Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#67
 ఎపిసోడ్ 25


జూలో ఏనుగు అభిర్ వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసి బ్లడ్ ప్యాకెట్ కొట్టమని రఫీకి, పెద్దపులిని వదలమని జూలో మనిషికి సైగ చేశాడు మిచల్.

**********************

జూలో పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగులు చూసి "సార్! దానికి మదం ఎక్కినట్లుంది. అందుకునే ఈ జంతువులు అన్ని అరుస్తున్నాయి, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం పదండి." అని కంగారుగా చెప్పాడు మస్తాన్.

సెక్యూరిటీ వాళ్ళని తొండంతో గిరాటు వేయడం చూసి భయపడుతున్న సందీప్ వాళ్ళ వైపు తిరిగి "అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి." అని చెప్పి ఏనుగు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అభిర్.

ఏనుగు వైపు పరిగెడుతున్న అభిర్ ని చూసి "బాబు! దాని దగ్గరికి వెళ్ళకు ఆ ఏనుగుకి మదం ఎక్కింది." అని గట్టిగా అరిచాడు మస్తాన్.

కింద పడ్డ సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ తొక్కడడానికి మీదకి వెళుతున్న ఏనుగు వైపు చూసి "ఆగు ఎందుకు గొడవ చేస్తున్నావు?" అని గట్టిగా అరిచాడు అభిర్.

సెక్యూరిటీ గార్డ్ ని తొక్కడం ఆపి తన దగ్గరికి వస్తున్న అభిర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ ఏనుగు.

ఆ ఏనుగు దగ్గరకు వెళ్లి సమురుతు "ప్రశాంతంగా ఉండు." అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళ వైపు చూసి "దీనికి తినడానికి ఏమైనా తీసుకురండి." అని చెప్పాడు అభిర్.

ప్రశాంతంగా ఉన్న ఏనుగు వైపు, దానిని నిదానంగా సమురుతున్న అభిర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఓకే సార్!" అని పరుగున వెళ్లాడు సెక్యూరిటీ గార్డ్.

ఏనుగుని సముడుతూ వెనక్కి తిరిగి నీలమ్ వాళ్ళ వైపు చూసి "భయపడకండి ఇక్కడికి రండి. ఇది ఏమీ చెయ్యదు చాలా మంచిది." అని నవ్వుతూ చెప్పాడు అభిర్.

అప్పటివరకు భయంకరంగా అరిచినా ఏనుగు అభిర్ చేయ్యి తగలగానే ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యంగా చూస్తూ పక్కకు తిరిగి సందీప్ వైపు చూసి "సార్! ఆ బాబు ఎవరు?" అని అనుమానంగా అడిగాడు మస్తాన్.

"జంతువుల మనసు అర్థం చేసుకునే మనిషి!" అని నవ్వుతూ ముందుకు వెళ్ళింది నీలమ్.

సెక్యూరిటీ గార్డ్ తీసుకువచ్చిన ఫుడ్ ఏనుగు కి పెడుతూ వసుంధర  చేతిలో ఉన్న రోషిని వైపు చూసి నవ్వుతూ చేతికి ఇచ్చి "దాని నోట్లో పెట్టు!" అని చెప్పాడు అభిర్.

ఆ మాట విని భయంగా చూస్తూ "వద్దులే అభిర్! జాగ్రత్తగా కావాలి." అని కంగారుగా అంది వసుంధర.

"మేడం! ఈ జంతువులు కూడా మనలాంటివే, వీటికీ మాటరాదు కానీ మనసు ఉంటుంది." అని ఏనుగు వైపు చూసి "అందరికీ క్షమాపణ చెప్పు నిన్ను చూసి భయపడిపోయారు." అని చెప్పాడు అభిర్.

ఆ మాట విని తొండం ఎత్తి చిన్నగా అరిచింది ఆ ఏనుగు.

అది చూసి "హై భలే భలే..! ఆ ఏనుగు అభిర్ అన్న మాట వింటుంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు చాక్లెట్.

"ఏ జంతువు అయినా ప్రేమతో చెబితే ఎవరి మాటైనా వింటుంది అందరూ దానికి ఫుడ్ పెట్టండి." అని చెప్పాడు అభిర్.

అంతలో అక్కడికి మత్తు ఇంజక్షన్స్ తీసుకుని హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశాంతంగా ఉన్న ఏనుగు వైపు చూసి "ఓ మై గాడ్! నేను చాలా కంగారు పడిపోయాను." అని చెప్పాడు రుషి.

"సార్! ఆ బాబు, ఏనుగుని ఒక్క మాటతో ఆపారు." అని అభిర్ వైపు చూపించాడు మస్తాన్.

"అవునా?" అని అభిర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఈ ఏనుగుకి కోపం వస్తే ఇక్కడ మావాటి వాళ్ళ మాట కూడా వినదు, నీ మాట విని ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది?" అని అడిగాడు రుషి.

