15-01-2026, 07:33 AM
(This post was last modified: 15-01-2026, 07:41 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 44
అవని ఏడుస్తూ విక్రమ్ చేతిని నుదుటిని అంటించుకుంటుంది. విక్రమ్ కి చాలా కష్టంగా ఉంటుంది. నిన్ను ఎటు వెళ్ళనివ్వకుండా లాక్ చేసేయాలి అనుకుని కళ్ళు మెల్లిగా కదూపుతూ ఉంటాడు.
అవని చూడడం లేదు అని చేతిని ఇంక కుంచెం కదుపుతాడు. అవని కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తోంది.
డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ ఉంటుంది.
బయట ఉన్న డాక్టర్ తల కొట్టుకుని, కంగారుగా లోపలికి వచ్చి ఏమైంది మేడం అని అడుగుతాడు. డాక్టర్ చూడండి విక్రమ్ గారు కళ్ళు కదుపుతున్నారు.
మీ మాటలు కి బాగా రెస్పాండ్ అవ్వుతున్నారు. అలాగే ట్రై చేయండి అని బయటికి వచ్చి శ్రీ పక్కన కూర్చొని మరి ఇంత అమయికురాలు ఏమిటీ రా...
ఇలా ఉంటే వాడు బాగా అడేసుకుంటాడు రా పాపం రా అని జాలిగా అంటాడు. అంటే మీరు డాక్టర్ కాదా అని నేహా అడిగితే...
డాక్టర్ కోట్ వేసుకున్న వాళ్ళు అంత డాక్టర్స్ ఆ ఏమిటి అంటూ శ్రీ వైపు చూసి నీ మేడం కూడ ఆ బాపతే నా అని అడుగుతాడు.
నీకు దండం రా స్వామి కాసేపు నోరు మూసుకో అని నేహా కి ఒక తింగరి స్మైల్ ఇస్తాడు. నేహా వాళ్ళిద్దర్నీ చూసి తల విదల్చుకుని సైలెంట్ గా కూర్చుంటుంది.
అవని విక్రమ్ ఫేస్ దగ్గరగా వచ్చి నా మాట వినిపిస్తుందా అని క్రాక్ వాయిస్ తో అడుగుతుంది.
విక్రమ్ కనురెప్పలు ఆటుఇటు కదుపుతూ స్లో వాయిస్ తో ఎవరు అని అడుగుతూ చేతిని గట్టిగ పట్టుకుంటాడు.
ఏమని చెప్పాలో తెలియక నేను అండి అని ఏడుస్తూ చెబుతుంది. నేను అంటే అని ముక్కలుముక్కలుగా అడుగుతాడు.
మీ భార్య ని అని చెప్పి మనసులో మాత్రం పేరు చెప్పకపోవడమే బేటర్. తరువాత కష్టం అవుతుంది అనుకుంటూ నుదురు మీద వేసిన చేతిని చెంప మీద కి తీసుకు వస్తుంది.
విక్రమ్ మనసులో నీ చావు తెలివి తేటలు నాకు తెలుసు. భార్య అంటే శిల్ప అనుకుంటాను. తరువాత నువ్వు వెళ్లిపోవచ్చు నీ ఆలోచిస్తున్నావు కదా... ఇక్కడ ఉన్నది విక్రమ్.
నీ అంతట నువ్వే అన్ని చెప్పుతావు చూస్తా ఉండు అనుకుని .. నా భార్యవా...మగతగా అడుగుతాడు. అవునండి అని చెబుతోంది.
కొంచెం దగ్గరికి రా అని చెయ్యి పట్టుకుని లాగుతాడు. అబ్బా. ఈ మనిషికి దెబ్బలు తగిలినా సరే ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది అనుకుంటు ఇంకా దగ్గరికి వెళుతుంది.
ఒకరి ఊపిరి ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉంటారు. అవని మాత్రం టెన్షన్ గా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ కి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.
నా భార్యామణివే కదా అని ముద్దు ముద్దుగా అడుగుతాడు. అవును అండి అనగానే ఒక ముద్దు పెట్టు అని అడుగుతాడు.
ఏమిటి ముద్ద అని నోరు వదిలేస్తుంది. ఎంతసేపటికి అవని లో స్పందన రాదు. ఓ నా భార్యవి కాదా కలవరింతలుగా అడుగుతూ ఉంటాడు.
బిపి,,పల్స్ రేట్ మళ్లీ డౌన్ అవుతూ ఉంటాయి. అవి చూడగానే అవిని కంగారుగా డాక్టర్ అని మళ్ళీ అరుస్తూ ఉంటుంది.
