15-01-2026, 07:31 AM
(This post was last modified: 15-01-2026, 07:32 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 43
అవిని కి ఆగకుండా ఎక్కళ్ళు వస్తువుంటాయి. ఏంటి సడన్గా ఇలాగా.. వాటర్ తాగి కొంచెం స్థిమిత పడి హమ్మయ్య అనుకుంటుంది.
విక్రమ్ గారు ఎలా ఉన్నారో ? ఫోన్ చేస్తే... వద్దులే పక్కన శిల్ప ఉంటుంది కదా... అలా అనుకోగానే మనసు అంత చాలా భారంగా మారిపోతుంది.
విక్రమ్ గారు శిల్పనే భార్య అనుకుంటున్నారా... నాకు పెట్టిన రింగ్ అండ్ నల్ల పూసలు ఇవ్వాల్లేదు కదా..
అవి ఏవి అని శిల్ప ని అడగలేదా అనుకుంటూ..
అయ్యిన నా పిచ్చి గాని ఆ ధనుంజయ్ ఫ్యామిలీ తిమ్మిని బమ్మిని చేసి అయినా సరే శిల్ప ని ఆయనకి భార్యని చేసేస్తారు.
ఇంక నా జీవితం ఇంతే నా అని దిగులుగా కూర్చుంటుంది.
మరి నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు అని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది.
చెబితే నమ్ముతారా...నువ్వు చెబితేనే కదా నమ్ముతారో నమ్మరో అనేది తెలిసేది. ఏమి చెప్పకుండా నీలో నువ్వే మదనపడితే అర్థం ఏముంటుంది...
ఇప్పటికే వాళ్ళిద్దరూ లైఫ్ స్టార్ట్ చేసేసి ఉంటారు కదా... చెప్పడం వల్ల విక్రమ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు..
నాకు దగ్గరవుతారా...శిల్ప ని దూరం చేసుకోగలుగుతారా... అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది.
దేనికి తన దగ్గర సమాధానం ఉండదు . ఆలోచించి ఆలోచిస్తూనే పడుకుండిపోతుంది. సూర్యుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన సరే నిద్రమత్తు వదలదు. మంచి డీప్ స్లీప్ లో ఉన్నగా ఫోన్ రింగ్ అవుతుంది.
ఈ టైం లో ఎవరు ఫోన్ అనుకోని లిఫ్ట్ చేసి మత్తుగా హలో అంటుంది. నేను శ్రీ ని మాట్లాడుతున్నాను అనగానే.. చెప్పండి అన్నయ్య.
తొందరగా హాస్పిటల్ కి రా...విక్రమ్ కి యాక్సిడెంట్ అయ్యింది అని కంగారుగా చెబుతాడు. అంతే నిద్ర మత్తు అంత ఎగిరిపోయి ఏం మాట్లాడుతున్నారన్నయ్య మీరు అని ఏడుపు గొంతుతో అడుగుతుంది.
నేను నిజమే చెబుతున్నాను హాస్పిటల్ అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తున్నాను అర్జెంటుగా రా ని ఫోన్ పెట్టేస్తాడు. అవని స్పీడ్ గా నేహా దగ్గరికి వెళ్లి సీనియర్, సీనియర్ అంటూ కంగారుగా పిలుస్తుంది.
ఏమైంది అవని... నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అనగానే... తొందరగా పదండి సీనియర్.
హాస్పిటల్ కి వెళ్లాలి ఏడుస్తూ బయటకు పరుగు పెడుతుంది.
ఆగు అవని వస్తున్నాను అని నేహా ఫ్లాట్ లాక్ చేసి అవని వెనకాల పరుగు పెడుతుంది.
అవని పిచ్చిదానిలా రోడ్డు మీదకి వచ్చి పరుగు పెడుతూ ఉంటుంది. నేహా స్పీడ్ గా వచ్చి నీకేమైనా పిచ్చా అని పట్టుకుని... ఏ హాస్పిటల్ అని అడుగుతుంది.
వెంటనే ఫోన్ తీసుకొని శ్రీ పంపిన లొకేషన్ చూపిస్తుంది. అటుగా వెళుతున్న ఆటో ని ఆపి ఇద్దరు ఎక్కుతారు. ఏమైంది అని నేహా ఎన్ని సార్లు అడిగిన అవని ఏమి మాట్లాడదు.
నేహా కూడ సైలెంట్ అయ్యిపోతుంది. అరగంట లో హాస్పిటల్ కి చేరతారు. ఆటో ఆగగానే అవని స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతుంది.
ఏమైంది అవనికి. నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటూ పే చేసి లోపలికి వెళ్ళుతుంది. నేహా లోపలికి వెళ్ళేటప్పటికి అవని శ్రీ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.
శ్రీ గారు ఇక్కడ ఉన్నారు ఏమిటి.. విక్రమ్ గారు ఎక్కడ అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్లుతుంది. అవని ఏడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య. ఆక్సిడెంట్ ఎప్పుడు అయ్యింది అనగానే..
