13-01-2026, 05:18 PM
(This post was last modified: 13-01-2026, 05:18 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 41
ఆ ఉత్తరం చదివిన ధనుంజయ్ చాలాసేపటి వరకు మనిషి కాలేకపోతాడు. తనంతట తానుగా రియలైజ్ అవ్వాలని ఎవరు కదపకుండా చూస్తూ ఉంటారు.
ఎంతసేపైనా ధనుంజయ్ ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుతూఉంటాడు. సత్యవతి గారికి మనసు వొప్పక ధనుంజయ్ భుజం మీద చేయి వేసి కదుపుతారు.
మనలోకంలోకి వచ్చిన ధనుంజయ్ సత్యవతి గారి నడుం చుట్టూ చేతులు వేసి అమ్మా అని బోరున ఏడుస్తాడు. ఇప్పుడు ఏడవడం వల్ల ఉపయోగమేముంది ధనుంజయ్ అని ఊరుకో పెడతారు.
నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు జరిగి పోయింది. అవని జీవితంలో నన్ను క్షమిస్తుందా అని అడుగుతాడు.
శిల్ప వైపు తిరిగి నువ్వు ఎలాగో చెడిపోయావు కదా రాక్షసి.
అవని జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేయాలనిచూసావు అని కోపంగా అడుగుతారు. జరిగిందంతా చూసాక ఇంకా శిల్ప కూడా తన రియాలిటీ లోకి వచ్చేస్తుంది.
ఏంటి డాడీ మీరు నా మీద కోప్పడుతున్నారు. మీరు అవని మీద ఫోకస్ పెట్టకపోతే అది నాదా తప్పు. నాకా అవకాశం ఉంది నేను యూస్ చేసుకున్నాను అని పొగరుగా చెబుతుంది.
శిల్ప మాట తిరుకి ధనుంజయ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎప్పుడూ తన ముందు అణిగి మణిగి,పద్ధతిగా మాట్లాడే శిల్ప నా అని.
ఇన్ని రోజులు నా ముందు నటించావా అని అడుగుతాడు. నటించాల్సిన అవసరం నాకేముంది నాకు కావాల్సిన దాన్ని కోసం ఒక స్టెప్ తగ్గి ఉన్నాను అంతే.
దానికోసం అవిని నీ యూస్ చేసుకున్నాను అంతే కదా మామ్ అని భార్గవి వైపు తిరుగుతుంది. అప్పటికే భార్గవికి ఒళ్లంతా చెమటలు పట్టేసి కూతురు వైపు దీనంగా చూస్తుంది.
దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇన్నాళ్లు జాగ్రత్తగా చేసుకువచ్చినదంతా ఒక రోజుతో నాశనంచేసేసింది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది.
నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా.. ఎప్పుడు డాడీ ముందు పద్ధతిగా ఉండేదానివి. ఒక్క నీ మోడలింగ్ ఫీల్డ్ మీద ఉన్నా ఇంటరెస్ట్ తో ఆ రోజు బయటికి వెళ్లావు.
నాకు ముందే తెలిస్తే వెళ్లనివ్వను అని చెప్పకుండా వెళ్ళావు. అది ఒక్కటే నీ తప్పు. అంతేగాని నువ్వు అవని నీ ఎప్పుడూ తక్కువ చేసే బిహేవ్ చేయలేదు కదా..
ఎందుకు ఇప్పుడు అవని నీ ఎక్కువ చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు అని ఇంకా కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
ధనుంజయ్ కి చిరాకు వచ్చి ఇంకా ఆపు భార్గవి నీ నాటకాలు. ఇంత జరిగినా సరే నీ కూతుర్ని వెనకేసుకొచ్చి అవని నీ తప్పు పట్టడానికి చూస్తున్నావు.
ఏంటి డాడీ ఇందాకటి నుంచి చూస్తున్నాను నేనేం తప్పు చేశాను అని మాట్లాడుతున్నారు. అయినా తప్పంతా మీరు చేసే నన్ను అంటారేంటి అని కోపంగా అరుస్తుంది.
నేనేం తప్పు చేశాను అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీరేమీ తప్పు చేయలేదా అని అంతే సీరియస్ గా అడుగుతుంది. నేనేం తప్పు చేయలేదు అని చెబుతాడు.
అవునా ... మన ఇంట్లో అవని బెడ్ రూమ్ ఎలా ఉంటుంది.. నా బెడ్ రూమ్ ఎలా ఉంటుంది. అవని ఎలాంటి ఫుడ్డు తింటుంది... నేను ఎలాంటి ఫుడ్డు తింటాను.