మళ్ళీ ఏం జరిగిందో ఏంటో అని డాక్టర్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. ఏమైంది మేడమ్ అని అడగగానే బీపీ డౌన్ అవుతుంది చూడండి అని కంగారుగా చెబుతుంది.
వెంటనే విక్రమ్ ని చెక్ చేస్తూ ఆయన ఎందుకో డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు ఏమైనా రాంగ్ గా మాట్లాడారా...మోటివేషన్ ఇవ్వలేదా అని అడుగుతాడు.
దానికి అవిని ఏమని చెప్పాలో తెలియక అది అని నసుగుతు ఉంటుంది. చూడండి మేడం, విక్రమ్ బ్రతకాలి అనుకుంటే మోటివేట్ చేయండి.
ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పి... బయటకు వెళ్ళిపోయి చైర్ లో కూర్చుని వీళ్ళిద్దరిని కలపడం ఏమో కానీ.. మనకు తెలియని డాక్టర్ వృత్తిలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది రా అని శ్రీ తో అంటూ ఉంటాడు.
నేహా కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగుతూ ఉండండి అని చెప్తుంది థాంక్యూ మిస్ అనగానే.. ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఆ డ్రామా అని అడుగుతుంది.
ఇంకా దారిలోనే ఉంది. మీ ఫ్రెండ్ మరి తాబేలు అనుకుంటా ... అనగానే నవ్వుతూ అది అందరిలాంటి అమ్మాయి కాదు అని చెబుతుంది.
అర్థమైంది అందుకే మా విక్రమ్ పట్టువదలని విక్రమార్కుడు లాగా ప్రయత్నిస్తూఉన్నాడు అని చెబుతాడు. శ్రీ మధ్యలో కూర్చొని నేను ఒకడిని ఉన్నా...
మీరిద్దరూ గుర్తిస్తున్నారా అని అడుగుతాడు. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా.. అసలే తల పగిలిపోతుంది. ముందు కాఫీ తాగినవ్వు అని చెప్పి సైలెంట్ గా కాఫీ తాగుతూ ఉంటాడు.
అవిని కి ఏం చేయాలో తెలియక విక్రమ్ దగ్గరగా వెళ్లి నేను మీ భార్యనే నండి. మీ చేతులతో మీరు తాళి కట్టిన మీ ఇల్లాలిని. నన్ను నమ్మండి అని చెప్పి నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది.
పల్స్ రేటు కొంచెం నార్మల్ అవుతూఉంటుంది. హమ్మయ్య అనుకుని విక్రమ్ గారు మీరు తొందరగానే బాగుఅయిపోతారు అని చాలా సంతోషంగా చెబుతుంది.
భార్య ఎప్పుడూ నుదుటిపైన కాదు పెట్టాల్సింది ముద్దు అని మగతగా చెబుతూ ఉంటాడు. మరి ఎక్కడ పెట్టాలి అండి అని అమాయకంగా అడుగుతూ ఉంటే..
దేవుడా దీనికి అన్ని నేర్పించేటప్పటికి నా పని అయిపోతుంది అనుకుని లిప్స్ పైన పెట్టాలి భార్యామణి అని చెబుతాడు.
ఏంటి లిప్స్ పైన అని ఆశ్చర్య పోతుంది. ఇలాగే వదిలేస్తే మళ్లీ ఊహల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి పల్స్ రేట్ మళ్ళీ డౌన్ చేస్తాడు. అది పడిపోతూ ఉంటుంటే లేదు లేదు ఇస్తాను అని చెప్పి లిప్స్ పైన అంటి అంటక పెదాలను ఉంచుతుంది.
ఇంతకు మించి అవిని ముందుకు వెళ్లలేదని అర్థం అయ్యే విక్రమే గట్టిగా కిస్ చేస్తాడు. అవిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ పైకి లెగవాలని చూస్తూ ఉంటే.. రెండు చేతులతో బంధించి తన పైకి గట్టిగా లాక్కుంటాడు ???.
అవిని కి ఊపిరి ఆడడం లేదు అనిపించినప్పుడు వదిలి కళ్ళు తెరుస్తాడు. విక్రమ్ అమాయకంగా ముఖం పెట్టి అరే అవని గారు మీరేంటి ఇక్కడ...
నా భార్య ఏది... ఇప్పుడే కదా కిస్ చేసింది. ఎక్కడికి వెళ్ళింది. అయినా నా భార్య ఉండాల్సిన ప్లేస్ లో మీరు ఉన్నారు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.
అవిని కి ఏం చెప్పాలో తెలియక దుఃఖం పొంగిపొర్లిపోతూ ఉంటుంది. ఏడుపు నీ ఉగ్గ బట్టుకొని విక్రమ్ వైపు బేలగా చూస్తూ ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.
