Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#60
ఎపిసోడ్ 22


కోర్టు అభిర్ మీద ఉన్న కేసు క్లోజ్ అవ్వడంతో సంతోషంగా వసుంధర తో కలిసి బయటికి వచ్చారు అందరు.

***********************

కోర్ట్ దగ్గర నుంచి హిరణ్యతో కలిసి కారులో వెళుతూ ముకూల్ నందకి కాల్ చేశాడు జనార్ధన్.

లండన్ తన రూమ్ లో ఫోన్ రింగ్ అవడంతో చూసి 'జనార్ధన్ కాల్ చేస్తున్నాడు కోర్టులో ఏం జరిగిందో!' అనుకుంటు టెన్షన్ గా ఫోన్ లిఫ్ట్ చేసి

"జనార్ధన్ ఏమైంది?" అని కంగారుగా అడిగాడు ముకుల్ నంద.

"అయ్యా! ఆ మురళి జోషి భార్య పెదబాబు గారి గురించి కోర్టులో నోరు విప్పలేదు, కానీ చంపింది అభిర్ కాదు అని సాక్ష్యం చెప్పింది. కోర్టు అభిర్ మీద ఉన్న కేసు కొట్టేసింది." అని నెమ్మదిగా చెప్పాడు జనార్ధన్.

"ఆ మాట విని ఊపిరి పీల్చుకుని లాయర్ నీ పక్కనే ఉన్నాడా?" అని అడిగాడు ముకుల్.

"అవునయ్యా! ఇదిగో మాట్లాడుతున్నారు." అని స్పీకర్ ఆన్ చేసి హిరణ్య కి ఫోన్ ఇచ్చాడు జనార్ధన్.

ఫోన్ తీసుకుని "సారీ సార్! లాస్ట్ మూమెంట్లో మురళి జోషి భార్య వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆరోజు ఆవిడని మిచల్ చంపేశాడు అనుకున్నాను, కానీ అతను చంపింది మనం ఏర్పాటు చేసిన డమ్మీ భార్యని!" అని చెప్పాడు హిరణ్య.

"సరే! ఈ కేస్ పూర్తిగా క్లోజ్ చేసారా? ఫర్ దర్ గా మళ్ళి ఇన్వెస్టిగేషన్ ఉంటుందా?" డౌట్ గా అడిగాడు ముఖేష్.

"ఈ కేస్ కంప్లీట్ గా క్లోజ్ అవ్వలేదు సార్! ఎంక్వయిరీ చేయమని సిబిఐ వాళ్ళకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అభిర్ బయటికి వచ్చేసాడు కదా అని ఆ మురళి జోషి భార్యకి ధైర్యం వస్తే ఖచ్చితంగా గోకుల్ గారి గురించి సిబిఐ వాళ్ళకి చెబుతుంది." అని చెప్పాడు హిరణ్య.

"ఈ కేసు గురించి తెలిసిన మురళీ జోషి భార్య బతికి ఉండడానికి వీల్లేదు." అని చెప్పాడు ముకుల్.

"ఓకే సర్! ఇప్పుడే మిచల్ కి ఆర్డర్స్ పంపిస్తాను." అన్నాడు హిరణ్య.

ఆ మాట విని హిరణ్య చేతిలో ఫోన్ లాక్కొని "అయ్యా! మరి అభిర్ కి కూడా తెలుసు కదా!" అని కంగారుగా అడిగాడు జనార్ధన్.

"అభిర్ కి కూడా తెలుసు కానీ వాడు నోరు విప్పడు ఆ విషయం నాకు బాగా తెలుసు! ముందు దాని సంగతి చూడండి తర్వాత వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాము." అని సీరియస్ గా చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

రూమ్ బయట నుంచి ముకుల్  మాట్లాడుతుంది మొత్తం విని "తాతగారు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నారు." అనుకుంది అర్ణ.

************************

అదే సమయంలో కోర్టు నుంచి బయటికి వచ్చి క్యాంటీన్లో కాఫీ తాగుతూ అభిర్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి "కంగ్రాట్స్! కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్ హ్యాపీగా ఉండు." అని చెప్పి గీత వైపు చూస్తూ

మీరు అభిర్ ని కాపాడారు కానీ అసలు హంతకుడిని కూడా కాపాడుతున్నారు మీరు నిజం నిర్భయంగా చెబితే మీ భర్త ఆత్మకు శాంతి లభిస్తుంది." అని చెప్పాడు శ్రీకర్.

"సారీ సర్! నేను మళ్ళీ ఈ గొడవలలో తల దూర్చి నా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాలి అనుకోవడం లేదు ఒక అమాయకుడికి శిక్ష పడకుండా చేశాను ఆ తృప్తి నాకు చాలు!" అని చెప్పింది గీత.

