11-01-2026, 05:27 AM
Part - 35
సత్యవతి గారు కంగారుగా ఏమైంది బంగారం అని అడుగుతారు. నాకు బ్రతకాలని లేదు నానమ్మ చచ్చిపోవాలనిపిస్తుంది.
అమ్మతోపాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే ఈ రోజుఈ నరకం ఉండేది కాదు కదా అని ఏడుస్తుంది. ఆ మాటలకు సత్యవతి గారి గుండె తరుక్కుపోతుంది.
అవని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మా అమ్మవు కదూ ఏడవకు ఏం జరిగిందో నాకు చెప్పు తల్లి అని కళ్ళు తుడుస్తారు.
దానితో శిల్ప పెళ్లి చూపులు ముందు భార్గవి తనతో చెప్పిన విషయాలన్నీ చెప్పి ఈరోజు ఏమీ తెలియనట్టు మీ ముందు నా మీద కోప్పడుతున్నారు.
నేనేం తప్పు చేశాను అని ఏడుస్తుంది. సత్యవతికి ఆ నిమిషము కొడుకు,కోడలపైన చాలా కోపం వస్తుంది. వీడెందుకు ఇలా తయారయ్యాడు.
అసలు కూతురు అంటే ఇంత చిన్న చూపా అని బాధపడుతూ మా అమ్మవి కదా..ఏడవకు తల్లి అని చెప్పి కళ్ళు తుడుస్తారు.
అవని అలా ఏడుస్తూనే వాళ్ళ నానమ్మ వొళ్ళో పడుకుని నిద్రపోతుంది. అవని పడుకున్న తర్వాత సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి రూమ్ దగ్గరికి వేసి ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతుంది.
శేషగిరి గారు అది చూసి ఏం జరిగింది అని ఆలోచిస్తూ భార్య వెనకాల వెళ్లి ఏమైంది సత్యా అని అడుగుతారు. దానికి సత్యవతి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకండి వీడు ఇలా తయారయ్యాడు.
రజిత ఉన్నప్పుడు అవిని నీ కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు. రజితతో పాటే కూతురు మీద ప్రేమ కూడా పోయినట్టుంది అని బాధపడుతూ జరిగిందంతా చెబుతుంది.
అది విన్న తర్వాత శేషగిరికి కూడా చాలా కోపం వస్తుంది. ఏమీ చేయలేక బాధపడతారు. వీళ్ళ బాధలో వీళ్ళు ఉండగానే పెళ్లిరోజు వచ్చేస్తుంది.
పెళ్లి పనుల్లో గాని,పెళ్లి దగ్గర గాని ఎక్కడ అవిని కనిపించదు. భార్గవి ముందే వెళ్లి హెచ్చరిస్తుంది. నిన్ను ఎక్కడ మీ నాన్నగారు కనపడద్దు అని చెప్పారు అని.
అవని గదిలో నుండి అసలు బయటికి రాదు.తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు.సత్యవతి గారు గుర్తుపెట్టుకుని ఫుడ్ పంపిస్తూ ఉంటారు.
కానీ అవిని కి ఏమి తినాలనిపించక ఫుడ్డు మొత్తం అలాగే ఉండిపోతుంది. ధనుంజయ్ మాత్రం కూతురు కోసం చూస్తూ ఉంటాడు.
ఇలాగైనా నలుగురిలోకి వస్తుందేమో అని. భార్గవిని అడుగుతాడు అవిని ఏది అని. దానికి భార్గవి ముసలి కన్నీరు కారుస్తూ నేను బ్రతిమాలానండి ఎంత చెప్పినా రాను అంది.
ఇంకా బలవంతం చేస్తే చేయి కోసుకుంటానని బెదిరించింది అని చెబుతుంది. దానికి ధనుంజయ్ కి కోపం వచ్చి ఎందుకు అవని ఇంత మొండగా బిహేవ్ చేస్తుంది.
నేను వెళ్లి అడుగుతాను అని చెప్పేసి సీరియస్గా వెళుతూ ఉంటాడు. అవని గదిలోకి వెళుతున్న ధనుంజయ్ ని చూసి భార్గవి కి టెన్షన్ వస్తుంది.
వెంటనే వాళ్ళ అన్నయ్య సునీల్ కి సైగా చేస్తుంది. వెంటనే సునీల్ బావ అని పిలుస్తారు. వెళ్లేవాడు వెనక్కి తిరిగి ఏమైంది సునీల్ అంటే.. మండపం దగ్గర కావలసిన పువ్వు లు వచ్చాయో లేదో అడుగుదామని పిలిచాను అంటాడు.
దానితో మనకి పనేముంది. అది ఆర్గనైజేషన్ వాళ్లకు ఇచ్చేసాము కదా అంటే... నిజమే కదా బావ మర్చిపోయాను.
