07-01-2026, 08:37 AM
ఎపిసోడ్ 20
కోర్ట్ హాల్ లో వాటర్ బాటిల్ కోసం సుమతి బయటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న గీత దగ్గరికి వచ్చి నమస్తే మేడం అని అడిగిన జనార్ధన్ వైపు భయంగా చూస్తూ ఉండిపోయింది గీత.
*******************
కోర్ట్ హాల్ లో తన వైపు భయంగా చూస్తున్న గీత వైపు చూసి "కంగారు పడకండి బయటకు వెళ్లిన మీ అమ్మాయి క్షేమంగానే ఉంటుంది. మీరు ఈ కోర్టులో నోరు తెరవనంత వరకు." అంటూ అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి
"పాత విషయాలు మీరు పూర్తిగా మర్చిపోయారు అనుకుంటున్నాను." అంటూ నవ్వుతూ అక్కడ నుంచి బయటకు వెళ్ళాడు జనార్ధన్.
దూరంగా ఉన్న అభిర్ వైపు చూస్తూ టెన్షన్ గా ఆలోచిస్తున్న గీత భుజం మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి తల పక్కకు తిప్పి కంగారు "ఎవరు?" అంది.
స్మైల్ ఇస్తూ "నేనే ఆంటీ! ఏమైంది? అంత టెన్షన్ గా ఉన్నారు అందరం ఇక్కడే ఉన్నాము కదా!" అంటూ చుట్టూ చూస్తూ "సుమతి ఎక్కడ?" డౌట్ గా అడిగింది నీలమ్.
"వాటర్ బాటిల్ కోసం బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు ఒక్కసారి చూసి వస్తావా అమ్మ? ఎందుకో నాకు కంగారుగా ఉంది." అంటూ వణుకుతున్న గొంతుతో చెప్పిన గీత.
"మీరు రిలాక్స్ గా ఉండండి నేను వెళ్లి సుమతి ఎక్కడ ఉందో చూస్తాను." అంటూ బయటికి వెళుతూ అక్కడ బెంచ్ మీద ఉన్న తన అసిస్టెంట్ వైపు చూసి "రాజు! ఆవిడ దగ్గరికి ఎవరైనా వచ్చారా?" డౌట్ గా అడిగింది నీలమ్.
"మేడం! ఒక వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళాడు అప్పట్నుంచి ఆవిడ టెన్షన్ గా ఉంది." అంటూ మొబైల్ లో ఫోటో చూపించాడు రాజు.
"అవునా?" అంటూ గీత వైపు చూసి ఆలోచిస్తూ "ఆ ఫోటో నాకు సెండ్ చెయ్ ఆ మనిషి మళ్ళీ వస్తే వెంటనే నాకు కాల్ చెయ్!" అంటూ హడావిడిగా సుమతి కోసం బయటికి వెళ్ళింది నీలమ్.
********************
కోర్టు హల్ నుంచి బయటికి వస్తూ ఫోన్ తీసి కాల్ చేసి "మిచల్! లోపల మురళి జోషి పెళ్లానికి వార్నింగ్ ఇవ్వడం అయ్యింది దాని కూతురు వాటర్ బాటిల్ కోసం క్యాంటీన్ దగ్గరికి వచ్చింది నేను కూడా అక్కడికే అక్కడే ఉన్నాను త్వరగా నీ మనుషుల్ని పంపించు అది మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు." అని చెప్పాడు జనార్ధన్.
"సరే! నా మనుషులు ఇద్దరు మీ దగ్గరికి వస్తున్నారు ఆ అమ్మాయిని చూపించి మీరు అక్కడి నుంచి లోపలకి వెళ్లిపోండి మిగతా విషయం మా వాళ్ళు చూసుకుంటారు." అని చెప్పాడు మిచల్.
"ఓకే!" అంటూ ఫోన్ కట్ చేసి క్యాంటీన్ దగ్గర ఉన్న సుమతి వైపు చూస్తూ ఉన్నాడు జనార్ధన్.
