09-01-2026, 09:47 AM
ఎపిసోడ్ 21
కోర్టు లోపల జడ్జిగారు రావడంతో అందరూ నుంచోడం చూసి సుమతితో పాటు లోపలికి వచ్చి మిత్రని పరిచయం చేసుకుంది నీలమ్.
**********************
కోర్టులో కొన్ని కేసులు తర్వాత కేసు నెంబర్ 326/2012 అని పిలవగానే బోన్ లోకి వచ్చి నిలబడ్డాడు అభిర్.
జడ్జి గారి ముందుకు వెళ్లి పేపర్స్ సబ్మిట్ చేసి "యువనానర్! అబీర్ మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని నిరూపించడానికి మా దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన పేపర్స్ మొత్తం మీకు సబ్మిట్ చేసాను.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ శ్రీకర్ గారిని ఒకసారి పిలిపించవలసిందిగా కోరుతున్నాను." అంటూ వినయంగా అడిగింది వసుంధర.
"ఓకే గ్రాంటెడ్!" అని చెప్పాడు జడ్జ్.
జడ్జ్ గారి ముందుకి వచ్చి నిలబడిన శ్రీకర్ వైపు చూస్తూ "మీరు ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేశారు కదా! మీకు తెలిసిన విషయాలు ఒకసారి జడ్జి గారు ముందు చెబుతారా?" అని అడిగింది వసుంధర.
"ఎస్!" అంటూ జడ్జి వైపు చూసి నమస్కరించి
"ఈ కేసు చాలా మిస్టరీగా ఉంది సార్! ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరు చనిపోయారు ఎంక్వయిరీ చేయడానికి మాకు ఎటువంటి దారి దొరకలేదు, కానీ మురళి జోషి భార్య పిల్లలు దూరంగా వెళ్లి బతుకుతున్నారని తెలిసి వెళ్లి వాళ్ళని కలిసి వివరాలు అడిగాము.
మురళీ జోషి గారి భార్య చెప్పిన మాటలు విని మేము కూడా షాక్ అయ్యాము, అసలు ఆవిడకి ఆయన భర్త కేసు కోర్టులో నడుస్తున్న విషయమే తెలియదు.
తన భర్తని చంపిన వ్యక్తి అభిర్ అని సెక్యూరిటీ ఆఫీసర్లకి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆ రోజే అక్కడి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి పారిపోయాను అని చెప్పారు. దీనిని బట్టి ఈ కేసులో అభిర్ ని కావాలని ఇరికించారు అని అర్థమైంది.
అంతే కాదు సర్! అబీర్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడానికి రెండుసార్లు దాడి జరిగింది సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ అధికారి డిపార్ట్మెంట్ పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.
అన్ని అవరోధాలు దాటుకుని సాక్షులను కోర్టుకి జాగ్రత్తగా తీసుకువచ్చాము మాకు ఇంకా కొంత సమయం ఇస్తే ఈ కేసులో అసలైన నేరస్తులని పట్టుకొని కోర్టులో ప్రవేశపెడతాము." అని చెప్పాడు శ్రీకర్.
జడ్జి గారికి ముందుకు వచ్చి "యువనానర్! సిబిఐ ఆఫీసర్ శ్రీకర్ గారు చెప్పినట్లు అభిర్ మీద దాడి జరిగినట్లు ఎక్కడ కేస్ ఫైల్ అవలేదు అయ్యినా సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టేముందు నోటీస్ ఇష్యూ చేయాలి అటువంటిదేమీ లేకుండా ఎలా విచారిస్తాము?" అని అడిగాడు హిరణ్య.
"యువనానర్! సాక్షులు బయట ఉంటే వారి ప్రాణాలకి చాలా ప్రమాదం అందుకే ఎటువంటి నోటీసు ఇష్యూ చేయకుండా వాళ్ళని కోర్టుకి తీసుకువచ్చాము." అంటూ బెంచ్ మీద కూర్చున్న గీతని చూపించి
"ఈ కేస్ ని 12 సంవత్సరాలుగా బెంచ్ మీదకి రాకుండా చేసిన వాళ్ళకి మిగతా విషయాలు చేయడం అంత పెద్ద పనేమీ కాదు." అని చెప్పింది వసుంధర.
"యువనానర్! వసుంధర గారు ఇది సినిమా అనుకుంటున్నారేమో సాక్షుల్ని ప్రశ్నించడానికి నాకు సమయం కావాలి." అని అడిగాడు హిరణ్య.
"మిస్టర్ హిరణ్య! మీరు చెప్పింది కరెక్టే! ఇది సినిమా కాదు మరి 12 సంవత్సరాలు ఈ కేస్ బెంచ్ మీదకి రాకుండా ఎలా ఉంది.
అసలు ఈ కేసులో అభిర్ దోషి అని రుజువు కాకుండా 12 సంవత్సరాలు శిక్ష ఎందుకు అనుభవించవలసి వచ్చింది సాక్షులని ఈరోజే క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. ఇట్స్ మై ఆర్డర్!" అంటూ సీరియస్ గా చెప్పాడు జడ్జ్.
