06-01-2026, 02:25 PM
ఎపిసోడ్ 18
అభి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మిత్ర అనే డిటెక్టివ్ ని అపాయింట్ చేసింది అర్ణ.
కిడ్నాపైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ పిల్లల్ని కనిపెట్టడానికి అభిర్ చెప్పినట్లు పక్షులు వెనకాల బయలుదేరాడు దయ.
********************
పిల్లల కోసం పక్షులు వెనకాల స్టాఫ్ తో కలిసి దయ వెళ్లడంతో వసుంధర వైపు చూసి
"మేడం! మనం మురళి జోషి ఫ్యామిలీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే ప్లేస్ లో సేఫ్ ఉంచాలి." అన్నాడు శ్రీకర్.
"కరెక్టే! కానీ టైమ్ లో వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం అంత సేఫ్ కాదు." అంది నీలమ్.
"ఈ ఒక్కరోజు వీళ్లని సేఫ్ గా ఉంచితే చాలు రేపు కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత వీళ్ళ ఒంటి మీద చెయ్యి వేయడానికి కూడా భయపడతారు." అంది వసుంధర.
టెన్షన్ పడుతున్న గీత సుమతిల దగ్గరకు వెళ్లి
"మీ దగ్గరికి ఎవరైనా రావాలి అంటే నన్ను దాటి రావాలి కంగారు పడకండి." అంటూ పక్షుల వైపు చూసి చప్పట్లు కొట్టి "ఈ ఇంటి చుట్టుపక్కలకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఇంకా మనకి తెలిసిపోతుంది." అన్నాడు అభిర్.
"అవునా? ఎలా తెలుస్తుంది?" డౌట్ గా అడిగింది నీలమ్.
ఎగురుతున్న పక్షులను చూపించి "ఇవే మనకి సెక్యూరిటీగా ఉంటాయి కొత్త వ్యక్తులు ఎవరైనా మన ఇంటి వైపు రావాలని చూస్తే వెంటనే వచ్చి నాకు చెప్తాయి." అన్నాడు అభిర్.
ఆ మాటకి ఎగురుతున్న పక్షుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు వాటితో మాట్లాడుతున్నావా? నిజంగా ఈ పక్షులు మనకి హెల్ప్ చేస్తాయా?" అనుమానంగా అడిగింది నీలమ్.
"అవును! మనకి మాట్లాడుకోవడానికి భాష ఉన్నట్లే ప్రతి జంతువుకి ఒక భాష ఉంటుంది దానిని మనం అర్థం చేసుకోవాలి, ఆ పక్షులు నాతోనే కాదు మీతో కూడా మాట్లాడుతున్నాయి వాటికి ఆహారం పెట్టినందుకు కృతజ్ఞతగా మనకి హెల్ప్ చేస్తున్నాయి." అన్నాడు అభిర్.
పక్షుల వైపు చూస్తూ దాస్ దగ్గరికి వచ్చి "సార్! మనం కూడా అభిర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇన్ ఫార్మర్స్ కి డబ్బులు ఇచ్చే పని ఉండదు." అటు సంతోషంగా చూస్తూ చెప్పాడు కుమార్.
ఆ మాటకి కుమార్ ని కింద నుంచి పైకి చూస్తూ "నువ్వు ఏ రోజైనా ఎంగిలి చేత్తో కాకినైనా కొట్టావా?" అని అడిగాడు దాస్.
"ఏమో సర్ గుర్తులేదు." అన్నాడు కుమార్.
"మరి నీకు ఏ పక్షి హెల్ప్ చేస్తుంది నోరు మూసుకుని మాట్లాడకుండా అక్కడ జరుగుతుంది చూడు." కోపంగా చూస్తూ అన్నాడు దాస్.
'మీరు పిల్లికి బిచ్చం కూడా పెట్టారు పైగా నన్ను అంటున్నారు.' అంటూ మనసులో అనుకుంటూ దూరంగా వెళ్ళాడు కుమార్.
"అభిర్! అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నాతో కూడా చెప్పకూడదా?" అని అడిగింది వసుంధర.
"నాకు పునర్జన్మ ఇచ్చిన కన్నతల్లి లాంటివారు, నా బాధ మీతో కాకుండా ఎవరితో చెప్పుకోగలను తప్పకుండా చెప్తాను కానీ దానికి కొంత సమయం ఉంది." అన్నాడు అభిర్.
అంతలో ఒక పక్షి అక్కడకి వచ్చి అరవడం చూసి "అభిర్! ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా?" అంటూ కంగారుగా అడిగాడు శ్రీకర్.
పక్షి వైపు చూసి "దయ సార్ వాళ్ళు పిల్లల్ని తీసుకుని వస్తున్నారు." అంటూ సంతోషంగా చెప్పాడు అభిర్.
"అవునా?" అంటూ ఇంటి బయటకు వెళ్లి చూసి "దయ వాళ్ళు వెళ్లిన కారు వస్తుంది." అంటూ సంతోషంగా చూస్తూ అన్నాడు శ్రీకర్.
