16-01-2026, 04:53 PM
ఎపిసోడ్ 29
హిరణ్యకీ తన ఇంటిలోనే వార్నింగ్ ఇచ్చి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు అభిర్.
*********************
అదే సమయంలో పాఠక్ కోసం బీహార్ లోని రుద్రపూర్ స్టేషన్ దగ్గరికి చేరుకొని అక్కడ ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి "ఎస్సై పాఠక్ గారిని కలవాలి." అని అడిగింది మిత్ర.
"సార్ కి ఫీవర్ డ్యూటీకి రాలేదు ఇంటి దగ్గరే ఉన్నారు కావాలంటే లోపల ఇంకో ఎస్ఐ గారు ఉన్నారు వెళ్లి మాట్లాడండి" అని చెప్పాడు కానిస్టేబుల్.
"కాదు కాదు! ఆయన మాకు చుట్టాలవుతారు కలవడానికి వచ్చాము." అని చెప్పింది మిత్ర.
"అవునా మేడం! అయితే ఇంటికి వెళ్ళండి సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లో 34 నెంబర్!" అని చెప్పాడు కానిస్టేబుల్.
"థాంక్యూ!" అని చెప్పి చాక్లెట్ తో కలిసి కారులో సెక్యూరిటీ అధికారి కోటర్స్ లో 34 నెంబర్ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టింది మిత్ర.
కాసేపటికి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న చాక్లెట్, మిత్రలను చూసి "ఎవరు మీరు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు పాఠక్.
"ఐ యాం మిత్ర ఐబి!" అని ఐడి కార్డ్ చూపించింది మిత్ర
"లోపలికి రండి మేడం!" అని చెప్పి సోఫా చూపించి "వాటర్ తీసుకుంటారా?" అని అడిగాడు పాఠక్.
"హ.. తీసుకురండి." అని ఆశ్చర్యంగా చూస్తున్న చాక్లెట్ వైపు చూసి "ఏమైందిరా.?" అని అడిగింది మిత్ర.
"అక్క! డమ్మీ ఐడి చూపించావు ఏమీ కాదు కదా, అసలే సెక్యూరిటీ అధికారి ఇంటికి వచ్చాము." అని భయంగా అడిగాడు చాక్లెట్.
"నువ్వు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండు." అని చెప్పి వాటర్ తీసుకొస్తున్న పాఠక్ వైపు చూసి
"మీరు నోయిడా స్టేషన్లో ఎస్సై నిరంజన్ గారి దగ్గర వర్క్ చేశారు కదా అప్పటి ఒక కేస్ గురించి ఎంక్వయిరీ కి వచ్చాము." అని చెప్పింది మిత్ర.
వాటర్ టేబుల్ మీద పెడుతూ "చెప్పండి మేడం! మీకు ఏ డీటెయిల్స్ కావాలి?" అని అడిగాడు పాఠక్.
"నిరంజన్ గారు ఎలా చనిపోయారో మీకు ఐడియా ఉందా?" అని అడిగింది మిత్ర.
"సార్ చనిపోయే సమయానికి నేను అక్కడ డ్యూటీలో లేను ట్రాన్స్ఫర్ అయిపోయాను, నాకు చాలా కాలం తర్వాత తెలిసింది." అని చెప్పాడు పాఠక్.
"పోనీ NIA ఆఫీసర్ మురళి జోషి మర్డర్ కేసులో ఒక పదహారేళ్ల కుర్రాడిని అరెస్టు చేసి నిరంజన్ గారు ఎఫ్ ఐఆర్ చేసారు అప్పుడు నువ్వు డ్యూటీలోనే ఉన్నావు కదా!" అని అడిగింది మిత్ర.
"ఎస్ మేడం! ఆ కేసుని నా జీవితంలో మర్చిపోలేను, ఆ మర్డర్ చేసింది ఆ కుర్రాడు కాదని అందరికీ తెలుసు కానీ పైనుంచి ప్రేజర్ వల్ల కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది." అని చెప్పాడు పాఠక్.
