Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#74
(22-12-2025, 08:00 AM)SivaSai Wrote: ఎపిసోడ్ 2


డ్యూటీలో జాయిన్ అయ్యినా వెంటనే టెర్రరిస్ట్ ఎటాక్ నుంచి తనని కాపాడిన భీరాజ్ ఫైల్ చూసి, తన భార్య వసుందరికి ఫోన్ చేసి కోర్టులో ఒక పిటిషన్ వేయామని చెప్పాడు సందీప్ రావు.

*********************

లండన్ వెస్ట్ పార్క్ దగ్గర ఉన్న నంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసులో డైరెక్టర్స్ తో మాట్లాడుతూ "ఇప్పటి వరుకు16 దేశాలలో మన కంపెనీ ముద్రవేశము'

'ఈ సంవత్సరం తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ నార్వే లో కూడా అడుగు పెడుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాను." అన్నాడు ముకుల్ నంద.

"చైర్మన్ గారు! మీ మాటకు అడ్డు వస్తునందుకు క్షమించాలి, మన కంపెనీ పుట్టిన ఇండియాలో మాత్రం డవలేప్ మెంట్ లేకుండా అక్కడే ఆగిపోయము.'

'ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న మన బిజినెస్ నుంచి  వందల కోట్ల నష్టం వస్తుంది. ఇప్పుడు మీ మనవలు మనవరాళ్లు కూడా బిజినెస్ లోకి వచ్చారు కదా!'

'వాళ్లకి ఇండియా లో ఉన్న  బిజినెస్ అప్పచెప్పండి లేకపోతే మన కంపెనీ పుట్టిన చోట కనుమరుగైపోతుంది." అన్నాడు ఒక డైరెక్టర్.

"ఆ విషయం నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీరంతా ఈ కంపెనీలో జాబ్ హోల్డర్స్ గా జాయిన్ అయ్యి డైరెక్టర్స్ గా మారారు ఆ విషయం మర్చిపోకండి." అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు ముకుల్ నంద.

ఇంటిదగ్గర ఆలోచిస్తూ కూర్చున్నా  ముకుల్ దగ్గరకు వచ్చి "సార్! మన కంపెనీ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి వస్తున్నారు.'

'మన కంపెనీకి సంబంధించిన వారందరికీ ఇన్విటేషన్స్  పంపించాము ఇంకా ఎవరికైనా పంపించాలి అంటే చెప్పండి." అన్నాడు పిఎ.

"కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయ్ తర్వాత మాట్లాడదాము." అంటూ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "హలో హిర్వాణి! హౌ అర్ యు? నీకు ఇన్విటేషన్ అందిందా?" అని అడిగాడు ముకుల్ నంద.

"సార్! మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి కాల్ చేశాను, 12 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ కేసు ఫైల్ కోర్టు బెంచ్ మీదకి వచ్చింది." అన్నాడు హిర్వాణి.

"అవునా? ఎంత ఖర్చు అయ్యినా పర్వాలేదు ఆ కేస్ ఓపెన్ అవ్వకూడదు." అంటూ కంగారుగా అన్నాడు ముకుల్.

"సారీ సార్! ఇన్ని సంవత్సరాలు కేస్ ఓపెన్ అవ్వకుండా అతన్ని జైలు నుంచి బయటకు రానివ్వకుండా మేనేజ్ చేయగలిగాను.'

'కానీ ఇప్పుడు ఆ కేస్ డీల్ చేస్తుంది వసుంధర! తనని డబ్బుతో కొనలేము కోర్టులోనే ఎదుర్కోవాలి, అయ్యినా ఈ కేసులో ఆవిడతో గెలవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు హిర్వాణి.

ఫోన్ పక్కన పెట్టి "అభిర్ బయట అడుగు పెడితే!" అంటూ భయంగా చూస్తూ గుండె పట్టుకొని కింద పడిపోయాడు ముకుల్ నంద.