అక్కడికి వచ్చి కారులో నుంచి దిగి అభిర్ దగ్గరకు వచ్చి "యువర్ రియల్లీ గ్రేట్! పిల్లల్ని ఉన్న ప్లేస్ ఎవరు కనిపెట్టలేరు, కానీ ఈ పక్షులు మమ్మల్ని ఈజీగా అక్కడకు తీసుకువెళ్లేయ్! పిల్లల్ని సేవ్ చేసాము ఆ గ్యాంగ్ లో కొంతమందిని అరెస్టు చేసాము ఈరోజు నువ్వు రెండు ప్రాణాలు కాపాడేవు." సంతోషంగా చూస్తూ చెప్పాడు దయ.
"కాదు సార్! ఆరు ప్రాణాలు కాపాడాడు మా పిల్లలు లేకపోతే మేము ఉండే వాళ్ళమే కాదు." అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు సురేష్.
అభిర్ చేతులు పట్టుకుని "థాంక్యూ బ్రదర్! నీ రుణం ఎప్పటికీ తీర్చుకొలేము." అన్నాడు కమల్.
"ఈ విషయంలో నేను చేసింది ఏమీ లేదు మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడింది థాంక్స్ చెప్పాలి అనుకుంటే మనకి హెల్ప్ చేసిన ఆ పక్షులకి చెప్పండి." అన్నాడు అభిర్.
"అంకుల్! ఈ పక్షులు నాతో కూడా మాట్లాడతాయా?" క్యూట్ గా అడిగింది రోషిని.
"ఆ పక్షులు నీతోరోజు మాట్లాడుతున్నాయి ఇప్పుడు కూడా హాయ్ చెప్తున్నాయి." అంటూ ఎత్తుకుని పక్షుల దగ్గరికి తీసుకువెళ్లాడు అభిర్.
"ఇటువంటి పిల్లాడికి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు బాగుపడరు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు." అంది గీత.
వసుంధర దగ్గరికి వచ్చి "మేడం! నాకు ఒక చిన్న డౌట్ పక్షులతో ఇంత చేయగలిగినవాడు జైల్లో ఉన్నట్లు తన మనుషులకి చెప్పలేడు అంటారా!" అంటూ దూరంగా ఉన్న అభిర్ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు శ్రీకర్.
"నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది." అంది వసుంధర.
"అంటే! అభిర్ ఇన్ని సంవత్సరాలుగా తన వాళ్లని కలవకూడదు అనుకున్నాడా? లేక తనకోసం వస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని ఆగిపోయాడా?" అనుమానంగా అన్నాడు శ్రీకర్.
"నాకు తెలిసి సెకండ్ పాయింట్ కరెక్ట్! తనకోసం వచ్చి ఎవరు ప్రమాదంలో పడకూడదు అని ఆలోచించి ఉంటాడు." అంది నీలమ్.
'ఈ కేస్ లో నుంచి అభిర్ బయటికి వచ్చిన తన మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది.' అని మనసులో అనుకున్నడు శ్రీకర్.
*******************
అదే టైంలో తన ఇంటి దగ్గర అభిర్ కేస్ ఫైల్ చూస్తూ తన అసిస్టెంట్ వైపు చూసి "ఒరేయ్ చాక్లెట్! మనకి కేసు ఇచ్చిన పార్టీకి అమౌంట్ వేయమని మెసేజ్ పెట్టాలి సుమారు ఎంత అవసరమవుతుంది." డౌట్ గా చూస్తూ అడిగింది మిత్ర.
"అక్క! అవసరం అంటే చాలా ఉంది రెంట్ కట్టాలి కిరాణా షాప్, పాలవాడు, కరెంట్ బిల్లు!" అంటు లిస్ట్ చెప్పడం మొదలు పెట్టాడు చాక్లెట్.
"అబ్బా...ఆపరా బాబు! ఎంత అవసరమో చెప్పు ఆ లిస్ట్ వింటుంటే బీపీ పెరిగిపోతుంది." కోపంగా చూస్తూ అంది మిత్ర.
"నీ ఇగో హర్ట్ అయిందని డిపార్ట్మెంట్ వాళ్లతో గొడవ పెట్టుకున్నావు సంవత్సరం నుంచి చేతిలోకి పైసా రాలేదు అప్పులు కాకుండా ఇంకేమి ఉంటాయి." విసుగ్గా అన్నాడు చాక్లెట్.
"సరే! ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు మనకి లండన్ పార్టీ తగిలింది ఈ కేస్ సాల్వ్ చేస్తే డబ్బుకి ఇబ్బంది ఉండదు పెద్ద పెద్ద వాళ్ళ కేసులు చాలా వస్తూ ఉంటాయి." అంటూ సంతోషంగా చెప్పింది మిత్ర.