"మరి ఎఫ్ఐఆర్ లో ఆ కుర్రాడి పేరు కానీ ఊరు కానీ ఎందుకు మెన్షన్ చేయలేదు, ఆ విషయం మీకు తెలియదా లేక కావాలని పైనుంచి ప్రెజర్ వల్ల ఆపారా?" అని అడిగింది మిత్ర.
"ఆ కుర్రాడి గురించి సార్ కి నాకు అన్ని డీటెయిల్స్ తెలుసు కానీ పైనుంచి ప్రెజర్ వల్లే ఎఫ్ ఐ ఆర్ లో మెన్షన్ చేయలేదు, తర్వాత రోజు నాకు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ కేసు ఏమైందో కూడా తెలియదు." అని చెప్పాడు పాఠక్.
"ఓకే! ఆ కేసు మళ్ళీ రిఓపెన్ అయింది ఆ కుర్రాడి డీటెయిల్స్ తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాము." అని చెప్పింది మిత్ర.
"మేడం! ఆ అబ్బాయి పేరు అభిర్! రాజస్థాన్ దగ్గర గొర్వర్ అనే కొండ ప్రాంతనికి చెందినవాడు, అసలు అతన్ని ఈ కేసులో ఎందుకు ఇరికించారో ఎవరికీ తెలీదు." అని చెప్పాడు పాఠక్.
"అభిర్ స్టేషన్లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి ఎవరైనా వచ్చారా?" అని నోట్ చేసుకుంటూ అడిగింది మిత్ర.
"అప్పుడు!" అని ఆలోచిస్తూ "అతని వయసు ఉన్న ఐదుగురు కుర్రాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు మేడం!" అని చెప్పాడు పాఠక్.
"అవునా? ఆ ఐదుగురికి కుర్రాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా?" అని అడిగింది మిత్ర.
"ఆ ఐదుగురు గురించి ఏమీ తెలియదు మేడం! వచ్చి మాట్లాడి వెంటనే వెళ్ళిపోయారు, డీటెయిల్స్ అడిగిన చెప్పలేదు." అని చెప్పాడు పాఠక్.
"ఓకే థాంక్యూ! ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఎంక్వయిరీ గురించి ఎవరికీ తెలియదు." అని చెప్పి చాక్లెట్ తో అక్కడి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కింది మిత్ర.
కారు దగ్గరికి వచ్చి "మేడం ఎంక్వయిరీ కి మాత్రం గొర్వర్ ప్రాంతానికి వెళ్ళకండి అక్కడ మనుషుల కన్నా జంతువులే ఎక్కువగా ఉంటాయి." అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు పాఠక్.
కార్ లో వెళ్ళుతు "అవును అక్క! అతను చెప్పింది నిజమే! ఆ ఏరియా మొత్తం అడవులు!" అని ఫోన్లో చూస్తూ చెప్పాడు చాక్లెట్.
డ్రైవింగ్ చేస్తూ "అసలు! అంత అడవి ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అది కాకుండా అభిర్ జైల్లో ఉన్నట్లు తన వాళ్లకి తెలుసు కానీ 12 సంవత్సరాలుగా తనని చూడడానికి ఎందుకు రాలేదు.
ఇప్పుడు ఆ అయిదుగురు ఎక్కడ ఉన్నారు అసలు అభిర్ గురించి లండన్ పార్టీ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటుంది." అని ఆలోచిస్తూ అంది మిత్ర.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అక్క! లండన్ పార్టీ కాల్ చేస్తుంది." అని చెప్పాడు చాక్లెట్.
ఫోన్ తీసుకు లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ మేడం!" అని చెప్పింది మిత్ర.
"గుడ్ మార్నింగ్! అభిర్ గురించి ఏమైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ.
"మేడం! అతను రాజస్థాన్ లో ఉండే గొర్వర్ అనే అడవి ప్రాంతానికి చెందినవాడు ఆ ఏరియా మొత్తం జంతువులతో నిండి ఉంటుంది చాలా డేంజరస్ ప్లేస్!