"ఇకనుంచి ఈ ఏనుగుకి కోపం రాదు, ప్రశాంతంగా ఉంటుంది." అని ఏనుగు వైపు చూసి "అవును కదా!" అని అడిగాడు అభిర్.

ఆ మాటకి తల ఊపుతూ ఉంది ఆ ఏనుగు.

"రియల్లీ గ్రేట్! ఏ జంతువు కూడా తనని పెంచిన వాళ్ళతో తప్పితే ఎవరితో ఇంత స్నేహంగా ఉండదు." అని చెప్పాడు రుషి.

దూరంనుంచి జరిగేది చూస్తూ మిచల్ వైపు తిరిగి "నువ్వేమో ఏదో చెప్పావు, ఆ అభిర్ గాడు అక్కడ మనకి సర్కస్ చూపిస్తున్నాడు. ఈసారైనా నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా? మళ్ళీ ఫెయిల్ అవుతుందా?" అని అడిగాడు జనార్ధన్.

"నా ప్లాన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు." అని కోపంగా జూలో ఉన్న తను మనిషి వైపు చూస్తూ 'వదులు!' అని సైగ చేశాడు మిచల్.

దూరంగా నుంచి మిచల్ చేసినా సైగ చూసి రెండు పెద్ద పులులు ఉన్న బోన్ పైకి ఎక్కి డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న గోడదూకి వేరే వైపుకి వెళ్ళిపోయాడు జూలో మనిషి.

అది చూసి నవ్వుతూ జనార్ధన్ వైపు చూసి "పద ఆ బోన్ పైకి వెళదాము, ఒకవేళ ఆ పెద్ద పులులు ఇటువైపు వచ్చిన మనం అందము." అని చెప్పి పైకి ఎక్కి దూరంగా ఉన్న తన మనుషుల వైపు చూసి వాళ్ళని కూడా పైకి ఎక్కమని సైగ చేశాడు మిచల్.

"ఒరేయ్! బాస్ మనల్ని కూడా పైకి ఎక్కమని సైగ చేశారు, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది త్వరగ పదండి." అని కంగారుగా చెప్పాడు చంటి.

ఆ మాట విని హడావుడిగా  అక్కడ ఉన్న బోన్ పైకి చెట్ల పైకి ఎక్కారు మిచల్ మనుషులు.

బోను పైకి ఎక్కి మిచెల్ వైపు చూసి "రఫీ గాడు ఇంకా ఆ మురళి గాడి పెళ్ళాం మీద రక్తం ప్యాకెట్ కొట్టడం ఏంటి?" అని ఆత్రుతగా అడిగాడు జనార్ధన్.

"అంత తొందర ఎందుకు? అప్పుడే కాదు, రెండు పులులు బోనులో నుంచి బయటకు వచ్చి వాటి గాండ్రింపు సౌండ్ వాడికి వినపడిన తర్వాత ఆ ప్యాకెట్ ఆ అమ్మాయి మీద కొడతాడు." అని చూస్తూ ఉన్నాడు మిచల్.

కాసేపటికి బోన్ లో ఉన్న రెండు పెద్ద పులులు బయటకు వచ్చి భయంకరంగా గాండ్రిస్తూ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లేయ్.

ఆ అరుపు ఉలిక్కిపడ్డ  వసుంధర వాళ్ళ వైపు చూసి "కంగారు పడకండి మేడం! అక్కడ ఉండే బోన్ లో రెండు పెద్ద పులులని పెట్టాము వాటికి కూడా అంతే చాలా కోపం ఎక్కువ!" అని చెప్పాడు మస్తాన్.

"అవునా?" అని సౌండ్ వచ్చిన వైపు చూసి పరుగెత్తుకుంటూ వస్తున్న రెండు పెద్దపులను చూసి బిగిసుకుపోయింది మిత్ర.

బిగుసుకుపోయి భయంగా చూస్తున్నా మిత్ర వైపు చూసి "ఏమైంది అక్క? అటువైపే చూస్తున్నావు." అని చూసి "బాబోయ్ పులులు! మన వైపే వస్తున్నాయి." అని గట్టిగా అరుస్తూ ప్యాంటు తడుపుకున్నాడు చాక్లెట్.

ఆ అరుపు విని వెనక్కి తిరిగి భయంగా చూస్తూ "ఓ మై గాడ్! ఇవి బయటికి ఎలా వచ్చాయి?" అని తన దగ్గర ఉన్న మత్తు ఇంజక్షన్స్ తో షూట్ చేస్తూ ఉన్నాడు రుషి.

రెండు పెద్ద పులులను చూసి భయంతో బిగిసుకుపోయి చూస్తూ ఉన్నారు నీలమ్, సుమతి వాళ్ళందరూ.

అంతలో దూరం నుంచి బ్లడ్ ప్యాకెట్ ని గీత వైపుకి గురి చూసి విసిరి అక్కడి నుంచి పరిగెత్తాడు రఫీ.

