15-01-2026, 07:47 AM
ఎపిసోడ్ 28
బామ్మ ద్వారా అభిర్ దళం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంది నీలమ్.
సుజిత్ ప్రాపర్టీ డీల్ చేసినా విషయం తెలుసుకుని, కొంత తక్కువ రేటుకి మనం ఒప్పుకోకూడదు అని ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పాడు రఘురామ్.
**********************
ఇంటిదగ్గర పక్షాలకి ఆహారం పెట్టి లోపలికి వెళ్ళిన అభిర్ రెడీ అయ్యి బయటకు వచ్చి, అక్కడ ఉన్న పక్షులతో ఆడుతున్న వసుంధర వాళ్ళ వైపు చూసి
"మేడం! నేను ఒకసారి బయటికి వెళ్లి వస్తాను." అని చెప్పాడు అభిర్.
ఆ మాటకి నవ్వుతూ "అభిర్! నీ మీద ఉన్న కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ ఎక్కడికైనా వెళ్ళచ్చు, నా పర్మిషన్ అవసరం లేదు." అని చెప్పింది వసుంధర.
"మేడం! మీ ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. నేను లాయర్ హిరణ్య ఇంటి వెళ్లి ఒకసారి కలిసి వస్తాను." అని చెప్పాడు అభిర్.
ఆ మాట విని "నో అభిర్! నువ్వు తన ఇంటికి వెళితే కావాలని ఏదో ఒక కేసులో ఇరికిస్తాడు." అని కంగారుగా చెప్పింది నీలమ్.
అభిర్ దగ్గరికి వస్తూ "ఆ హిరణ్య నువ్వు మాట్లాడితే మంచివాడుగా మారతాడు అనుకుంటున్నావా? వాడు చాలా పెద్ద వెధవ!" అని చెప్పాడు సందీప్.
"సార్! మనిషిని మార్చడానికి దేవుడే దిగిరానవసరం లేదు మన ప్రయత్నం మనం చేయాలి." అని చెప్పాడు అభిర్.
"సరే! నేను హిరణ్యకి ఫోన్ చేసి వస్తున్నామని చెప్తాను అతను ఓకే అంటే వెళదాము లేకపోతే లేదు, నీతో పాటు నేను కూడా వస్తాను." అని చెప్పింది వసుంధర.
"సరే మీ ఇష్టం! కానీ అక్కడ నేను మాత్రమే మాట్లాడతాను." అని చెప్పాడు అభిర్.
"ఓకే నో ప్రాబ్లం!" అని చెప్పి ఫోన్ తీసి హిరణ్య కి కాల్ చేసింది వసుంధర.
ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే లాయర్ గారు! మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, విషయం ఏమిటో చెప్పండి? మీరు భయపడలేదు కదా!" అని వెటకారంగా అడిగాడు హిరణ్య.
"ఒక్కసారి పర్సనల్గా మీట్ అవ్వాలి, మీతో అభిర్ మాట్లాడాలి అంటున్నాడు భయపడి మాత్రం కాదు." అని కోపంగా చెప్పింది వసుంధర.
"ఓకే! వెల్కమ్ మై హోమ్! నేను వచ్చినప్పుడు మీరు డిసప్పాయింట్ చేశారు, కాని మిమ్మల్ని డిసప్ పాయింట్ చేయను." అని చెప్పాడు హిరణ్య.
"ఓకే థాంక్యూ!" అని చెప్పి ఫోన్ పెట్టేసి అభిర్ వైపు చూసి "వెళదామా?" అని అడిగింది వసుంధర.
"వదిన! మీతో పాటు నేను కూడా వస్తాను." అని చెప్పింది నీలమ్.
అంతలో అక్కడికి వస్తున్న శంకర్ ని చూసి "తనని కూడా తీసుకెళ్లండి తోడుగా ఉంటాడు." అని చెప్పాడు సందీప్.
"అభిర్ దళ నాయకుడికి తోడు అవసరం లేదు, రథసారథి మాత్రమే కావాలి." అని చెప్పింది బామ్మ.
ఆ మాట విని "బామ్మా! మేము వెళ్ళేది మాట్లాడడానికి ఫైటింగ్ కాదు." అని నవ్వుతూ చెప్పింది నీలమ్.
