Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం - 10
#18
*"" యాది వాటర్ పట్టుకుని వచ్చాడు అక్కడికి వచ్చి
చూడబోతే కార్ లో 
అమ్మాయిగారు లేరు...
అతడికి కంగారు అనిపించింది.... ఇదేంటి ఇందమ్మ ఎక్కడికి 
వెళ్లారు అని కంగారుగా 
అక్కడంతా వెతుకుతూ... 
ఉన్నాడు.
 
*"" స్పృహలో లేనట్టు
అయిపోయి ఉన్న సిద్దు కళ్ళ ముందుకు ఒక ఆకారం
హఠాత్ గా వచ్చి నిలుచుంది.
 
సిద్దు తుళ్ళి పడి చూసాడు చూడబోతే ఆమె ఒక హిజ్రా.... 
 
( ఫ్రెండ్స్ ఈ కథలో హిజ్రా గా
ఉన్న ఆమెకు చాలా
ఇంపార్టెన్స్ ఉంది 
నేను వారిని గౌరవిస్తూ
వారికోసం ఒక పాత్రని 
క్రియేట్ చేశాను
అంతా గమనించాలి
అని కోరుకుంటున్న)
 
*""ఎర్ర చీర కట్టుకుని 
పసుపు పూసుకుని నుదిట సూర్యుని రూపం లో
కుంకుమ పెట్టుకుని 
చూసేందుకు ఆది శక్తి
అవతారం అన్నట్టు
ప్రకాశిస్తూ కనిపిస్తుంది.....
ఆమెను చూసిన సిద్దు.... 
ఓపిక లేనట్టు ఎవరండీ
మీరు ఎం కావాలి అని అడిగాడు. 
 
*"ఆమె తలపై ఒక కలశం 
పెట్టుకుని ఉంది అక్కడికి 
దగ్గరలో ఉన్న మావారి కి 
అర్చన చేసేందుకు వెళ్తుంది
అని చెప్పి ఎంటి బిడ్డ ఇలా ఉన్నావు ఏమైంది అని 
అతడి తల్లి అడిగినట్టు 
అడిగింది... 
 
సిద్దు నీరసం గా ఎం లేదు 
అమ్మా ఎం జరిగిందో నాకే తెలియడం లేదు 
ఇంక నీకే మి చేబుతను..... 
అని అనడం తో 
 
*""ఆమె నవ్వుతూ నువ్వు నాకేం చెప్పనవసరం లేదు
నీకు నువ్వు తెలుసుకుంటే 
చాలు లే కానీ అందుకు
ఇంకా సమయం రాలేదు 
ముందైతే నీ నీరసం
తొలగించుకో అని ఒక మట్టి
ప్రమిద లాంటి దానిలో ఆమె 
తలపై ఉన్న కలశం లోని
పానకం పోసి...హు... 
తాగు అని చెప్పింది.
 
*"" అస్సలు కదల్లేని పరిస్తితి లో సిద్దు ఉన్నాడు 
ఆమె ఎవరో ఏంటో తెలియదు
కానీ మంచి ఆవిడలా
అనిపించి వద్దు అనకుండా
ఆ పానకం తాగాడు.
 
*" అంతే పోయిన ఎనర్జీ కి 
వంద రెట్లు ఎక్కువ బలం 
వచ్చినట్టు అనిపించింది
అతడు ఆశ్చర్య పోతూ
అమ్మా మీరెవరో గాని 
సమయానికి ఈ సిరప్ ఇచ్చారు వావ్ నాకు నార్మల్ అయింది
అని అంటూ ఉంటే... 
 
*"ఆమె నవ్వుతూ నీలో శక్తి కోల్పోవడం అంటే అదీ 
తాత్కాలికం పోవలసింది
పోతేనే రావలసింది రాగలదు.... ఇప్పుడు ఈ శక్తి నీతో పాటు ఇంకొకరికి కూడా అవసరం
అని అర్థం కానట్టు 
మాట్లాడుతూ ఉంటే 
 
*"సిద్దు విసుగ్గా 
నీ మాటలు నాకు అస్సలు అర్ధం కాలేదు కానీ థాంక్స్
ఇంక నేను వెళ్ళాలి నా బ్యూటీ ఎటుపోయిందో ఎమో అని ముందుకు వెళ్ళబోతూ ఉంటే.
 
*"" ఆమె కార్ కి అడ్డం వచ్చి 
పొన్ను పోయినా వైపు
పోతున్నావు గాని నీ పయనం అటు కాదు బిడ్డ,
ఇటు మరలు అదే నీకు సరైన మార్గం పో ఇటేపు పో అని
యడమ వైపు చూపించి.
ఆమె చేతిలో ఉన్న కుంకుమ
అతడి నుదిట పెట్టింది.
 