"అవునా?" అంటూ మొబైల్ తీసుకుని మెసేజ్ టైప్ చేస్తూ "అక్క! టూ లాక్స్ పంపించమని నీ ఎకౌంట్ నెంబర్ కూడా సెండ్ చేశాను." అని చెప్పాడు చాక్లెట్.
"ఒరేయ్! వర్క్ స్టార్ట్ చేయకుండానే 2 లాక్స్ అడిగితే ఇస్తారో లేదో!" అంటూ ఫోన్ తీసుకుని మెసేజ్ చూసి
చాక్లెట్ వైపు కోపంగా చూస్తూ "టూ లాక్స్ పక్కన 'పి' లెటర్ ఏంటిరా దరిద్రుడా... సరిగ్గా టైప్ చేయడం కూడా రాదా!' అంటూ డిప్ప మీద ఒకటి పీకింది మిత్ర.
"సారీ అక్క! కొంచెం పెద్ద అమౌంట్ కదా కంగారులో టైప్ అయిపోయింది." అంటూ తల సమురుకుంటూ అన్నాడు చాక్లెట్.
"అర్ణ మేడమ్ దగ్గర నా ఇమేజ్ మొత్తం పోతుంది. మెసేజ్ పెట్టడం కూడా రాదు డిటెక్టివ్ అయిపోయిందా అనుకుంటుంది." అంటు చికాకు పడుతూ అంది మిత్ర.
అంతలో మెసేజ్ సౌండ్ రావడంతో ఫోన్ చూస్తూ "అక్క! నో ప్రాబ్లం ఎకౌంట్లో అమౌంట్ పడినట్టు ఉంది." అంటూ సంతోషంగా చూస్తూ చెప్పాడు చాక్లెట్
"ఓకే! మన బ్యాలెన్స్ పోను కరెక్ట్ గా రెండు లక్షలు వేసిందో లేదో చూడు ఈ డబ్బుఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి." అంది మిత్ర.
"మన అకౌంట్లో 11 రూపాయలు ఉండాలి." అంటూ మెసేజ్ చూస్తూ "అక్క! ఇక చాలా సున్నాలు ఉన్నాయి అర్థం కావడం లేదు." అంటూ అయోమయంగా పేస్ పెట్టి అన్నాడు చాక్లెట్.
"అవునా?" అంటూ మొబైల్ తీసుకుని చూసి "ఏంట్రా ఆవిడా రెండు కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మిత్ర.
"అక్క! లండన్ పార్టీ అన్నావు కదా! టూ లాక్స్ పక్కన 'పి' అని ఉంటే పౌండ్స్ అనుకుని టూ లాక్స్ పౌండ్స్ ట్రాన్స్ఫర్ చేసారు." అంటూ ఆనందంగా చెప్పాడు చాక్లెట్.
"అంటే! మనం ఒప్పుకున్న కేసు అంత పెద్దదా? నిజంగా ఆ అభిర్ మన పాలిటి దేవుడు అతని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి." అంటూ సంతోషంగా అంది మిత్ర.
************************
సాయంత్రం తన ఆఫీసులో ఉన్న హిరణ్య ఫోన్ రింగ్ అవడం చూసి "మిచల్ కాల్ చేస్తున్నాడు పని అయిపోయిందనుకుంటా!" అంటూ సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి "వర్క్ కంప్లీట్ అయిపోయిందా?" అంటూ ఆత్రుతగా అడిగాడు హిరణ్య.
"నో సార్! ప్లాన్ ఫెయిల్ అయింది నా మనుషుల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు, ఆ లాయర్ ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీ వాళ్లని మనం ఇప్పుడు ఏమి చేయలేము ఏదైనా ఉంటే కోర్టు దగ్గర చూసుకోవడమే!" అన్నాడు మిచల్.
"అవునా!" అంటూ కాసేపు ఆలోచించి "రేపు కోర్టు దగ్గర ఎటువంటి చిరాకు జరిగిన కేసు వాళ్ళకి ఫేవర్ అయిపోతుంది ఏం జరుగుతుందో చూద్దాము నేను చెప్పే వరకు సైలెంట్ గా ఉండు." అన్నాడు హిరణ్య.
"ఓకే సార్! మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అంటూ ఫోన్ పెట్టేసాడు మిచల్.
"ఈ విషయం ముకుల్ గారితో చెప్పడమే కరెక్ట్!" అనుకుని ఫోన్ తీసి కాల్ చేసాడు హిరణ్య.
ఫోన్ లిఫ్ట్ చేసి "ఏమైంది?" అంటూ టెన్షన్ గా అడిగాడు ముకుల్.
"సారీ సార్! మనం ఈ కేసు ఓడిపోబోతున్నాము మురళి జోషి భార్యా పిల్లలు బతికే ఉన్నారు రేపు కోర్టులో మర్డర్ చేసింది అభిర్ కాదని ఆవిడ కచ్చితంగా చెబుతుంది." అంటూ డల్ గా చెప్పాడు హిరణ్య.
ఆ మాట విని ఫోన్ కట్ చేసాడు ముకుల్ నంద.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)