12-01-2026, 07:36 AM
Part - 38
విక్రమ్ ఉదయ్ కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వినయ్ తీసుకుని మాన్షన్ కి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళేటప్పటికి లలిత గారు హాల్లోనే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారు.
విక్రమ్ ని చూడగానే వెళ్లి హత్తుకుని నా కోడలు ఎలా ఉంది నాన్న అని అడుగుతారు. విక్రమ్ నవ్వుతూ ఎలా ఉన్నావ్ అని నన్ను అడగడం మానేసి...
అవని ఎలా ఉంది అని అడుగుతున్నావా అంటే... నీ గురించి నాకు తెలుసు రా...నువ్వు బానే ఉంటావు. ఒంటరిగా ఉంటుంది తన గురించి కదా నా బెంగ అంతా అనగానే...
ఐ లవ్ యు మమ్మీ. నీలాంటి అత్తగారు ఉంటే ఏ కోడలు అయిపోయిన బిందాస్ అని చెప్పి ఫ్రెష్ అయి వస్తాను బాగా ఆకలిగా ఉంది అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు.
వినయ్ కూడా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వస్తాడు. విక్రమ్
తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ అమ్మ చేతి గోరుముద్దలు తింటూ... శిల్ప పనిష్మెంట్లు ఎంతవరకు వచ్చినాయి మామ్ అని అడుగుతాడు.
నువ్వు చెప్పినట్టుగానే వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కక్కలేక మింగలేక అమ్మ కూతురు ఇద్దరు విలవిల్లాడుతున్నారు .
ఎప్పుడు నాన్న దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది అని అడుగుతారు. తొందర్లోనే దీనికి శుభం కార్డు పలుకుతున్నాను.
రేపు ఇచ్చే ట్విస్ట్ తో శిల్ప భూమి కింద కాళ్లు కదులుతాయి అని చెప్పి భోజనం కంప్లీట్ చేస్తాడు. సరే నాన్న వెళ్లి రెస్ట్ తీసుకో అని కొడుకులు ఇద్దరికీ దిష్టి తీస్తారు.
మేము ఇంకా చిన్నపిల్లల మా అమ్మ అంటే..
మీరు ఎంత ఎదిగినా సరే నా పిల్లలు నాకు ఎప్పుడూ చిన్న పిల్లలే.
ఇంకా వెళ్లి పడుకో నాన్న అని చెప్పి లలిత గారు కూడా పడుకోవడానికి వెళ్తారు.
విక్రమ్ కూడా తన రూమ్ కి వెళ్ళిపోయి మంచం మీద వాలుతాడు. పొద్దున్ననుంచి ఒకటే పరుగులు మీద ఉన్నాడు. అలసటగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు.
మూసుకున్న కనురెప్పల వెనకాల అవని రూపం కనబడుతుంది. అవనికి ఫోన్ చేయడం మర్చిపోయాను అనుకుని వెంటనే ఫోన్ చేస్తాడు.
విక్రమ్ ఫోన్ కోసమే చూస్తున్నాట్టుగా కూర్చున్నా అవని ఒక్కరింగికే లిఫ్ట్ చేసి వెళ్లిపోయారా అని అడుగుతుంది. ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు.
అది నిద్ర రాలేదు అని చెబుతుంది. అవునా అని ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్తాడు. అదేంటి ఫ్లైట్ ఎప్పుడో వెళ్లిపోయింది కదా.. ఇంత లేట్ ఎందుకు అయింది.
మధ్యలో ఏమైనా ఇబ్బంది అయిందా అని కంగారుగా అడుగుతుంది. దానికి విక్రమ్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు.
నేను ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్ కి వెళ్ళాను. అందుకే లేట్ అయింది. నీకు ఫోన్ చేయడం కుదరలేదు అని చెప్పి డిన్నర్ చేసావా అని అడుగుతాడు.
హ అని మెల్లిగా చెబుతోంది ఓయ్ ఒకసారి వీడియో ఆన్ చెయ్ అని చెప్పి వీడియో కాల్ చేస్తాడు. వెంటనే అవిని కంగారుగా ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు...
మామూలుగా మాట్లాడండి చాలు అంటే... ఎందుకు అంత కంగారు పడుతున్నావు. రూమ్ లో నేను ఒక్కడినే ఉన్నాను మాట్లాడు అని చెబుతాడు..
అప్పుడు అవిని కొంచెం రిలాక్స్ అయి విక్రమ్ వైపు చూస్తుంది. చాలా అలసటగా కనిపిస్తాడు. ఈరోజు మీకు వర్క్ చాలా ఎక్కువ అయిపోయినట్టుంది అని అడుగుతుంది.
ఎందుకు అనిపించింది అని తిరిగి క్వశ్చన్ చేస్తాడు. మీ ముఖం చాలా వాడిపోయి ఉంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నుంచి పరుగులు పెడుతునే ఉన్నట్టున్నారు అని అడుగుతుంది.
