Yesterday, 05:40 PM
ఎపిసోడ్ 24
మిచల్ తెలివిగా పంపించిన పాంప్లెట్స్ చూసి జూకి వెళదామని డిసైడ్ అయ్యారు వసుంధర వాళ్ళు.
********************
శుక్ల దగ్గర నుంచి చాక్లెట్ తో కలిసి బైక్ మీద ఇంటికి వెళుతూ "పాఠక్ ఎక్కడ ఉన్నాడో తెలిసింది ఇంక వాడి ఫోన్ నెంబర్ సంపాదిస్తే అభిర్ గురించి మనకి కొంచెం డీటెయిల్స్ తెలుస్తాయి." అని చెప్పింది మిత్ర.
"అవును అక్క!" అని ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "జర్నలిస్ట్ అక్క చెప్పు బండి మీద ఉన్నాను." అని సంతోషంగా అన్నాడు చాక్లెట్.
"ఒరేయ్ చాక్లెట్! మేమందరం జూకి వెళుతున్నాము సరదాగా మీ అక్క తో కలిసి నువ్వు కూడా రా..! ఇంతకీ మిత్ర ఫోన్ కలవడం లేదు ఎక్కడ ఉంది?" అని అడిగింది నీలమ్.
"అక్క బైక్ డ్రైవింగ్ లో ఉంది అందుకని ఫోన్ సైలెంట్ లో పెట్టింది అనుకుంటా! మేమిద్దరం కచ్చితంగా వచ్చేస్తాము." సంతోషంగా చెప్పాడు చాక్లెట్.
"సరే!త్వరగా బయలుదేరండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది నీలమ్.
బైక్ డ్రైవ్ చేస్తూ "ఎవర్రా? అంత సంతోషంగా మాట్లాడుతున్నావు." డౌట్ గా అడిగింది మిత్ర.
"అక్క! అభిర్ అన్న ఫ్రెండ్, జర్నలిస్ట్ అక్క! అందరూ కలిసి జూకి వెళ్తున్నారంట మనల్ని కూడా రమ్మని కాల్ చేసింది." అని చెప్పాడు చాక్లెట్.
"అవునా? మనల్ని బానే గుర్తు పెట్టుకుంది రా..! సరే పద ఇటు నుంచి డైరెక్ట్ జూకి వెళదాము, వాళ్లతో పరిచయం మనకు చాలా అవసరం." అని రూట్ మార్చింది మిత్ర.
**********************
అదే సమయంలో తన అడ్డాలో ఫోన్లో మాట్లాడి జనార్ధన్ వైపు చూసి "నా ప్లాన్ సక్సెస్ అయింది ఆ లాయర్ ఫ్యామిలీతో సహా జూకి వస్తున్నారు." అని సంతోషంగా నవ్వుతూ చెప్పాడు మిచల్.
"సూపర్! ఇంతకీ జూ దగ్గర నీ ప్లాన్ ఏమిటి?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.
"పద వెళుతు మాట్లాడుకుందాము." అని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్ చంటి జూకి వెళదాము బయల్దేరండి." అని చెప్పాడు మిచల్.
"సరే భయ్యా!" అని సంతోషంగా మిగతా వాళ్లతో కలిసి వెళుతూ "కొత్త కొత్త జంతువులు వచ్చాయంట!" అని సంబరపడ్డాడు చంటి.
"ఓ.. సంతోషా పడిపోకు భయ్యా జూలో ఏదో మర్డర్ ప్లాన్ చేశాడు దానికోసం వెళుతున్నాము." అని చెప్పాడు రఫీ.
"అవునా? జూలో మర్డర్ ప్లాన్ ఏమిటిరా..!" అని టెన్షన్ గా చూస్తూ 'ఏదైనా తేడా జరిగితే జంతువుల చేతిలో మనం మర్డర్ అయిపోతాము.' అని అనుకుంటూ జీప్ ఎక్కడు చంటి.
