Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#75
ఎపిసోడ్ 27


అభిర్ గురించి బామ్మ చెప్పడం విని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.

***********************

బామ్మ అడిగిన దానికి "అవును!" అని సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయాడు అభిర్.

అభిర్ వైపు చూస్తూ ఉన్న బామ్మ దగ్గరికి వచ్చి

"బామ్మ! శివాజీ మహారాజ్ చరిత్ర చాలాసార్లు చదివాను, ఆయన దగ్గర ఉన్న వీరుల గురించి కూడా తెలుసుకున్నాను, కాని అభిర్ దళం గురించి నేనెప్పుడూ వినలేదు." అని డౌట్ గా అడిగింది నీలమ్.

"శివాజీ మహారాజ్ భవాని మాత భక్తుడు ఆయన ప్రతి యుద్ధం ముందు ఆ మాత దర్శనం చేసుకుని పూజించి బయలుదేరేవారు.

ఒకరోజు భవాని మాత శివాజీ మహారాజ్ ముందు ప్రత్యక్షమై ధర్మపరీరక్షణ కోసం చంద్రహాస్ అని పిలవబడే  ఒక కత్తిని, ఆ మాత అంశతో పుట్టిన అడవి బిడ్డలైన అభిర్ దళాన్ని కూడా తోడుగా ఇచ్చారని చెబుతూ ఉంటారు.

అభిర్ దళంలో ప్రతి ఒక్కరూ మహా వీరులు, వారి నాయకుడుగా ఎన్నుకున్న వ్యక్తికి అప్పటి వరకు ఉన్న పేరు మార్చి అభిర్ అని పిలుస్తారు, ఆ నాయకుడికి కొన్ని శక్తులు కూడా ఉంటాయని అనుకునేవారు.

ఆ అభిర్ దళం గూఢచారులుగా ఉండి శివాజీ మహారాజ్ కి సహాయం చేసే వారిని, ఎటువంటి సమాచారం అయినా ఎంత దూరం నుంచి అయినా జంతువుల ద్వారా  పంపించేవారని చెబుతూ ఉంటారు.

అభిర్ దళం గురించి శివాజీ మహారాజ్ కి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి తప్పితే మిగతా వారికి కూడా తెలియదు అని చెబుతూ ఉంటారు.

శివాజీ మహారాజ్ మరణం తర్వాత అసలు అభిర్ దళం అనేది ఒక పుకారు మాత్రమే అటువంటి వారు ఎవరు లేరు అని ప్రచారం జరిగింది.

కాని బామ్రఘడ్ అడవుల్లో అభిర్ దళం వారు నివసిస్తూ ఉండేవారని చెబుతూ ఉండేవారు, కొంతమంది అసలు అటువంటి దళమే లేదని చెబుతారు,

నేను ఒక ఆర్కియాలజిస్ట్ ని పురావస్తు తవ్వకాలలో  బీజాపూర్ దగ్గర ఉన్న కోటలో కొన్ని పుస్తకాలు బయటపడ్డాయి వాటి మీద రీసెర్చ్ చేశాను, అవి శివాజీ మహారాజ్ తల్లి జిజియా బాయ్ రాసుకున్న పుస్తకాలు అని తేలింది.

ఆ పుస్తకాల్లో అభిర్ దళం గురించి ప్రత్యేకంగా రాసి ఉంది. ఆ నాయకుడి చేతి మీద ఉండే ముద్ర కూడా నేను ఆ పుస్తకంలోనే చూశాను, కాని అభిర్ దళం గురించి ఆవిడ కూడా బయటికి తెలియకూడదు అని అనుకున్నారు.

అందుకే నేను ఈ విషయాలు ఎవరికి చెప్పకుండా నా మనసులోనే ఉంచుకున్నాను, కానీ ఇప్పుడు ఆ బాబు చేతి మీద గుర్తు చేసిన తర్వాత అడగాలి అనిపించింది." అని చెప్పింది బామ్మా.

"థాంక్యూ బామ్మ! తెలియని విషయాన్ని చెప్పావు." అని దూరంగా ఉన్న అభిర్ వైపు చూసి 'మరి అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడ ఇలా ఎందుకు ఉన్నాడు, తన మనుషులు మొత్తం ఏమైపోయారు, అసలు ఈ కేసులో తనని ఇరికించిది ఎవరు? వాళ్లకి అభిర్ కి సంబంధం ఏమిటి? ఎలాగైనా తెలుసుకోవాలి." అని మనసులో అనుకుంది నీలామ్.

*************************

అదే సమయంలో  మిచెల్ ఇంటిదగ్గర ఫోన్ రింగ్ అవుతూ ఉండడం చూసి లిఫ్ట్ చేసి "హలో లాయర్ గారు నేను మిచల్ మనిషి చంటిని మాట్లాడుతున్నాను." అని చెప్పాడు.

"మీ బాస్ ఎక్కడ అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇవ్వు!" అని అడిగాడు హిరణ్య.

