13-01-2026, 05:14 PM
(This post was last modified: 13-01-2026, 05:15 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 40
శిల్ప జ్యూస్ తీసుకువచ్చి క్రిష్ ముందు నిలబడుతుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. మాట్లాడితే ఎక్కడ తన గొంతు గుర్తుపడతాడు ఏమో అని సైలెంట్ గా ఇస్తుంది.
క్రిష్ అనుమానం గా చూస్తూ గ్లాస్ తీసుకోవడానికి చెయ్యి ముందుకు పెడతాడు. తొందరగా తీసుకుంటే వెళ్ళిపోవాలి అని శిల్ప ఒక పాదం ఎత్తుతుంది.
క్రిష్ బ్యాక్ సైడ్ కి ఉన్నా స్టాండ్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఆ ఫ్యాన్ గాలి శిల్ప ఫేస్ కి తగేలేలాగా సెట్ చేస్తారు. వినయ్ ఫ్యాన్ దగ్గర ఉండి శిల్ప ఫేస్ కి తగేలేలాగా చేస్తాడు.
అంతే శిల్ప ఫేస్ మీద ఉన్నా ముసుగు ఎగిరిపోతుంది. చెయ్యి ముందుకు పెట్టిన క్రిష్ శిల్ప ఫేస్ చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు.
ఆశ్చర్యంగా శిల్పా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. దానికి శిల్పా టెన్షన్గా క్రిష్ వైపు విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది.
విక్రమ్ మాత్రం సూటిగా శిల్ప వైపే చూస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో తెలియక చెమటలు తుడుచుకుంటూ ఉంటుంది. నిన్నే శిల్పా అడిగేది ఇక్కడున్నావు ఏంటి అని చెయ్యి పట్టుకుని కదుపుతాడు.
లలిత వెంటనే నీకు శిల్ప తెలుసా బాబు అని అడుగుతుంది. నాకెందుకు తెలియదు ఆంటీ. తనకి మోడలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కదా..అప్పటి నుంచి నాతో టచ్ లోనే ఉంది.
రీసెంట్ గానే సెలెక్ట్ కూడా అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ కూడా ఉంది. ఏం శిల్పా చెప్పలేదా అని అడుగుతూ...నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటే సమాధానం చెప్పవేంటి అని మళ్ళీ అడుగుతాడు.
దాంతో శిల్ప మనస్సులో అయిపోయింది ఈరోజు తో నా జీవితం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే ధనుంజయ్ ఫ్యామిలీ కూడా లోపలికి ఎంటర్ అవుతారు. భార్గవి వెంటనే శిల్ప దగ్గరికి వెళ్లి అమ్మ శిల్ప అని పిలుస్తుంది.
శిల్ప ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఫ్యామిలీ మొత్తం కనపడుతుంది. ఇక అరిపాదాల నుంచి నడి నెత్తి వరకు చెమట కారిపోతూ ఉంటుంది.
మామ్ నువ్వేంటి ఇప్పుడు ఎక్కడ అని తడబడుతూ అడుగుతుంది. అదేంటి శిల్ప అలా తడబడుతున్నావు.. నువ్వు ముసుగు కూడా తీసేసావు.
మీ అత్తయ్య గారు మన ఫ్యామిలీ మొత్తాన్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు అందుకే వచ్చాము అని చెబుతారు.
క్రిష్ ఎవరో అన్నది శిల్పకి తప్ప ధనుంజయ్ ఫ్యామిలీకి తెలియదు. అందుకే భార్గవి తన ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది.
సెలక్షన్స్ ఎప్పుడు జరిగాయి క్రిష్ అని లలిత అడుగుతుంది దానికి క్రిష్ చెప్పిన డేట్ వినగానే అంటే ఆరోజు మా విక్రమ్ పెళ్లి కదా అంతేనా అన్నయ్యగారు అని ధనుంజయ్ తిరిగి అడుగుతుంది.
అవునమ్మా కానీ మీరు ఏమి అడుగుతున్నారు దేని గురించి అన్నది నాకేమీ అర్థం కావడం లేదు అని అయోమయంగా చెబుతారు.
అప్పుడే కంగారు పడతారు ఎందుకు అన్నయ్యగారు కూర్చోండి అని.. ఈ అబ్బాయికి మీ శిల్ప బాగా తెలుసు అంట అని నొక్కి చెబుతుంది.
ఆ మాట తీరికి ధనుంజయ్ కి ఇబ్బందిగా అనిపిస్తుంది. భార్గవి కోపంగా ఏంటండీ వదినగారు మీరు మాట్లాడే విధానం అంటే...
ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు భార్గవి కూర్చోండి చెబుతాం కదా అని... ధనుంజయ్ వైపు తిరిగి మీ చిన్నమ్మాయికి మోడలింగ్ అంటే ఇష్టం ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతారు.