"సార్!" అంటూ కంగారుగా  దగ్గరికి వచ్చి హాస్పిటల్ కి తీసుకు వెళుతూ ఫోన్ చేసి "మేడం! మీ తాతయ్య గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది హాస్పిటల్ కి తీసుకువెళ్లను మీరు త్వరగా రావాలి." అని చెప్పాడు పిఏ.

"అవునా? నేను వెంటనే బయలుదేరుతున్నాను." అంటూ కంగారుగా చెప్పింది  ముకుల్ మనవరాలు అర్ణ.

*******************

ఢిల్లీ వసుందర తో కలిసి ఇంటి దగ్గరికి వచ్చి హాల్లో ఉన్న సందీప్ రావుని చూసి "హాయ్ బ్రదర్! హౌ ఆర్ యు? నీ మీద ఎటాక్ జరిగిందని తెలిసింది.'

"ఫుల్ డీటెయిల్స్ ఇస్తే 30 మినిట్స్ ప్రోగ్రాం చేసి టెలికాస్ట్ చేస్తాను, అసలే ఈ మధ్య సరైన హాట్ న్యూస్ ఏమి దొరకలేదు." అంటూ నవ్వుతూ అడిగింది నీలమ్.

"అవునా? ఎంత ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ అయితే మాత్రం  మీ అన్నయ్యనే టీవీలో చూపించి ట్రోల్ చేస్తావా?'

'అయ్యినా వీకెండ్ తప్పితే మిగతా రోజుల్లో మా ఇంటికి రాకూడదు అనుకుంటున్నావా ఏంటి?" అనుమానంగా అడిగింది వసుందర.

"హో..! అలాంటిదేమీ లేదు వదినా! వీకెండ్ అయితే రోషిని  ఇంటి దగ్గరే ఉంటుంది. నేను కాసేపు స్పెండ్ చేయొచ్చు, మామూలు రోజుల్లో నువ్వు కోర్టుకు వెళతావు అన్నయ్య డ్యూటీ కి వెళ్తాడు.'

'నేను ఇక్కడ ఉన్న ఒకటే నా రూమ్ లో ఉన్న ఒకటే కదా!" అంటూ లోపలి నుంచి వస్తున్న రోషనిని చూసి "హాయ్! నీకోసమే వచ్చాను." అంటూ చాక్లెట్స్ ఇచ్చి ముద్దులాడుతూ ఉంది నీలమ్.

"హాయ్ ఆంటీ!" అంటూ చాక్లెట్లు తీసుకుని "ఈరోజు మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది." అంటూ రూమ్ లో ఉన్న కుక్క పిల్లని చూపించి

"దీని పేరు టామీ! మా ఇంట్లోనే ఉంటుంది నేను ఆడుకోవడానికి డాడీ తీసుకువచ్చారు." అంటూ సంతోషంగా చెప్పింది రోషిని.

"హో.. క్యూట్ గా ఉంది." అంటూ సమరుతు చెప్పింది నీలమ్.

ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ "సందీప్! నువ్వు చెప్పినట్లు జైల్లో ఉన్న  వ్యక్తి కేస్ రిఓపెన్ చేయాలని పిటిషన్ వేశాను.
ట్విస్ట్ ఏమిటంటే!'

'నేను పిటిషన్ వేసిన గంటలో తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తులని అండమాన్ జైలు కి షిఫ్ట్ చేయాలి ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి NIA వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ లిస్టులో అభిర్ పేరు కూడా ఉంది." అని చెప్పింది వసుందర.

"అవునా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "అసలు అభిర్ నేరం చేసినట్లే రుజువు అవ్వలేదు, అలాంటిది కరుడుగట్టిన నేరస్తుడు ఎలా అవుతాడు? అతని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది." అంటూ అనుమానంగా అన్నాడు సందీప్ రావు.