రాత్రి చెల్లమ్మ అని చాలా దీనంగా చెబుతాడు. రాత్రి అయ్యితే ఇప్పుడు దాక నాకు ఎందుకు చెప్పలేదు అని అరుస్తుంది.
నేహా అవని వైపు వింతగా చూస్తూ దీనికిమైనా పిచ్చా...
అతనికి ఆక్సిడెంట్ అయ్యితే దీనికి ఎందుకు చెప్పాలి అని అయోమయంగా జరిగేదాన్ని చూస్తుంది.
రాత్రి విక్రమ్ వైఫ్ తో వచ్చాడు. ఇద్దరికీ ఏదో గొడవ జరిగింది. విక్రమ్ కోపంగా బయటకు వెళ్ళాడు. ఇలా అయ్యింది అని చెప్పగానే శిల్ప ఇక్కడే ఉందా అని టెన్షన్ పడుతుంది.
ఆ అమ్మాయి ఏది అని తడబడుతు అడుగుతుంది. హ్మ్ ఆ అమ్మాయి కుంచెం తిక్కలిది అనుకుంటా భర్త కి ఇలా ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది.
హైదరాబాద్ నుంచి బామ్మగారు ఒకేటే ఫోన్లు. అప్పుడు అనుమానంగా చుట్టూ చూస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవ్వరు లేరు ఏమిటీ అన్నయ్య అని అడుగుతుంది.
బామ్మగారికి. సెంటిమెంట్స్ ఎక్కువ కదా. విక్రమ్ కి ఇలా అవ్వగానే పూజ జరిపిస్తున్నారు. అందరూ అక్కడే ఉండాలి అంట.
పెళ్లి అయ్యాక విక్రమ్ తన వైఫ్ కి రింగ్ పెట్టాడు అంట.అది చాలా పవర్ఫుల్. విక్రమ్ భార్య తన రింగ్ ఉన్న చేతితో విక్రమ్ కుడి చేతిలో చెయ్యి వేసి గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోమని చెప్పారు.
ఆ విషయం తెలిసినప్పుడు నుంచి ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. నాకు ఏమి చేయాలో తెలియక నీకు కాల్ చేసాను. చాలా టెన్షన్ గా ఉంది ఏమి జరు.. అంటూ ఉండగానే రూమ్ ఎక్కడ అన్నయ్య అని అడుగుతుంది.
అక్కడ అని చూపించాగానే పరుగున వెళుతుంది. వెనక నేహా కూడ వెళుతు ఉంటే నువ్వు ఎక్కడికి అని చెయ్యి పట్టుకొని ఆపుతాడు.
సీరియస్గా ఒక్క లుక్ ఇస్తుంది. సారీ మిస్. మీరు కూర్చోండి అని సీట్ ఆఫర్ చేస్తాడు. అస్సలు ఇక్కడ ఏమి జరుగుతుంది.
కూల్ నేహా. అంత లోకకల్యాణమే జరుగుతుంది. అదే అవని కళ్యాణం అంటాడు. చేతులు రెండు కట్టుకుని అర్ధం కాలేదు అంటుంది.
పైనుంచి కిందకి ఒకసారి చూసి అవని కి పెళ్లి అయ్యింది అని తెలుసు కదా మరి ఆమె భర్త ఎవ్వరు అని అడుగుతాడు.
నాకు తెలీయదు అని చెబుతుంది. మీది నిజంగా మట్టిబుర్రే. ఒక పెళ్లి అయ్యిన అమ్మాయి ఎవరి కోసం పరుగు పెడుతుంది అనగానే.. భర్త కోసం అని అంటే విక్రమ్ గారు అవని భర్త అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
అమ్మయ్య ఇప్పటికైనా అర్థం అయ్యినందుకు థాంక్స్.. ఇప్పుడైనా కూర్చుంటారా అని కూర్చుంటాడు. ఎందుకు మీరు ఫ్లాట్ తీసుకున్నారు. అవని దగ్గరికి వచ్చి మాట్లాడొచ్చు కదా...
అవని గురించి అన్ని తెలుసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా... నిన్న ఏం న్యూస్ ఛానల్ చూడలేదా మీరిద్దరూ అని అడుగుతాడు.
అవిని కి టివి చూసే ఇంట్రెస్ట్ ఉండదు. నాకు వర్క్ ఉండి బయటకు వెళ్లాను అందుకే ఏమీ చూడలేదు అని న్యూస్ ఏంటి అని అడుగుతుంది.
చెప్పడం ఎందుకు చూపిస్తాను అని ఛానల్ ఓపెన్ చేసి ఇస్తాడు. అంతా చూసి ఏమిటి ఇంత జరిగిందా అని ఆశ్చర్య పోతుంది.
ఇప్పుడు అవిని యే చెప్పాలి అన్నది మా విక్రమ్ ప్లాన్. అందుకే ఇంత డ్రామా అంటాడు. విక్రమ్ గారికి నిజంగానే ఏమీ అవ్వలేదా అని చాలా ఆనందంగా అడుగుతుంది.
