Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#86
ఎపిసోడ్ 30


2010 సంవత్సరం, న్యూస్ చానల్స్ లో "ఈరోజు నంద గ్రూప్ అఫ్ కంపెనీస్ కి కాబోయే చైర్మన్ గారైన గోకుల్ నంద గారు ఇండియాకి వస్తున్నారు, మరొకసారి భారీగా పెట్టుబడులు రావచ్చని పారిశ్రామిక వర్గాలవారు ఆశిస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో గోకుల్ గారికి స్వాగతం పలకడానికి సెంట్రల్ మినిస్టర్, జనశక్తి పార్టీ అధ్యక్షుడు అయినా  అభిజిత్ పాండే గారు ఇప్పుడే చేరుకున్నారు.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే గోకుల్ గారు, అభిజిత్ గారు చిన్ననాటి స్నేహితులు చాలాకాలం తర్వాత మళ్ళీ కలుసుకోబోతున్నారు." అని చెప్పాడు రిపోర్టర్.

ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తూ తన పక్కన ఉన్న మనిషి వైపు చూసి "జాకీ! వాడు లండన్ నుంచి నా కోసం వస్తున్నాడు, ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు మన ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోవాలి." అని చెప్పాడు అభిజిత్.

"భయ్యా! నువ్వేమీ కంగారు పడకు గెస్ట్ హౌస్ లో అన్ని సెట్ అప్ చేశాను." అని చెప్పాడు జాకీ.

"ఓకే! సడన్గా వస్తున్నానని కాల్ చేశాడు ఇక్కడ అంత అర్జెంట్ పని ఏమిటో కూడా అర్థం కాలేదు." అని ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం చూసి హడావుడిగా వెళ్ళాడు అభిజిత్.

ఫ్లైట్ లో నుంచి దిగుతూ ఎదురుగా ఉన్న అభిజిత్ ని చూసి సంతోషంగా వచ్చి కౌగిలించుకుని "వీడియో కాల్ లో కన్నా డైరెక్ట్ గానే స్మార్ట్ గా ఉన్నావు." అని కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు గోకుల్.

ఆ మాటకి నవ్వుతూ "నీ కన్నా స్మార్ట్ గా ఉన్నానా?" అని బొకే ఇచ్చి "కాబోయే నంద గ్రూప్ చైర్మన్ గారికి వెల్కమ్!" అని చెప్పాడు అభిజిత్.

బోకే తీసుకుంటూ "అబ్బా.. ఆ గోల నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను, మళ్లీ ఆ విషయలు గుర్తు చేయకు." అని విసుగ్గా అన్నాడు గోకుల్.

"అయితే! అర్ణపాప ని కూడా తీసుకురావాల్సింది. కొన్ని రోజులు ఇక్కడ సరదాగా ఉండేది." అని కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అభిజిత్.

కార్లు ఎక్కి రిలాక్స్ గా కూర్చుని వెళుతూ, "నా వైఫ్ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది. అప్పట్నుంచి అర్ణ వాళ్ళ తాత దగ్గర ఉంటుంది.

ఈ బిజినెస్ వ్యవహారాలతో నేను బిజీ అయిపోయాను,  లైఫ్ రొటీన్ అయ్యిపోయింది. కొన్ని రోజులు రిలాక్స్ అవుదామని ఇండియాకి వచ్చాను అందుకే ఫస్ట్ కాల్ నికు చేశాను." అని చెప్పాడు గోకుల్.

"నువ్వు ఇండియా వస్తే నాకే కాల్ చేయాలి." అని చెప్పి ఫ్రెంట్ సీట్లో ఉన్న జాకి వైపు చూపిస్తూ

"నా తమ్ముడు లాంటి వాడు, పేరు జాకీ! నేను పొలిటికల్ వ్యవహారాలు చూసుకుంటే, వాడు పైన వ్యవహారాలు చూసుకుంటాడు." అని పరిచయం చేశాడు అభిజిత్.

"నమస్తే భయ్యా!  మీరు ఇక్కడి నుంచి వెళ్లే లోపు ఎంజాయ్మెంట్ ఏంటో నేను చూపిస్తాను, మీరు కంప్లీట్ గా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోతారు." అని చెప్పాడు జాకీ

"నాకు కూడా కావలసింది అదే!" అని చెప్పాడు గోకుల్.

అంతలో మీడియా వాళ్ళు కారుని చుట్టుముట్టడం చూసి 'వీళ్ళు వదిలేటట్లు లేరు.' అనుకుని "గోకుల్!  ఒక్కసారి  బిజినెస్ వ్యవహారాల గురించి రాలేదు ఫ్రెండ్స్ తో కొన్ని రోజులు గడపడానికి వచ్చాను అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వు చాలు ఇంక నీ వెంట పడరు." అని చెప్పాడు అభిజిత్.