"ఆవిడ అలాగే మాట్లాడుతుంది లే కానీ, శంకర్ నువ్వు తాళాలు తీసుకొచ్చి కార్ స్టార్ట్ చెయ్ వెళదాము." అని చెప్పింది వసుంధర.
"ఓకే మేడం!" అని సందీప్ దగ్గర ఉన్న తాళాలు తీసుకుని కార్ స్టార్ట్ చేసాడు శంకర్.
కారు ఎక్కుతున్న వసుంధర దగ్గరికి వెళ్లి, "ఇప్పుడు వెళ్లడం అవసరమా?" అని అడిగాడు సందీప్.
"దీంట్లో ఏముంది నార్మల్ గా మాట్లాడడానికే కదా, అభిర్ లాయర్ గా నేను పక్కన వెళుతున్నాను, రేపు మళ్లీ తనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు." అని చెప్పి కార్ ఎక్కింది వసుంధర.
"అన్నయ్య! ఎందుకు కంగారు పడుతున్నావు?" అని చెప్పి కార్ ఎక్కి శంకర్ వైపు చూసి "లాయర్ హిరణ్య ఇంటికి వెళ్ళు!" అని చెప్పింది నీలమ్
ఆ మాటకి ఆశ్చర్యంగా వసుంధర వైపు చూసి "మేడం! ఇప్పుడు అక్కడికెందుకు?" అని డౌట్ గా అడిగాడు శంకర్.
"ఈరోజుతో గొడవలన్నీ సమసి పోవాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అందుకని వెళుతున్నాము." అని చెప్పింది వసుంధర.
"ఓకే మేడం!" అని ముందుకు వెళుతూ సీరియస్ గా ఉన్న అభిర్ వైపు చూశాడు శంకర్.
*********
కాసేపటికి ఇంటి ముందు కారు ఆగడంతో దిగుతున్న వసుంధర వాళ్ళని చూసి "వెల్కమ్ మేడం! మీ కోసమే వెయిట్ చేస్తున్నాను." అని లోపలకి తీసుకువెళ్లి భార్యని పిలిచి పరిచయం చేసి కూర్చోవడానికి సోఫా చూపించాడు హిరణ్య.
సోఫాలో కూర్చుంటూ "అభిర్ మీతో మాట్లాడాలి అన్నాడు అందుకనే వచ్చాము." అని చెప్పింది వసుంధర.
వర్కర్ తెచ్చిన కాఫీ ఆఫర్ చేస్తూ అభిర్ వైపు చూసి "మీ మీద జరుగుతున్న ఎటాక్ లకు భయపడి ఇక్కడకు వచ్చారని నాకు బాగా తెలుసు!
ఆ ఎటాక్ లు ఆగాలి అంటే నువ్వు, మురళి జోషి భార్య ఏం చేయాలో మీకు బాగా తెలుసు కదా!" అని చెప్పాడు హిరణ్య.
"అసలు! ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారో తెలియకుండానే నేను మాట్లాడడానికి వచ్చాను." అని నవ్వుకుంది వసుంధర.
"మేడం! ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోకపోవడమే మీకు మంచిది. ఆ విషయం అభిర్ కి కూడా బాగా తెలుసు, అందుకనే ఇక్కడికి వచ్చాడు." అని వెటకారంగా చూసి నవ్వేడు హిరణ్య.
"మమ్మల్ని జూ దగ్గర చంపాలని చూసింది కూడా మీరేనా?" అని అడిగాడు అభిర్.
"నేను అంటే నేను కాదు, నా వెనకాల ఉన్న పెద్ద మనిషి ఆర్డర్!" అని చెప్పాడు హిరణ్య.
ఆ మాట విని కోపంగా చూస్తూ 'అసలు వీడు లాయర్ ఎనా ఎంత పబ్లిక్ గా చెబుతున్నాడో సిగ్గు లేదు.' అని మనసులో అనుకుంది నీలమ్.
కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ "లాయర్ గారు! మీ పెద్దమనిషికి ఒక్కసారి కాల్ చేసి, ఈరోజుతో అబీర్ అజ్ఞాతవాసం వీడి బయటకి వచ్చాడు అని చెప్పండి." అన్నాడు అభిర్.
ఆ మాటకి అయోమయంగా చూస్తూ "నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు, ఆ మాట చెబితే ఈ కేసు సెటిలైపోయినట్టేనా?" అని అనుమానంగా అడిగాడు హిరణ్య.