ఆ మాటకి కంగారుపడి "ఓకే యువనానర్ !" అంటూ వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు హిరణ్య.
గీత, వైఫ్ ఆఫ్ మురళీ జోషి అని పిలుపు విని జడ్జిగారు ముందుకి వచ్చి కుర్చీలో కూర్చుంది గీత.
తన ముందు ఉన్న గీత వైపు చూసి "మీరు ఎవరికి భయపడాల్సిన పనిలేదు ధైర్యంగా మీరు తెలిసింది మీరు చూసింది చెప్పండి." అని చెప్పాడు జడ్జ్.
"ఓకే సార్!" అంటూ నమస్కారం చేసి దూరంగా ఉన్న జనార్ధన్ వైపు భయంగా చూస్తూ ఉంది గీత.
"గీత గారు మీ భర్త మురళి జోషి గారిని చంపిన వ్యక్తిని మీరు చూశారా?" అని అడిగింది వసుంధర.
"నేను చూశాను." అంటూ బాధగా చెప్పింది గీత.
"సరే! ఆ మనిషిని మీరు ఇప్పుడు చూసినా గుర్తుపట్టగలరా?" అని అడిగింది వసుంధర.
"కచ్చితంగా గుర్తుపడతాను ఆ మనిషిని ఎప్పటికీ మర్చిపోలేను." అంటూ కోపంగా చెప్పింది గీత.
"మంచిది." అంటూ ఎదురుగా ఉన్న అభిర్ వైపు చూపిస్తూ "మీ భర్తను చంపింది ఆ మనిషి యనా సరిగ్గా చూసి చెప్పండి." అని అడిగింది వసుంధర.
ఆ మాట విని తల ఎత్తి ఎదురుగా ఉన్న అభిర్ వైపు చూస్తూ "నా భర్తను చంపింది అతను కాదు ఆ మనిషి నాకు బాగా గుర్తున్నాడు." అని చెప్పింది గీత.
"మీ భర్తను చంపింది అభిర్ అని మీరు సెక్యూరిటీ అధికారి స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారా?" అని అడిగింది వసుంధర.
"నా భర్తను చంపడం చూసి భయపడిన పిల్లల్ని తీసుకుని పరిపోయాను నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు." అంటూ
శ్రీకర్ వైపు చూసి "ఆ ఆఫీసర్ గారు వచ్చి చెప్పే వరకు కోర్టులో కేసు నడుస్తున్న విషయం కూడా నాకు తెలీదు." అని చెప్పింది గీత.
"మీ భర్తను చంపిన వ్యక్తి మీకు తెలుసా?" అని అడిగాడు జడ్జి.
ఆ మాట విని గీతా ఏం చెబుతుందని టెన్షన్ గా చూస్తూ ఉన్నారు జనార్దన్, హిరణ్యలు.
"నా భర్తను చంపిన వ్యక్తిని నేను చూశాను కానీ అతను ఎవరో నాకు తెలియదు చూడడం అదే మొదటిసారి!" అని చెప్పింది గీత.
ఆ మాట విని ఊపిరి పీల్చుకున్నారు హిరణ్య జనార్ధన్ లు.
"ఓకే!" అంటూ హిరణ్య వైపు చూసి "మీరేమైనా అడగాలనుకుంటే అడగండి." అని చెప్పాడు జడ్జ్.
గీత దగ్గరికి వచ్చి "మీ భర్తను చంపిన వ్యక్తి గురించి మీకు తెలీదు అని చెప్తున్నారు ఆ మనిషి అభిర్ అయి ఉండొచ్చు కదా! అతను 12 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు ఒక్కసారి బాగా చూసి చెప్పండి." అని అడిగాడు హిరణ్య.
"నా భర్తను చంపిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి అతని మొహం నాకు బాగా గుర్తుంది." అంటు కోపంగా చూస్తూ చెప్పింది గీత.
"సరే! మీ భర్తను మీ కళ్ళముందే అంత దారుణంగా చంపితే వాళ్ల మీద కేసు కూడా పెట్టకుండా మీరు పిల్లల్ని తీసుకుని ఎందుకు పారిపోయారు?" అని అడిగాడు హిరణ్య.
"నేను ఒక హౌస్ వైఫ్ నాకు నా భర్త, పిల్లలే నా ప్రపంచం అటువంటిది నా కళ్ళముందే నా భర్త దారుణంగా చంపడం చూసి భయపడి పిల్లలకి ఏమీ అవ్వకూడదు అని అక్కడి నుంచి దూరంగా పారిపోయాను.
కానీ ఒక అమాయకుడికి అన్యాయంగా శిక్ష పడుతుంది అని తెలిసి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను." అని చెప్పింది గీత.
"యువనానర్! ఎవరో ఈవిడని భయపెట్టి ఇలా చెప్పిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది." అంటూ వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు హిరణ్య.
