Thread Rating:
  • 20 Vote(s) - 3.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 19


ఆ తర్వాత నేను సోమేశ్ ఇంటికి వెళ్లి డోర్ బెల్ ని కొట్టాను. అప్పుడు మోహిని డోర్ ని తెరిచింది.

నేను లోపలికి వెళ్ళి, డ్రాయింగ్ రూములో కూర్చున్నాను. మోహిని కూడా నా వెనుకే వచ్చింది.

నేను : నాకు మీ అందరి హెల్ప్ సెలక్షన్ లో అవసరం అయింది. అందరినీ పిలవండి.

మోహిని ముగ్గురినీ పిలిచింది. ఆంటీ కూడా వచ్చింది.

నేను ఆల్బం ని వాళ్ళ ముందు పెట్టాను. అందుకు కారణం, సోమేశ్ ఇంటి ముందు భాగం కూడా చాలా పాతగా అయిపోయింది. సో ఒకేసారి రెండు పనులు అయిపోతాయి.

మోహిని ఆంటీ పక్కన సోఫాలో కూర్చుని ఆల్బమ్ ని తెరిచింది. ఆ ముగ్గురూ సోఫా వెనుక నిలబడి చూడడం మొదలుపెట్టారు.

మోహిని : ఇది ఎంత అందంగా ఉంది కదా !

సుమ : లేదు, ఇది అందంగా ఉంది.

హేమ : నాకు ఇది బాగా అనిపిస్తోంది.

ఆంటీ : బాబూ, మీరే చూడండి. నాకు ఇలాంటి వాటి గురించి తెలియదు.

ఆల్బమ్ లో నుండి నాకు నచ్చిన పిక్ ని నేను తీశాను.

నేను : నైనా, నీకు ఇంకేదైనా బాగా అనిపించిందా ?

నైనా : నేను చూస్తున్నాను. ఈ రోజుల్లో అయితే లైటింగ్ ఉన్న మంచి డిజైన్లు చాలా ఉన్నాయి. వీటిలో అది లేదు.

మోహిని : ఆ యార్, లైటింగ్ ఉన్నది ఉండాలి కదా.

సుమ : ఆ, ఇది చాలా బాగా అనిపిస్తుంది.

హేమ : కానీ అది వీటిలో లేదు. సరిగా చూడు.

నైనా : ఆ పిక్ ని బహుశా రాహుల్ తీసి ఉంటారు.

నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నైనా గురించి నేను ఆలోచించక తప్పడంలేదు. అందరి నుండి వేరుగా, అందరి కన్నా అందంగా ఉంటాయి తన ఆలోచనలు. అతిగా మాట్లాడదు, ఎప్పుడు మాట్లాడినా, ఎదుటివాళ్ళు  మాట్లాడే మాటలు ఆగిపోతాయి.

అందరూ నా వైపు చూడడం మొదలుపెట్టారు.

మోహిని : నైనా, నువ్వు ఎలా చెబుతున్నావు ?

నైనా : ఆయన షర్ట్ లో నుండి పిక్ కనిపిస్తోంది.

నేను తెలుపు షర్ట్ ని వేసుకున్నాను. అందులో ప్రతిబింబం కనిపిస్తుంది అని మర్చిపోయాను.

తన తెలివైన మనసుకి సెల్యూట్ చేయాల్సిందే.

ఆ తర్వాత నేను పిక్ ని తీసి టేబుల్ మీద ఉంచాను.

మోహిని దాన్ని తీసుకుని చూసింది.

మోహిని : వావ్ యార్ ! అద్భుతంగా ఉంది, మీరు కూడా చూడండి హేమ, సుమ.

సుమ : ఆ, ఇది బెస్ట్.

హేమ : నాకు కూడా ఇదే నచ్చింది యార్.

నేను : నైనా, నీకు ఏది నచ్చింది ?

నైనా : నాకు కూడా ఇదే నచ్చింది.

నేను : ఓకే, ఫైనల్ అయిపొయింది. ఇక ఇదే డిజైన్ లో తయారవుతుంది.

మోహిని : యస్ !

నేను : మరొక విషయం.