కార్ లో జనార్ధన్ తో కలిసి వెళుతూ, "జూలో కొంతమంది స్టాప్ తో మాట్లాడాను లోపల రెండు పెద్ద పులులు మంచి కోపం మీద ఉన్నాయంట!' ఆ మురళీ జోషి పెళ్ళాం వాటి దగ్గరికి వెళ్ళగానే దానిని బయటకు వదులుతాడు." అని చెప్పాడు మిచల్.
"ఆ పెద్దపులి కరెక్ట్ గా మురళీ జోషి పెళ్ళాం మీద పడి తినడానికి వాటి చెవులో నువ్వు ఏమైనా చెప్పావ ఏంటి?" అని డౌట్ గా అడిగాడు జనార్ధన్
డ్రైవింగ్ చేస్తూ కారు బాక్స్ లో నుంచి బ్లడ్ ప్యాకెట్ తీసి చూపించి "ఆ టైంలో దానిమీద ఇది పోసాము అంటే చాలు, ఆ రెండు పెద్ద పుల్లు కరెక్ట్ గా వచ్చి దానిని పట్టుకుంటాయి, చావు వాటి ఖాతాలోకి వెళ్ళిపోతుంది." అని క్రూరంగా చూస్తూ అన్నాడు మిచల్.
"ఓరి నీ ఐడియా!" అని టెన్షన్ గా చూస్తూ "ఏదైనా తేడా జరిగితే ఆ పెద్ద పులలా దెబ్బకి అందరూ చస్తారు." అని కంగారుగా చెప్పాడు జనార్ధన్.
"టెన్షన్ పడకు అన్న! జూ స్టాఫ్ అక్కడ రెడీ గానే ఉంటారు వాళ్లకి ఇవన్నీ మామూలే!" అని చెప్పాడు మిచల్.
"ఒకవేళ ఆ ప్లాన్ మిస్ అయితే!" డౌట్ గా అడిగాడు జనార్ధన్.
"నా దగ్గర ప్లాన్ బి ఉంది అది చెప్పను నువ్వు భయపడతావు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసి చూపిస్తాను, నిన్ను ప్రాణాలతో మీ దేశానికి పంపుతాను లే కంగారు పడకు." అని నవ్వుతూ అన్నాడు మిచల్.
"మంచిది." అని చెప్పి'ఆ లాయర్ అనుమానం రాకుండా చంపమంటే వీడు మరీ క్రూరంగా తయారయ్యాడు.' అని సీట్లో సర్దుకుంటూ కూర్చుంటూ మిచల్ వైపు చూసి అనుకున్నాడు జనార్ధన్.
***********************
ఆదే సమయంలో ఇంటి దగ్గర రెడీ అవుతూ "ఆ జూ సూపర్డెంట్ నా ఫ్రెండ్ వస్తున్నామని కాల్ చేశాను, జూకి కొత్త జంతువులు వచ్చి చాలా కాలం అయింది అయినా మేము ఏ పాంప్లెట్లు కొట్టించలేదు అని చెబుతున్నాడు, మరి వీళ్ళకి పాంప్లెట్లు ఎలా వచ్చాయి?" అని డౌట్ గా అడిగాడు సందీప్.
"నాకు మాత్రం ఏం తెలుసు! ఇప్పుడు మీరు ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెబితే మీ అమ్మాయిని ఊరుకో పెట్టడం నావల్ల కాదు." అని రెండు చేతులు పైకి ఎత్తింది వసుంధర.
"లాయర్ గారికి వల్లే కాకపోతే కష్టం వెళదాములే!" అని నవ్వుతూ అన్నాడు సందీప్.
గెస్ట్ హౌస్ లో ఉన్న సుమతి వాళ్ళ దగ్గరికి వచ్చి "అందరూ రెడీ అయ్యారా? త్వరగా పదండి వెళదాము." అని అభిర్ వైపు చూసి
"నీకు జంతువులు అంటే చాలా ఇష్టం కదా! అక్కడ చాలా ఉంటాయి వాడితో నువ్వు ఎంత సేపు కావాలి అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు!" అని నవ్వుతూ చెప్పింది నీలమ్.
