Yesterday, 05:38 PM
ఎపిసోడ్ 23
ముఖేష్ ఇచ్చిన పేపర్స్ తీసుకుని చూస్తూ 'నిరంజన్ అసిస్టెంట్ పాఠక్! ముందు వీడు ఉన్నాడో పోయాడో తెలుసుకోవాలి.' అనుకుంది మిత్ర.
*************************
కోర్టు కేసు జరిగే సమయంలో, రాజన్ తో కలసి ఉత్తరప్రదేశ్ లో ల్యాండ్ ప్రాపర్టీ చూస్తూ ఉన్న సుజిత్ దగ్గరికి వచ్చి "సార్! సెంట్రల్ మినిస్టర్ వరదరాజులు గారు కాల్ చేస్తున్నారు." అని ఫోన్ ఇచ్చింది రియా.
ఫోన్ తీసుకుంటూ రియా వైపు చూసి స్మైల్ ఇచ్చి "థాంక్యూ!" అని ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ అంకుల్! హౌ ఆర్ యు? ఎలా జరిగింది పార్టీ మీటింగ్!" అని అడిగాడు సుజిత్.
"ఫైన్! ఫైన్ సుజిత్! మనం ప్రాపర్టీ విషయం మాట్లాడుకుందాము అనుకున్నాము కదా ఈరోజు కలుద్దామా?" అని అడిగాడు వరదరాజులు.
"అంకుల్! నేను అవుట్ ఆఫ్ లో ఉన్నాను, మార్నింగ్ మీ ఇంటి దగ్గర ఉంటాను బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేస్తూ డీల్ కూడా కంప్లీట్ చేద్దాము." అని నవ్వుతూ చెప్పాడు సుజిత్.
"షూర్! నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు వరదరాజులు.
ఫోన్ రియాకి ఇస్తూ రాజన్ వైపు చూసి "గూర్ గామ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ సేల్ విషయం రేపు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను మాక్సిమం డీల్ కంప్లీట్ అవుతుంది." అని చెప్పాడు సుజిత్.
అంతలో అక్కడికి వస్తు "గుడ్ మార్నింగ్ సార్! మీరు ఓకే అంటే ఈ ల్యాండ్ డీల్ కూడా పెట్టుకుందాము బయ్యర్ రెడీగా ఉన్నాడు." అని చెప్పాడు అరుల్.
"వెయిట్! వెయిట్ ఫస్ట్ ఒక డీల్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాము." అని చెప్పాడు సుజిత్.
"ఓకే సార్! మీ ఇష్టం, నా దగ్గర బయ్యర్స్ రెడీగా ఉన్నారు మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు మీ ముందు కూర్చో పెడతాను." అని చెప్పాడు అరుల్.
అక్కడి నుంచి కారు దగ్గరికి వస్తూ "కచ్చితంగా నీ బయ్యర్స్ తో డీల్ కి కూర్చుందాము కాకపోతే కాస్త టైముంది." అని చెప్పి కార్ ఎక్కడు సుజిత్.
"ఓకే సార్ నో ప్రాబ్లెమ్! మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుల్.
కారులో అక్కడి నుంచి వెళుతూ బ్యాక్ సీట్లో ఉన్న సుజిత్ వైపు చూసి "సార్! ఆ మినిస్టర్ ప్రాపర్టీని చాలా చీప్ గా కొట్టేయాలని చూస్తాడు జాగ్రత్తగా మాట్లాడండి అతని గురించి నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు రాజన్.
"మనకి ఆ మినిస్టర్ తో ముందు ముందు చాలా పని ఉంది తీసుకొని ఉపయోగపడతాడు." అని చెప్పాడు సుజిత్.
"ఓకే సార్ మీ ఇష్టం!" అని చెప్పాడు రాజాన్.
************************
మరుసటి రోజు ఉదయం చాక్లెట్ తో కలిసి సెక్యూరిటీ అధికారి హెడ్ క్వార్టర్స్ లో ఎకౌంట్ సెక్షన్ దగ్గరికి వెళ్లి "ఆ పాఠక్ చరిత్ర మొత్తం ఇక్కడే ఉంటుంది. ఆ సెక్షన్ లో ఉన్న ఆఫీసర్ ని లైన్ లో పెడితే మనకు వెంటనే డీటెయిల్స్ దొరుకుతాయి." అని చూస్తూ చెప్పింది మిత్ర.
"అక్క వన్ మినిట్!" అని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ముందు నుంచి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి మిత్ర వైపు చూసి "అతని పేరు శుక్ల!" అని చెప్పాడు చాక్లెట్.