అంతలో చాక్లెట్ కలిసి బైక్ మీద అక్కడికి వచ్చి పార్క్ చేసి కోర్టు లోపలికి వెళుతూ "ఒరేయ్! ఈరోజు మన దేవుడిని డైరెక్ట్ గా చూద్దాము." అని చెప్పింది మిత్ర.
"సరే అక్క!" అంటూ వెనకాలే వెళుతూ క్యాంటీన్ వైపు చూసి "అక్క! రైటర్ ముఖేష్ ఇక్కడే ఉన్నాడు మన కోసమే వచ్చాడేమో!" డౌట్ గా అన్నాడు చాక్లెట్.
"అవునా? మనం ఎక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు కదా!" అంటూ డౌట్ గా వెనక్కి తిరిగి క్యాంటీన్ దగ్గర సమోసా తింటున్నా ముకేశ్ ని చూసి
"అబ్బా.. ఎప్పుడు కనిపించినా సమోసా తింటూనే ఉంటాడు వీడి పెళ్ళాం ఇంటి దగ్గర ఏమి వండి పెట్టదు అనుకుంటా!" అంటూ చికాకుగా చూస్తూ క్యాంటీన్ వైపు వెళ్ళింది మిత్ర.
కోర్ట్ హాల్లో నుంచి హడావిడిగా బయటకు వచ్చి క్యాంటీన్ దగ్గర ఉన్న సుమతిని చూసి దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ "వాటర్ బాటిల్ కోసం వచ్చావా?" అని అడిగింది నీలమ్.
భుజం మీద చెయ్యి వేసిన నీలమ్ వైపు చూసి "హ...! అమ్మ వాటర్ అంటే వచ్చాను ఇక్కడ చాలా బిజీగా ఉంది." అంటూ బాటిల్ తీసుకుని డబ్బులు ఇస్తూ చెప్పింది సుమతి.
"ఓకే! నువ్వు సింగిల్ గా బయటికి రాకూడదు ఏదైనా అవసరమైతే నాతో చెప్పు!" అంటూ దూరంగా ఉన్న జనార్దన్ దగ్గరికి ఇద్దరు మనుషులు రావడం చూస్తూ చెప్పింది నీలమ్.
తన దగ్గరికి వచ్చిన మిచల్ మనుషుల వైపు చూసి క్యాంటీన్ వైపు చూపించి "ఆ వైట్ కలర్ టీ షర్ట్ అమ్మాయిని మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సింది." అని చెప్పాడు జనార్ధన్.
"ఓకే సర్! మీరు లోపలికి వెళ్ళండి ఇంక మేము చూసుకుంటాము." అంటూ క్యాంటీన్ వైపు వెళ్లారు మిచల్ మనుషులు ఇద్దరు.
జనార్ధన్ కోర్టు లోపలికి వెళ్లడం క్యాంటీన్ వైపు అతనితో మాట్లాడిన ఇద్దరు రావడం చూసి సుమతి చెయ్యి పట్టుకుని "మనం ఇటు వైపు నుంచి వెళదాము పద!" అంటూ స్పీడ్ గా అక్కడినుంచి తీసుకువెళ్ళింది నీలమ్.
క్యాంటీన్ దగ్గరికి వచ్చి లోపల చూస్తూ ముఖేష్ తో మాట్లాడుతు వైట్ కలర్ టీ షర్ట్ లో ఉన్న మిత్రని చూసి దగ్గరకు వెళ్లి
"మీ అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు వసుంధర మేడం మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు." అని చెప్పాడు అక్కడకు వచ్చిన ఇద్దరిలో ఒకడు.
ఆ మాటకి తల తిప్పి చూస్తూ "మీరు మాట్లాడేది నాతోనే కదా! నేను మీకు బాగా తెలుసా?" అంటూ వెటకారంగా అడిగింది మిత్ర.
వెంటనే పక్కనున్న రెండో వాడు మిత్ర వీపు మీద కత్తి పెట్టి "నువ్వు ఎవరో మాకు బాగా తెలుసు! మర్యాదగా నోరు మూసుకుని మాతో పాటు రా..!" అంటూ నెమ్మదిగా చెప్పాడు.