"ఆ జూ ఆ జంతువుల ఇల్లు కాదు, నాలానే అవి కూడా జైల్లో ఉన్నాయి అక్కడ అవి సంతోషంగా ఉండవు బాధగా ఉంటాయి మనం వాటిని ఓదార్చాలి అంతేకానీ చూసి నవ్వుకోకూడదు." అని చెప్పాడు అభిర్.
"నువ్వు చెప్పింది కూడా కరెక్టే! కానీ జంతువులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అడవిలో ఉండడం కన్నా జూలో ఉండడమే సేఫ్!" అని చెప్పింది నీలమ్.
"నిజమే! ఇక్కడ మనిషే బతకలేకపోతున్నాడు ఇంకా జంతువులేం బతుకుతాయి." అంది గీత.
"అభిర్! ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నింటిలోంచి బయటికి వచ్చావు కదా, పాత విషయాలన్నీ మర్చిపోయి కాస్త ఫ్రీగా ఉండు, నీకు దేంట్లో టాలెంట్ ఉందో దాంతో న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్!" అని చెప్పింది నీలమ్.
"సరే! అని స్మైల్ ఇచ్చి "ఇంక బయలుదేరుదామా?" అని అడిగాడు అభిర్.
"అబ్బో... నీకు నవ్వడం కూడా వచ్చా!" అని ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రోషిని వాళ్ళని చూసి కార్ ఎక్కి స్టార్ట్ చేసింది నీలమ్.
కాసేపటికి రెండు కార్లలో జూ దగ్గరికి వెళ్లి అక్కడ వెయిట్ చేస్తున్న మిత్రని చూసి "హాయ్!" అని చెప్పింది సుమతి.
కారులో నుంచి దిగుతూ మిత్ర వైపు డౌట్ గా చూసి "ఎవరి ఈ అమ్మాయి?" అని అడిగింది వసుంధర.
"తన పేరు మిత్ర నా ఫ్రెండ్! డిటెక్టివ్ గా చేస్తుంది వాడి పేరు చాక్లెట్ తన అసిస్టెంట్!" అని పరిచయం చేసింది నీలమ్.
"హాయ్ నీ పేరు భలే ఉంది చాక్లెట్! నేను రోజు తింటాను." అని చెప్పింది రోషిని.
ఆ మాటకి నవ్వుతూ అందరూ కలిసి జూన్ లోపలకి వెళ్లారు.
సందీప్ ని చూసి దగ్గరికి వచ్చి "హాయ్!" అని షేక్ హ్యాండ్ ఇచ్చి "నేను సూపర్డెంట్ గా వచ్చిన దగ్గర్నుంచి పిల్లల్ని తీసుకురమ్మని చెబుతున్నాను నీకు ఇప్పటికి కుదిరింది." అని వసుంధర వైపు చూసి "నమస్తే మేడం! నా పేరు రుషి!" అని పరిచయం చేసుకున్నాడు.
"నమస్తే అండి." అని మర్యాదగా పలకరించి రోషిని, ప్రణీత లతో కలిసి లోపలికి వెళ్ళింది వసుంధర.
ఋషికి నీలమ్ ని చూపిస్తూ "తను నా సిస్టర్ వాళ్ళ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్!" అని పరిచయం చేశాడు సందీప్.
"ఓకే! పదండి మీతో పాటు మా సెక్యూరిటీ గార్డు వస్తాడు." అని చెప్పి పక్కకు తిరిగి
"మస్తాన్! సార్ వాళ్లకి దగ్గర ఉండి అన్ని చూపించండి." అని చెప్పాడు రుషి.
"ఓకే సార్!" అని సందీప్ వాళ్ళతో పాటు వెనకాలే వెళ్ళాడు మస్తాన్.
జూలో దూరం నుంచి అభిర్ వాళ్లు రావడం చూసి "పెద్దపులికి ఆహారం అవ్వడానికి గొర్రెలు వచ్చేయ్!" అని మనసులో నవ్వుకున్నాడు మిచల్.