"ఒక్క నిమిషం సార్! ఆయన లోపల మెడిటేషన్ లో ఉన్నారు." అని ఫోన్ తీసుకెళ్లి నెత్తి మీద దుప్పటి కప్పుకుని ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉన్న మిచల్ దగ్గరికి వెళ్లి

"బాయ్! లాయర్ గారు ఫోన్ చేశారు అర్జెంటుగా మాట్లాడాలి అంట!" అని ఫోన్ ఇచ్చాడు చంటి.

ఫోన్ తీసుకుని "హలో లాయర్ గారు అసలు ఆ అభిర్ ఎవరు?" అని అడిగాడు మిచల్.

"నువ్వు ఆ మాట డబ్బులు తీసుకునే ముందు అడగాలి, ఇప్పుడు అడిగి ప్రయోజనం ఉండదు, ఇంతకీ ఏం చేసావు? ఆ జనార్ధన్ ఎక్కడ ఉన్నాడు? ఫోన్ కూడా ఎత్తడం లేదు." అని డౌట్ గా అడిగాడు హిరణ్య.

"ఆ.. జనార్ధన్ పెద్దపులి నోట్లో ఉన్నాడు, న్యూస్ చూడరా తమరు!" అని జూలో జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు మిచల్.

"అవునా?" అని షాక్ అయ్యి "అసలు అలా ఎలా జరుగుతుంది. అభిర్ మాట జంతువులు ఎందుకు వింటాయి? ఒకవేళ మీరు మందు తాగి జూకి వెళ్ళారా ఏంటి?" అని అడిగాడు హిరణ్య.

"నేను పనిలో ఉన్నప్పుడు మందు వేయను ఆ విషయం మీకు కూడా తెలుసు! వాడి మాట జంతువులు వింటే నా మాట మనుషులు వింటారు, మీరేం కంగారు పడకండి ఫస్ట్ వాడిని చంపిన తర్వాత దానిని చంపుతాను." అని కోపంగా చెప్పాడు మిచల్.

"సరే! ముకుల్ గారి దగ్గరనుంచి ఫోన్ రాకముందే పని అయిపోతే బెటర్!" అని చెప్పాడు హిరణ్య.

"సరే! సరే! ఫోన్ పెట్టండి ఈ రోజు రెస్ట్ మోడ్ లో ఉన్నాను ఏదైనా రేపటి నుంచి మొదలవుతుంది." అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మిచల్.

***********************

అదే సమయంలో రాజన్, రియాతో కలిసి సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు ఇంటికి వెళ్ళాడు సుజిత్.

కారు దిగుతున్న సుజిత్ ని చూసి "వెల్కమ్ బాబు నీకోసమే వెయిట్ చేస్తున్నాను." అని తన పక్కన ఉన్న వ్యక్తిని చూపించి  "వీడు నాకు కొడుకు తంబీయర్! నా రాజకీయ వారసుడు కూడా." అని పరిచయం చేశాడు వరదరాజులు.

"హాయ్!' అని తంబీయర్  షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు సుజిత్.

ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటు "ఆ.. సుజిత్ ఇప్పుడు చెప్పు ప్రాపర్టీ  గురించి ఏమీ చేద్దాము." అని అడిగాడు వరదరాజులు.

రాజన్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని చూపిస్తూ "అంకుల్! ఈ ప్రాపర్టీ వ్యాల్యూ 2500 క్రోర్స్ అది మీకు మాత్రమే, బయట మార్కెట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు నాకు తెలుసు, మన మధ్య ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని నేను ఈ ఆఫర్ మీకు ఇస్తున్నాను." అని చెప్పాడు సుజిత్.

"ఎస్ ఎస్! ఈ డీల్ నాకు ఓకే! కానీ రిజిస్ట్రేషన్ కి ముకుల్ గారి ఫ్యామిలీ మొత్తం రావాలి." అని చెప్పాడు వరదరాజులు.

"కచ్చితంగా వస్తారు అంకుల్! లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు కదా!" అని చెప్పాడు సుజిత్.

"సుజత్! అక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ఫ్యామిలీలో ఎవరు 12 సంవత్సరాలుగా ఇక్కడికి రాలేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి వస్తారు అని గ్యారెంటీ ఏంటి?" అని అడిగాడు తంబియార్.

"మీకు వచ్చిన డౌట్ కరెక్టే! కానీ ఇప్పుడు అలా కాదు, ఈ డీల్ చేసుకోమని చెప్పిందే నంద సామ్రాజ్యానికి కాబోయే వారసురాలు, ముకుల్ గారి ముద్దుల మనవరాలు అర్ణ!" అని చెప్పాడు సుజిత్.

"ఓకే! నువ్వు ఒకసారి ఆవిడతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని చెబితే అగ్రిమెంట్ చేసుకుందాము." అని చెప్పాడు వరదరాజులు.