దానికి ధనుంజయ్ ఆశ్చర్యపోతూ భార్గవి వైపు చూస్తాడు.
భార్గవి తడబడుతూ ఇదంతా అబద్ధం మా అమ్మాయి కాలేజ్, ఇల్లు తప్ప బయట ప్రపంచమే తెలియదు అని బొకాయిస్తుంది.
క్రిష్ కి మాత్రం అంతా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కానీ... సంథింగ్ ఫిషీ అని సైలెంట్ గా జరిగేది చూస్తూ ఉంటాడు.
అంత కోపం వద్దు భార్గవి అని టీవీ ఆన్ చేస్తారు. అప్పటికే రికార్డ్ అయిన వీడియో కనెక్ట్ చేసి ఉంచుతారు. అది కరెక్ట్ గా విక్రమ్ పెళ్లి రోజు డేట్.
అక్కడ శిల్ప థైస్ వరకు ఉన్న ఒక స్లీవ్ లెస్ డీప్ నెక్ ఫ్రాక్ వేసుకునే ఉంటుంది. అది చూడగానే ధనుంజయ్ అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు.
ఇక్కడ విక్రమ్ ఫ్యామిలీ లో ఉన్న జెంట్స్ కూడా తల పక్కకి తిప్పుకుంటారు. శిల్పా క్రిష్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. అలాగే క్రిష్ ఫ్రెండ్ తో కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది.
సెలక్షన్స్ అయిపోయిన తర్వాత శిల్ప డ్రింక్ చేస్తూ క్రిష్ ఫ్రెండ్ తో రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అది చూడగానే ధనుంజయ్ కి తట్టుకోలేనంత కోపం వచ్చి స్పీడ్ గా లెగిసి శిల్ప చెంప మీద గట్టిగా కొడతాడు.
ఆ ఫోర్స్ కి శిల్పా నేలని ముద్దాడుతుంది. వెంటనే భార్గవి ఏంటండీ మీరు అని వెళ్లి శిల్పని గట్టిగా పట్టుకుని బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటుంది..
మామ్ అని భార్గవిని గట్టిగా హగ్ చేసుకుని భయంగా అందరినీ చూస్తూ ఉంటుంది. వెంటనే కళ్యాణ్ ధనుంజయ్ ముందుకు వెళ్లి ఇప్పుడు శిల్ప ని కొట్టడం కాదు.
ఆరోజు పెళ్లి కదా.. అక్కడ శిల్ప లేదు అంటే..పెళ్లి పీటల మీద ఉన్నది ఎవరు? ధనుంజయ్ గారు అని సూటిగా అడుగుతాడు.
అంతే ఆ మాటకి భార్గవి గుండెల్లో విమానాలే దూసుకు వెళుతూ ఉంటాయి. ధనుంజయ్ భార్గవి వైపు చూసి జబ్బ పట్టుకుని పైకి లేపి నిజం చెప్పు భార్గవి.
ఆరోజు పెళ్లి పీటల మీద కూర్చుంది ఎవరు? అని భార్గవిని కూడా రెండు పీకుతాడు. భార్గవి రెండు చెంపలపై రెండు చేతుల్ని పెట్టుకుని అందరి వంక భయంగా చూస్తూ... అత్తగారు అయితే సేవ్ చేస్తారేమో అని ఆవిడ వైపు అడుగులు వేయబోతుంది.
వెంటనే సత్యవతి గారు నువ్వు అక్కడే ఆగు. నిజం చెబితే నీకు నీ కూతురికి మంచిది. లేకపోతే నాలుగు పీకు అయిన నిజాలు చెప్పించాల్సి వస్తుంది.
ఎలాగు నిజం చెప్పక తప్పదు. దెబ్బలైనా తప్పించుకుంటే మీకే మంచిది అని కటువుగా మాట్లాడుతారు. ఇంక తప్పించుకునే దారి లేదని అర్థమయ్యి అవని అని చెప్పి తలదించుకుంటుంది.
ధనుంజయ్ కోపం, ఆశ్చర్యంతో ఆరోజు అవని పెళ్లికొప్పుకోలేదని చెప్పావు కదా.. మరి ఎలాగా పీటల మీద కూర్చుంది అని గట్టిగా అడుగుతాడు.
ఏం చెప్పాలో తెలియక అది అది అని నాన్చుతూ ఉంటుంది. నా సహనాన్ని పరీక్షించవద్దు భార్గవి నిజం చెప్పు అని గట్టిగా అరుస్తారు.
నేనే బ్రతిమాలి కూర్చోబెట్టాను అండి ఇంటి పరువు పోకూడదు అని అమాయకంగా చెబుతుంది. మరి అలాంటప్పుడు తాళిపడిన అవని యే కదా విక్రమ్ భార్య గా ఉండాలి కానీ..
