16-01-2026, 04:50 PM
Part -48
ధనంజయ్ కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు తను నిజం చెప్పిన సరే అవని నమ్మదు అని మాత్రం తనకు అర్థం అవుతుంది.
అది నిజమే కదా....ఆరోజు తన కళ్ళ ముందే అవని బాధపడింది కానీ ఆ బాధను తన అర్థం చేసుకోకుండా మాట్లాడాడు .
భార్గవి మాటలను గుడ్డిగా నమ్మి అవిని నీ దారిలో పెట్టాలి అనుకుని దూరం చేసుకున్నాడు.
కూతురు చేతులు పట్టుకొని ఆ రోజు నిజంగా అలా అని నాకు తెలియదమ్మా...నువ్వు జంక్ ఎక్కువ తింటున్నావ్ అని చెబితే కోప్పడ్డాను కానీ...ఆకలితో ఉన్నావని అనుకోలేదు అని చెబుతాడు.
అవని అతని చేతిలో నుంచి తన చేతులు తీసేసుకుని అవునా... నేను మీ ఇంటిలో పడిన ఇబ్బంది మీకు తెలియదా అని అడుగుతుంది. తెలియదు అన్నట్టుగా తలువుతాడు.
ఒక్క విషయం సూటిగా అడుగుతాను సమాధానం చెప్పండి. శిల్ప మీ ఇంటిలో ఎలా ఉంది ఏంటి అన్నది మీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసు అన్నట్టుగా తలువుతాడు.
మరి నేను ఎలా ఉన్నానో మీకు ఎందుకు తెలియలేదు దీనికి మాత్రం సమాధానం చెప్పండి సార్ అని అడుగుతుంది. ఏమని సమాధానం చెబుతాడు.
సమాధానం లేని ప్రశ్న ఎదురయ్యింది. భార్గవిని గుడ్డిగా నమ్మినందుకు ఈరోజు కూతురు ముందు దోషిగా నిలబడ్డాడు.
నిజంగా నాకు తెలియదు అవని. తెలిస్తే నేను ఎందుకు నీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాను అని బాధపడతాడు. దానికి విరక్తిగా ధనుంజయ వైపు చూసి వాళ్ళ నాన్నమ్మతో మొదటిసారి ఆడపిల్లకి తల్లి అవసరమైనప్పుడు ఈ దంపతులిద్దరూ ఏం చేశారో అడుగు నానమ్మ అని అంటుంది.
సత్యవతి గారు అనుమానంగా ధనుంజయ్ వైపు చూస్తారు. ఆ విషయం ఏంటో అర్థం కాక ధనుంజయ్ ప్రశ్నార్థకంగా కూతురు వైపు చూస్తాడు.
ఈ విషయం కూడా మీకు తెలియదని ఇప్పుడు నేను అనుకోవాలా అని... నొప్పి అని ఏడుస్తూ ఉంటే ప్రతిదానికి ఏడుపేనా మేము బయటికి కి వెళుతున్నాము.
ఏదైనా అవసరం ఉంటే పనిమనిషిని అడుగు అని వెళ్లిపోయారు. అప్పుడు మన ఇంటిలో పని చేస్తున్న మంగే నన్ను తల్లిలాగా చూసుకుంది.
ఆ ఐదు రోజులు నాతోనే ఉండిపోయింది. ఈయన గారి భార్య పాచిపోయిన అన్నం పెడితే... ఆ టైంలో అలాంటి భోజనం మంచిది కాదు అని ఎవరు చూడకుండా మంగే తీసుకొచ్చి పెట్టేది.
మరి శిల్పకి తల్లి అవసరం అయిన టైంలో మీరిద్దరూ ఎలా చూసుకున్నారు అని అడుగుతుంది. ధనుంజయ్ కా రోజు గుర్తొస్తుంది.
శిల్పకి ఐదు రోజులు సపరేట్గా కూర్చోబెట్టి జాగ్రత్తగా హెల్ది ఫుడ్ పెట్టి ఫంక్షన్ గ్రాండ్గా చేయడం. ఆ ఫంక్షన్ లో ఎక్కడా కూడా అవని కనిపించకపోవడం.
ఇప్పుడైనా గుర్తొచ్చిందా లేదా ఇది కూడా మీకు తెలియకుండానే శిల్పని అంత జాగ్రత్తగా చూసుకున్నారా అని అడుగుతుంది.
ఆ రోజు నేను లేను అన్న ఆలోచన కూడా మీకు రాలేదు కదా అని అంటుంది. ఆరోజు ధనుంజయ్ భార్గవిని అడిగితే అవని అలిగి పడుకుంది.
ఎంత బ్రతిమాలుతున్నా సరే రెడీ అవ్వడం లేదు. లోపల లాక్ చేసుకుంది అని చెబుతుంది. మీరు వెళ్లి పిలవండి అని చెబుతుంది.
ధనుంజయ్ అవని గది దగ్గరకు వచ్చి అవని అవని అని పిలుస్తాడు. ఎంత పిలిచినా సరే ఆ తలుపు తెరుచుకోదు. ఇంతలో సునీల్ వచ్చి బావ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు రండి అని చెప్పి తీసుకు వెళ్ళిపోతాడు.