"ఈ శుక్ల సర్ ఎప్పుడు బయటకి వస్తారో!" అనుకుంటూ ఉండగా చైర్ లోనుంచి లెగిసి సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బయటికి వెళ్లడం చూసి "దొరికాడు రా.. పద! అని చాక్లెట్ తో కలిసి వెనకాల వెళ్ళింది మిత్ర.
బయటికి వచ్చి క్యాంటీన్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ "సాయంత్రానికి ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తాను నువ్వు మాత్రం ఆఫీస్ దగ్గరికి రాకు ప్లీజ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు శుక్ల.
ఆ మాట విని వేరే టేబుల్ దగ్గర కూర్చుని చాక్లెట్ ని దగ్గరికి పిలిచి "గురుడికి డబ్బులు అవసరం అనుకుంటా మనం తీర్చేద్దాము వెళ్లి నా దగ్గరికి తీసుకురా!" అని చెప్పింది మిత్ర.
"సరే అక్క!" అని సిగరెట్ తాగుతున్న శుక్ల దగ్గరికి వెళ్లి నవ్వుతూ చూస్తూ "నమస్తే సార్, చాక్లెట్!" అన్నాడు.
"నాకు ఇపుడు ఏ చాక్లెట్ వద్దు బాబు వెళ్ళు!" విసుగ్గా అన్నాడు శుక్ల.
"సార్! నా పేరు చాక్లెట్! నేను చాక్లెట్లు అమ్మే వాడిని కాదు." అని చెప్పాడు చాక్లేట్.
ఆ మాట విని "హో.. నీ పేరే చాక్లెట్ ఆ..!" అని నవ్వుతూ "బలే సిల్లిగా ఉంది ఏంటి చెప్పు?" అని అడిగాడు శుక్ల.
"నాకు తెలిసి మీకు ఇప్పుడు డబ్బులు బాగా అవసరం అనుకుంటా!" అని నెమ్మదిగా అన్నాడు చాక్లెట్.
"ఏ నువ్వు ఇస్తావా?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు శుక్ల.
"నేను ఇవ్వను సార్! మీకు ఇవ్వడానికి లక్ష్మీదేవి అక్కడ రెడీగా కూర్చుని ఉంది. మీరు వెళ్లి ఎదురుగా కూర్చుంటే చాలు, ఏటీఎం కూడా అవసరం ఉండదు విత్ డ్రా చేసుకుని వెళ్లిపోవడమే!" అని దూరంగా ఉన్న మిత్రని చూపించాడు చాక్లెట్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూసి మిత్ర ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లి ఎదురుగా కూర్చుని "నా నుంచి మీరు ఏదో ఆశించే వచ్చి ఉంటారు, నావల్ల డిపార్ట్మెంట్లో మీకు చిన్న పని కూడా అవ్వదు." అని చెప్పాడు శుక్ల.
"నేను ఒక డిటెక్టివ్ ని ఎవరి దగ్గరికి వెళితే ఏ పని అవుతుందో నాకు బాగా తెలుసు! మీకు అమౌంట్ ఎంత అవసరమో చెప్పండి. మిమ్మల్ని టెన్షన్ పెట్టే వాళ్ళ నుంచి ఫోన్ రాదు." అని చెప్పింది మిత్ర.
"నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి! కానీ నేను చేసే అంత పెద్ద సహాయం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు." డౌట్ గా చూస్తూ అడిగాడు శుక్ల.
"మీరు చేసేది అంత పెద్ద హెల్ప్ ఏమి కాదు చిన్న హెల్ప్ ఏ కానీ మీకు అంత డబ్బు ఎందుకు అవసరమో ముందు అది చెప్పండి." అని అడిగింది మిత్ర.
"మా అమ్మాయికి మంచి కాలేజీలో సీటు వచ్చింది అర్జెంటుగా రెండు లక్షలు కడితేనే జాయిన్ చేసుకుంటారు లేకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది.
నా దగ్గర అంత డబ్బు లేదు ఫార్మాలిటీస్ తీసుకునే అలవాటు లేదు అలాగని చూస్తు నా కూతురుని బాధ పెట్టాలి అనిపించడం లేదు ఏం చేయాలో తెలియక టెన్షన్ గా ఉన్నాను." అని చెప్పాడు శుక్ల.
"ఓకే సార్! మీరు అడిగిన రెండు లక్షలు ఇప్పుడే ఇస్తాను." అని స్లీప్ ఇచ్చి
"ఇతను 12 సంవత్సరాల క్రితం నో యిడా స్టేషన్లో కానిస్టేబుల్ గా చేశాడు, ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తున్నాడో మీకు మాత్రమే తెలుస్తుంది నాకు ఆ డీటెయిల్స్ కావాలి." అని చెప్పింది మిత్ర.