పాపం కదా అవని అనగానే.. అవని ఎందుకు పాపం, ఇంత ఫైట్ చేసిన మా విక్రమ్ ని పాపం అనుకోవాలి . పెళ్ళాం కోసం ఇంత నమ్మకంతో ఫైట్ చేస్తారా అంటాడు.
అది నిజమే. విక్రమ్ గారు అడవిని ఏలే సింహం అయితే ఇది తాబేలు కన్నా దారుణం. విక్రమ్ గారు ఆడే ఆటలో ఇది ఎలా బకరా అవుతుందో అని మనసులో అనుకుంటూ..
అవని మీద మనసులోనే జాలిని చూపిస్తుంది.
శ్రీ చూపించిన రూములోకి అవిని పరిగెత్తుకుంటూ వెళుతుంది. రూమ్ డోర్ ఓపెన్ చేయ గానే విక్రమ్ కి ఫుల్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేసి ఉంచుతారు.
బి. పి. , హార్ట్ బీట్ అన్ని చాలా స్లో గా ఉంటాయి. అవిని ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వెళ్లి మీరు ఆరోజు పెట్టినప్పుడు నుంచి నేను అసలే తీయలేదు కదా..
చేతికున్న గ్లౌస్ తీసేసి శ్రీ చెప్పినట్టుగా తన చేతిని విక్రమ్ కుడి చేతులో పెట్టి గట్టిగా పట్టుకుంటుంది. నేను పక్కనే ఉన్నాను. నా చేతిని మీ చేతితో కలిపి పట్టుకున్నాను వినిపిస్తుందా అంటూ ఏడుస్తూ అడుగుతుంది.
విక్రమ్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు. సంతోషంగా తలపైకి ఎత్తి చూస్తుంది. బీపీ హార్ట్ బీట్ అన్ని నార్మల్ గా వస్తూ ఉంటాయి.
డాక్టర్ డాక్టర్ అని పిలుస్తుంది. వెంటనే ఒక డాక్టర్ వచ్చి ఏమైంది మేడం అని అడగగానే... విక్రమ్ గారు కదులుతున్నారు చెక్ చేయండి అని చెబుతుంది.
డాక్టర్ చెక్ చేసి వావ్ వాట్ ఏ మిరాకిల్. వదిలేసుకున్న విక్రమ్ గారిలో చలనం వచ్చింది. ఏం చేశారు మేడం మీరు అనగానే..
అవని సంతోషంతో నేనేమీ చేయలేదు డాక్టర్. చేయ పట్టుకుని కూర్చున్నాను అంతే అని అమాయకంగా చెబుతుంది.
మీరు అలాగే పట్టుకొని కూర్చోండి. కొంచెం సేపటిలో ఆయనకి మేలుకువ రావచ్చు. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. ఏదైనా అవసరమైతే పిలవండి అని బయటికి వెళ్లి శ్రీ కి ఓకే అని థంబ్ ఫింగర్ చూపిస్తాడు.
డాక్టర్ బయటికి వెళుతూ మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం అని చెప్పి మరి వెళ్తాడు.
అవని విక్రమ్ చేయని గట్టిగా పట్టుకుని ఇంకొక చేతితో నుదురు మీద పెట్టి విక్రమ్ గారు నా మాటలు మీకు వినిపిస్తున్నాయా... నేను చెప్పేది నిజమని మీరు నమ్ముతారా అని అడుగుతుంది.
మీరు తాళి కట్టింది నాకే. శిల్ప కి కాదు. ఆరోజు ఉంగరం పెట్టింది కూడా నాకే. అందుకే ఆ చేతితో మిమ్మల్ని పట్టుకోగానే మీలో ఆ వైబ్రేషన్స్ వచ్చాయి అని అమాయకముగా,ఎమోషనల్ గా చెబుతుంది.
ఆ ధనుంజయ్ ఫ్యామిలీ చేసిన మోసం వలన నేను అజ్ఞాతంలోకి రావాల్సి వచ్చింది. కానీ మీకు దూరంగా వస్తుంటే నా ప్రాణం పోయినట్టే ఉంది.
మిమ్మల్ని ఇక్కడ చూడగానే నేను ఎంత సంతోష పడ్డానో నాకే తెలుసు . మీ పక్కనే శిల్ప ని ఊహించుకోలేకపోయాను.
కానీ ఏ హక్కుతో మీ ముందుకు రావాలో అర్థం కాలేదు. జరిగింది చెపితే మీరు అర్థం చేసుకోకుండా మోసం చేశాను అంటే నేను తట్టుకోలేను.
నాకంటే ఎక్కువగా ప్రేమించేది మిమల్నే . రెండు రోజులకే నా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు.
మీకు ఏమన్నా అయితే అంతకముందే నా ప్రాణం నా నుండి దూరంగా వెళ్లిపోతుంది ఇది నిజం విక్రమ్ గారు అని ఆ చేతిని నుదుటిపైన పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)