*"" సిద్దు చాలా లేట్ అయ్యింది ఆమె కార్ వెళ్ళిపోయి 
ఉంటుంది ఇంకెందుకు అటు పోవడం అని ఆవిడ చెప్పిన వైపు వెళ్తే తన ఇంటికి షార్ట్ కట్ అనుకుని అటు తిరిగి వెళుతున్నాడు...!!
 
 
*""ఆ హిజ్రా.... నవ్వుతూ.... 
నీ దిశ మార్చాలి అని వాడు చూస్తున్నాడు.... 
కానీ నీ కవచం అందుకు 
అడ్డు పడింది.
 
నీ గమ్యం చేరేందుకు ఈ అమరావతి నీ అడ్డు పెట్టింది
ఆ శక్తి.....
బిడ్డా ఇంక వాడు ఏమి
చేయలేడు అంతా అమ్మ ఆశీర్వాదం అని గట్టిగా
నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
 
*"" సిద్దు విసుక్కుంటూ
అసలు నాకేం అవుతుంది
ఎందుకు నేను ఇలా తెలియని ఇమాజ్నేషన్ కి గురై పడిపోతున్నాను
ఒకవేళ షుగర్ లెవెల్స్ పడిపోతుంటే ఇలా జరుగుతుందా ఒకసారి డాక్టర్ నీ మీట్ 
అవుతా అని అనుకుంటూ
కార్ నడుపుతూ ఉంటే 
కొంత దూరం లో ఎవరో
అమ్మాయి పరుగులు పెడుతూ రైల్వే ట్రాక్ వైపు
వెళుతున్నట్టు కనిపించింది.
 
*" అంతే సిద్దు కార్ స్పీడ్ పెంచి అటుగా వెళ్ళాడు
అక్కడ కార్ ఆపేసి అతడు
ఆ ట్రాక్ వైపు పరుగు
తీశాడు.
********"""""""""**********"""""""""""
*"" ఇందు కార్ లో ఉండగా ఆ చీకటి నీడ ఆమెను కమ్ముకుంటు
వచ్చింది అంతే ఇందు భయం తో కేక పెట్టింది...
అక్కడ ఎవరూ లేరు కానీ
ఎదో వింత సభ్ధం
భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి అంతే... 
ఇందు భయం గా కార్ దిగి పరుగులు పెడుతూ ఉంది 
ఆమె పరిస్తితి దారుణం గా
ఉంది చీకటి కంటే నల్లని నీడ
ఆమె ను వెంటాడుతూ
ఉంది ఇందు చుట్టు ప్రక్కల
ఎవరు లేకపోవడం వల్ల
ప్రాణాలు దక్కించు కోవడం 
కోసం రోడ్ పై పరుగులు తీస్తు
ఉంది ఆ నీడ ఇందు నీ 
తాకలేదు కానీ భయపెడుతూ వెంటాడుతూ ఉంది
అందుకే ఇందు పరుగులు
తీస్తూ రైల్వే ట్రాక్ వైపు 
వచ్చింది 
 
*""'ఆమెకు ఎం జరుగుతుంది
తాను ఎక్కడ ఉంది అర్థం కాలేదు వెంటాడుతున్న నీడ నుండి తప్పించు కోవాలి అదొక్కటే
ఆమె చేస్తుంది ఆ నీడ కూడా ఆమెను తరిమింది కేవలం 
ఆమెను ప్రమాదం లో పడతోయాడానికే... 
అటుగా వస్తున్న ట్రైన్ కింద 
ఆమె పడబోతోంది.....
**""""***""""""**"""'"""***"""""""*****
*"" సిద్దు అనుకుంటూ ఉన్నాడు ఎవరో అమ్మాయి సూసైడ్
చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకుని ఎంతో వేగం గా
వెళ్లి క్షణం లో ఆమె చేయి అందుకుని పక్కకి లాగేసాడు.
 
*" అతడు క్షణం ఆలస్యం చేస్తే 
ఆమె ట్రైన్ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయేది.....
అంత వరకు ఆమెను 
వెంటాడిన నీడ అక్కడికి
సిద్దు రావడం తో మాయం అయ్యింది....
 
*' సిద్దు చేయి అందుకున్న 
ఇందు కెవ్వున కేకే పెట్టీ
స్పృహ కోల్పోయింది.... 
 
*"అంతే అక్కడి దృశ్యం చూసి సిద్దు షాక్ అయ్యాడు
తాను ఎవరికోసం అయితే 
వెతుకుతూ ఉన్నాడో ఆమె 
తానుగా ట్రైన్ కింద పడబొయింది కాస్త అతడు ఆలస్యం చేసి 
ఉంటే ఓహ్ గాడ్ సిద్దు వళ్లు జలదరించింది.
 