ఆంటీ : ఏంటి బాబూ ?

నేను : ఆ ఇంటితో పాటు ఈ ఇంటి ముందు భాగం కూడా అలాగే మారుతుంది.

హేమ : ఏంటి, నిజంగా మా ఇల్లు కూడా కొత్తగా తయారవుతుందా ?

నేను : అవును. ఈ రెండు ఇళ్ళు ఒకేలా కనిపిస్తాయి. ఎవరైనా చూస్తే, వాళ్లకి రెండు కాదు, ఒకే ఇల్లు లా అనిపిస్తుంది.

మోహిని : అది మంచి ఆలోచన. ఏంటి నైనా, నువ్వు ఏమంటావు ?

నైనా : నాకు ఆ సంగతి ముందే తెలుసు.

నా మీద మరొక బాంబు వేశింది నైనా.

నేను : ఏంటి ? ఎలా ? నువ్వు ఎలా ఊహించావు ? ఈ రోజు నాకు చెప్పండి ఆంటీ, తను మీ కూతురే కదా ?

నా మాట విని అందరూ నవ్వడం మొదలుపెట్టారు. నైనా కూడా.

ఈ రోజు మొదటిసారి తనని నవ్వుతున్నప్పుడు చూశాను. తానొక సీరియస్ టైపు అమ్మాయి.

నేను : ఆంటీ, చెప్పండి. ఎక్కడైనా ఆకాశం నుండి ఊడి పడిందా తను ? లేదంటే తన వశంలో దేవతలు ఎవరైనా ఉన్నారా ? వాళ్ళు తనకి అన్నీ ముందే చెబుతుంటారా ?

నా మాట విని అందరూ మళ్ళీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. నైనా నవ్వు కూడా ఈ రోజు చాలా బాగుంది.

ఆ తర్వాత నేను అక్కడ ఫైనల్ చేసుకుని సోమేశ్, సైరా ల దగ్గరికి వచ్చాను.

సైరా : రాహుల్ సార్, ముందు భాగం (ఫ్రంట్) ఫైనల్ అయిందా ?

నేను : అవును, అయింది. ఇదిగో ఈ పిక్ ని చూడు. రెండు ఇళ్ళు ఒకేలా తయారు చేయాలి. రెండు కాదు, ఒకే ఇల్లు అని అనిపించాలి.

సైరా : మీరు దాని గురించి ఆలోచించకండి.

సైరా : మరి ఇంటీరియర్ డిజైన్ కూడా సెలెక్ట్ చేయండి.

నేను : మీరు ఇంటి లోపల చూశారా ?

సైరా : అవును, నేను చూశాను.

నేను : నాకు బాత్రూంలో కొన్ని మార్పులు కావాలి.

సైరా : ఓకే, చెప్పండి.

నేను తనని బాత్రూం దగ్గరికి తీసుకుని వెళ్ళాను.

నేను : ఇక్కడ చూడండి. ఇక్కడ టైల్స్ అన్నీ మార్చాలి. నల్లా, షవర్ అన్నీ మార్చాలి. ఇప్పుడు పైకి పదండి.

మేము పైకి వచ్చాము. అక్కడి బాత్రూం కి వెళ్ళాము.

నేను : నాకు ఈ బాత్ రూముని పెద్దదిగా చేయాలి. దీనిలో పెద్ద టబ్ కూడా పెట్టాలి.

ఆమె కొలతలు తీసుకుని చెప్పింది :

సైరా : అవుతుంది సార్. అయితే మీకు ఓపెన్ ప్లేస్ కొద్దిగా చిన్నగా అవుతుంది.

ఆమె బాత్రూం వెలుపల ఖాళీ ప్రదేశం వైపు చూపిస్తూ అంది.

నేను : పర్లేదు.

సైరా : అయితే మీరు ఎలా చెప్పితే అలాగే చేస్తాను.

నేను : ఓకే. ఇక కిచెన్ సంగతి, రూమ్స్ ని మీ ప్రకారం చెప్పండి. ఎలా మరింత బెస్ట్ గా చేయొచ్చొ ?

