కాదు అని ఆయన గుర్తుపట్టారు.
అలాంటిది ఆ ఇంటిలో ఇన్ని ఘోరాలు జరుగుతున్న ఆయనకి తెలియదు అంటే ఎలా నమ్మమంటారు మీరే చెప్పండి నానమ్మ అని అడుగుతున్నా మనవరాలు ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక బాధగా కళ్ళు మూసుకుంటారు.
నా భర్తకి నా మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో నన్ను కనిపెట్టి... ఆ ఇంట జరిగిన అన్యాయాలు అన్ని బయట పెడితే గాని ఈయనకి తెలియదంట.
ఇప్పుడు ఈయన ఇంత కపట ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో తెలుసా నానమ్మ ... తన ముద్దుల భార్యని, గారాల కూతురిని కాపాడుకోవడానికి.
నా భర్త అన్ని నిజాలు బయటపెట్టేటప్పటికీ ఏమి చేయాలో తెలియక ఎలా కాపాడుకోవాలో తెలియక ఇలా ముసలి కన్నీరు కారుస్తున్నారు.
ఆ మసలకన్నీరుతో నన్ను కరిగించి నాతోనే వాళ్లని విడిపించండి అని చెప్పించడానికి ఈయన ప్రయత్నం అంతా...
మీ అబ్బాయికి నా తల్లిని చంపినందుకు కూడా బాధ లేదు. ఆయన భార్య జైల్లో మగ్గిపోతున్నందుకు బాధంతా. వాళ్లని విడిపించడానికి ఒక కొత్త పన్నాగం అంతే అని కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంది.
ఆ మాటలు విన్న ధనుంజయ్ ముఖంలో నెత్తురు చుక్క ఉండదు. తన కూతురి దృష్టిలో తను ఎంత దిగజారిపోయాడో అర్థమవుతూఉంటుంది.
అవిని మనసు ఎంత విరిగిపోయిందో, వీళ్ళ విషయంలో ఎంత బండబారిపోయిందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది.
ధనుంజయ్ ప్రత్యక్షంగా ఆ ఘోరాలు చేయకపోయినా పరోక్షంగా కారణమయ్యాడు అని... అందరూ అవని వైపే నిలబడతారు.
ధనుంజయ్ గట్టిగా చెప్పలేకపోతున్నాడు అందరికన్నా ఎక్కువ తన భార్య రజతయే అని... అవని అంటే ప్రాణం అని...
ఎలా చెప్పగలడు.. చెప్పిన నమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు.. ఆఖరికి తనకన్నా తల్లిదండ్రులు కూడా నమ్మలేని పరిస్థితులు వచ్చాయి.
ఏమి చేస్తే తన కూతురు తనని నమ్ముతుంది అని ఆలోచిస్తున్నాడు.
ఒక నిర్ణయానికి వచ్చిన వాడై, అవని ముందుకు వెళ్లి నీ బాధ నాకు అర్థం అవుతుంది నీ మానసిక క్షోభకి కారణం నేనే.
ఈ విషయంలో నేను ఎవరిని నిందించలేను. ఎందుకంటే గుడ్డిగా చెప్పుడు మాటలు విన్నందుకు శిక్ష కూడా నేనే అనుభవించాలి.
నీకు నాపై నమ్మకం కలిగి నన్ను నాన్న అని పిలిచిన రోజునే మళ్లీ నీ ముందుకు వస్తాను. అప్పటివరకు నీ కళ్ళ ముందుకి నేను రాను.
ఒకవేళ నా ప్రాణం పోయేలోపుల నువ్వు నన్ను క్షమించగలిగితే అంతకన్నా అదృష్టం నాకు ఇంకొకటి ఉండదు.
ఒకవేళ క్షమించ లేకపోయినా సరే నా తలకొరివి మాత్రం నువ్వే పెట్టు ఆ నిమిషం వెళ్లి మీ అమ్మ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణలు అడుగుతాను.
ఇందిరాగారి దగ్గరకు వెళ్లి చేతులెత్తి జోడించి నావల్ల చాలా పెద్ద తప్పే జరిగింది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా సరే కళ్ళు మూసుకుని ఉండిపోయాను.
నావల్ల జరిగిన తప్పుకి మీకు కోపం ఉంటే నాకు ఎటువంటి శిక్ష అయినా సరే వేయండి. మీ సంస్కారం నాకు తెలుసు.
ఒక తండ్రిగా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాను. అంతేగాని మిమ్మల్ని తక్కువ చేసి మాత్రం కాదు.
అవని జాగ్రత్త. ఇన్ని రోజులు అది ఎటువంటి ప్రేమకి నోచుకోలేదు. ఒక తండ్రిగా నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను.
మీ అమ్మాయి అవనినీ దత్తత తీసుకుంటాను అని చెప్పారు. దానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరము లేదు.
ఎందుకంటే అవి ఆపడానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదు. మమ్మల్ని క్షమించండి. అవని ఇంటికి వచ్చేటప్పుడు ఒక అనాధగానే వస్తాను అని చెప్పింది కదా...
నిజంగానే తను ఒక అనాధ ఎందుకంటే నేను బ్రతికి ఉన్న చచ్చిన వాడితో సమానం కాబట్టి. ఇంకా మాటలు రాక ఏడుపు స్వరంతో వెళ్లి వస్తాను.
నా కూతురు క్షమించిన రోజున తప్పకుండా పుట్టింటి లాంఛనాలతో ఈ గుమ్మం తొక్కుతాను అని వాళ్ళ అమ్మ గారి వైపు చూసి వెళదామా అమ్మ అని అడుగుతాడు.
కొడుకు బాధ చూడలేక మనవరాలిని ఇంకొకసారి అడుగుతారు. మీ నాన్నని క్షమించవచ్చు కదా తల్లి వాడి బాధ చూడలేకపోతున్నాము అని...
మీ అబ్బాయిని ఏ విషయంలో అయినా క్షమించగలను గాని.. ఆ ఉదయ్ కి సంబంధించిన విషయంలో నా జీవితంలో క్షమించలేను.
ఒక్క ఆడదానిగా నువ్వే ఆలోచించు నాన్నమ్మ. ఆరోజు ఏదైనా జరిగి ఉండి ఉంటే ఈరోజు నీ ముందు నేను ఉండే దాన్నా అని అడుగుతుంది.
సత్యవతి గారిలో మౌనం. నీ మౌనమే సమాధానం చెప్పింది కదా అని అవని నమస్కారం చేస్తుంది.
ఆ నమస్కారానికి అర్థం తెలిసిన ధనుంజయ్ ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు.
వెళుతున్న వాళ్ళని కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది.
అవిని నీ ఎలా చూసిన విక్రమ్ నిర్ణయం ఏమిటి...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)