అక్కడ ఉన్న జంతువుల్ని చూపిస్తూ "మేడం! ఈ జూకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడికి రోజు ఒక పెద్ద గరుడ పక్షి వస్తుంది ఇక్కడ ఉన్న జంతువులని చూసి మళ్లీ వెళ్ళిపోతుంది." అని చెప్పాడు మస్తాన్.
"నిజమా? చాలా ఆశ్చర్యంగా ఉంది." అంది వసుంధర.
"ఈరోజు అది వచ్చే టైం అయింది మేడం! అంత పెద్ద పక్షిని మీరు ఎప్పుడు చూసి ఉండరు, అలాంటి పక్షి మన దేశంలో ఏ జూలో కూడా లేదు." అని చెప్పాడు మస్తాన్.
"ఇప్పుడు వస్తే బాగుండు సరదాగా అందరం చూడొచ్చు!" అన్నాడు చాక్లెట్.
"ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్లి పోతుందో ఎవ్వరికి తెలియదు, ఇక్కడ జంతువులు ఆ పక్షిని ఒకరోజు చూడకపోతే ఆహారం కూడా ముట్టుకోవు." అని చెప్పాడు మస్తాన్.
"చాలా విచిత్రంగా ఉంది. ఈ న్యూస్ కచ్చితంగా కాలమ్స్ లో రాస్తాను." అని చెప్పింది నీలమ్.
ఆ మాట విని అక్కడ ఉన్న జంతువుల వైపు చూస్తూ "ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది.?" అని అడిగాడు అభిర్.
"ఈ జంతువులని వేరువేరు జూలలో, సంరక్షణ కేంద్రాలలో ఉండేవి సార్! ఈమధ్య ఈ పెద్ద జూ కి పంపించారు." అని అక్కడ ఉన్న జంతువులు మొత్తం గట్టిగా అరవడం చూసి
"ఈ రోజు అన్ని ఇలా ఎందుకు అరుస్తున్నాయో అర్థం కావడం లేదు." అని అయోమయంగా చూస్తూ అన్నాడు మస్తాన్.
అంతలో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగులు చూసి "మస్తాన్! ఆ ఏనుగుని కట్టలేదా ఏంటి? మనవైపే పరిగెత్తుకుంటూ వస్తుంది." అని కంగారుగా అన్నాడు సందీప్.
"లేదు సార్! ఇక్కడ జంతువులన్నీ కట్టేసి ఉంటాయి." అని అక్కడికి గట్టిగా అరుస్తూ వేగంగా వస్తున్న ఏనుగు ని చూసి కంగారుగా వెళ్లి సైరన్ ఆన్ చేసి సెక్యూరిటీ ని అలెర్ట్ చేసాడు మస్తాన్.
దూరంగా నుంచుని పక్కనే ఉన్న మిచల్ వైపు చూసి "ఏంటయ్యా? నువ్వు పెద్దపులి అన్నావు, అక్కడ ఏనుగు వస్తుంది." అని అనుమానంగా అడిగాడు జనార్ధన్.
"మన మనిషి అనుమానం రాకుండా ఫస్టు ఏనుగుని వదిలి ఉంటాడు." అని చూస్తూ చెప్పాడు మిచల్.
సెక్యూరిటీ వాళ్ళని తొండంతో లేపి గిరాటు వేస్తూ మీదకి వస్తున్న ఏనుగుని చూసి భయంతో ఒక పక్కకి వెళ్లారు అందరూ.
"అభిర్ అక్కడే నుంచుని చూస్తున్నాడు." అని కంగారుగా చెప్పింది మిత్ర.
"అవునా?" అని పక్కకి తిరిగి "అభిర్ నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయ్!" అని గట్టిగా అరిచింది నీలమ్.
దూరం నుంచిని రఫీ వైపు చూసి బ్లడ్ గీత మీద పోయమని సైగ చేసి, జూలో ఉన్న తన మనిషి వైపు చూసి పెద్దపులిని వదలమని సైగ చేశాడు మిచల్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)