లేదు అవని. ఆ రోజు నేను వచ్చి నిన్ను పిలిచాను. నీ గది ముందే చాలాసేపు నిలబడి తలుపు కొట్టాను అంటే.. నా గదిని లాక్ చేసి మీరే తలుపు కొట్టారా... అసలు నేను ఆరోజు నా గదిలో ఉంటేనే కదా మీరు తలుపు కొడితే నేను పలకడానికి అంటుంది.
సత్యవతి గారు కూడా ఆ నిమిషం మౌనంగానే ఉండిపోతారు. నీకు తెలుసా అమ్మ అవని ఎక్కడుందో అని అడిగితే...
ఆ రోజు నువ్వు చెబితేనే కదా నీ భార్య పిల్లని స్టోర్ రూమ్ లో పెట్టి తాళం వేసింది కదరా...ఇంకా ఏమని నువ్వు నన్ను అడుగుతున్నావు అని అడుగుతారు.
అంతే ఆ మాటలకి ధనుంజయ్ తడబడుతూ వెనక్కి తూలపడుతాడు. అయినా ఎవరూ కూడా ముందుకి ఒక అడుగు వేసి ధనుంజయని పట్టుకోరు.
నేనెందుకు అమ్మ నా కూతుర్ని గదిలో పెట్టి తాళం వేయమంటాను అని బాధగా అడిగితే... ఏమోరా ఆ విషయము మీ భార్యాభర్తలిద్దరికీ తెలియాలి అని ముభావంగా చెబుతారు.
నిజంగా నాకు ఇవేమీ తెలియదు నన్ను నమ్ము అవని అని కన్నీళ్ళతో అడుగుతాడు. అసలు మీకు ఏ విషయం తెలుసు అని ఒప్పుకుంటారు.
ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ ఇంటిలో నరకం అనుభవిస్తుంటే ఒక్కటి కూడా మీకు తెలియదు అంటే నమ్మేటట్టుగా ఉందా...
ఆఖరికి నీ భార్య సంతోషం కోసం నీ మేనల్లుడికి నన్ను అప్పజెప్పడానికి కూడా సిద్ధపడ్డావు కదా అది కూడా నీకు తెలియదా అని కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తుంది.
సత్యవతి గారు అవని నీ గట్టిగా పట్టుకుని ఏమంటున్నావ్ తల్లి అంటే...అవును నానమ్మ నేను చెప్పేది అంతా నిజమే.
మీరు అప్పటికి ఇంకా ఊర్లోనే ఉంటున్నారు కదా.. నేను టెన్త్ లో ఉండగానే ఆ ఉదయ్ గాడు నా మీద కన్ను వేశాడు.
వాడి నుంచి తప్పించుకోవడానికి నిద్రలేని రాత్రులే గడిపాను. ఆరోజు సాయంత్రం నేను చదువుకుంటూ ఉంటే ఈ పెద్ద మనిషి నా దగ్గరికి కోపంగా వచ్చి. నీకు ఎన్నిసార్లు చెబుతున్న బుద్ధిరాదా...
ఎందుకు మా మాటకి నువ్వు ప్రతిదీ ఎదురు చెబుతావు.. ఉదయ్ అడిగింది కూడా నీ మంచి కోసమే కదా వాడు అడిగినట్టు చేస్తే తప్పేంటి అని కోపంగా అరిచారు.
ఆ మాటలు వినగానే చాలా భయం వేసింది. ఏడుపు తన్నుకు వచ్చింది. కానీ ఎవరికి చెప్పుకోను. కన్న తండ్రి నన్ను తార్చడానికి సిద్ధపడ్డాడు అని అర్థమవుతూ ఉంటే నా బాధ వర్ణనాతీతం నానమ్మ .
ఆ రోజు రాత్రి వీళ్ళందరూ సినిమాకు వెళుతూ ఉదయ్ ని, నన్ను వదిలేశారు. వెళుతూ ఉదయ్ అడిగింది చెయ్యి అని చెప్పి కోపంగా అరిచి వెళ్ళిపోయారు.
అప్పటికి ఏడుస్తూ నేను వస్తాను నాన్న. నాకు ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది అని అంటే... నువ్వు భయపడి పోవడానికి ఇక్కడ ఎవరూ రాక్షసులు లేరు అని వాళ్లంతా సినిమాకి వెళ్ళిపోయారు.
మొత్తం నాలుగు గంటలు వాడి నుండి తప్పించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు... ఆఖరికి నా ప్రాణాలు తీసుకోవడం కూడా సిద్ధపడ్డాను అని మణికట్టు మీద ఉన్న మచ్చని చూపిస్తుంది.
సత్యవతి గారుఅక్కడ చెయ్యి వేసి నిమురుతూ ఉంటే.. ఏడుస్తూ ఆ రోజు వాడిని చాలా బ్రతిమాలాను నానమ్మ. నా జోలికి రావద్దు అని కాళ్లు కూడా పట్టుకున్నాను.
