Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller శక్తి ఆగమనం - 10
#17
*" అతడు అర్థం చేసుకుని ఆ మినిష్టర్ సపోర్ట్ తో శివరాం రెచ్చిపోతున్నాడు 
భూషణ్ నువ్వు ఆవేశ పడకు ముందు వచ్చి నన్ను కలువు
మనం మాట్లాడుకుందాం....
ఎం చేయాలి ఎలా ఆ శివరాం నీ దెబ్బ తియ్యాలి అన్నది ప్లాన్
చేద్దాం అని అతడ్ని అక్కడి 
నుండి తన గెస్ట్ హౌస్ కి 
పిలిపించి మంతనాలు
చేస్తూ
మందు మీద దృష్టి పెట్టారు 
అంతా శివరాం పై రగిలిపోతూ
ప్లాన్ చేస్తున్నారు...
 
ప్రస్తుతం భూషణ్ తెలివి
లేనంత తాగాడు అంతలో
అతనికి
  ఇందు విషయం
గుర్తు వచ్చింది.... 
టైం లేదు ఇవ్వాల్టి కి 
డ్రైవర్ యాది నీ వెళ్ళమని
చెప్పి పంపించి. 
అతడితో తన మనుషులని ఉండమని చెప్పాడు....!
 
*"" భూషణ్ అంటున్నాడు...
శ్రీనివాసులు....
ముందు ఆ హరిబాబు
సంగతి చూడాలి
వాడి పదవి వూడకొడితే
ఈ శివరాం రెక్కలు
రాలిపోతాయి అని అటుగా 
ఎత్తు వేస్తు చెప్పాడు. 
 
*"శ్రీనివాసులు కూడా 
హరిబాబు పై నిప్పులు చేరుగుతు వీడికి పదవి రావడం 
పట్టలేనట్టు గా ఉంది 
అంతా వాడి ఇష్టానికి 
చేస్తున్నాడు
నా పనులకు కూడా వాడు అడ్డు వస్తున్నాడు.
నిన్న మొన్నటి దాకా నన్ను
అన్నా అన్నా అని అనేవాడు
ఇప్పుడు పేరు పెట్టిపిలుస్తున్నాడు.... 
అంతా పదవి గర్వం.
 
*"" అందుకే అంటారు.... 
యదవలకి పదవలిచ్చిన 
గుర్రానికి రెక్కలొచ్చి న 
పట్టలెం.....!
 
అని...
ముందు వాడి పదవి ఊడకొట్టాలి
ఆ పదవి నీకు వచ్చేలా
చేయాలి అందుకు
నువ్వు కాస్త పైకం వదులుకోవాలి
ఎలాగూ ఎన్నికలు 
రాబోతున్నాయ
అక్కడ చూసుకుందాం 
వాళ్ళ సంగతి 
ఏమంటావ్ భూషణ్ అని శ్రీనివాసులు అడిగాడు...?????
 
*'' భూషణ్ ఇంత వరకు పొలిటీషియన్ సపోర్ట్ తో
బిజినెస్లు రన్ చేస్తు వచ్చాడు 
కానీ ఇప్పుడు
భూషణ్ కి పొలిటీషియన్
అవ్వమని సలహా
ఇచ్చాడు శ్రీనివాసులు.
 
అంతే తానే ఎమ్మెల్యే అయితే తనకున్న స్టేటస్ తో బ్యగ్రౌండ్ తో మినిస్ట్రీ కొట్టేయడం పెద్ద కష్టం
కాదు అప్పుడు
ఆ శివరాం ఎం 
చేస్తాడో.... చూస్తాను
నన్ను చూసి ఎలా ఎడుస్తాడో 
ఎంత కుల్లిపోతాడో
ఈ మేయరమ్మ నాకు
భయపడదట చూస్తాను
ఎలా భయ పడదో అని
వాళ్ళని తలచి నవ్వుకుంటూ.... శ్రీనివాసులు తో చేతులు
కలిపి నా ఎంత కర్చు అయినా నేను పెడతాను
ఎమ్మెల్యే కి నేను పోటీ చేస్తాను
ఆ హరిబాబు నాకు అడ్డు
వచ్చి శివరాం కి సాయం
చేసినందుకు అనుభవిస్తాడు... 
నేను వాడి పదవి లాక్కుంట
అని అతడికి ఆపోజిట్ గా
పోటీ చేసేందుకు ఆమోదం
తెలిపాడు. 
 