పులిని చూసి కంగారులో రోషిని ఎత్తుకొని పక్కకు జరిగిన వసుంధర తలకు తగిలింది ఆ బ్లడ్ ప్యాకెట్.

వసుంధర, రోషిని మీద బ్లడ్ పడడం చూసి "ఎవరో కావాలని బ్లడ్ పోశారు." అని గట్టిగా అరిచింది నీలమ్.

రక్తం వాసన రావడంతో అటువైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాయి రెండు పెద్ద పులులు.

ఒంటి మీద ఉన్న రక్తం చూసుకుని "త్వరగా అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. ఆ పులులు రక్తం వాసన చూసి మన వైపే వస్తున్నాయి." అని భయంగా చూస్తూ గట్టిగ అరిచింది వసుంధర.

రుషి షూట్ చేస్తున్న మత్తు ఇంజక్షన్స్ తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరింది ఒక పెద్ద పులి.

అరుపులు విని ఏనుగుని గొలుసుతో కడుతు గాలిలో ఉన్న పెద్ద పులి వైపు, ఎదురుగా రక్తంతో తడిసిన వసుంధరని చూసి పరుగెత్తుకుంటూ వస్తూ 'రాజు! ఆగు నన్ను కాపాడిన అమ్మ!" అని గట్టిగా అరిచాడు అభిర్.

అరుపు విని గాలిలో ఉన్న పెద్ద పులి తల తిప్పి చూసి పంజా వెనక్కి తీసుకుని కిందపడి లెగిసి అభిర్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది.

వెనకాల పరిగెత్తుకుంటూ వస్తునన్న ఇంకొక పెద్ద పులిని చూసి "షేర్!" అని గట్టిగా అరిచాడు అభిర్.

ఆ అరుపు విని ఆ పెద్ద పులి కూడా తల తిప్పి చూసి అభిర్ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది.

పెద్దపులి తన మీదకి దూకుతుంది అనుకుని రోషినిని గట్టిగా పట్టుకుని  కళ్ళు మూసుకొని అరుస్తున్న వసుంధర దగ్గరికి వెళ్లి "వదిన ఏమి అవ్వలేదు ఒక్కసారి కళ్ళు తెరిచి అభిర్ వైపు చూడు." అని ఏడుస్తూ చెప్పింది నీలమ్.

ఆ మాట విని కళ్ళు తెరిచి భయంగా చూస్తూ అభిర్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళుతున్న పెద్ద పులులను  ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది వసుంధర.

సందీప్ దగ్గరికి వచ్చి కంగారుగా చూస్తూ "అసలు ఎవరతను? ఆ పులులను పేర్లు పెట్టి పిలుస్తున్నాడు." అని అనుమానంగా అడిగాడు రుషి.

"అభిర్ గురించి మాకు కూడా తెలియదు." అని చెప్పాడు సందీప్.

వేగంగా  అభిర్ దగ్గరికి వెళ్లి  కింద పడేసి నాకుతు ఉన్నాయి రెండు పెద్ద పులులు.

అది చూసి "ఆ రెండు టైగర్స్ అభిర్ అంకుల్ ఫ్రెండ్స్ అనుకుంట!" అని మొహాన ఉన్న బ్లడ్ తుడుచుకుంటూ చెప్పింది రోషిని.

ఫాంట్ తడుపుకున్న చాక్లెట్ ని గట్టిగా పట్టుకుని "ఒరేయ్! ఈ అభిర్ కొంపతీసి టార్జానా ఏంటి?" అని భయంగా చూస్తూ అడిగింది మిత్ర.

వణుకుతూ "చూస్తుంటే అలాగే ఉంది అక్క! నాకు ఇంకా ఒకటి ఆగలేదు." అని చిటికెన వేలు చూపిస్తూ ఏడుస్తూ అన్నాడు చాక్లెట్.

"అసలు! అభిర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ జంతువులు తనని ప్రేమగా ఎందుకు చూస్తున్నాయి? వాటి పేర్లు అభిర్ కి ఎలా తెలుసు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అంది నీలమ్.

అంతలో గట్టిగా అరుస్తూ వేగంగా ఎగురుతూ నీలమ్ వాళ్ళ ముందు వాలింది భారీ గరుడ పక్షి.

తమ ముందు వాలిన పక్షి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.

పెద్ద పులుల మీద పడుకుని పక్షిని చూసి "సింబా!" అని గట్టిగా అరిచాడు అభిర్.

ఆ మాట విని వేగంగా అభిర్ దగ్గరకు వెళ్ళింది గరుడ పక్షి.

అది చూసి "ఈ జంతువులకి ఆ బాబుకి కచ్చితంగా ఏదో సంబంధం ఉంది." అని చెప్పాడు మస్తాన్.

బోన్ పైనుంచి జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు మిచల్, జనార్ధన్ లు.
[+] 5 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - Yesterday, 05:44 PM



Users browsing this thread: 1 Guest(s)