అవని ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది.. నేను ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను. అట్లీస్ట్ అవని నీ ఏ ఫంక్షన్ కైనా మీరు తీసుకు వెళ్లారా.. పోనీ ఎవరికైనా మీకు అవిని అనే ఇంకొక కూతురు ఉంది అన్న విషయం తెలుసా అని చాలా పొగరు గా అడుగుతుంది.
ఆ మాటలకి ధనుంజయ్ బిగుసుకుపోయి ఏమి చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతాడు. ఏంటి డాడీ నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు కదా...
ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు అవిని విషయంలో తప్పు చేశారో.. తప్పంతా మీరు చేసి నన్నంటారేంటి...
ధనుంజయ్ విరక్తిగా అవును నిజంగానే నేను తప్పు చేశాను. మీ అమ్మ మాటలే ఎప్పుడూ వింటూ అవే నిజాలనుకుని నా కూతురికి దూరమైపోయాను.
కానీ మీరిద్దరూ మేక తోలు కప్పుకున్న తోడేళ్లు అని తెలుసుకోలేకపోయాను. ఎందుకు భార్గవి ఇలా చేశావు నీకు ఏం తక్కువగా జరిగిందా ఆ ఇంట్లో అని బాధగా అడుగుతాడు.
ఆ ఇంట్లో భార్గవికి ఏం తక్కువైందో నేను చెబుతాను కదా ధనంజయ్ గారు అని విక్రమ్ వాయిస్ వినపడుతుంది.
ఇంకొక వీడియో ఆన్ చేస్తాడు. అది ఉదయ్ హాస్పిటల్లో ఎడ్మిట్ చేసిన తర్వాత భార్గవి ని సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు.. సునీల్ దంపతులకి భార్గవ్ కి మధ్యన జరిగిన గొడవ కి సంబంధించిన వీడియో.
భార్గవి క్వార్టర్స్ లోకి వెళ్లగానే అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తూన్నావు భార్గవి అని సునీల్ కోపంగా అడుగుతాడు.
నువ్వు చేసింది ఏమిటి ఉదయ్ హాస్పిటల్ లో ఉన్నాడు. డబ్బులు కావాలనే కదా నాకు చెప్పావు. అయినా నేను కూడా హాస్పిటల్ నుంచే కదా వచ్చాను.
మరి మీ బావ ముందు ఎందుకు అలా మాట్లాడావు అని కోపంగా అడుగుతుంది. నేను నిజమే కదా చెప్పాను అని చాలా కేర్లెస్ గా మాట్లాడుతాడు.
నువ్వు మాట్లాడే విధానం అసలు బాగోలేదు. నాకు కోపం తెప్పించకు అని అరుస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు రజితని చంపినట్టుగా మమ్మల్ని చంపుతావా అని రెచ్చగొడతాడు.
ఆ మాటలకి భార్గవి వంకరగా నవ్వుతూ నీకు ఇంకా రజిత చావు గుర్తుందా...గుర్తుండి కూడా నాతో పెట్టుకుంటున్నావా అని అడుగుతుంది.
అన్ని గుర్తున్నాయి. మమ్మల్ని బావ నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తుంటే.. నాకెందుకు అని ఊరుకున్నావు కదా..అప్పుడే అర్థమైంది నీ అవసరం తీరిపోతే మమ్మల్ని కూడా అలాగే చేస్తావని.
అన్నీ తెలిసి కూడా నాతో పెట్టుకున్నావు అంటే మిమ్మల్ని ఏం చేయాలి అని అంటుంది. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు.
ఏమన్నా చేస్తే ముందు బావ దగ్గరికి వెళ్లి రజిత ని నువ్వే మెట్లు పైనుంచి తోసేసావని చెబుతాను. తర్వాత అవని నీ ప్రేమగా చూసుకుంటున్న వంకతో బావ జీవితంలోకి ఎలా వెళ్లావో కూడా అర్థమయ్యే విధంగా చెబుతాను.
రజిత మీద ఉన్న కోపంతో అవిని నీ ఎలా పని మనిషిని చేసావో కూడా అన్ని వివరంగా చెబుతాను అని అనగానే... భార్గవి గట్టిగా నవ్వుతూ నువ్వు చెబితే మాత్రం మా ఆయన నమ్ముతాడని అనుకుంటున్నావా...
ఆయన్ని ఎక్కడ నొక్కాలో కూడా నాకు బాగా తెలుసు. మగవాడికి ఆడదాని అవసరం ఉన్నంతవరకు ఆడదాని చేతిలో కీలుబొమ్మే.
రెండే రెండు రోజుల్లో మీ బావే వచ్చి నన్ను తీసుకువెళ్తాడు అని పొగరుగా చెప్పి వెళ్లి మంచం మీద పడుకుంటుంది.
వీడియో చూడగానే భార్గవి టెన్షన్తో బిగిసిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది.