సైరా : నేను మీకు అన్ని డిజైన్లు చూపిస్తాను. నేను కొన్ని ఇంటి ఫోటో లని తీసుకుంటాను సార్.

నేను : తప్పకుండా.

ఆ తర్వాత ఆమె తన బ్యాగ్ లో నుండి కెమెరా ని తీసి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రతి ప్లేస్ ని ఫోటోలు తీసుకున్న తర్వాత :

సైరా : సార్, నా పని అయిపోయింది.

నేను : ఓకే. మిగతా డిజైన్ల ఆల్బమ్ మీ దగ్గరే ఉందా? ఇంటీరియర్ డిజైన్లది.

సైరా : అవును సార్, ఉంది. నేను మీకు చూపిస్తాను.

నేను : పదండి మరి.

మేము బయటికి వచ్చాము. నేను సోమేశ్ ని ఇంటి గేట్ తెరవమని చెప్పాను.

నేను తలుపు కి తాళం వేశాను. సోమేశ్ దగ్గరికి వెళ్ళాను.

సైరా : సార్, ఈ ఆల్బమ్ ఇంటీరియర్ డిజైన్లది. మీరు చూసి రండి.

నేను : లేదు, మీరు తోడుగా రండి.

సైరా : ఓకే సార్, పదండి.

నేను ఇంకా సైరా సోమేశ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. డ్రాయింగ్ రూములో కూర్చున్నాము.

ఆ నలుగురూ కూడా వచ్చారు.

సైరా అందరినీ విష్ చేసింది.

ఆ తర్వాత సైరా ఆల్బమ్ ని తీసి అందరికీ డిజైన్లు చూపించడం మొదలుపెట్టింది. అందరికీ డిజైన్లు నచ్చాయి. ఆ తర్వాత ఒక డిజైన్ ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత టీ తాగి మేము బయటికి వచ్చాము.

సైరా : సార్, మీరు రేపు ఆఫీసుకి రాగలరా ? లేదంటే మీకు కొటేషన్ ని ఇక్కడికే పంపించమంటారా ?

నేను : మీరు ఎన్ని రోజుల్లో ఈ పని ని పూర్తి చేస్తారు ?

సైరా : సార్, 15 లేదా 20 రోజుల పని సార్.

నేను : ఓకే. కొటేషన్ కాకుండా మరేదైనా పని ఉందా ఆఫీస్ లో ?

సైరా : లేదు. అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సారీ సార్, ఎందుకంటే నేను నా కంపెనీని ఇప్పుడే మొదలుపెట్టాను. అందుకే అడ్వాన్స్ కావాలని అడుగుతున్నాను.

నేను : ఇంతకుముందు మీరు నా పని చేసినప్పుడు, మీకు కంపెనీ లేదా ?

సైరా : లేదు సార్. అక్కడ నేను జాబ్ చేసేదాన్ని. ఆ కంపెనీ ఓనర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఆ తర్వాత నేను నా స్వంత ఆఫీసుని మొదలుపెట్టాను.

నేను : ఒహ్హ్, చాలా మంచి విషయం. కొటేషన్ ని తీసుకోవడానికి సోమేశ్ మీ దగ్గరికి వస్తాడు. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో మీరు వీడికి చెప్పండి.

సైరా : నిజానికి, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మీరు ఓకే అంటే, కొటేషన్ ని నేనే స్వయంగా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇస్తాను.

నేను : ఓకే. మీకు ఏది బెటర్ అనిపిస్తే అలాగే చేయండి.

సైరా : ఓకే సార్, నేను వెళ్తాను. బై.

నేను : బై.

ఆ తర్వాత ఆమె తన కారులో వెళ్ళిపోయింది.

నేను : సోమేశ్ యార్, నేను ఈ రోజు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఈ రోజు నన్ను ఇన్వైట్ చేశారు. ఈ రోజు టైం దొరికితే మళ్ళీ వస్తాను. లేదంటే రాలేను. ఈ రోజు పని కూడా చాలా చేశాను. అలసిపోయాను.

సోమేశ్ : పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను కూడా ఈ రోజు కి రెస్ట్ తీసుకుంటాను.