అవని ఏడుపును చూస్తూ ఉంటే విక్రమ్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తను తగ్గితే అవని నోటి నుంచి నిజాలు రావు అని చెప్పండి అవని గారు అంటూ బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు.
అవని వెంటనే విక్రమ్ చాతి పైన చెయ్యి వేసి రుద్దుతూ మీరు ఆవేశపడకండి అంటూ కంగారుపడుతూ ఉంటుంది.. నేను అడిగిన దానికి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు అని...
ఉంగరం చూసి అదేంటి ఇది నా భార్య కి నేను పెట్టిన ఉంగరం కదా... మీ దగ్గరికి ఎలా వచ్చింది మెడలో ని నల్లపూసలు చైన్ కూడా పైకి లాగి ఇది కూడా నేను నా భార్యకి వేసింది మీ మెడలోకి ఎలా వచ్చింది అడుగుతాడు.
అవిని పొద్దుటి నుంచి పడుతున్న కంగారులో నల్లపూసలు లోపలికి వేసుకోవడం మర్చిపోతుంది. అది ఇప్పుడు విక్రమ్ కళ్ళల్లో పడుతుంది.
ఏం చెప్పాలో తెలియక అవిని టెన్షన్ పడుతూ ఉంటే ఇక విక్రమ్ లాభం లేదు అని పల్స్ రేట్ మళ్లీ డౌన్ చేస్తూ బ్రీతింగ్ ఇబ్బందిగా తీసుకుంటూ ఉంటాడు.
నిజం మాత్రమే చెప్పు అవని అని చాలా కష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. అవని ఇక నిజం చెప్పక తప్పదు అని కన్నీళ్ళతో విక్రమ్ వైపు చూస్తూ మీరు తాళి కట్టింది నాకే అని తడబడుతూ చెబుతుంది.
వాట్ ఏమంటున్నావ్ అవని నీకు నేను తాళి కడితే నా భార్య గా అక్కడ ఉన్నది ఎవరు.. పెళ్లి అయినప్పటి నుంచి నాతోనే ఉంది కదా...మధ్యలో ఎలా మారుతారు అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు.
అవని ఇంకా జరిగిందంతా చెప్పక తప్పదు అని వాళ్ల పెళ్లి రోజు నుంచి శోభనం రోజు వరకు జరిగిందంతా చెప్పి తలదించుకుంటుంది.
ఇందులో నీ తప్పు ఏముంది అని తలదించుకుంటున్నావు అవని అని తన చేతికున్న ఆ మిషన్స్, ఛాతి పైన ఉన్న మిషన్స్ అన్ని తీసేస్తూ ఉంటాడు.
అయ్యయ్యో మీరు ఇవన్నీ ఇలా తీసేస్తున్నారేంటి.అసలు మీకు దెబ్బలు తగిలాయి. ఆ పల్స్ కూడా పడిపోతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఎలాగా అని కంగారు పడుతుంది.
నీ నోటితో నిజాలు చెప్పించడానికి నేను ఆడిన నాటకం ఇదంతా అని చెబుతాడు. అంటే అని అయోమయంగా అడుగుతూ... మీకు ఇవన్నీ ముందే తెలుసా ఆనందం, భయం అన్ని రకాల ఎమోషన్స్ కలిపిన ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంది.
వెంటనే సంతోషంతో విక్రమ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విక్రమ్ కూడా అవని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు.
ఇద్దరూ ఎంతసేపు అలా ఉన్నారో వాళ్లకే తెలియదు ఒకళ్ళది తన దగ్గరికి తన బంధం చేరుతుందో లేదో తెలియని భయం.
మరి ఒకరిది తన బంధం తన దగ్గరికి వచ్చింది అన్న ఆనందం. అవిని వెంటనే ఉలిక్కిపడి దూరం జరిగి క్షమించండి అని తలదించుకుంటుంది.
ఎందుకు అని అడుగుతాడు. మీకు ఈ నిజం ఎప్పుడూ తెలిసింది అంటే... శిల్పతో లైఫ్ స్టార్ట్ చేశాక, చేయకముందా అని అడుగుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.
అవని మానసిక పరిస్థితి అర్థం అయ్యి విక్రమ్ చాలా ఓపికగా అవని వైపు చూస్తూ.. చూపులు వేలుతో అవని గెడ్డాన్ని పైకి లేపి నువ్వు ఏమనుకుంటున్నావు అని కళ్ళల్లో కళ్ళు పెట్టే సూటిగా అడుగుతాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)