కుక్కపిల్లతో ఆడుతూ "అసలు అభిర్ కేస్ ఇన్ని సంవత్సరాలు ఫాలోఅప్ చేసిన లాయర్ ఎవరు?" డౌట్ గా అడిగింది నీలమ్.

"ఈ కేసులో ఆపోజిట్ లాయర్ మితిల్ హిర్వాణి! తన ఇన్ఫ్లెన్స్ తోనే ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసుని బెంచ్ మీదకి కూడా రాకుండా చేశాడు.'

'16 సంవత్సరాల పిల్లాడిని 18 సంవత్సరాలు నిండాయని కోర్టుని నమ్మించి తీహార్ జైలుకి పంపించాడు." అని చెప్పింది వసుందర.

"లాయర్ హిర్వాణి! తను ఏ కేస్ టేకప్ చేసినా క్రోర్స్ లో ఛార్జ్ చేస్తాడు ఎటువంటి కేసు అయిన తారుమారు చేయగల సత్తా ఉన్నవాడు.'

'నాకు తెలిసి ఈ అండమాన్ జైలుకి పంపించే ప్రపోజల్ కూడా అతనే తీసుకువచ్చి ఉంటాడు  ఎటువంటి వారినైనా డబ్బుతో పడేస్తాడు." అని చెప్పింది నీలమ్.

"అభిర్ జైలుకి వచ్చినప్పుడు వయస్సు 16 సంవత్సరాలు ఆ వయసు పిల్లవాడిని  అన్ని కోట్లు ఖర్చుపెట్టి బయటకు రానివ్వకుండా 12 సంవత్సరాలు జైల్లోనే ఉంచి అతని జీవితం పాడు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది." అన్నాడు సందీప్ రావు.

"ఓకే! నాకు మంచి న్యూస్ దొరికినట్లు ఉంది ఒకసారి అభిర్ తో మాట్లాడాలి." అంది నీలమ్.

"మనం వేసిన పిటిషన్ రెండు రోజుల్లో బెంచ్ మీదకి వస్తుంది నేను కూడా ఒకసారి అభిర్ తో మాట్లాడాలి." అంది వసుందర.

"ఓకే! మీ ఇద్దరికి నేను స్పెషల్ పర్మిషన్ ఇప్పిస్తాను రేపు జైలుకు వచ్చి అభిర్ తో మాట్లాడండి." అన్నాడు సందీప్ రావు.

*******************

లండన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఐసియు లో ఉన్న ముకుల్ నంద ని చూసి పక్కనే ఉన్న పిఏ వైపు చూస్తూ "తాతగారు దేని గురించైనా ఆలోచించి టెన్షన్ పడ్డారా?" డౌట్ గా అడిగింది అర్ణ.

"మేడం! 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ గురించి, నార్వేలో కంపెనీ స్టార్ట్ చేయడం గురించి డైరెక్టర్ తో మీటింగ్ జరిగింది అక్కడ ఇండియాలో ఉన్న బిజినెస్ గురించి డిస్కషన్ జరిగింది అప్పుడే  బాగా టెన్షన్ పడ్డారు." అన్నాడు పిఏ.

"మనకి ఇండియాలో ఉన్న కంపెనీల ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి." అని అడిగింది అర్ణ.

"మేడం! ఆ డీటెయిల్స్ మొత్తం సార్ చాలా సీక్రెట్ గా ఉంచుతారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కూడా ఆ కంపెనీల డీటెయిల్స్ తెలుసుకోనివ్వరు అక్కడకి వెళ్లనివ్వరు.'

"సార్ స్వయంగా చూసుకుంటారు ఇప్పుడు మీరు అడిగారని తెలిస్తే ఆయన ఇంకా టెన్షన్ పడతారు." అన్నాడు పిఏ.

"ఓకే! మా ఫ్యామిలీ మెంబర్స్ లండన్ ఎప్పుడు వస్తున్నారు?" అని అడిగింది అర్ణ.