*"అంతే... శ్రీనివాసులు చక్రం తిప్పుతూ  
పార్టీ అధిష్టానం తో
మీటింగ్ కి ఏర్పాట్లు
చేస్తున్నాడు. 
 
*'భూషణ్ దగ్గర చాలా డబ్బు
ఉంది సో ఎలా అయినా 
గెలుస్తాడు అందుకే పార్టీ టికెట్
ఈజీ గా వస్తుంది అని ధీమా
వ్యక్తం 
చేశాడు.. 
వాళ్ళ ఆలోచన బైటకు 
వెళ్లకుండా శ్రీనివాసులు
జాగర్తలు తీసుకుంటూ
ఉన్నాడు.
 
భూషణ్ కూడా సమయం
వచ్చే వరకు విషయం బైట
పెట్టను అని తను
రాజికియ్యాల్లోకి రాబోతున్నాడు అన్న విషయం ఇంట్లో వాళ్ళకి 
కూడా చెప్పకూడదు అని 
నిర్ణయం తీసుకుని అతడి మనుషులు తన మాట
జవదాటరని నమ్మకం తో
ఇంటికి తిరిగి వెళుతున్నాడు.
*""
 
*"" వాళ్ళకంటే ఒక అడుగు 
ముందు ఉన్న శివరాం 
కాంట్రాక్ట్ భూషణ్ కి కాకుండా చేశాను అని సంతోష పడుతూ హరిబాబు తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాడు... 
అలాగే దెబ్బ తిన్న భూషణ్ 
ఇప్పుడు ఎం చేయబోతున్నాడో
అని సందేహ పడుతూ వాడి
నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నాడు శివరాం.
 
*"" యాది కార్ డ్రైవ్ చేస్తూ
ఉంటే ఇందు విండో నుంచి 
బైట కి చూస్తూ.... 
త్వరగా ఇంటికి చేరుకుంటే 
చాలు అని లోలోపల భయపడుతూ.... 
కూర్చుని ఉంది.
 
*""వాళ్ళని సిద్దు... తన కార్ తో ఫాలో చేస్తూ...వస్తున్నాడు... 
కొంత దూరం వెళ్ళాక... ఎప్పటిలా.... సిద్దు... 
ముందు కొన్ని సింటంస్ 
కనిపిస్తూ ఉన్నాయి... 
అతడి చేతులు చమట పడుతుంటే.... 
కాళ్ళు వణుకుతూ 
ఉన్నాయి... అతడికి 
తెలుస్తుంది... ఆ లైట్.....
అతడి ముందుకు రాబోతుంది
అని సిద్దు కంగారుగా....
ఓహ్ నో.... ఇప్పుడా...
వద్దు ప్లీజ్....అని కార్ స్లో చేస్తున్నాడు 
కానీ ఎదో తెలియని శక్తి...అక్కడంతా
అలుముకొని అతడికి
మార్గం కనిపించకుండా కమ్ముకుంది...!!
 
ఒక్కసారిగా సిద్దు కార్ స్టీరింగ్ వదిలేశాడు...
చివరిగా బ్రేక్ పై కాలు వేసి...
ముందుకు వెళుతున్న కార్ ఆపగలిగాడు 
కానీ ఆ వెలుగు నుండి తప్పించు కోలెక పోయాడు...
కొన్ని క్షణాలు ఆ కాంతి
కిరణాలు సిద్దు నీ కవచం లా
చుట్టేసి..అతడిలో ఉన్న శక్తి
నంతా తీసుకున్నట్టు
చేసి అదృశ్యం అయ్యింది. 
 
అంతే సిద్దు పూర్తి నిస్సత్తువ ఆవహించి నట్టు అయిపోయి
సొమ్మసిల్లి పడిపోయాడు. 
 