"ఓకే! ఓకే కూల్! కూల్!" అంటూ వెనక్కి తిరిగి ఇద్దరి కళ్ళల్లోకి చూస్తూ "ప్లీజ్ నన్ను వదిలి పెట్టండి. మీకు పుణ్యం ఉంటుంది." అంటూ భయంగా చూస్తూ ఫేస్ ఫీలింగ్స్ మార్చి నవ్వుతూ
"ఒరేయ్! ఈ కత్తులుకి, బ్లేడులకి భయపడే రకం కాదురా నేను! మీ చేతిలో ఏకే 47 ఉంటే అప్పుడు ఆలోచిస్తాను." అంటూ కత్తి పట్టుకున్న వాడికి రెండు కాళ్ళ మధ్యలో మోకాలితో ఒక్క తన్ను తన్నింది మిత్ర.
"అబ్బా... చచ్చేనురా దేవుడా!' అంటూ కిందపడి గిలగిల కొట్టుకున్నాడు వచ్చిన వాళ్ళలో ఒకడు.
అక్కడినుంచి పారిపోతున్న రెండో వాడిని చూసి "చాక్లెట్ వాడిని పట్టుకోరా..!" అంటూ గట్టిగా అరిచింది మిత్ర.
ఆ అరుపు విని పరిగెడుతున్న వాడి మీదకి దూకి రెండు కాళ్ళు పట్టుకుని కింద పడేసి "అక్క తొందరగా రా..! వీడు దున్నపోతులాగ ఉన్నాడు." అంటూ గట్టిగా పట్టుకున్నాడు చాక్లెట్.
గిలగిలా కొట్టుకుంటున్న వాడిని పైకి లేపి ముఖేష్ చేతికి ఇచ్చి పరుగెత్తుకుంటూ వెళ్లి రెండవ వాడి మీద కాలు పెట్టి "చాక్లెట్ వాడిని వదిలేయరా..!" అంటూ జుట్టు పట్టుకుని పైకి లేపి
"మీరు నా దగ్గరికి చాలా లేటుగా వచ్చారూ రా..! మా అమ్మ కళ్ళు తిరిగి పడి పైకి పోయి 12 ఏళ్లు అవుతుంది. ఎవర్రా మీరు..? మిమ్మల్ని ఎవరు పంపించారు? అంటూ కోపంగా చూస్తూ అడిగి ఇద్దరు సైలెంట్ గా ఉండడంతో
ముఖేష్ వైపు తిరిగి "ఇద్దరిని స్టేషన్ కి తీసుకువెళ్లి ఫుల్ గా బిర్యాని పెట్టి కొడుతూనే ఉండాలి నేను వచ్చి నీ దగ్గర పేపర్స్ తీసుకుని వీళ్ళ దగ్గర నిజం తెలుసుకుంటాను." అంటూ చాక్లెట్ వైపు చూసి "ముఖేష్ కి 10000 ఫోన్ పే చెయ్!" అని చెప్పింది మిత్ర.
"ఓకే అక్క!" అంటూ ఫోన్ తీసి ముఖేష్ కి అమౌంట్ పంపించాడు చాక్లెట్.
ఫోన్ కి వచ్చిన మెసేజ్ సంతోషంగా చూస్తూ తనతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని పిలిచి "వీళ్ళిద్దరిని జీపులో ఎక్కించండి బిరియాని పెట్టించి స్టేషన్ కి తీసుకువెళదాము." అన్నాడు ముఖేష్.
"ఓకే సార్!" అంటూ ఇద్దరి చేతిలో వెనక్కి పెట్టి పట్టుకుని జీప్ దగ్గరికి తీసుకెళ్లారు కానిస్టేబుల్స్.