"నాకు ఎప్పటినుంచో ఒక డౌట్ ఉంది అసలు ఆ ఫ్యామిలీ ఇండియాకి ఎందుకు రావడం లేదు?" అని అడిగాడు తంబియార్.

"నాకు తెలిసి ఇండియాలో ప్రాపర్టీ సేల్ చేస్తే ఏదో ప్రాబ్లం వస్తుంది అని ముకుల్ గారు చెబుతున్నారు, ఆ ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవడానికి ఒక ప్రాపర్టీ అమ్మడానికి అర్ణ రెడీ అయింది.

ఆ ప్రాబ్లం ఎలాంటిదైనా మీరు ఫేస్ చేస్తారని తను అనుకుంటుంది అందుకే మీకు ఈ ప్రాపర్టీ ఇంత చీప్ గా ఇస్తుంది." అని చెప్పాడు సుజిత్.

ఆ మాట విని "హహహ!" అని నవ్వుతూ "ప్రాబ్లమ్ ని కాలుకింద తొక్కి పట్టడమే రాజకీయ నాయకుల పని దాని గురించి మీరు వర్రీ అవ్వకండి." అని చెప్పాడు వరదరాజులు.

"ఓకే అంకుల్! ఈ డీల్ గురించి నేను అర్ణ తో మాట్లాడి అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుందామో మీకు చెబుతాను మీరు పేమెంట్ రెడీ చేసుకోండి."  అని చెప్పాడు సుజిత్.

"ఓకే డన్! ఆ ప్రాపర్టీ కొనాలని ఎప్పటినుంచో కలలు కంటున్నాను ఇప్పటికీ తీరబోతుంది." అని సంతోషంగా చెప్పాడు వరదరాజులు.

బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అవడంతో "ఓకే అంకుల్ బాయ్!" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు సుజిత్.

***********************

ఆస్ట్రేలియా తన ఆఫీసులో ఉండగా ఫోన్ రింగ్ అవడంతో చూసుకుని 'ఆగస్త్య కాల్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చి ఉంటుంది.' అని ఆత్రుతగా లిఫ్ట్ చేసి "టెల్ మీ అగస్త్య!" అన్నాడు రఘురామ్.

"గుడ్ మార్నింగ్ సార్! సుజిత్ ఇక్కడ ఉన్న ఒక ప్రాపర్టీ  సెంట్రల్ మినిస్టర్ వరదరాజులతో డీల్ చేసుకుంటున్నాడు దాని వ్యాల్యూ 5000 క్రోర్స్ కానీ 2500 కోర్స్ కే సేల్ చేస్తున్నాడు." అని చెప్పాడు అగస్త్య.

"అవునా? అంత తక్కువకి ఎందుకు ఇవ్వడం వెనకాల ఏదైనా కారణం ఉందా?" అని డౌట్ గా అడిగాడు రఘురామ్.

"వరదరాజులు, సుజిత్ ఫాదర్ ఎప్పటినుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ డీల్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, నెక్స్ట్ జరగబోయే డీల్స్లో అతను అండగా ఉంటాడని సుజిత్ భావిస్తున్నాడు." అని చెప్పాడు అగస్త్య.

"నెక్స్ట్ జరిగే డీల్స్ లో అండగా ఉంటాడా? అంటే మమ్మల్ని  పొలిటికల్ వాళ్ళతో బెదిరించి మోసం చేయాలని అనుకుంటున్నారు, అసలు ఈ డీల్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను." థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు రఘురామ్.

"ఓకే సార్ బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆగస్త్య.

ఫోన్ పెట్టేసి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ చేసి కాన్ఫరెన్స్లోకి తీసుకుని  విషయం చెప్పి "ఈ డీల్ కి ఎవరు ఒప్పుకోవద్దు, అర్ణ కాల్ చేస్తే నాతో మాట్లాడమని చెప్పండి." అని చెప్పాడు రఘురామ్.

"ఓకే మావయ్య! అక్కడ అర్ణ కేనా మనుషులు నాకు ఉన్నారు ఈ డీల్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను, అవసరమైతే ఇండియా బయలుదేరి వెళతాను." అని చెప్పాడు విష్ణు.

"మనం కంగారు పడడం ఎందుకు, ఈ డీల్ ఓకే అయితే ఫ్యామిలీ మొత్తం ఇండియా వెళ్ళాలి, దానికి నాన్నగారు ఒప్పుకోవాలి కదా!" అని చెప్పాడు సుభాష్.

"కరెక్ట్! ఇన్ని సంవత్సరాలు ఒప్పుకొని మామగారిని అర్ణ ఎలా ఒప్పిస్తుందో అది చూద్దాము." అన్నాడు రఘురామ్.


[Image: image?pratilipiId=6755373545910185&name=...0&type=jpg]
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 15-01-2026, 07:46 AM



Users browsing this thread: 1 Guest(s)