హ్మ్...కొంచెం ఇంపార్టెంట్ వర్క్. ఇప్పుడు ఆ వర్క్ ఫినిష్ అయిపోయింది.రిలాక్స్డ్ గానే ఉన్నాను అని చెప్తాడు. సరే పడుకోండి గుడ్ నైట్ అని చెప్తుంది.
గుడ్ నైట్ అవని ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. విక్రమ్ చూసిన ఆనందంతో అవిని కూడా పీస్ ఫుల్ గా నిద్రపోతుంది
నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ లేచి జిమ్ ఫినిష్ చేసుకుని కిందకి వస్తాడు. విక్రమ్ ని చూసిన శిల్ప హమ్మయ్య విక్రమ్ వచ్చాడు.
ఎలాగైనా విక్రమ్ తో మాట్లాడాలి అనుకుని గబగబా విక్రమ్ వైపుకు వెళుతూ ఉంటుంది. మాధవి గారు శిల్ప ను చూసి ఎక్కడికి శిల్పా అంత స్పీడ్ గా వెళుతున్నావు అని అడుగుతారు.
అబ్బా ఈవిడ చూశారా అనుకొని... అదేమీ లేదు పిన్ని గారు, విక్రమ్ గారు ఇప్పుడే కనిపించారు. ఏమైనా కావాలేమో అని అడుగుదామని వెళుతున్నాను అంటే...
విక్రమ్ కి ఏమన్నా కావలిస్తే మేము చూస్తాము గాని...నీకు అమ్మ ఏం చెప్పింది. ఈ దోషం పోయే వరకు నిన్ను విక్రమ్ కి ఎదురు పడద్దని చెప్పింది కదా...
పెద్దవాళ్ల మాట అంటే అసలు లెక్క లేదా..మీ అమ్మ ఇదే నేర్పించిందా అని కోప్పడతారు. వెంటనే శిల్ప కోపంతో ప్రతిదానికి మా అమ్మని అంటారు ఎందుకు..
భర్తతో మాట్లాడడానికి కూడా అందరి పర్మిషన్ కావాలా అంటూ ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది ఇలాగైనా విక్రమ్ పట్టించుకుంటాడేమో అని చిన్న ఆశ.
విక్రమ్ మాధవి వైపు తిరిగి అత్త ఈ రోజు లంచ్ కి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు. మంచి డిషెస్ అన్నీ రెడీ చేయండి. నాకు వర్క్ ఉంది అని చెప్పి స్టడీ రూమ్ కి వెళ్ళిపోతాడు.
వెళుతున్న విక్రమ్ వైపు శిల్పా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి శిల్ప అంతలా ఏడ్చిన విక్రమ్ పట్టించుకోలేదని ఆలోచిస్తున్నావా...
విక్రమ్ పెద్దవాళ్ల మాటకి విలువస్తాడు. మా అమ్మ చెప్పింది కదా దోషం పోయేవరకు మాట్లాడకూడదని... అందుకే పెద్ద వాళ్ల మాటకి కట్టుబడి ఉన్నాడు.
నీకేమో అలాంటివి ఏమీ లేవు. ఏం చేస్తాము మా కర్మ నీలాంటి దాన్ని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నందుకు వెళ్లి నీ పని చూసుకో అని విసుగ్గా కిచెన్ లోకి వెళ్ళిపోతారు.
శిల్ప పుట్టినప్పటినుంచి గారాభంగా పెరుగడం వల్ల ఏరోజు ఒక మాట కూడా ఎవరు అనింది లేదు. ఈ మాన్షన్ కి వచ్చినప్పుడు నుంచి ప్రతిరోజు ఛీత్కారాలు , అవమానాలు కడుపునిండా తిండి కూడా లేదు.
ఇవన్నీ ఆలోచించి ఇంకా దుఃఖం తన్నుకోస్తూ ఉంటే గదిలోకి వెళ్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. రెండుసార్లు ఫోన్ రింగ్ అయి కట్ అయిపోతుంది.
మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది. ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది కదా అని మళ్ళీ చేస్తుంది. కట్ అయిపోయే ముందు లిఫ్ట్ చేసి చెప్పు బేబీ అనగానే...
ఏం చెప్పాలి మామ్ నువ్వు ఏం చెప్పి నన్ను ఇక్కడకి పంపించావు. ఇక్కడ ఏం జరుగుతుంది. ప్రతి నిమిషం నాకు అవమానాలే.
విక్రమ్ అయితే నా వైపు అసలు చూడనే చూడడు. ఏదైనా మాట్లాడదామంటే దోషం మాట్లాడకూడదు అని ఆపేస్తున్నారు. ఇంకా విక్రమ్ నా వైపు కి ఎలా తిప్పుకోవాలి అని ఏడుస్తూ అడుగుతుంది.
భార్గవి అసలే చిరాకులో ఉంది ఇప్పుడు శిల్ప ఏడుపుతో విసుగు వచ్చి... బేబీ ప్రతిదానికి ఏడవడం కాదు. ఇన్ని రోజులైంది. ఇంట్లో వాళ్ళని నీ వైపుకు తిప్పుకోలేకపోయావు.