దూరం నుంచి ఇద్దరిని కొడుతున్న మిత్రని చూసి స్మైల్ ఇస్తూ మనసులో థాంక్స్ చెప్పి సుమతీ తో కలిసి లోపలికి వెళ్లి అసిస్టెంట్ రాజు అని పిలిచి
"గీతా మేడం దగ్గరికి వెళ్లి ఒక్కసారి ఇటు వైపు చూడమను నువ్వు ఆవిడతో మాట్లాడుతున్న విషయం ఆ బ్లాక్ షర్ట్ వాడికి తెలియకూడదు." అంటూ కోర్టు హాల్లో ఉన్న జనార్దన్ ని చూపించింది నీలమ్.
"ఓకే మేడం!" అంటు కోర్టు హాల్ లోపలికి వెళ్లి గీత పక్కన కూర్చుని పేపర్ చూస్తూ "మేడం ఒకసారి తల లెఫ్ట్ కి తిప్పండి." అని చెప్పాడు రాజు.
ఆ మాట విని తల తిప్పి నీలమ్ తో పాటు ఉన్న సుమతిని చూసి ఊపిరి పీల్చుకుంది గీత.
అక్కడ నుంచే సైగ చేసి సుమతి భుజం మీద చెయ్యి వేసి 'నేను ఉన్నాను మీరు కంగారు పడకండి.' అంటూ బొటనవేలు చూపించింది నీలమ్.
చాక్లెట్ తో కలిసి కోర్టు హాల్లోకి వచ్చి అభిర్ ని చూపించి "ఒరేయ్! అతనే మనకి డబ్బులు ఇచ్చిన దేవుడు!" అని చెప్పింది మిత్ర.
"అవునా?" అంటూ అభిర్ వైపు చూసి "అక్క! ఇంత పెద్ద కేసులో ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడేంటి?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు చాక్లెట్.
"మనిషి ప్రశాంతంగానే ఉన్నాడు రా..! కానీ అతని కళ్ళలో కసి, మనసులో ఉక్రోషం, కడుపులో బాధ అన్ని నాకు అతని మొహం లోనే కనిపిస్తున్నాయి." అంటూ చూస్తూ చెప్పింది మిత్ర.
"అవునా? నీకు అతని మొహంలో అన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నాయా?" డౌట్ గా అడిగాడు చాక్లెట్.
ఎస్! అంటూ కోర్టు హాల్లోకి వసున్న హిరణ్యని చూసి "చాక్లెట్! లోపలికి వస్తున్న ఆ లాయర్ మొహం చూడు ఏమనిపిస్తుంది?" అని అడిగింది మిత్ర.
కళ్ళజోడు సరిచేసుకుంటూ లోపలికి వస్తున్న హిరణ్యని చూసి "అక్క! వీడు చిన్న పిల్లల నోట్లో లాలీపాప్ లాక్కునే వెధవ లాగా ఉన్నాడు." అంటూ అసహ్యంగా చూస్తూ చెప్పాడు చాక్లెట్.
"కరెక్ట్ గా చెప్పావు!" అంటు నవ్వుతూ ఫ్రంట్ బెంచ్ లో ఉన్న గీతా దగ్గరికి వస్తున్న వసుంధరని చూసి 'అభిర్ కేసు టేకప్ చేసింది ఈవిడే కదా!' అనుకుంది మిత్ర.
గీత దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి "మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన విషయం జడ్జి గారు ముందు ధైర్యంగా చెప్పండి." అంటూ వెళ్లి తన చైర్ లో కూర్చుంది వసుంధర.
అంతలో కోర్టు హాల్లోకి జడ్జిగారు రావడం చూసి అందరూ లెగిసి నుంచోవడంతో నెమ్మదిగా సుమతితో పాటు లోపలికి వచ్చి మిత్ర పక్కన కూర్చుని స్మైల్ ఇచ్చి
"హాయ్! ఐ యాం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నీలమ్!" అంటూ పరిచయం చేసుకుంది.
"హాయ్! ఐయామ్ డిటెక్టివ్ మిత్ర! వాడు నా అసిస్టెంట్ చాక్లెట్!" అంటూ స్మైల్ ఇచ్చింది మిత్ర.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)