"టుడేస్ లో అందరూ ఇక్కడే ఉంటారు మేడం! ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి." అన్నాడు పిఏ.

"ఓకే! మీటింగ్లో ఇండియా కంపెనీస్ గురించి మాట్లాడిన డైరెక్టర్ ఎవరు?" డౌట్ గా అడిగింది అర్ణ.

"ప్రతాప్ మిశ్రా గారు మేడం!" అని చెప్పాడు పిఏ.

"ఓకే! తాత గారు స్పృహలోకి వస్తే వెంటనే నాకు కాల్ చెయ్!" అంటూ ఫోన్ తీసి కాల్ చేసి "హాయ్ అంకుల్! హౌ ఆర్ యు?" అని అడిగింది అర్ణ.

"హాయ్ బేబీ ఫైన్! ఇప్పుడే హాస్పిటల్ కి బయలుదేరుతున్నాను నువ్వు అక్కడే ఉన్నావా?" అని అడిగాడు ప్రతాప్ మిశ్రా

"ఎస్ అంకుల్! మీరు ఇంటి దగ్గర ఉండండి నేనే మీ దగ్గరికి వస్తున్నాను కొంచెం మాట్లాడే పని ఉంది." అంటూ ఫోన్ కట్ చెసి కార్ లో స్పీడ్ గా వెళ్ళింది అర్ణ.

కాసేపటికి ఇంటి లోపలికి వస్తున్న అర్ణని చూసి "హాయ్ బేబీ! ఏంటి పర్సనల్ మీట్ అవ్వాలి అన్నావు? ఎనీ ఇంపార్టెంట్ మేటర్!" డౌట్ గా అడిగాడు ప్రతాప్ మిశ్రా.

"ఇండియాలో ఉన్న మన కంపెనీస్ డీటెయిల్స్ నాకు కావాలి, వాటిని తాతగారు ఎవరికి తెలియకుండా ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారో తెలుసుకోవాలి." అంది అర్ణ.

"నంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆస్తిలో థర్టీ పర్సెంట్ ఇండియాలోనే ఉంది. అక్కడ కంపెనీస్ వల్ల వచ్చే నష్టం మన లాభాలను కూడా దెబ్బతిస్తుంది.'

'మనం అక్కడ ఉన్న కంపెనీస్ క్లోజ్ చేసి ఆస్తులు అమ్మినా చాలు మన కంపెనీ షేర్ వాల్యూ మూడు రెట్లు అవుతుంది.'

'ఈ విషయం ఎప్పుడూ మాట్లాడిన తాతగారు టెన్షన్ గా మీటింగ్ నుంచి వెళ్ళిపోతారు అసలు మన కంపెనీ పుట్టింది ఇండియాలో కానీ అక్కడ జీవం లేకుండా అయిపోతుంది. మీలో ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తే అందరం లాభపడతాము." అన్నాడు ప్రతాప్ మిశ్రా.

"ఓకే అంకుల్! టు డేస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు, ఈ విషయం గురించి తాత గారితో నేను మాట్లాడుతాను.'

'ఇప్పటివరకు నేను హ్యాండిల్ చేసినా ప్రతి విషయంలో సక్సెస్ అయ్యాను." అంటూ స్మైల్ ఇస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది అర్ణ.

అక్కడి నుంచి అర్ణ కారు వెళ్లడంతోనే ఫోన్ తీసి కాల్ చేసి "నమస్తే రాజన్! తొందరలోనే నంద వారసులు ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"అవునా? వెల్కమ్ చెప్పడానికి మా అబీర్ సైన్యం సిద్ధంగా ఉంటుంది." అంటూ గంభీరమైన గొంతుతో చెప్పాడు రాజన్.
Like Reply


Messages In This Thread
RE: ఖైదీ నెంబర్ 402 - by Babu143 - 3 hours ago
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM



Users browsing this thread: 1 Guest(s)