అసలు నువ్వు నా కూతురువేనా అని కోపంగా అడుగుతుంది. ఏంటి మామ్ నువ్వు కూడా నా మీద అరుస్తున్నావా అంటే...
లేకపోతే ఏంటి బేబీ. మా పెళ్లయిన నెలలోపే మీ డాడీని నా వైపుకు తిప్పుకున్నాను. నేను ఏది చెబితే అది వినేటట్టు చేశాను.
అలాంటిది కొత్తగా పెళ్లయిన నువ్వు నీ భర్తని నీ వైపుకు తిప్పుకోలేకపోతున్నావు. నాతో ఏదైనా మాట్లాడితేనే కదా నా వైపు తిప్పుకునేది అని అడిగితే...
నువ్వు అందర్నీ అబ్జర్వ్ చెయ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటది. ఆ వీక్నెస్ తో నీ వైపుకు తిప్పుకోవాలి బేబీ అని చెబుతుంది. ఓకే మా నేను ఆ ప్రయత్నంలోనే ఉంటానని ఫోన్ పెట్టేస్తుంది.
తల్లి కూతుర్లు మాట్లాడుకున్న ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. అదంతా విన్న విక్రమ్ పరవాలేదు తల్లి కూతుర్లు బానే ప్లాన్ వేస్తున్నారు.
ఈ రోజు నేను ఇచ్చే ట్విస్టుతో నీ కూతురు పరిస్థితి ఏంటో భార్గవి అని నవ్వుకుంటాడు. నవ్వుకుంటున్న కొడుకుని చూసి ఏంటి విక్రమ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని కళ్యాణ్ గారు అడుగుతారు.
ఏమీ లేదు డాడ్...హనుమంతుడు ముందు కొప్పిగొంతులు అన్నట్టుగా మన ముందే తల్లి కూతుర్లు ఇద్దరు డాన్స్ చేస్తున్నారు. వాళ్లు పాట్లు చూసి నవ్వు వస్తుంది అని చెబుతాడు.
ఉదయ్ పరిస్థితి ఎలా ఉంది విక్రమ్ అని అడుగుతాడు. అప్పుడే వినయ్ మీకు చెప్పేసాడా అంటే.. హ..అదంతా విన్నాక నిజంగా చాలా బాధ అనిపించింది రా..
అందరూ ఆడవాళ్లే కదరా.. అవిని నీ అంత దారుణంగా ఎలా హింసించారు అని బాధపడతారు. రమేష్ గారు కూడా బాధపడుతూ విక్రమ్ వైపు చూసి తొందరగా నా కూతుర్ని తీసుకొచ్చాయి.
ఇన్ని రోజులు తల్లిదండ్రులు లోటు తీర్చలేకపోయినా.. ఇప్పుడు నుండి మాత్రం ఆ లోటు పూర్తిగా మేము తీర్చేస్తాము అని చాలా ఎమోషనల్ గా చెబుతారు.
విక్రమ్ మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది విక్రమ్ సీరియస్ గా ఉన్నావంటే.. నథింగ్ డాడ్. ఈరోజు మధ్యాహ్నం జరిగే సినిమా గురించి అని చెబుతాడు.
అంటే..... అయోమయంగా అడుగుతారు. వెయిట్ అండ్ వాచ్. ముందే చెప్పేస్తే ట్విస్ట్ ఏముంటుంది అని చెప్పి మీరు లంచ్ టైం కి అందరూ ఇంట్లోనే ఉండండి. ఎక్కడికి వెళ్లదు అని గట్టిగా చెబుతాడు.
మేమెందుకు ఆ సినిమా మిస్ అయిపోతాము అని చెప్పి అందరూ ఇంట్లో ఉండే వర్క్ చూసుకుంటూ ఉంటారు. శిల్ప తో పని అంతా చేపిస్తూ లలిత, మాధవి గెస్ట్ కోసమని వెరైటీస్ రెడీ చేస్తూ ఉంటారు.
ఇదే మంచి టైము. ముందు వీళ్ళిద్దరితో మాటలు కలపాలి అనుకుని... అత్తయ్య గారు అని చాలా స్వీట్ గా పిలుస్తుంది.
ఆ మాటకి లలిత గారికి విసుగు వచ్చి ఏంటమ్మా కోడలు గాని కోడలు పిల్ల అని అడుగుతారు. ఆ మాటకి బిత్తర చూపులతో అదేం పిలుపు అత్తయ్య గారు అంటే...
అదే ఇంకా పూర్తిగా దోషం పోలేదు కదా.. అందుకే అలా పిలిచాను ఏంటి విషయం అని అడుగుతారు.
శిల్ప ఏమి చెబుతుంది...
కథ కొనసాగుతుంది....
ప్లీజ్ గివ్ మీ రేటింగ్స్

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)