కానీ వాడికి వాళ్ల మామ సపోర్టు ఉంది కదా.. అందుకే రెచ్చిపోయాడు. ఇక ఏ దారి లేక కిచెన్లోనికి వెళ్లి చాక్ తీసుకున్నాను.
దగ్గరికి వస్తే పొడి చేస్తాను అని బెదిరించాను. దానికి వాడు వంకరగా నవ్వుతూ నన్ను పొడిస్తే మా మామ నిన్ను బ్రతకనిస్తాడు అనుకుంటున్నావా...
నిన్ను నాలుగు పీకే అయినా సరే, నీ రక్తం కళ్ళ చూసైనా సరే నిన్ను నా దగ్గరికి పంపిస్తాడు అని చాలా అసహ్యంగా మాట్లాడాడు.
వాడి మాటలు వినగానే అది నిజమే కదా.. నేను ప్రాణాలతో ఉంటేనే ఈ తిప్పలన్నీ అని.. నా మణికట్టు దగ్గర నేనే కోసేసుకున్నాను.
నేను అలా చేస్తానని వాడు ఊహించలేదు వాడు భయంతో బయటికి వెళ్లిపోయాడు. వాడు అక్కడ నిండి వెళ్లిన తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు.
నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ లో ఉన్నాను. నా పక్కన నువ్వు ఉన్నావు. నిన్ను చూడగానే నాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది.
వెంటనే నిన్ను కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేసాను. నన్ను మీతో పాటు తీసుకెళ్లి పోండి నేను ఇక్కడ ఉండను అని మిమ్మల్ని భయపడుతూ గట్టిగా పట్టుకున్నాను గుర్తుందా నానమ్మ అని అడుగుతుంది.
గుర్తుంది తల్లి అంటారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు గానీ అప్పటినుండి మీరు ఇక్కడే ఉండిపోయారు.
మీరు ఉంటున్నప్పుడు నుండి ఆ ఉదయ్ దౌర్జన్యాలు తగ్గాయే గాని ఈ భార్యాభర్తల అరాచకాలు ఏమైనా తగ్గాయా నానమ్మ అని అడుగుతుంది.
ఆ మాటలకే సత్యవతి గారు మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడు చెప్పండి ఈ విషయాలు ఏమీ మీ అబ్బాయికి తెలియదా...
ఆయనకు తెలియకుండానే నన్ను బలి చేయడానికి సిద్ధపడ్డారా అని ఏడుస్తుంది.
లలిత గారు వెంటనే వచ్చి అవిని నీ గట్టిగా కౌగిలించుకుంటారు. మాధవి, నివి కూడా వచ్చి అవని చుట్టూ చేతులు వేసి పట్టుకుంటారు.
ఆ నిమిషం ధనుంజయ్ మాత్రం మాట రాని బొమ్మ అయిపోతాడు. ఇప్పుడు తను నిజం చెప్పిన సరే ఇక్కడ ఎవరూ నమ్మరు అని పూర్తిగా అర్థం అయిపోయింది.
అంత బాగా భార్గవి తన కళ్ళకి పొరలు కట్టేసింది. ధనుంజయ్ మోకాళ్ళ మీద కింద కూర్చుని ఏడుస్తూ నిజంగా ఉదయ్ అలా చేసాడని నాకు తెలియదు.
నువ్వు ఒక సబ్జెక్టులో వీక్ గా ఉన్నావు ప్రాక్టీస్ చేపిస్తాను అంటే మాట వినడం లేదు. ట్యూషన్ కి పంపిస్తాను అన్నా వద్దు అంటున్నావు అని చెప్పారు.
అది నిన్ను ప్రాక్టీస్ చేయమన్నాను గాని..వాడు నీతో అలా తప్పుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అని ఊహించలేదు. మేము ఆరోజు బయట నుంచి వచ్చేటప్పటికి రక్తపు మడుగులో ఉన్న నిన్ను చూసి నా ప్రాణం అక్కడే పోయినట్టు అనిపించింది..
ఈ నా రెండు చేతులతోనే నిన్ను ఎత్తుకొని వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాను. నువ్వు మొండిగా మారిపోయావు అనుకుని..
అమ్మ వాళ్ళు ఉంటే అయినా నువ్వు అందరితో కలిసి పోతావు అని అమ్మని నేనే ఒప్పించి ఇక్కడ ఉంచాను.
నా కూతుర్ని నేనే పరాయి వాడు పక్కకి ఎలా పంపిస్తాను అవని అని తన చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడుస్తాడు.
అక్కడున్న అందరికీ ఇద్దరి బాధ అర్థమవుతుంది. ఇద్దరూ భార్గవి చేతిలో మోసపోయిన వారే..
ఒకళ్ళు భార్య చెప్పిందే నిజం అనుకుని కూతురికి దూరమైతే... ఇంకొకరు సవితి తల్లి చేష్టలకి తండ్రి మీదే విరక్తి తెచ్చుకున్న వాళ్లు.
తండ్రి కూతుళ్ళ పయనం ఎటువైపు....
కథ కొనసాగుతుంది...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)