 
*""ఇందు ఉన్న కార్ ముందుకు దూసుకు పోయింది. 
ఒక ప్రదేశం కి చేరుకున్న వెంటనే
కార్ సడన్ గా ఆగిపోయింది.
ఉన్నట్టుండి కార్ ఆగిపోవడం
తో ఇందు భయం గా 
ఉలిక్కి పడి ఏమైంది యాది ఎందుకు కార్ ఆపావ్ అని అడిగింది. 
 
*""యాది ఏమి అర్ధం కానట్టు
చాలా సార్లు కార్ స్టార్ట్ చేసి
ఆ కార్ స్టార్ట్ అవ్వక ఇందమ్మా నాకు ఎం తెలియడం లేదు... 
ఉండండి చూస్తాను 
అని కార్ దిగాడు
 
*""ఇందు కి భయం
ఎక్కువయింది త్వరగా
యాది చీకటి పడింది
ఇంటికి వెళ్ళాలి అని 
చెబుతూ ఉంటే 
అతడు ఎంత అమ్మా 
రెండు నిముషాలు అని చెప్తూ 
కార్ బో నెట్ ఓపెన్ చేసాడు చూడబోతే రేడియేటర్ వేడెక్కి ఆవిర్లు వస్తున్నాయి 
విచిత్రం గా కొత్త కారు
అందులోనూ అసలు ఎక్కువ వాడింది లేదు సర్వీసింగ్ చేయాల్సిన సమయం ఇంకా రాలేదు అలాంటిది 
ఉన్నట్టుండి ఇలా పొగలు
రావడం ఎంటి అని చెక్ చేసి 
వాటర్ పోస్తే సరిపోతుంది 
అనుకుని ఇందుఅమ్మ
రెండు నిముషాలు ఇక్కడ
దగ్గర్లో వాటర్ ఉంటే తీసుకు వస్తాను మీరు కార్ లోనే 
ఉండండి అని చెప్పి
ఆమె చెప్తున్న వినిపించు
కొకుండా వెళ్లిపోయాడు.
 
*" అంతే ఇందు గుండె 
దడదడ కొట్టుకోవడం
మొదలైంది
చూస్తుంటే చుట్టు ప్రక్కల 
ఎవరు లేనట్టు ఉంది 
నిర్మానుష్య 
ప్రదేశంలో ఆ కార్
ఆగింది 
ఆమెకు ప్రాణం 
వణికిపోతుంది.... 
ఎదో ప్రమాదం రాబోతుంది 
అని అర్థం అవుతుంది.... 
ఆమె దేవి మాత స్తోత్రమ్ 
పటించాలి అని ప్రయత్నిస్తూ 
ఉంది కానీ గొంతు పెగలడం 
లేదు... 
నోట మాట రావడం 
లేదు చేతులు
వణుకుతుంటే 
ఆమె పక్కన ఉన్న
బ్యాగ్ లో
 మొబైల్ అందుకుని 
తన
వాళ్ళ కి ఫోన్ చేయాలి
అనుకుంది కానీ
అందుకు 
అవకాశం లేకుండా....
పోయింది.
 
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
శక్తి ఆగమనం - 10 - by k3vv3 - 19-11-2025, 06:08 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 20-11-2025, 09:46 AM
RE: శక్తి ఆగమనం - by anaamika - 20-11-2025, 12:16 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 10-12-2025, 09:32 AM
RE: శక్తి ఆగమనం - by Uday - 10-12-2025, 02:21 PM
RE: శక్తి ఆగమనం - by k3vv3 - 01-01-2026, 09:35 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 09:39 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 01-01-2026, 10:00 PM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:28 AM
RE: శక్తి ఆగమనం-1 - by k3vv3 - 08-01-2026, 09:29 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 08-01-2026, 09:31 AM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:46 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:48 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:50 PM
RE: శక్తి ఆగమనం-2 - by k3vv3 - 15-01-2026, 03:53 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 15-01-2026, 05:27 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:15 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:18 PM
RE: శక్తి ఆగమనం-3 - by k3vv3 - 22-01-2026, 07:19 PM
RE: శక్తి ఆగమనం - 6 - by Uday - 06-02-2026, 04:01 PM



Users browsing this thread: 1 Guest(s)