*"" ఆమె చేయి ఇంకా అతడి
చేతిని బిగించి పట్టుకునే
ఉంది.
ఆమెను అతడు చుట్టుకుని ఉన్నాడు
అమే గుండె వేగం అతడికి తెలుస్తుంది... 
ఎదో తెలియని అనుభూతి
ఎన్నో ఏళ్ల యడబాటు తొలగిపోయిన భావన
కలిగింది.
అలాగే ఆమెలో స్పృహ లేదు.... చాలా భయపడింది
అందుకే వళ్లంతా
చల్లబడి ఉంది
సిద్దు కి ఎలా అర్థం
చేసుకోవాలో తెలియడం
లేదు కాసేపటి క్రితం కాలేజ్ 
నుండి బైలుదేరిన అమ్మాయి
ఇలా సూసైడ్ చేసుకోవాలి
అని ఎందుకు అనుకుంది 
అని ప్రశ్నించుకుంటూ..... 
ఆమెను 
ఎత్తుకుని తన కార్ వరకు
తెచ్చి
కార్ లో పడుకో పెట్టీ 
ఆమెను తడుతు పిలుస్తూ
ఉన్నాడు,,
 
అతడికి ఆమె పేరు తెలియదు అందుకే హేయ్.... బ్యూటీ...
ఏ బ్యూటీ... కళ్ళు తెరవ
ఏమైంది నీకు
ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావ్ అని అతడు
ఎంత పిలిచిన ఇందు పలక లేదూ ఆమెకు మెలుకవ
రాకపోయే సరికి అతడికి 
కాస్త భయం వేసింది 
ఎం చేయాలి అని తన 
మనుషులకి కాల్ చేయ
బోయాడు.
 
*"" అంతలో అటుగా
యాది కార్ తో వచ్చాడు
అతడు సిద్దు కార్ అక్కడ 
ఆగి ఉండటం చూసి సందేహం గా అక్కడికి వచ్చి చూసాడు
చూడబోతే ఆ కార్ లో ఇందుమ్మ ఉంది అతడు సిద్దు తో
గొడవ కి దిగబొయాడు....
సిద్దు ఊరుకుంటాడా.... 
గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆమె
ట్రైన్ కి అడ్డం వెళ్ళబోయింది
అని ఎందుకో భయపడింది 
అని చెప్పాడు
 
తాను రాకుంటే ఆమె చనిపోయి ఉండేది అని చెప్పడం తో 
యాది కి విషయం అర్ధం
అయింది ఇందమ్మా.... 
ఇలాంటి ప్రమాదాల్లో చాలా 
సార్లు పడింది అంటే 
ఈ అబ్బాయి నిజమే చెబుతున్నాడు శివరాం కొడుకు ఇంధమ్మ నీ కాపాడాడు
అనుకుని అతడికి
క్షమాపణ చెప్పి అతడి సాయం తో అమ్మాయిగారిని కార్ లో ఎక్కించుకుని 
ముందుకు కదిలాడు.
 
*" సిద్దు అయోమయం గా 
తన కళ్ళ ముందు అసలు ఎం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు.
ఇందు కి తనని సిద్దు సేవ్ 
చేశాడు అని తెలియదు 
 
ఆ డ్రైవర్ కూడా ఇందు కి
జరిగింది చెప్పాలి అనుకొలేదూ.
 
*"" మార్గం మధ్యలో ఇంటికి మెళుకువ వచ్చింది ఆమె అయోమయం గా చూస్తూ
ఉంటే అంతలో ఆమె ఇల్లు చేరుకుంది.
 
 *"చూడబోతే తాను కార్ లో
ఉంది అంతా నార్మల్ గా ఉంది. ఆమె కంగారుగా యాది నాకు ఏమైంది నేను కార్లో కి ఎలా వచ్చాను అని కంగారు గా 
అడిగింది..??
 
*" యాది తడబడకుండా మీరు కార్లోనే ఉన్నారు గా మరీ
ఎలా వచ్చాను అంటారు 
ఎంటి అమ్మ నేను నీళ్లకోసం 
వెళ్లి వచ్చాను చూడబోతే మీరు నిద్రపోతూ ఉన్నారు 
మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం 
ఎందుకు అని నెమ్మదిగా కార్ నడుపుకుంటూ వచ్చాను 
అని అభద్ధం చెప్పాడు.
 
*""ఇందు కంగారుగా చుట్టు చూసి లేదు నన్ను ఎవరో తరిమారు
నేను భయం తో పరుగులు పెట్టాను అక్కడ
వేగం గా ట్రైన్ వస్తుంది 
అంతలో ఎవరో నా చేయి 
పట్టుకుని లాగారు అని
అంటూ ఉంటే యాది కి అర్థం 
అయ్యింది
 
అతడు చెప్పింది
అంతా నిజమే అని
కానీ ఆమె భయ పడుతుంది
అని అలాంటిది ఏమి లేదు 
అని మీరు కల కనీ ఉంటారు
అని అబద్ధం చెప్పాడు.
 
