Yesterday, 05:45 PM
ఎపిసోడ్ 26
జూలో ఎటాక్ చేయడానికి వచ్చిన పెద్దపులులు, అక్కడికి వచ్చిన గరుడ పక్షి అభిర్ దగ్గరకి వెళ్లడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.
**********************
జూలో జరిగేది ఆశ్చర్యంగా చూస్తూ "ఈ అభిర్ గాడు నా ప్లాన్ మొత్తం పాడు చేసాడు, అసలు ఆ జంతువులు వీడి మాట ఎందుకు వింటున్నాయి?" అని డౌట్ గా అన్నాడు మిచల్.
"ఆ విషయం గురించి తర్వాత తెలుసుకోవచ్చు, ముందు నీ ప్లాన్ బి సంగతి చూడు, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అంటే ముకుల్ గారి ప్లాన్ సి లో మనిద్దరం ఉంటాము." అని కంగారుగా చెప్పాడు జనార్ధన్.
"ఈ జూలో 14 హైనాలు ఉన్నాయి, అవి గుంపుగా ఉంటే పెద్ద పులిని కూడా చంపేస్తాయి, వాటికి మనిషి రక్తం అంటే చాలా ఇష్టం!" అని ఫోన్ తీసి కాల్ చేసి "ఓపెన్ చెయ్!" అని చెప్పాడు మిచల్.
"ఓకే సార్!" అని చెప్పి హైనాలు ఉన్న బోన్ ఓపెన్ చేసాడు ఆ వ్యక్తి.
తన దగ్గరికి వచ్చిన గరుడ పక్షి వైపు ప్రేమగా చూస్తూ "నా కోసం వెతుకుతూ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా?" అని అడిగాడు అభిర్.
ఆ మాట విని అభిర్ ని రెండు రెక్కలతో గట్టిగా హత్తుకుని గాల్లోకి ఎగిరి ఆనందంగా చక్కర్లు కొడుతూ ఉంది గరుడ పక్షి.
అంతలో హైనాల అరుపు వినిపించి రాజు, షేర్ లు గట్టిగా గర్జించాయి.
పెద్ద పులుల అరుపు విని "వాటికి మళ్లీ ఏమైంది?" అని అనుమానంగా చూస్తూ అన్నాడు మస్తాన్.
జూలో ఉన్న జంతువులు మొత్తం అరుస్తూ ఉండడం చూసి "మళ్లీ ఎక్కడో బోన్ తెరుచుకుంది ఏవో జంతువులు బయటికి వస్తున్నాయి, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు." అని అనుమానంగా చూస్తూ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని ఎలర్ట్ చేశాడు రుషి.
హడావిడిగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి "సార్! హైనాలా బోను తెరుచుకుంది అవి మొత్తం బయటికి వచ్చాయి." అని కంగారుగా చెప్పాడు ఒక సెక్యూరిటీగా గార్డ్.
"అవునా?" అని భయంగా సందీప్ వాళ్ళ వైపు చూసి "లోపల హైనాలు చాలా ఉన్నాయి, అవి బయటకు వచ్చాయంటే ఆపడం ఎవరి వల్ల కాదు మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము పదండి." అని కంగారుగా చెప్పాడు రుషి.
పెద్దపులులు రెండు అరుస్తూ ఉండడం చూసి అనుమానం వచ్చి "మన వాళ్ళ దగ్గరికి ఏ జంతువు రాకూడదు." అని రాజు, షేర్ లా వైపు చూసి చెప్పి, పరిగెత్తుకుంటూ వసుంధర వాళ్ళ దగ్గరికి వచ్చాడు అభిర్.
పరుగెత్తుకుంటూ వస్తున్న అభిర్ వైపు చూసి "హైనాలు తప్పించుకున్నాయంట!" అని కంగారుగా చెప్పింది నీలమ్.
ఆ మాట విని వసుంధర, రోషిని మీద ఉన్న రక్తం చూసి "ఎవరో క్రూరమృగాలకి మిమ్మల్ని ఆహారంగా వేయాలని చూస్తున్నారు. నేను ఉండగా అది జరగదు." అని ఆకాశం వైపు చూసి సింబా అని గట్టిగా అరిచాడు అభిర్.
ఆ మాట విని గాలిలో వేగంగా వస్తూ తన కాళ్లతో ఒక కర్ర తీసుకువచ్చి అభిర్ కి ఇచ్చాడు సింబా.
అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న హైనాలని చూసి భయంతో బిగిసుకుపోయారు అందరు.
తన చేతిలో ఉన్న కర్రను గాలిలో తిప్పుతూ వింతగా శబ్దాలు చేస్తూ, ఎదురుగా వచ్చి ఎర్రటికళ్ళతో కసిగా చూస్తున్న హైనాల కళ్ళలోకి చూస్తూ ముందుకు వెళ్లాడు అభిర్.
కర్రని గిరగిరా తిప్పుతూ ముందుకు వెళుతున్న అభిర్ ని చూసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయని హైనాలా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రుషి.