ఆ స్థానంలోకి శిల్ప ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అని ఇంకొక రౌండ్ వేస్తారు. ప్లీజ్ అండి కొట్టకండి. అందరి ముందు అని అడిగితే...
నువ్వు చేసిన పనికి అందరిలోనూ నా ఇంటి పరువు పోలేదా అని అసహ్యంగా చూస్తాడు. అప్పటికి భార్గవి ఏమి చెప్పకుండా తలదించుకునే ఉంటుంది.
వెంటనే ఇంకొక వీడియో ఆన్ అవుతుంది. ఉదయ్ పెళ్ళిలో జరిగింది మొత్తం చెబుతూ ఉన్న వీడియో. అది చూడగానే భార్గవి, శిల్ప భయంతో వణుకుపోతూ ఒకళ్ళని ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటారు.
ఇది అంతా అబద్ధం అవిని నీ నేను ఏమి చేయలేదు అని భయంగా చెబుతూ ఉంటుంది. అప్పుడే బిందు లోపలికి వస్తూ ఎందుకు భార్గవి అబద్ధం చెబుతున్నావు.
ఆరోజు నేను ఉదయ్ కూడా అక్కడే ఉన్నాము కదా.. మనము ఈ ఫొటోస్ చూపించి భయపెట్టలేదా అని ఫొటోస్ ధనుంజయ్ చేతికి ఇస్తుంది.
ఆ ఫొటోస్ లో అవని ఉదయతో చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉండి చాలా అసహ్యంగా ఉంటాయి. భార్గవి వైపు కోపంగా చూస్తూ తప్పు చేసింది నీ కూతురైతే...
అవిని మీద ఎందుకింత పెద్ద నింద మోపావు. నీకు అసలు మనసు ఎలా వచ్చింది అని కోపం తట్టుకోలేక నడుముకు ఉన్న బెల్టు తీసి మరీ కొడతాడు.
ఆ దెబ్బలు తట్టుకోలేక ప్లీజ్ అండి కొట్టొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. కొట్టడం కాదే నిన్ను చంపేయాలి. నాకు నా కూతురు మధ్యన ఇంత దూరం తీసుకో వస్తావా అని అక్కడున్న సోఫాలో కూర్చుని బాధపడతారు.
ఇప్పుడు బాధపడడం వల్ల ఉపయోగం ఏముంది ధనుంజయ్ అని శేషగిరి గారు అంటారు. నాన్న అని బాధగా అనగానే... నాన్ననే మాట్లాడుతున్నాను.
ఏ రోజైనా అవిని కీ దగ్గరగా ఉన్నావా... నీ పెళ్ళాం ఏది చెబితే అది గంగిరెద్దులాగా తల ఊపావు. అంతేగాని అవని దగ్గర కూర్చుని ఏం కావాలి, ఏంటి అని మాట్లాడావా...
శిల్పతో ఉన్నట్టుగా అవిని తో ఏ రోజు అయినా ఉన్నావా ధనుంజయ్ అని కోపంతో అడుగుతారు. ప్లీజ్ నాన్న ఇంకా నన్ను మీరు చంపకండి అని బాధపడతాడు.
దానికి శేషగిరి గారు విరక్తిగా నవ్వుతూ ఇప్పుడేమిట్రా ఎప్పుడైతే నీ కూతురుకి చాలీచాలని భోజనం పెట్టావో, నీ ఇంటిలోనే నీ కూతురికి రక్షణ లేదో, ఆరోజే ఒక తండ్రిగా చచ్చిపోయావు.
ఇదిగో నీ కూతురు వెళ్లే ముందు రాసిన ఉత్తరం అని చెప్పి ధనుంజయ చేతిలో పెడతారు. అవని రాసిన అక్షరాలు వెంట ధనుంజయ్ కళ్ళు పరుగుపెడుతూ ఉంటాయి.
తాతయ్య నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేకపోయినా ఏదో భరిస్తున్నారు అనుకున్నాను.
కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరికీ శిల్ప జీవితం బాగుంటే చాలు. దానికోసం నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకడుగు వేయరు అని ఈ రోజే అర్థమయింది.
ఇక్కడ ఉంటే శాశ్వతంగా నన్ను నేను కోల్పోవాల్సి వస్తుంది. దానికి కన్న ఒక అనాధగా బ్రతకడమే మంచిది. ఎలాగో అనాధగానే ఉన్నాను కాబట్టి.. అనాధనే అవుతాను సెలవు అని రాసి ఉంటుంది.
ఆ ఉత్తరం కూడా చాలా స్పీడ్ గా రాసినట్టుగా కన్నీళ్లు పడినట్టుగా ఉంటుంది.
ఆ ఉత్తరం చదివిన ధనుంజయ్ ఒక రకమైన షాక్ లో ఉండిపోతాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)