మేనకోడలు పెళ్లి అనేటప్పటికీ కాళ్లు చేతులు ఆడడం లేదు. అందుకే ఏదో మాట్లాడేశాను అని చెప్పి చెమటలు పడుతున్నట్టుగా సడన్గా కుర్చీలో కూర్చుని పోతాడు.
ఏమైంది అని గబగబా కిందికి వస్తాడు. కొంచెం బీపీ డౌన్ అయినట్టుంది అని భార్యని పిలిచే కొంచెం మజ్జిగ తీసుకురా అని చెబుతాడు.
వెంటనే బిందు కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లి మజ్జిగ తీసుకువచ్చేస్తుంది. అది తాగి ధనుంజయ్ చేయబట్టుకుని బావ నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది నువ్వు నా పక్కనే కూర్చో అని చెప్పి ఆపేస్తాడు.
భార్గవి కళ్ళు వోత్తుకుంటూ మేనకోడలు అంటే ఎంత ప్రేమ మా అన్నయ్యకి అని చెప్పి మీరు పక్కన ఉండండి. అన్నయ్యకి కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెబుతుంది.
అవిని దగ్గరికి వెళ్లే విషయం మర్చిపోయి సునీల్ చెయ్యి పట్టుకుని కూర్చోండిపోతాడు. ఇదంతా చూస్తున్న సత్యవతి, శేషగిరి గారు మాత్రం ఏమీ మాట్లాడరు.
అసలు వీళ్ళ విషయంలో కలగ చేసుకోవడానికి కూడా మనసు అంగీకరించదు. సునీల్ కాసేపు అయిన తర్వాత బావ ఇప్పుడు నేను బానే ఉన్నాను.
మనం మండపం దగ్గరికి వెళ్దాం పద.అక్కడ ఉండి అన్ని పనులు చూసుకుంటే నాకు కొంచెం రిలాక్స్డ్ గా అనిపిస్తుంది అని ధనుంజయ్ ని ఆలోచించుకోనివ్వకుండా అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాను .
హమ్మయ్య అని బిందు, భార్గవి గుండెల పైన చేయి వేసుకుంటారు. భార్గవికి తనని ఎవరు చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది.
అక్కడ సత్యవతి గారు సూటిగా చూస్తూ కనిపిస్తుంది. భార్గవి కంగారుపడుతూ అదేంటి అత్తయ్య గారు అలాగా చూస్తున్నారు అంటే....
ఏమీ లేదు అమ్మ మీ అందరి పెర్ఫార్మన్స్ చూస్తున్నాను అంతే అని చెప్పి వెళ్ళిపోతారు. ఏంటో ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని....
ఇప్పుడు అవన్ని ఆలోచించే టైం లేదులే అని కూతురు గదిలోనికి వెళుతుంది. గదిలోనికి వెళ్లేటప్పుడు గది అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. నగలు చీర అన్ని అక్కడే ఉంటాయి.
వాష్ రూమ్ లో ఉందా అని డౌట్ వచ్చి బాత్రూంలో కూడా చూస్తారు. కానీ అది కూడా వెక్కిరిస్తూ ఉంటుంది.
ఇది ఎక్కడికి వెళ్లిందా అని చూస్తూ ఉంటే..నగల కింద ఒక పేపర్ కనిపిస్తుంది.అనుమానంగా అది తీసి చూస్తోంది.
దానిమీద ఉన్న చేతురాత శిల్ప ది.ఇక అనుమానంగా అనిపించి చదువుతూ ఉంటుంది. అమ్మ నాకు మోడలింగ్ ఆడిషన్స్ కి ఇప్పుడే కాల్ వచ్చింది.
నేను పెళ్లి టైం కల్లా వచ్చేస్తాను. అప్పుడు దాకా మేనేజ్ చేయి అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చూడగానే భార్గవికి టెన్షన్ తో చెమటలు పడతాయి.
చేతిలో ఉన్న పేపరు కింద పడిపోతుంది. గుండెల్లో రాయి పడుతుంది. ఇప్పుడు ఇలా చేసింది ఏంటి...ఈ విషయం గనుక ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా...
నేను ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ఇంత మంచి సంబంధాన్ని సెట్ చేస్తే... ఇది ఇప్పుడెలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే బిందు లోపలికి వస్తుంది. ఏంటి వదిన ఇంకా శిల్ప రెడీ అవ్వలేదా...మండపానికి వెళ్లాలి కదా అని అడుగుతుంది.
దానికి జరిగింది అంతా చెబుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా అంటే... అదే అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇద్దరికీ ఒకేసారి ఒకే ఆలోచన వస్తుంది. వెంటనే భార్గవి అవని గదిలోనికి వెళ్లి అవని అని ప్రేమగా పిలుస్తుంది. ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమగా పిలిచేటప్పటికీ అవిని కి ఆశ్చర్యమేస్తుంది.