కసిగా చూస్తూ ముందుకు దూకినా ఒక హైనా మీదకి రావడంతో కర్రతో గట్టిగా దెబ్బ కొట్టి కింద పడ్డ దాని మీద కాలు పెట్టి కోపంగా ఎదురుగా ఉన్న మిగతా హైనాలా వైపు చూసాడు అభిర్.
అభిర్ వైపు చూసి ఎత్తిన తోకలు కిందకు దింపి వెనక్కి పరిగెత్తి బోన్ లోకి వెళ్లాయి హైనాలు.
అభిర్ తన కాలు తీయడంతో అక్కడ ఉన్న హైనా కూడా బోన్ వైపు పరుగు తీసింది.
బోన్ మీద నుంచి అభిర్ వైపు చూస్తూ "అసలు ఎవరు వీడు? ఇదంతా వీడికి ఎలా సాధ్యమైంది." అని ఆశర్యంగా చూస్తూ ఉన్నాడు మిచల్.
అంతలో దూరంగా బోను మీద ఉన్న మిచల్ ని చూసి "అభిర్! మేడం వాళ్ళ మీద బ్లడ్ ప్యాకెట్ కొట్టింది వాళ్లే!" అని గట్టిగా అరిచింది మిత్ర.
ఆ మాటకి వెనక్కి తిరిగి బోన్ మీద నుంచున్న వాళ్ళవైపు కోపంగా చూస్తూ "షేర్!" అని పిలిచి మిచల్ వాళ్ల వైపు వెళ్ళాడు అభిర్.
రెండు పెద్ద పులులు, మరొక పెద్దపులి లాగా అభిర్ తమ వైపే రావడం చూసి కంగారులో జనార్ధన్ ని తోసేసి అక్కడినుంచి వెనక్కి వెళ్లి గోడదుకి పారిపోయాడు మిచల్.
కింద పడ్డ జనార్ధనని చూసి వేగంగా వెళ్లి నోటితో పట్టుకుని అభిర్ దగ్గరికి తీసుకువచ్చాడు షేర్.
పెద్దపులి నోట్లో భయంతో వణికిపోతున్న జనార్ధన్ ని చూసి అబీర్ వైపు చూస్తూ "బాబు అతన్ని కాపాడు." అని చెప్పాడు మస్తాన్.
"నా తల్లి లాంటి వారిని చంపాలని చూసినవాడు బతకడం నాకు ఇష్టం లేదు." అని కోపంగా చెప్పాడు అభిర్.
ఆ మాట అభిర్ అనటంతోనే పరుగెత్తుకుంటూ వెళ్లి షేర్ నోట్లో ఉన్న జనార్ధన్ తలని నోటితో పీకి అవతల పరేసి కోపంతో చెవుల దద్దరిల్లిపోయినట్లు గర్జించాడు రాజు.
జనార్దన్ చావడం చూసి మనసులో సంతోష పడి కన్నీళ్లు తుడుచుకుంది గీత.
రెండు పెద్దపులులను బోన్లోకి పంపించి "త్వరలోనే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళతాను." అని చెప్పి ఆకాశం వైపు చూసి
"సింబా! యుద్ధం మొదలైంది అభిర్ రంగంలోకి దిగాడు అని మనవాళ్ళకి చెప్పు!" అన్నాడు అభిర్.
ఆ మాట విని గట్టిగా శబ్దం చేసుకుంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు సింబా.
తమ దగ్గరికి వస్తున్న అభిర్ ని చూసి అడగడానికి అందరూ రెడీ అవ్వడంతో ముందుకు వచ్చి "ఇంటికి వెళదామా? చీకటి పడుతుంది." అని అడిగింది వసుంధర.
ఆ మాట విని వసుంధర వైపు ఆశ్చర్యంగా చూస్తూ బయటికి వెళ్లే రూట్లో నడిచారు అందరు.
అభిర్ దగ్గరకు వచ్చి "థాంక్యూ సో మచ్! నీవల్ల ఈరోజు జూలో ఈ ఎటువంటి ప్రమాదం జరగలేదు." అని చెప్పాడు రుషి.
"ఆ రెండు బోన్ గేట్లు ఎలా తెరుచుకున్నాయో తెలుసుకుని వాళ్ళని ఇక్కడనుంచి పంపించండి. జంతువులన్నిటినీ జాగ్రత్తగా చూసుకోండి. త్వరలోనే నాతో పాటు తీసుకువెళతాను." అని చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళాడు అభిర్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రుషి.
అభిర్ వెనకాలే వెళుతూ "జంతువులన్నిటిని తనతో పాటు తీసుకువెళతాడా! ఇంతకీ ఈ టార్జాన్ గారు ఎక్కడి నుంచి వచ్చారో!" అని మనసులో అనుకుంది మిత్ర.
పక్కనే నడుస్తూ "అక్క! వెళ్లేటప్పుడు ప్యాంటు కొనుక్కోవాలి చలి పెడుతుంది." అన్నాడు చాక్లెట్.