ధనుంజయ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు బెల్ట్ తో ఇంకొక రౌండ్ భార్గవిని వేసి ఎందుకు రజితని చంపావు అని రక్తం వచ్చేలాగా కొడుతూ ఉంటాడు.
శిల్ప కూడా ఆ దెబ్బలు చూసి స్తంభం చాటుకి వెళ్లి దాక్కుంటుంది. భార్గవి ఆ దెబ్బలని తట్టుకోలేక నేనే చంపాను అయితే ఏంటి అని గట్టిగా అరుస్తుంది.
ధనుంజయ్ కొట్టడం ఆపి ఎందుకు చేసావు అని అరుస్తాడు. రజిత మీద ఉన్న అసుయతో చేశాను.
ఎప్పుడు ఊరు వచ్చిన కారులోనే వచ్చేది. అందరికీ అన్ని రకాలు తీసుకోవచ్చేది.అవన్నీ చూడగానే నాకు సొంతం చేసుకోవాలి అనిపించింది.
అనుకోని అవకాశంగా అవని పుట్టినరోజు వచ్చింది. మా అమ్మ, అన్నయ్య సలహాతోనే రజితని మెట్ల పైనుంచి తోసేసాను..
అసలు అవిని నీ కూడా తోసేద్దాం అనుకున్నాను కానీ... అది లేకపోతే నీ జీవితంలోకి రావడం కష్టమని దాన్ని ప్రాణాలతో ఉంచాను.
అనుకున్నట్టుగానే నీ జీవితంలోకి వచ్చాను. కానీ ఎక్కడా కూడా అవని నీ కూతురుగా చెప్పడం నాకు ఇష్టం లేదు.
అందుకే నీకే అవని రావడం ఇష్టం లేదు అని చిన్నప్పటి నుంచి నూరు పోసి దాన్ని గదిలో నుంచి బయటికి రానివ్వలేదు..
ఎక్కడికి వెళ్లినా ధనుంజయ్ కి ఒక్కతే కూతురు అది శిల్ప అని మాత్రమే తెలిసేలాగా చేశాను. చిన్నప్పటినుండి అవని నీ ఒక నార్మల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునేటట్టుగా చేశాను.
ఎక్కడ కూడా ఒక తండ్రిగా మీ సంతకం కానీ, మీ పేరు గాని లేకుండా అనాధ కింద క్రియేట్ చేశాను.నీ కింగ్డమ్ కి మొత్తానికి ఏకైక వారసురాలు శిల్ప అని జనం అనుకునే లాగా చేశాను.
ఆఖరికి ఈ పెళ్లి విషయంలో కూడా శిల్పకి విక్రమ్ తో పెళ్లి చేయాలని మీ కోరిక. పెద్ద వాళ్ళు ముందు కావాలని అడుగుతారు. ఇష్టం లేదని చెప్పమన్నారు అని చెప్పాను. అందుకే అవని ఆ రోజు అలా చెప్పింది.
ఈ శిల్ప చేసిన తింగరి పని వల్ల ఆ తాళి అవని మెడలో పడింది. శోభనం రోజు రాత్రి అవని నీ మేమే బెదిరించాము.
ఆరోజు కూడా అదంతా మీరే చేయమన్నట్టుగా చేశాను. అందుకే అవిని కీ మీ మీద పూర్తిగా విరక్తి వచ్చేసింది. ఎప్పటికైనా ఎదురు తిరుగుతుందేమో అన్న అనుమానం తోనే ఉదయ్ తో అవిని జీవితం నాశనం చేయాలి అనుకున్నాను.
అది తప్పించుకుని పారిపోయింది. ఎలాగో పారిపోయింది కదా అని బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేశాను.
ఆ ఉదయ్ గాడు సరిగ్గా ప్లాన్ చేయక దొరికిపోయాడు.
అవిని కోసం మీరు తాపత్రయపడడం నాకు అస్సలు నచ్చలేదు. ఏదైనా చేయాలి అనుకునే లోపు నా ప్లాన్లు అన్ని రివర్స్ అయిపోయినాయి అని ఆవేశంలో తనకు తెలియకుండానే అన్ని నిజాలు చెప్పేస్తుంది.
భార్గవి చెబుతున్న నిజాలు వింటున్న అందరికీ అసహ్యం జుగుప్సా కలుగుతాయి. భార్గవి లో ఒక సైకో కనపడుతుంది.
ఒంటిపైనున్న రక్తం తుడుచుకుంటూ అక్కడున్న సోఫాలో కూర్చుని ఇప్పుడు మీరు వెళ్లి అవినికి నిజాలు చెబితే మాత్రం మిమ్మల్ని నమ్ముతుంది అనుకుంటున్నారా అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)