"నేను చెప్పిన మాట ముకుల్ నంద కి చెప్పండి." అని కోపంగా చూస్తూ చెప్పాడు అభిర్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఈ కేసు వెనకాల ఉంది నంద గ్రూప్ చైర్మన్ ముకుల్ నందగారా?" అని అనుమానంగా అడిగింది వసుంధర.
"అభిర్! ఆయన పేరు బయటకు చెప్పి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు." అని ఆవేశంగా చెప్పాడు హిరణ్య.
"లాయర్ గారు ఏ విషయమైనా మాట్లాడుకునేటప్పుడు ఇరుపక్షలు వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకోవడం ఉత్తమం మీకు ఆ విషయం కూడా తెలియదా? ఇప్పటికైనా పేరు చెప్పి అభిర్ మంచి పని చేశాడు." అని చెప్పింది వసుంధర.
"నా గురించి నీకు తెలియదు అభిర్! ఆయన పేరు బయటకు వచ్చింది అంటే, ఈ విషయంలో చాలా దూరం వెళ్తాను, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళ ముందు నువ్వు ఒక చీపిరి పుల్ల ఆ విషయం తెలుసుకో!" అని వార్నిగ్ ఇచ్చాడు హిరణ్య.
"నా గురించి నీకు తెలుసా!" అని అడిగాడు అభిర్.
"నీ గురించి తెలుసుకోవాల్సిన అంత పెద్దవాడివి ఏమీ కాదులే, 12 సంవత్సరాలు జైల్లో ఉన్న నిన్ను చూడ్డానికి ఒక్కడు కూడా రాలేదు." అని వెటకారంగా అన్నాడు హిరణ్య.
"నువ్వు చేసిన మొదటి తప్పు అదే! నా గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం." అని చెప్పాడు అభిర్.
"నీ గురించి తెలుసుకోవడానికి ఏముంది? ప్రాణాలతో ఉండాలి అంటే కాంప్రమైజ్ చేసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో!" అని పొగరుగా చెప్పాడు హిరణ్య.
"నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే రేపటి నుంచి కోర్టుకి వెళ్లకూడదు, నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం నీవల్ల నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాలి, ఇది అభిర్ ఆజ్ఞ!" అని హిరణ్య కళ్ళలోకి చూస్తూ సూటిగా చెప్పాడు అభిర్
కోపంతో ఉన్న అభిర్ కళ్ళ వైపు చూసి కంగారు పడి "ఏంటి ఈ హిరణ్యనే బెదిరిస్తున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలియదు, మీ మేడంని అడుగు చెబుతారు." అని చెప్పాడు హిరణ్య.
"నా గురించి కూడా నీకు తెలియదు కదా హిరణ్య! రేపు కోర్టుకు వెళ్లడానికి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టు అప్పుడు నా గురించి తెలుస్తుంది." అని చెప్పాడు అభిర్.
ఆ మాటకి అభిర్ వైపు చూసి "మనం ఇక్కడికి సెటిల్ చేసుకోవడానికి వచ్చాము." అని చెప్పింది వసుంధర.
"అవును మేడం! నేను సెటిల్మెంట్ చేస్తున్నను." అని హిరణ్య భార్య వైపు చూసి "మీ భర్త బతికి ఉండాలి అంటే కోర్టుకు రాకూడదు." అని చెప్పాడు అభిర్.
ఆ మాట విని హిరణ్య వైపు భయంగా చూస్తూ "ఏంటండీ ఇది, అసలు ఎవరి ఈ అబ్బాయి? ఎందుకైనా మంచిది ఒకసారి ముకుల్ గారికి ఫోన్ చేసి, ఆ అబ్బాయి చెప్పమన్నట్లు చెప్పండి. అప్పుడు విషయం అర్ధం అవుతుంది కదా!" అని కంగారుగా చెప్పింది భార్య.
"అతని మాటలు ఏం పట్టించుకోకు బెదిరించాలని చూస్తున్నాడు." అని కంగారుగా ముకుల్ కి కాల్ చేశాడు హిరణ్య.
ఫోన్ లిఫ్ట్ చేసి "హిరణ్య టెల్ మీ? ఈ టైంలో ఫోన్ చేసావు ఏంటి?" అని అడిగాడు ముకుల్.