"సరే రా..! నువ్వే ధైర్యవంతుడివి నీకు కింద నుంచి అదైనా వచ్చింది. నాకు నోట్లో నుంచి మాటే రాలేదు." అని చెప్పి నీలమ్ దగ్గరకు వెళ్లి "రేపు ఇంటికి వచ్చి కలుస్తాను బాయ్!" అని చెప్పింది మిత్ర.
"ఓకే! అనవసరంగా నిన్ను ఇక్కడికి పిలిచి ప్రమాదంలో ఇరికించాను సారీ!" అని చెప్పింది నీలమ్.
"ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లేకపోతే ఇటువంటి గొప్ప సిచువేషన్ మిస్ అయిపోయే దానిని!" అని చెప్పింది మిత్ర.
"అక్క! అసలు ఇంతకీ అభిర్ అన్న ఎవరు? ఆ జంతువులు అతని మాట ఎందుకు విన్నాయి?" అని అనుమానంగా అడిగాడు చాక్లెట్.
"ఆ విషయం అభిర్ నోట్లో నుంచి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నము, నాకు తెలియగానే ఫస్ట్ నీతోనే చెబుతాను." అని నవ్వుతూ చెప్పింది నీలమ్.
"సరే!" అని కార్లో ఉన్న సుమతి వాళ్ళ వైపు చూసి బాయ్ చెప్పి బైక్ మీద చాక్లెట్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళింది మిత్ర.
అక్కడి నుంచి కార్ లో ఇంటికి వెళుతూ డ్రైవ్ చేస్తూ వసుంధర వైపు చూసి "అభిర్ ని అలా ఎలా చేసావు అని అందరు అడుగుదాము అనుకున్నారు, కానీ ఇంతలో నువ్వు అడగకుండా ఆపేసావు ఎందుకు?" అని డౌట్ గా అడిగాడు సందీప్.
"అభిర్ నన్ను తల్లి లాగా చూస్తున్నాడు, తను ఎవరో తన గతం ఏమిటో చెప్పాలి అనిపించినప్పుడు తప్పకుండా చెబుతాడు అప్పటివరకు ఎవరు అడగకండి." అని చెప్పింది వసుంధర.
"ఓకే!" అని చిన్న స్మైల్ ఇచ్చాడు సందీప్.
కాసేపటికి ఇంటికి వెళ్లడంతో సీరియస్ గా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు అభిర్.
************************
ఉదయం ఇంటి ముందు ఆటో ఆగడం చూసి గబగబా వెళ్లి బ్యాగ్ తీసుకుని "బామ్మ గారు! వస్తున్నానని ఒక ఫోన్ చేస్తే స్టేషన్ కి కార్ వేసుకుని ఎవరో ఒకరు వచ్చేవాళ్ళం కదా!" అని అడిగింది నీలమ్.
"నా గురించి ఎవరు శ్రమ పడకూడదు." అని ఆటో వాడికి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వెళ్ళింది బామ్మ.
బ్యాగ్ తీసుకుని వెళుతున్న నీలమ్ వైపు చూసి "ఎవరు ఆవిడా?" అని అడిగింది సుమతి.
"మా వదిన వాళ్ళ నాయనమ్మ! మహారాష్ట్రలో ఉంటుంది ఫుల్ స్టిట్, చాదస్తం కూడా కొంచెం ఎక్కువే!" అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది నీలమ్.
కాసేపటికి బయటకు వచ్చి పక్షులకు ఆహారం వేస్తున్న అభిర్ వైపు చూసి ఎవరు బాబునువ్వు? నీ పేరు ఏమిటి? " అని అడిగింది బామ్మ.
అక్కడికి వస్తు "బామ్మ! అతని పేరు అభిర్! నాకు తెలిసిన మనిషే ఇక్కడే ఉంటున్నాడు." అని చెప్పింది వసుంధర.
"అభిర్ అంటే గోవుల మంద కలవాడు అని అర్థం!" అని దగ్గరికి వెళ్లి చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసి "నీ అసలు పేరేమిటి?" అని అడిగింది బామ్మా.
కాఫీ తాగుతూ అక్కడికి వచ్చి "బామ్మ! అతని అసలు పేరే అభిర్!" అని నవ్వుతూ చెప్పింది నీలమ్.
"అభిర్ భుజం మీద ఉన్న ఈ పచ్చబొట్టు గురించి నేను కథలుగా విన్నాను,"
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యంలో చరిత్రకు తెలియని ఒక దళం ఉంది అదే అభిర్ దళం వాళ్ల నాయకుడికి మాత్రమే ఈ పచ్చబొట్టు ఉంటుంది.
శివాజీ మహారాజ్ గారి మరణం తర్వాత ఈ దళం కనుమరుగైపోయిందని చెబుతూ ఉంటారు నువ్వు ఆ వంశానికి చెందిన వాడివా? ఆ దళానికి నాయకుడువా? " అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది బామ్మ.
ఆ మాట విని పక్షులకు ఆహారం వేస్తూ "అవును బామ్మగారు!" అని చెప్పాడు అభిర్.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు అందరూ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)