"మీరేమీ టెన్షన్ పడకండి ఆంటీ! సుమతీకి మా ఛానల్ లో జాబ్ కన్ఫర్మ్ చేయించాను మీరు కూడా హ్యాపీగా ఇంకా ఇక్కడే ఉండండి ప్రణతి కూడా ఇక్కడే చదువుకుంటుంది." అని చెప్పింది నీలమ్.

క్యాంటీన్ దగ్గరికి వస్తూ వసుంధర వైపు చూసి "మేడం వీళ్ళందరూ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు త్వరగా ఇంటికి తీసుకువెళదాము." అని చెప్పాడు దయ.

"ఓకే" ఓకే!" అంటూ అభిర్ వాళ్ళ వైపు చూస్తూ "లెట్స్ గో  ఇంటికి వెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకుందాము, దయ గారు చెప్పింది కూడా కరెక్టే! ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అటు వైపు పార్టీ ఓడిపోయాము అన్న కసితో ఉంటారు." అని చెప్పింది వసుంధర.

బిల్ పే చేసి కార్ తీసుకువచ్చి అభిర్, గీత, సుమతీలను తీసుకొని ఇంటికి బయలుదేరింది నీలమ్.

దయ వైపు చూస్తూ "వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు కూడా వెళ్లిపోండి కేసు క్లోజ్ అయింది కాబట్టి మాక్సిమం ప్రాబ్లం ఉండదు." అని చెప్పాడు శ్రీకర్.

"ఓకే బాయ్ సార్! ఈవినింగ్ మీట్ అవుదాము." అని చెప్పి నీలమ్ వాళ్ల కారు వెనకాలే సెక్యూరిటీగా వెళ్ళాడు దయ.

క్యాంటీన్లో పక్క టేబుల్ దగ్గర చాక్లెట్ తో కలిసి కాఫీ తాగుతూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మొత్తం విని నీలమ్ కారు వెనకలే బైక్ వేసుకుని వెళుతూ

"ఒరేయ్ చాక్లెట్!  రూట్ బాగా గుర్తుంచుకో ఆ జర్నలిస్టుతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి అప్పుడే అభిర్ కి దగ్గరవుతాము." అని చెప్పింది మిత్ర.

"ఓకే అక్క! ఈ రూట్ లో నేను చాలాసార్లు వచ్చాను." అని చూస్తూ చెప్పాడు చాక్లెట్.

**************************

కార్ లో  పక్కనే ఉన్న జనార్ధన్ వైపు చూస్తూ "కోర్టులో ఆవిడ గోకుల్ గారి పేరు చెప్పలేదు కాబట్టి మూకుల్ గారు ప్రశాంతంగా ఉన్నారు లేకపోతే నా పని అవుట్! ఎలాగైనా దాని అడ్డు తొలగించాలి." అని డ్రైవర్ వైపు చూసి "సిటీ అవుట్స్ కట్స్ లో ఉన్న ఈగల్ బార్ కి వెళ్ళు!" అని చెప్పి మిచల్ కి కాల్ చేశాడు హిరణ్య.

ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ గారు చెప్పండి." అన్నాడు మిచల్.

"నువ్వు అర్జెంట్గా సిటీ ఔట్స్ కట్స్ లో ఉన్న ఈగల్ బార్ దగ్గరికి రా.. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము." అని చెప్పాడు హిరణ్య.

"ఓకే సార్! 15 మినిట్స్ లో వస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మిచల్.

జనార్ధన్ తో కలిసి బార్ లోకి వెళ్లి  డ్రింక్ ఆర్డర్ చెప్పి వాటర్ తాగుతూ "ఇంతకీ ముకుల్ సార్ కి ఆ అభిర్ కి మధ్య గొడవ ఏమిటి మీకైనా తెలుసా?" డౌట్ గా అడిగాడు హిరణ్య.

ఆ మాటకి హిరణ్య వైపు కంగారుగా చూస్తూ 'డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాచకూడదు అంటారు కానీ వీడి దగ్గర ఏ విషయం కూడా చెప్పకూడదు పెద్ద వెధవ!' అని మనసులో అనుకుని

"నాకు కూడా ఆ విషయం గురించి ఏమీ తెలియదు అయ్యగారు చెప్పారు నేను చేస్తున్నాను ఏదైనా చెబితే లాయర్ కాబట్టి మీకే చెప్పాలి." అన్నాడు జనార్ధన్.

ఆ మాటకి నవ్వుతూ "నాకు చెబుతారా! ముకుల్ గారు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు ఆయన వినాలి అనుకున్నది మాత్రమే వింటారు, డబ్బు, పరిచయాలు కోసం ఈ కేసు గురించి ఒక్క ముక్క తెలియకపోయినా ఒప్పుకున్నాను." అంటూ వెయిటర్ డ్రింక్ తీసుకురావడంతో తీసుకుని సిప్ చేస్తూ చెప్పాడు హిరణ్య.