ఆ మాటకి నవ్వుతూ మరొక పేపర్ తీసి ఇస్తూ "యువనానర్! అసలు ఈ కేసు ఫైల్ చేసింది ఎవరు హిరణ్య గారికి అప్ప చెప్పింది ఎవరో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
లాస్ట్ టైం వారిని అడిగితే NIA ఆఫీసర్ కదా అని పోరాడుతున్నాను అని చెప్పారు, అసలు ఆ డిపార్ట్మెంట్ వాళ్లే ఈ కేసు గురించి పట్టించుకోవడం లేదు మురళి జోషి మర్డర్ ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు.
అండమాన్ కి పంపించే లిస్టులో అభిర్ పేరు తప్పుగా యాడ్ చేశామని రిమూవ్ చేసి మళ్లీ కోర్టుకి సబ్మిట్ చేశారు మరి అసలు ఈ కేసుని వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో మన లాయర్ గారు చెప్పాలి." అంటూ నవ్వుతూ హిరణ్య వైపు చూసి అడిగింది వసుంధర.
"నా దగ్గరికి వచ్చిన కేసు ఎలాంటిదైనా చివరి వరకు పోరాడమే నాకు తెలుసు అందుకే దీనిని ఎవరు ఫాలోఅప్ చేయకపోయినా నేను చూసుకుంటున్నాను చనిపోయిన ఆఫీసర్ కి న్యాయం జరగాలి అన్నదే నా ఉద్దేశం!" అని చెప్పాడు హిరణ్య.
"ఇరుపక్షల వాదనలో వినడం అయ్యింది. ఈ కేసు పూర్వపురాలు పరిశీలించి త్వరగా మురళి జోషి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన అతని భార్య గీత హంతకుడు అభిర్ కాదని చెప్పడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడం అవుతుంది.
ఈ కేసు ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తిచేసి అసలైన నేరస్తుల్ని కోర్ట్ లో ప్రవేశపెట్టాల్సిందిగా సిబిఐ వారికి తెలియజేయడమైనది." అంటూ తీర్పు ఇచ్చాడు జడ్జ్.
తీర్పు విని స్పీడ్ గా బయటికి వెళుతున్న జనార్ధన్ వెనకాలే వెళ్ళిపోయాడు హిరణ్య.
అభిర్ దగ్గరికి వచ్చి సంతోషంగా చూస్తూ "ఈ కేసు నుంచి బయటపడ్డావు ఇక ప్రశాంతంగా ఉండు." అని చెప్పింది వసుంధర.
"థాంక్స్ మేడం! మీ ఋణం కచ్చితంగా ఈ జన్మలోనే తీర్చుకుంటాను." అని చెప్పాడు అభిర్.
సంతోషంతో చప్పట్లు కొడుతున్న నీలమ్, సుమతి వైపు చూసి "అతను మీకు తెలుసా?" డౌట్ గా అడిగింది మిత్ర.
"అభిర్ నా ఫ్రెండ్! ఈ కేసు వాదించింది మా వదిన! సాక్ష్యం చెప్పింది సుమతి వాళ్ళ మదర్!" అంటూ సంతోషంగా చూస్తూ చెప్పింది నీలమ్.
'అవునా? కరెక్ట్ పర్సన్స్ ని పరిచయం చేసుకున్నాను.' అని మనసులో అనుకుంది మిత్ర.
"అక్క! నీ టీ షర్టు సుమతి అక్క టీ షర్టు సేమ్ ఉన్నాయి చూసావా?" అని చూస్తూ చెప్పాడు చాక్లెట్.
ఆ మాట విని "మీ అసిస్టెంట్ లేట్ గా కనిపెట్టిన కరెక్ట్ గా చెప్పాడు, ఇందాక నువ్వు కొట్టిన వాళ్ళు సుమతిని కిడ్నాప్ చేయడానికి వచ్చారు, ఇద్దరు సేమ్ టీ షర్ట్స్ వల్ల తను అనుకుని నీ దగ్గరికి వచ్చి తన్నులు తిన్నారు ఎనీ హౌ తనని కాపాడినందుకు థాంక్స్!" అని చెప్పింది నీలమ్.
"నో ప్రాబ్లం! ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయ్యాము కదా! నువ్వు జర్నలిస్ట్ నేను డిటెక్టివ్ ఇద్దరికీ ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది టైం వచ్చినప్పుడు నాకు హెల్ప్ చెయ్!" అని చెప్పింది మిత్ర.
"కన్ఫామ్ గా చేస్తాను." అని వసుంధర తో పాటు వస్తున్న అభిర్ ని చూసి మిత్ర కి బాయ్ చెప్పి సుమతితో కలిసి వెళ్ళింది నీలమ్.
అభిర్ వెనకాలే చాక్లెట్ ని తీసుకుని వెళ్ళింది మిత్ర
కోర్టు దగ్గర నుంచి హిరణ్యతో కలిసి కారులో వెళుతూ ముఖేష్ కి కాల్ చేశాడు జనార్ధన్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)