ఏమైంది పిన్ని నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది. ఆ మాటకి భార్గవికి కోపం వచ్చినా సరే ఇప్పుడు అవసరం తనది కాబట్టి నవ్వుతూ పక్కనొచ్చి కూర్చుని ఏంమ్మ భోజనం చేయలేదా అని అడుగుతుంది.
అయోమయంగా భార్గవి వైపు చూస్తుంది. మీ నాన్నగారు అలా చెప్పారని నీతో మాట్లాడను గాని నీ మీద నాకు ఏమైనా కోపమా చెప్పు తల్లి అని ఎంతో ప్రేమని చూపిస్తూ మాట్లాడుతుంది.
ఇంతకీ విషయం ఏంటి పిన్ని అని తల కిందకి దించుకుని అడుగుతుంది. ఇంకా తన నాటకం అవని కి అర్థం అయిపోయింది అని తెలుసుకుని....
ఏమీ లేదు అవని నువ్వు కొంచెంసేపు శిల్ప ప్లేస్ లో కూర్చోవాలి అని చావు కబురు చల్లగా చెబుతుంది. దానికి అవని ఆశ్చర్యంగా నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా పిన్ని అంటే...
నాకన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళింది. తను వచ్చేదాకా శిల్ప ప్లేస్ లో ఉండాలి.
ఎలాగో మేలు మూసుగు వేస్తాం కాబట్టి పెళ్లికూతురు గెటప్ లో ఉన్నది ఎవరు అన్నది తెలియదు. ఈలోపు శిల్ప పెళ్లి టైం కల్లా శిల్ప వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు అని చెబుతుంది.
ఆ మాటలకి అవిని కి దుఃఖం పొంగుకొస్తుంది. నేనేమైనా బొమ్మను అనుకుంటున్నారా...వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు అని....
నేను ఈ పని చేయలేను పిన్ని అని చెబుతుంది. ఇది నా కోసం కాదు చేసేది.మీ నాన్నగారు కోసం. ఆయన పరువు పోకుండా ఉండడం కోసం అని చెబుతుంది.
దానికి అవిని విరక్తిగానవ్వుతూ ఏ రోజైనా నన్ను కూతురుగా చూశారా...ఈరోజు నేను ఆయన పరువు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అని అడుగుతుంది.
దానికి భార్గవి కోపంగా అంటే ఏంటి నీ ఉద్దేశం మేము ఎప్పుడూ నిన్ను కూతురుగా చూడలేదన్న అని అడుగుతుంది.
ఆ విషయం మీకే తెలియాలి. నేను మాత్రం ఈ పని చేయలేను అని చెబుతుంది. దానికి భార్గవి... నాకు నా కూతురు కంటే ఏది ముఖ్యం కాదు.
ఈ పని చేయకపోతే పెళ్లి ఆపేస్తాను అంటుంది. అంటే ఏం చేస్తావని అనుమానంగా చూస్తుంది. ఏం చేస్తానని అనా నీ అనుమానం అనగానే అవని అవును అన్నట్టుగా తల ఊపుతుంది.
ఏముంది పెద్దవాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరిని పైకి పంపించేస్తాను. అప్పుడు పెళ్లి ఆగిపోతుంది కదా అని రాక్షసంగా చెబుతుంది.
ఆ మాటలకి అవనికి చాలా భయమేస్తుంది. ఎందుకు పిన్ని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నీ ఇష్టం మీ నానమ్మ తాతయ్య ప్రాణాలు అయితే నీ చేతుల్లో ఉన్నాయి.
వాళ్లు కావాలి అనుకుంటే రెడీ అవ్వు. నేను ఏమి పెళ్లి పీటలు ఎక్కమనడం లేదు కదా...అప్పుడు దాకా శిల్ప ప్లేస్ లో ఉండమంటున్నాము.
మీ నాన్నగారికి అన్ని విషయాలు తెలుసు. ఆయనే నాకు చెప్పి పంపించారు అని చెప్పి రెడీ అవుదాగాని పదా అని ఎవరూ చూడకుండా అవని నీ శిల్ప గదిలోకి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతుంది.
అవని నీ బలవంతంగా పెళ్లికూతురు లాగా రెడీ చేసి మేలు ముసుగు వేస్తారు. అక్కడికి ఉదయ్ వచ్చి అత్తయ్య అంతా రెడీయేనా అని అడుగుతాడు.
అంతా రెడీయే అని చెప్పి అవి నేను కిందకి తీసుకు వస్తారు పెళ్ళికూతురు మారింది అన్న విషయం బిందు భార్గవి ఉదయ్ కి మాత్రమే తెలుసు.
కన్నీళ్ళతో అవని కళ్యాణ మండపానికి వెళుతుంది.
శిల్పకి భార్గవి ఉదయ్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు కానీ ఫోను ఎంతకీ కలవడం లేదు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)