ఆ తర్వాత నేను అక్కడ నుండి బయలుదేరి మా ఇంటి కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు సడన్ గా జానీ గుర్తొచ్చాడు.

నేను : ఓహ్ షిట్ !

సెల్ ని తీసి కాల్ చేశాను.

నేను : జయా, ఎక్కడ ఉన్నావు ?

జయ : సార్, నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను.

నేను : ఎందుకు ఇంత లేటు ?

జయ : సార్, పని ఎక్కువగా ఉంది. అందుకే.

నేను : ఓకే, మరొక పని చెయ్యి ఇప్పుడు.

జయ : అలాగే సార్, చెప్పండి.

నేను : నా లాంటి కార్లు ఇండియాలో ఇంకా ఎన్ని ఉన్నాయి ? ఇప్పుడే తెలుసుకుని నాకు చెప్పు.

జయ : ఏ కారు సార్ ?

నేను : సర్ఫ్ (SURF).

జయ : ఓకే సార్. నేను తెలుసుకుని మీకు చెబుతాను.

నేను : గుడ్. ఒకవేళ నా కారు కాకుండా ఇంకో కారు ఉంటే, ఓనర్ గురించి కూడా కనుక్కో, ఓకే.

జయ : ఓకే సార్. నేను ఇప్పుడే తెలుసుకుంటాను.

నేను : థాంక్స్.

జయ : నో థాంక్స్ సార్.

నేను : ఓకే బై. తొందరగా చెయ్యి.

జయ : ఓకే బై.

ఆ తర్వాత నేను కారుని ఇంటి వైపు తిప్పాను. ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యాను. కొద్దిసేపటి తర్వాత నా రూమ్ తలుపు ని తట్టారు.

నేను : ఎవరు ? లోపలికి రా.

పనిమనిషి : పెద్ద సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు.

నేను : ఓకే, నేను వస్తాను.

ఆ తర్వాత నేను నాన్నని కలవడానికి వెళ్ళాను. ఆయన టీవీ లాంజ్ లో కూర్చున్నారు.

నేను : నాన్నా, మీరు పిలిచారా ?

నాన్న : ఆ, రా. ఇక్కడ కూర్చో.

నాన్న : షోరూములో ఏం జరిగింది ?

నేను : నాన్న, మీకు మొత్తం తెలిసిపోయి ఉంటుంది. అంకుల్ మీకు చెప్పి ఉంటారు.

నాన్న : అవును చెప్పాడు. నీకు వాడి మీద ఎలా డౌట్ వచ్చింది ?

ఆ తర్వాత నేను నాన్నకి డీటెయిల్స్ చెప్పాను.

నాన్న : గుడ్. ఎప్పుడూ నీ ఎంప్లాయిస్ అవసరాల గురించి ఆలోచించు. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం విజయం సాధిస్తాము.

నేను : అవును నాన్న, అలాగే చేస్తాను.

ఆ తర్వాత నేను నాన్న దగ్గర నుండి నా రూములోకి వచ్చాను.

రూములోకి వచ్చి చూస్తే, జయా దగ్గరనుండి వచ్చిన కాల్స్ కనిపించాయి. నేను తనకి కాల్ చేశాను.

నేను : ఆ జయా, ఏమైనా తెలిసిందా ?

జయ : అవును సార్, ఒక కారు ఉంది, మీ కారు కాకుండా. అది వైజాగ్ లోనే ఉంది. కలర్ నీలం.

నేను : గుడ్. దాని ఓనర్ గురించి ఏమైనా సమాచారం దొరికిందా ?

జయ : అవును సార్. నేను మీకు ఇప్పుడే పంపుతాను.

నేను : గుడ్. చాలా థాంక్స్ !

జయ : నో థాంక్స్ సార్, ఇది నా డ్యూటీ.

నేను : ఓకే, బై.

జయ : బై సార్.

జయ దగ్గర నుండి SMS వచ్చింది. ఆ తర్వాత నేను కారు ఓనర్ కి కాల్ చేశాను.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 12-01-2026, 12:35 PM



Users browsing this thread: Raghavendra, rajusatya16, 8 Guest(s)