అక్కడి నుంచి వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నాడు ఎందుకు అనేది తెలియడం లేదు, కాని దీని వెనకాల చాలా పెద్ద వాళ్ళ హస్తం ఉందని తెలుస్తుంది
ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే తెలుసుకుంటాను, అంతే కాదు మేడం అతనికి సంబంధించిన ఒక ఐదుగురు స్టేషన్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు, కానీ 12 సంవత్సరాలుగా మళ్ళీ తనని చూడడానికి కూడా రాలేదు." అని చెప్పింది మిత్ర.
"గుడ్! మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఇంకా ఏదైనా విషయం తెలిస్తే వెంటనే నాకు కాల్ చెయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసింది అర్ణ.
"ఈ గోర్వార్ ఏరియా గురించి నేనుఎక్కడో విన్నాను." అని ఆలోచించి
"ఎస్! చంద్రశేఖర్ గారు ఆర్కియాలజిస్ట్ మనం ఆయనని కలిస్తే అసలు ఆ ఏరియాలో ఉండే వాళ్ల గురించి తెలుస్తుంది." అని కార్ స్పీడ్ పెంచింది మిత్ర.
***********************
అదే సమయంలో కారులో ఇంటికి వెళుతూ సీరియస్ గా ఉన్న అభిర్ వైపు చూసి "ఏంటి? ఒక్కసారిగా అలా మారిపోయావు? నిజంగా నీకోసం నీ వాళ్ళందరూ ఉన్నారా?" అని అడిగింది వసుంధర.
డ్రైవింగ్ చేస్తూ "మేడం! మా అభిర్ సేన నాయకుడి ఆజ్ఞ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము, ఇక పిలుపు అందింది దేశం నలుమూలలా ఉన్న దళం సిద్ధం అవుతుంది." అని గ్లాస్ దింపి ఆకాశంలో ఎగురుగుతున్న గరుడ పక్షిని చూపించాడు శంకర్.
ఆ మాట విని శంకర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నీకు అభిర్ ముందే తెలుసా?" అని అడిగింది వసుంధర.
"అభిర్ ని ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను మేడం!" అని చెప్పాడు శంకర్.
ఆకాశంలో ఎగురుతున్న గరుడ పక్షిని చూస్తూ "అంటే! అది మీ వాళ్ళందరికీ సిగ్నల్ ఇస్తుందా?" అని డౌట్ గా అడిగింది నీలమ్.
"అవును మేడమ్! ఆ పక్షి అరుపు విన్న వెంటనే దళం లో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకుడు నుంచి పిలుపు వచ్చింది అని అర్థమవుతుంది." అని చెప్పాడు శంకర్.
"నిజంగా హిరణ్య కోర్టుకి వెళ్లితే చంపేస్తారా?" అని అడిగింది నీలమ్.
"అభిర్ నోటి వెంట మాట వచ్చింది అంటే అది మా అందరికీ ఆజ్ఞ! తప్పకుండా జరిగి తీరుతుంది." అని చెప్పాడు శంకర్.
"మీకు నంద ఫ్యామిలీ వల్ల ఏదో అన్యాయం జరిగిందని అర్థమైంది. మరి ఇన్ని సంవత్సరాలు సైలంట్ గా ఎందుకు ఉన్నారు?" అనుమానంగా అడిగింది వసుంధర.
"ఆ ఫ్యామిలీ లో వారసులు లేకుండా చేస్తానని అభిర్ చెప్తున్నాడు, అంత తప్పు వాళ్ళు ఏం చేశారు?" అని అడిగింది నీలమ్.
ఇంటి దగ్గర కార్డ్ స్లో చేస్తూ "అది తెలియాలి అంటే ఇప్పటివరకు ఎవరకి తెలియని రహస్యం మీకు తెలియాలి." అని చెప్పడం స్టార్ట్ చేశాడు శంకర్.
*****************
లండన్ ఇంటిదగ్గర టెన్షన్ గా ఉన్న ముకుల్ దగ్గరకు వచ్చి "తాతగారు! అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు ఏమైంది? అలా ఎందుకు ఉన్నారు?" అని డౌట్ గా అడిగింది అర్ణ.