"షూర్!"  అని కారు దగ్గరికి వచ్చిన మీడియా వాళ్ల వైపు చూసి గ్లాస్ దింపి

"హాయ్! నాకోసం ఇంత సేపు వెయిట్ చేసినందుకు థాంక్యూ సో మచ్! నేను వెళ్లే ముందు కచ్చితంగా మీకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తాను అప్పటివరకు ప్లీజ్ డోంట్ డిస్ట్రబ్!" అని స్మైల్ ఇస్తూ గ్లాస్ పైకి ఎత్తాడు గోకుల్.

గెస్ట్ హౌస్ దగ్గరికి  కార్ లో తీసుకు వెళుతూ "నీకు ఎటువంటి ఎంజాయ్మెంట్ కావాలో చెప్పు వెంటనే అరేంజ్ చేస్తాను." అని చెప్పాడు అభిజిత్.

"నాకు ఎంజాయ్మెంట్ కాదు థ్రిల్లింగ్  కావాలి." అని చెప్పాడు గోకుల్.

ఆ మాట విని "ఏంటి? థ్రిల్లింగ్ ఆ..! ఫారన్ కంట్రీస్ లో దొరకని  థ్రిల్లింగ్ ఇండియాలో ఏముంటుంది?" అని అనుమానంగా అడిగాడు అభిజిత్.

"నాకు థ్రిల్లింగ్ ఇచ్చే విషయం ఏమిటో నీకు చెప్పడానికి ఒక మనిషి ఆల్రెడీ ఇండియా వచ్చాడు, కాసేపట్లో మన దగ్గరికి వస్తాడు." అని చెబుతూ గెస్ట్ హౌస్ రావడంతో కారు దిగాడు గోకుల్.

"ఏంటి భయ్యా! ఇండియాలో ఉన్న నిధి గురించి ఏమైనా తెలిసిందా ఏంటి?" అని నవ్వుతూ అడిగాడు జాకి.

ఆ మాట విని నవ్వి గెస్ట్ హౌస్ లోపలికి వెళుతూ, "డబ్బు నా దగ్గర ఎంత కావాలి అంటే అంత ఉంది దాని గురించి నేను వెతకాల్సిన అవసరం లేదు, ఈ లోకంలో దానికి మించింది ఒకటి ఉంటుంది దాని గురించి మీ అన్నకి బాగా తెలుసు!" అని చెప్పాడు గోకుల్.

ఆ మాట విని "అవును! డబ్బు కన్నా పవర్ఫుల్ అయింది పవర్! అది ఉంటే అన్ని మన కాలు కిందకి వస్తాయి, మన నోటి నుంచి వచ్చిన మాట వేదం అవుతుంది." అని చెప్పాడు అభిజిత్.

"అంటే భయ్యా! పవర్ కోసం నువ్వు కూడా ఇండియన్ పాలిటిక్స్ లోకి వస్తావా?" అని అనుమానంగా అడిగాడు జాకి.

"నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అయినా అభిజిత్ ఉండగా నాకు అవసరం లేదు." అని చెప్పాడు గోకుల్.

"మరి పాలిటిక్స్ కన్నా పవర్ ఫుల్ అయింది ఏముంది?" అని అయోమయంగా అడిగాడు జాకి.

"ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పవర్ఫుల్ అయిన ఆధ్యాత్మిక శక్తి ఇండియా గడ్డ మీద ఉంది. అది మన దగ్గర ఉంటే ఎటువంటి పనినైనా సాధించవచ్చు!" అని చెప్పాడు గోకుల్.

ఆ మాట విని డౌట్ గా చూస్తూ "ఆధ్యాత్మిక శక్తి  ఆ...! ఇక్కడ ఉన్న గుళ్ళలో ఉంటుంది. లేకపోతే తపస్సు చేసుకునే ఋషుల దగ్గర ఉంటుంది. దానిని మనం తీసుకోవడం ఎలా కుదురుతుంది. మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తే పుణ్యం వస్తుంది." అని చెప్పాడు అభిజిత్.

"నాకు కావలసింది పుణ్యం కాదు, ఆధ్యాత్మిక శక్తి ఉన్న కొన్ని వస్తువులు ఈ గడ్డమీద ఇంకా ఉన్నాయి, వాటితో మనం ఎప్పటికీ రాజులాగా ఉండవచ్చు, మన పేరు చరిత్ర పుటల్లో ఉండిపోతుంది." అని చెప్పాడు గోకుల్.

ఆ మాట విని పక్కన ఉన్న జాకి వైపు ఆశ్చర్యంగా చూసి  "గోకుల్! అటువంటి వస్తువులు గురించి వినడమే కానీ ఇప్పటివరకు ఎక్కడ బయట పడలేదు." అని చెప్పాడు అభిజిత్.

"ఎస్! అటువంటి వస్తువుని వెతికి పట్టుకోవడంలోనే ఉంటుంది థ్రిల్!" అని చెప్పాడు గోకుల్.