*" అంతే ఇందు షాక్ అయ్యి అవునా నిజంగా నేను కల
కన్నానా యాది నువ్వు అబద్ధం చెప్పడం లేదు గా
నాకు భయం వేస్తుంది
నేను చెబుతుంది నిజం 
అయితే ఇంక కాలేజ్ కి కాదు
కదా ఇంట్లో నుంచి బైటికే
వెళ్ళను అని అనింది
 
*" అంతే యాది ఫిక్స్ అయిపోయాడు
ఇంధమ్మా నేను జరిగింది అంతా నిజం అని చెబితే 
కాలేజ్ కి వెళ్ళడం మానేస్తారు
అన్న నన్ను చావకొడతాడు అమ్మాయిని వంటరిగా ఎందుకు వదిలేసావు అని
 
అందుకే ఆలోచించి 
నేను చెప్పింది నిజం అమ్మ
మీరేం కంగారు పడకండి 
అంతా మీ బ్రమ అని
నచ్చచెప్పాడు.
 
ఇందు యాది అంత కచ్చితం గా చెప్పడం తో మౌనం వహించింది నమ్మలేని దృశ్యం ఇంకా కళ్ళముందు మెదులుతూనే
ఉంది కానీ యాది అది
స్వప్నం అనడం తో ఎటు తేల్చుకోలేక ఇంటిలోపలికి
వెళ్ళింది ఇందూ.
 
*" ఆమె రావడం చూసి
శారదాంబ హమ్మయ్య
వచ్చేసవా 
ఎందుకు ఇంత ఆలస్యం
అయ్యింది నీతో నాన్నగారు రాలేదా...???
అని అడిగి ఎప్పటిలా 
అమ్మాయికి దిష్టి తీసి
అవతల పడేసి ఫ్రెష్ అయి
రమ్మని చెప్పింది. 
 
ఇందు గదిలోకి వెళ్లి అక్కడ
ఉన్న దేవి ప్రతిమ కి
నమస్కరించి అమ్మా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది
నేను ఎం పాపం చేశాను 
అంతా కలలా ఉంది
కానీ కాదు అనిపిస్తుంది 
నన్ను తరిమింది ఎంటి
ఎందుకు వెంటాడుతుంది 
నన్ను రక్షించింది ఎవరు...???
ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ 
వేదన పడాలి ఇప్పుడు 
జరిగింది అమ్మకి చెబితే
తను కంగారు పడుతుంది 
అందుకే నేను అమ్మ తో ఏమి చెప్పను అనుకుని.... 
 
స్నానం చేసేందుకు డ్రెస్ 
రిమూవ్ చేయబోయిన
ఆమె చేతి గాజుల కి చిక్కున్న
ఒక వస్తువు కనిపించింది.
 
అది త్రిశూలం ఆకారం లో
ఉన్న లాకెట్ అది సిద్దు చేతికి
ఉన్న బ్రెస్లెట్ కి హేంగ్ అయి ఉంటుంది
సిద్దు తనకి వద్దు అని 
ఎంత చెప్పినా దక్ష్యాయిని 
అదే సిద్దు వాళ్ళ అమ్మ కుంకుమార్చన జరిపించి 
ఆ బ్రేస్లెట్ తొడిగింది
ఇప్పుడు ఆ త్రిశూలం ఇందు 
చేతికి చేరింది.....
ఆమె ఆ లాకెట్ ఆశ్చర్యం గా చూస్తూ ఇదెక్కడి నుండి వచ్చింది...
అని ఆలోచిస్తూ అంతలోనే
ఆనంద పడిపోతూ 
ఆ దేవి మాత నాకోసం 
ఇచ్చింది నేను ఎక్కువ 
భయ పడుతున్నా కదా
అందుకని అని  
అనుకుంటూ గబగబా స్నానం 
చేసి బట్టలు వేసుకుని 
ఆ త్రిశూలం లాకెట్ పూజ 
గదిలో ఉన్న అమ్మవారి దగ్గర 
పెట్టి తిరిగి తీసుకుని ఒక 
ఎర్రని దారానికి దాన్ని 
ఎక్కించి మెడలో కట్టుకుంది.
 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం - 10 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:46 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:48 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:50 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:53 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 15-01-2026, 05:27 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:15 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:18 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:19 PM
RE: శక్తి ఆగమనం - 6 - by Uday - 06-02-2026, 04:01 PM



Users browsing this thread: 1 Guest(s)