"ఇన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న ఏమాపాశం మళ్లీ మన మీదకు వస్తుంది. ఈ నంద సామ్రాజ్యాన్ని ఎలా కాపాడలో తెలియడం లేదు, అందుకే నీతో ఒకసారి మాట్లాడాలి అనిపించి రమ్మన్నాను." అని చెప్పాడు ముకుల్.
"మీరు టెన్షన్ పడేది జైల్ నుంచి రిలీజ్ అయిన అభిర్ గురించే కదా! అసలు గొర్వర్ అనే అడవి ప్రాంతంలో ఉండే అతనితో మనకి వీరోధమేమిటి? ఆఫ్ట్రాల్ ఒక సామాన్యమైన మనిషిని చూసి భయపడి ఇండియా నుంచి ఎందుకు వచ్చేసారు?" అని అడిగింది అర్ణ.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు అభిర్ గురించి ఎంక్వయిరీ చేస్తున్నావా?" అని అడిగాడు ముకుల్.
"నేను మీకు ముందే చెప్పాను, మీ ఆస్తి వారసత్వంలో పాటు మీ బాధను కూడా పంచుకుంటాను అని అందుకే చేస్తున్నాను." అని చెప్పింది అర్ణ.
"ఇంతకాలం నా మనసులో దాచుకున్న రహస్యం నీకు చెప్పి భారం దించుకుంటాను, ఈ విషయం తెలిసిన తర్వాత అయినా అభిర్ గురించి ఆలోచించకుండా ఉంటావు." అని చెప్పడం మొదలుపెట్టాడు ముకుల్.
***********************
అదే సమయంలో తీహార్ జైల్ కి వెళ్లి "మిస్టర్ నితీష్ మిమ్మల్ని కొన్ని విషయాలు అడగడానికి వచ్చాను, మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెబితే డ్యూటీలో ఉంటారు, లేకపోతే కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది." అని చెప్పాడు శ్రీకర్.
"మీరు నన్ను ఏమి అడగాలి అనుకుంటున్నారో నాకు తెలుసు! అభిర్ పేరు అండమాన్ లిస్టులో ఎందుకు యాడ్ చేశాను అనే కదా! కూర్చోండి ప్రశాంతంగా మాట్లాడుకుందాము." అని చెప్పాడు నితీష్.
"ఎస్! అభిర్ పేరుని ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది. దీని వెనకాల ఎవరు ఉన్నారు?" అని అడిగాడు శ్రీకర్.
"మీకు నేను ఆ పేరు చెబుతాను కానీ మీరు అతన్ని టచ్ కూడా చేయలేరు జనశక్తి పార్టీ అభిజిత్ పాండే!" అని చెప్పాడు నితీష్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అభిజిత్ పాండే గారా? ఆయనకి ఏమి అవసరం?"అని డౌట్ గా అడిగాడు శ్రీకర్.
"నాకెలా తెలుస్తుంది ఆయన చెప్పిన తర్వాత చేయకుండా నేను కాదు, మీరు కూడా ఉండలేరు, అందుకే ముందే చెప్పాను టచ్ కూడా చేయలేరని అడిగే ధైర్యం ఉంటే వెళ్లి ఆయననే అడగండి." అని చెప్పాడు నితీష్.
అక్కడినుంచి బయటికి వచ్చి కారుకి డ్రైవర్ వైపు చూసి "వసుంధర మేడం ఇంటికి వెళ్ళు!" అని చెప్పాడు శ్రీకర్.
"ఓకే సార్!" అని కార్డ్ స్టార్ట్ చేశాడు డ్రైవర్.
కార్ లో కూర్చుని "ఈ కేసులో అభిజిత్ పాండే పేరు చేరిస్తే వెంటనే కేసు పక్కన పెడతారు, అసలు అతనికి అభిర్ కి సంబంధం ఏమిటి?" అని ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీకర్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)