అంతలో బయటినుంచి ఒక సెక్యూరిటీ గార్డ్ లోపలికి వచ్చి "సార్! ఎవరో సర్పరాజ్ అంట గోకుల్ గారి కోసం వచ్చారు లోపలికి పంపించమంటారా?" అని అడిగాడు.

"సర్పరాజ్ ఆ..?" అని అడిగి గోకుల్ వైపు చూసి "ఎవరతను?" అని డౌట్ గా అడిగాడు అభిజిత్.

"ఎస్! అతను నా మనిషే లోపలికి పంపించండి." అని చెప్పి అభిజిత్ వైపు చూసి

"నేను చెప్పాను కదా నాకన్నా ముందు ఒక మనిషి ఇండియా వచ్చాడు అని, అది అతనే, సర్పరాజ్ మహంతి వరల్డ్ టాప్ ఆర్కియాలజిస్ట్!" అని చెప్పాడు గోకుల్.

లోపలికి వచ్చి గోకుల్ వైపు చూసి "గుడ్ మార్నింగ్ సార్!" అని చెప్పి కొన్ని బుక్స్ టేబుల్ మీద పెట్టాడు సర్పరాజ్.

"ఆర్కియాలజిస్ట్ అంటే చరిత్ర గురించి తెలుసుకోవడానికి తవ్వుతూ ఉంటారు, మీ దగ్గర మా గోకుల్ కి థ్రిల్లింగ్ ఇచ్చే అంత విషయం ఏముంది?" అని అడిగాడు అభిజిత్.

"నీకు అతని గురించి సరిగ్గ తెలియదు, ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని మైథాలజీల మీద రీసెర్చ్ చేశారు." అని చెప్పి సర్పరాజ్ వైపు చూసి

"మీరు నాకు చెప్పిన విషయాల గురించి నా ఫ్రెండ్ కూడా ఒకసారి చెప్పండి." అని చెప్పాడు గోకుల్.

"ఓకే సార్!" అని జాకీ వైపు చూసి "డోర్ క్లోజ్ చేయండి." అని చెప్పాడు సర్ఫరాజ్.

"సరే!" అని బయటికి వెళ్లి సెక్యూరిటీ వైపు చూసి "కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నము." అని చెప్పి డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చాడు జాకీ.

"నేను ప్రపంచంలో ఉన్న అన్ని మైథాలజీల మీద రీసెర్చ్ చేశాను, ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న మైథాలజీ ఏదైనా ఉంది అంటే అది హిందూ మైథాలజీ ప్రపంచంలో ఎక్కడ ఆర్కియాలజిస్టులు త్రవ్వకాలు జరిపిన,

హిందూ మైథాలజీ నమూనాలు బయటకు వస్తూనే ఉంటాయి, అది ఇంకా మిగిలి ఉండడానికి కారణం, కారణం ఈ భూమి మీద ఇంకా ఆధ్యాత్మికమైన కొన్ని శక్తివంతమైన వస్తువులు.

ఈ భూమి మీద రహస్య ప్రదేశాలలో కొంతమంది రక్షణలో అలాంటి వస్తువులు ఇంకా ఉన్నాయి, వాటి కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను చాలా ప్రదేశాలు తిరిగాను." అని చెప్పాడు సర్పరాజ్.

"మీరు చెప్పింది వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీ రీసెర్చ్ లో దేని గురించైనా తెలిసిందా? అటువంటి వస్తువు ఎక్కడ ఉందో చెప్పండి దాన్ని ఎలా సాధించాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు అభిజిత్.

"థాంక్యూ!" అని చెప్పి "మీరు ఎప్పుడైనా జారువా తెగ గురించి విన్నారా?" అని అడిగాడు సర్పరాజ్.

ఆ మాటకి కాసేపు ఆలోచించి "ఆ తెగ గురించి విన్నాను వాళ్లు అండమాన్ లో ఉన్న ఒక ఒక దీవిలో ఉంటారు  లోపలికి వెళ్లడానికి ట్రై చేసిన ఒక ఫార్నర్ ని కూడా ఈ మధ్య చంపేశారు." అని చెప్పాడు అభిజిత్.

"ఎస్! ఆ జారువా తెగ ఇప్పటిది కాదు, వాళ్ల గురించి వేదాలలో కూడా ఉంది. ఆ తెగ కాలక్రమమైన ముక్కలుగా చీలిపోయి కొంతమంది మనుషులకు దూరంగా బతుకుతున్నారు.

కొంతమంది ఈ జీవన విధానానికి అలవాటు పడి మనతో కలిసి బతుకుతున్నరు కానీ వాళ్ళు చాలా భిన్నమైనవారు." అని చెప్పాడు సర్పరాజ్.

"భిన్నమైన వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర మాయలు మంత్రాలు ఏమైనా ఉంటాయా?  వాళ్ల దగ్గర మీరు చెప్పిన వింత వస్తువులు ఏమైనా ఉన్నాయా?" అని ఆత్రుతగా అడిగాడు జాకి.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 16-01-2026, 04:54 PM



Users browsing this thread: 1 Guest(s)