స్లిప్పు తీసుకుని చూసి కాసేపు ఆలోచించి "ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి." అని లోపలికి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చి
"అతను బీహార్ దగ్గర రుద్రపూర్ అనే ఊర్లో ఎస్సైగా చేస్తున్నడు." అని చెప్పాడు శుక్ల.
"థాంక్యూ! హ్యాపీగా వెళ్లి మీ పాపని కాలేజీలో జాయిన్ చేయండి." అని చెప్పి చాక్లెట్ వైపు చూసి
"సార్ కి స్వీట్ ప్యాకెట్ ఇవ్వరా..!" అని చెప్పింది మిత్ర.
"ఓకే అక్క!" అని శుక్ల చేతిలో స్వీట్ ప్యాకెట్ పెట్టి ఇంకో చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసుకుని "ఇంకా మీకు ఇది అవసరం లేదు సార్!" అని చెప్పాడు చాక్లెట్.
"థాంక్యూ సో మచ్! ఇంత చిన్న పనికి అంత పెద్ద అమౌంట్ ఇవ్వనవసరం లేదు కాని...!" డౌట్ గా చూసాడు శుక్లా.
"నేను ఇచ్చిన డబ్బు మీరు చేసిన పనికి కాదు మీ అమ్మాయి చదువుకి!" అని బైక్ స్టార్ట్ చేసుకుని చాక్లెట్ తో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిత్ర.
ఆ మాట విని అక్కడి నుంచి వెళుతున్న మిత్ర వాళ్ళ వైపు సంతోషంగా చూసి ఫోన్ తీసి కూతురికి ఫోన్ చేశాడు శుక్ల.
************************
అదే సమయంలో తన మనుషుల వైపు చూసి "ఒరేయ్ రఫీ, చంటి! మీరిద్దరూ ఏం చేస్తారంటే, ఈ జూ పాంప్లెట్స్ ని కాలేజ్ నుంచి వెళుతున్న లాయర్ వసుంధర కూతురికి, ఆఫీసులో ఉన్న ఆ జర్నలిస్టు దగ్గరకి వెళ్లేటట్లు చేయండి." అని చెప్పాడు మిచల్.
"సరే బాయ్!" అని పాంప్లెట్లు తీసుకుని చూసి
"బాయ్! జూలో కొత్త జంతువులు వచ్చాయని ఉంది మనం కూడా వెళ్లి చూద్దామా?" అని అడిగాడు చంటి.
ఆ మాటకి కోపంగా చూస్తూ "నోరు మూసుకొని ముందు నేను చెప్పిన పని చేసి రండి." అని చెప్పాడు మిచల్.
"సరే బాయ్!" అని పాంప్లెట్స్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్లారు ఇద్దరు.
మిచల్ వైపు చూస్తూ "జూ పంప్లేట్స్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించావు?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.
"ఈరోజు శనివారం ఆ పాంప్లెట్స్ చూసి కచ్చితంగా టెంప్ట్ అయ్యి ఫ్యామిలీ మొత్తం సాయంత్రం జూకి వస్తారు అక్కడే నా ప్లాన్ వర్క్ అవుట్ చేస్తాను." అని చెప్పాడు మిచల్.
ఆ మాట విని "ఏంటి లోపల ఉన్న పెద్దపులిని బయటకు వదులుతావా ఏంటి?" నవ్వుతూ అడిగాడు జనార్ధన్.
"ఏం జరుగుతుందో సాయంత్రం చూడండి." అన్నాడు మిచల్.
************************
మిచల్ మనుషులు పాంప్లెట్స్ రోషిని దగ్గరికి నీలమ్ దగ్గరికి వెళ్ళేటట్లు చేయడంతో కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వెళ్లి
"మమ్మీ జూలోకి కొత్త కొత్త జంతువులు వచ్చాయంట! మళ్ళి టు డేస్ లో వెళ్ళిపోతాయంట! మనం వెళ్లి చూసి వద్దాము." అని అడిగింది రోషిని.
అక్కడికి వస్తూ "అవును వదిన నేను కూడా విన్నాను ఈరోజు శనివారం అందరికీ హాఫ్ డే సరదాగా సాయంత్రం వెళదాము, గీత ఆంటీ వాళ్ళు, అభిర్ కూడా ఈ మూడ్ నుంచి డైవర్ట్ అవుతారు." అని చెప్పింది నీలమ్.
"సరే!" అని ఫోన్ తీసి రోషినికి ఇచ్చి "మీ డాడీ కి నువ్వే కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మను, ముద్దుల కూతురు చెబితేనే వస్తారు." అని నవ్వుతూ అంది వసుంధర.
"ఓకే!" అని సంతోషంగా ఫోన్ తీసుకుని సందీప్ కి కాల్ చేయడానికి నీలమ్ దగ్గరికి వచ్చింది రోషిని.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)