ఫోన్ టేబుల్ మీద పెట్టి స్పీకర్ ఆన్ చేసి "సార్! జైలు నుంచి రిలీజ్ అయిన అభిర్, మీతో ఒక మాట చెప్పమన్నాడు అందుకే కాల్ చేశాను." అని చెప్పాడు హిరణ్య.
"అవునా? ఏం చెప్పమన్నాడు?" అని నెమ్మదిగా అడిగాడు ముకుల్
"తను అజ్ఞాతవాసంలో నుంచి బయటకు వచ్చాను అని చెప్పమన్నాడు." అని చెప్పి, రిప్లై రాకపోయేసరికి "సార్ సార్! లైన్ లో ఉన్నారా?" అని కంగారుగా అడిగాడు హిరణ్య.
ఫోన్ తన వైపుకి జరుపుకొని "ముకుల్ నంద గారు ఈరోజు నుంచి రోజులు లెక్కేసుకోండి. మీ వారసుల చనిపోతూ ఉంటారు." అని చెప్పాడు అభిర్.
"నా వారసును ఇండియాకి రానివ్వను." అని భయంగా చెప్పాడు ముకుల్.
"నీ వారసులు ఈ గడ్డమీద చావాలో లేక పరాయి గడ్డమీద చావాలో నువ్వే డిసైడ్ చేసుకో, ఈ అభిర్ యుద్ధం మొదలు పెట్టాడు నీకు ఇచ్చిన సమయం పూర్తయింది." అని గంభీరమైన గొంతుతో చెప్పాడు అభిర్.
"అభిర్! నేను ఇండియా వస్తాను నన్ను ఏమైనా చేసుకో, నా వారసుల్ని వదిలిపెట్టు నిన్ను వేడుకుంటున్నాను." అని రిక్వెస్ట్ అడిగాడు ముకల్.
"ఈ అభిర్ ఆడిన మాట తప్పడు, చేసిన ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోడు, నీ వారసుల మరణం చూసిన తర్వాతే నీ మరణం!" అని చెప్పాడు అభిర్.
"నా వారసులు బతికి ఉండాలంటే నేనేం చేయాలి, కావాలి అంటే ఇండియాలో ఉన్న నా ఆస్తి మొత్తం తీసుకో, సరిపోకపోతే ఇంకా ఎంత కావాలో చెప్పు ఇస్తాను." అని కంగారుగా చెప్పాడు ముకుల్.
"నేను కోల్పోయింది నాకు కావాలి తిరిగి ఇస్తావా? కుదరదు కదా! అలాగే ఇది కూడా కుదరదు." అని చెప్పి తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న వసుంధర వాళ్ళ వైపు చూసి
"మేడం! మాట్లాడడం అయిపోయింది ఇంకా వెళదామా?" అని చెప్పి అక్కడి నుంచి లేచి కారు దగ్గరికి వెళ్ళాడు అభిర్.
"అభిర్! అభిర్! " అని ఫోన్లో అరుస్తున్న ముకల్ మాట విని "సార్ అతను ఇక్కడ లేడు వెళ్లిపోయాడు, అయ్యినా మీరు ఎందుకు సార్ కంగారు పడుతున్నారు, నన్ను కూడా కోర్టుకు వెళితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు వాడు ఏం చేయగలడు." అని అడిగాడు హిరణ్య.
"నువ్వు బతికి ఉండాలంటే రేపటి నుంచి కోర్టుకు వెళ్ళకు అభిర్ చెప్పింది చేయ్, అతను ఒక్కడు కాదు, అతని సైన్యం అన్నిచోట్ల ఉంటారు.
నీ డ్రైవర్, నీ పని వాడు, లేక నీతో పాటు ఉన్న వారు ఎవరైనా సరే అతని మనిషి అవ్వచ్చు, ఏ క్షణమైనా నిన్ను చంపేయొచ్చు, కాబట్టి అతను చెప్పిన మాట విని బ్రతుకు ఎదురు చెప్పకు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.
ఆ మాట విని వణుకుతూ అక్కడ ఉన్న పని వాళ్ళ వైపు భయంగా చూస్తూ ఉన్నాడు హిరణ్య.
ఫోన్లో ముకుల్ చెప్పింది విని, ఒకరి మోకాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంగా బయటికి వచ్చారు నీలమ్, వసుంధరలు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)