"మా అయ్యగారి వల్ల మీరు కూడా బానే బాగుపడ్డట్లు ఉన్నారు కదా! మళ్లీ వివరాలు ఎందుకు అలాగే కంటిన్యూ అవ్వండి అదే మంచిది." అని చెపుతూ బార్ లోపలికి వస్తున్న మిచల్ వైపు చూసి చెయ్యి పైకి ఎత్తాడు జనార్ధన్.

ఇద్దరూ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ వెయిటర్ వైపు చూసి "టు పెగ్స్ విస్కీ!" అని ఆర్డర్ చెప్పి హిరణ్య వైపు చూస్తూ "చెప్పండి అర్జెంటుగా రమ్మన్నారు?"  అని అడిగాడు మిచల్.

"అసలు నీ మనుషులు ఆ మురళి జోషి కూతుర్ని ఎందుకు పట్టుకోలేకపోయారు?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.

"కోర్టు క్యాంటీన్ లో గొడవ జరిగేసరికి నా మనుషులు ఇద్దరిని సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకెళ్లారు, లాయర్ గారు కోర్టు దగ్గర ఎక్కువ హడావిడి చేయొద్దు అన్నారు అందుకే నేను తక్కువ మనుషులే పంపించాను." అన్నాడు మిచల్.

"సరే! జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆ మురళి జోషి భార్య బతికి ఉండడానికి వీల్లేదు పైనుంచి పెద్దాయన ఆర్డర్! అది ఎలా చావాలి అంటే మర్డర్ అని ఎవరికి అనుమానం రాకూడదు అంత జాగ్రత్తగా పని అయిపోవాలి లేట్ కూడా చేయకూడదు." అన్నాడు హిరణ్య.

వెయిటర్ తీసుకువచ్చిన మందు తాగుతూ "వాళ్ళు కేసు గెలిచిన సంబరాలలో ఉంటారు కదా కచ్చితంగా బయటికి వస్తారు, అందరూ తిరిగి ఇంటికి వెళతారు కానీ మురళి జోషి పెళ్ళం మాత్రం తిరిగి ఇంటికి వెళ్ళదు, ఒకవేళ తిరిగి వెళితే మళ్ళీ నా మొహం మీకు చూపించను." అన్నాడు మిచల్.

"హ.. నువ్వు చేయగలవు మిచల్! నీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టే ఏ పనైనా నీకే అప్పచెపుతున్నాను, కానీ ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు." అన్నాడు హిరణ్య.

"ఈసారి మీ ప్లాన్ కాదు నా ప్లాన్ ప్రకారం వెళ్తాను చూస్తూ ఉండండి త్వరలోనే మీకు కబురు అందుతుంది." అంటూ గడగడ రెండు పెగ్గులు తాగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు మిచల్.

************************

అభిర్ ఉండే వసుంధర ఇంటిని చూసి అక్కడ నుంచి ముఖేష్ ని కలవడానికి స్టేషన్ కి బయలుదేరి సాయంత్రానికి చేరుకొని బేకరీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది మిత్ర.

స్టేషన్ లోపలికి వెళ్లి ముఖేష్ కి కనిపించడు చాక్లెట్.

డస్క్ లో ఉన్న పేపర్స్ తీసుకుని పక్కనే ఉన్న ఆఫీసర్ వైపు చూసి "నేను వెళ్లి టీ తాగి వస్తాను." అంటూ చాక్లెట్ వెనకాలే బేకరీ దగ్గరికి వచ్చాడు ముఖేష్.

చాక్లెట్ తో పాటు వచ్చిన ముఖేష్ ని చూసి "ఆ ఇద్దరు ఏమంటున్నారు? ఎవరి మనుషులో తెలిసిందా?" అని అడిగింది మిత్ర.

ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ సమోసా ఆర్డర్ చెప్పి "ఆ ఇద్దరు మిచల్ గ్యాంగ్ మనుషులు బీహార్ నుంచి వచ్చారు, నీ మీద ఎందుకు ఎటాక్ చేశారో తెలియలేదు.
వాళ్ళని అడుగుదాము అనుకునే లోపు డి ఎస్ పి గారు ఫోన్ చేసి వదిలి పెట్టమన్నారు తప్పలేదు." అంటూ పేపర్స్ ఇస్తూ "నువ్వు అడిగిన డీటెయిల్స్!" అని చెప్పాడు ముకేశ్.

పేపర్స్ తీసుకుంటూ "మిచల్ గ్యాంగ్ మనుషుల?" అని ఆలోచిస్తూ పేపర్స్ చూసి 'నిరంజన్ అసిస్టెంట్ పాఠక్! ఇప్పుడు వీడు వున్నాడో పోయాడో తెలుసుకోవాలి.' అనుకుంది మిత్ర.
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 09-01-2026, 09:48 AM



Users browsing this thread: