Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
#91
Part - 28


  ధనుంజయ్ అడిగిన దానికి భార్గవి ఏమి సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ ఉంటుంది.  అది అది అంటూ ఉంటే ఇంకా ఏమీ చెప్పకు నాకు అర్థం అయింది లే అని అటు తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంటాడు.

భార్గవికి చాలా టెన్షన్ వస్తుంది. ఏంటి ఈయన కొత్తగా అవని గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మా మధ్యన అవని టాపిక్ వచ్చేది కాదు.నేను చెబితేనే వినేవారు.

నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముసలోళ్ళు ఇద్దరినీ నా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. ముందు పూర్తిగా ఈయన ని నా వైపుకు తిప్పుకోవాలి.

అవిని గురించి అసలు ఆలోచించకుండా చేయాలి. ఏమి చేయాలి అని ఆలోచిస్తూ భర్త వైపుకు తిరిగి చెయ్యి వేస్తుంది.

నన్ను విసిగించకు చాలా చిరాగ్గా ఉంది పడుకో అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. భర్త చిరాకుకి భార్గవికి చివుక్కుమనిపిస్తుంది. మరోవైపుకు తిరిగి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ముందు దాన్ని కనిపెట్టాలి అనుకుని ఎప్పటికో నిద్రపోతుంది.

  బెంగళూర్...

చీకటితోనే అవని నిద్ర లేచి  ఎప్పటిలాగానే రెండేళ్లకి కలిపి ఒకే ముగ్గు వేసి గబగబా వంట చేసేసి పెడుతుంది.  విక్రమ్ వాళ్ళకి ఇవ్వాల్సినయన్ని ఒక హాట్ ప్యాక్ లో సర్దేసి నేహా కి మెసేజ్ చేసి గుడికి వెళుతుంది.

విక్రమ్ జాగింగ్ కోసమని బయటికి వచ్చేటప్పటికి ముగ్గు కనిపిస్తుంది.  ఏంటి అవని ఇంత తొందరగా ముగ్గు పెట్టేసింది.

ఈరోజు ఏమైనా విశేషమా అని ఆలోచిస్తూనే జాగింగ్ కి వెళ్తాడు. జాగింగ్ నుంచి వచ్చేటప్పటికి కూడా అవని కనిపించదు.

ఏమైపోయింది... నాకు కనపడకుండా ఉండదే. నేను మిస్ చేస్తున్న సరే తన మిస్ అవ్వనివ్వదు  కదా అని ఆలోచిస్తూనే ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు . 

ఫ్రెష్ అయ్యి బిజినెస్ న్యూస్ చూస్తుండగా కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంది.  ఓ అమ్మాయి గారు ఇప్పుడు వచ్చారా అని.. నేను వెళ్లి తలుపు తీయను నాకు కనపడలేదు కదా  ఇప్పుడు నీకు నేను కనపడను అనుకుంటూ సైలెంట్ గా కూర్చుంటాడు.

కాలింగ్ బెల్ ఓ సౌండ్ వస్తూ ఉంటే..   శ్రీ బయటికి వచ్చి అంతలా డోర్ కొడుతుంటే తలుపు తీయవేంట్రా అంటే...  నీకు కావాలి అనుకుంటే నువ్వు తలుపు తీయి నాకు అవసరం లేదు అంటూ న్యూస్ చూస్తూ ఉంటాడు.

ఇప్పుడు లోపలికి వచ్చి నన్ను బ్రతిమాలుతుంది కదా అప్పుడు చెబుతాను అవని పని అనుకుంటూ అలకగా కూర్చుంటాడు.

శ్రీ తల కొట్టుకుంటూ వెళ్లి డోర్ తీస్తాడు.  ఎదురుగుండా నేహా కనిపిస్తుంది. నేహా ని చూసి శ్రీ కొంచెం తడబడతాడు. నేహా ఎవరో తెలిసిన సరే మీరు అని తెలియనట్టుగా అడుగుతాడు.

విక్రమ్ అది వింటూ ఎవరా అని డోర్ వైపు చూస్తాడు.  హాయ్ ఐయామ్ నేహా. అవిని ఫ్రెండ్ ని అని చెబుతుంది.

అవని మీకు ఈ బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఇమ్మంది అని చెప్పి బాక్స్ అన్ని అందిస్తుంది. థాంక్యూ.... అవిని ఏమయింది అని అడుగుతాడు.

ఈరోజు పొద్దుటే గుడికి వెళ్ళింది. కాలేజ్ కి కూడా లీవ్ పెట్టేసింది. మార్నింగ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టి నన్ను టైంకి అందించమంది.

నాకు ఆఫీసు టైం అవుతుంది బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. విక్రమ్ శ్రీ తో ఏ గుడికి వెళ్ళిందో కనుక్కో అనగానే.. వెళుతున్న నేహాన్ని చూస్తూ శ్రీ వెంటనే ఏ గుడికి వెళ్ళింది అవని అని అడుగుతాడు.

ఇక్కడ పక్కనే ఉన్న అమ్మవారి గుడి కి వెళ్ళింది. రాత్రి కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది.  మేబీ దాని గురించి వెళ్ళు ఉండొచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది.

ఇంత సడన్గా గుడికి వెళ్లడం ఏమిటి.. అది కూడా అంత పొద్దుటే వెళ్ళింది.  కాలేజ్ కి కూడా లీవ్ పెట్టేసి అనే విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు.

శ్రీ ఆ బాక్సెస్ అన్ని టేబుల్ మీద పెట్టి మా చెల్లి ఎంతైనా గ్రేట్ బావ.  పొద్దున్నే గుడికి లేట్ అవుతుందని అన్ని ప్రిపేర్ చేసి పెట్టి మరీ వెళ్ళింది.

ఇప్పుడు కూడా వెరైటీస్ చేసి ఇచ్చింది అంటు బాక్స్ ఓపెన్ చేస్తాడు.  శ్రీ  తినేసి డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చే నేను గుడికి వెళుతున్నాను అని చెప్పి వెనక నుండి శ్రీ పిలుస్తున్న వినిపించుకోకుండా విక్రమ్ ఆ గుడి దగ్గరికి వెళతాడు.

గుడి పైకంట ఉంటుంది. మెట్లు ఉంటాయి. ఆ ప్రతి మెట్టు దగ్గర కూడా ఆడవాళ్లు బొట్టు పెట్టి ఎక్కుతూ ఉంటారు. అవన్నీ చూస్తూనే విక్రమ్ పైకి వెళతాడు.

అక్కడ అవని కనిపించదు. ఎక్కడ ఉంది అవని అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడ మోకాళ్ళ మీద గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కనిపిస్తుంది.

ఎందుకు ఇంత కఠినమైన పని చేస్తుంది అనుకుంటూ అక్కడ ఉన్న పెద్ద ఆవిడని అడుగుతాడు.  ఎందుకు అమ్మాయి అలా తిరుగుతుంది అని..

ఆ అమ్మాయి మీకు తెలుసా బాబు అని అడుగుతారు. తెలుసు అని చెబుతాడు. తన భర్తకి ఏదో ఆపద వచ్చిందంట..

అందుకే చీకటితోనే వచ్చి ఆ గుడిమెట్లే అన్ని కూడా మోకాళ్ళ పైన ఎక్కుతూ బొట్లు పెట్టుకుంటే వచ్చింది. ఇప్పుడు దాకా  గుడి చుట్టూ కూడా 108 ప్రదక్షిణాలు చేసి మోకాళ్ళ మీద 11 ప్రదక్షిణాలు చేస్తుంది.

అమ్మాయికి భర్త అంటే చాలా ప్రేమ అనుకుంటా అని మురుపంగా చెబుతుంది.  విక్రమ్ అవిని నే చూస్తూ ఉంటాడు.

నిష్టగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది తన చేయవంక చూసుకుంటాడు.  నాకు ఇంత చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు ఇంత కఠినమైన దీక్ష చేస్తున్నావు.

మరి నా మనసుకు తగిలిన దెబ్బకి ఏమి చేస్తావు నువ్వు అవని అనుకుంటూ నిలబడి చూస్తూ ఉంటాడు. ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత అమ్మవారి ముందు నిలబడి మనసులోనే దండం పెట్టుకుంటూ ఉంటుంది.


ఆయనకు ఎటువంటి కష్టం రానివ్వద్దు.ఆయన కోరుకున్నవన్ని ఆయన దగ్గరికి చేర్చు తల్లి. ఎక్కడున్నా ఆయన సంతోషంగా ఉంటే నాకది  చాలు అని మనస్పూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటుంది.

అవని పక్కగా వచ్చి విక్రమ్  నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటాడు. విక్రమ్ రావడం అవని చూడదు. కానీ విక్రమ్ పక్కన నిలబడగానే తనకెందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

అప్పుడు దాకా ఉన్న అలసట అంతా పోయి చిరునవ్వు వస్తుంది. పూజారి గారు విక్రమ్ పేరుమీద పూజ చేసి బయటకు వచ్చి దంపతులుగా ఉన్న అవని విక్రమ్ లని దీర్ఘ సుమంగళీభవ, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు.

ఆ మాటకి అవని ఆశ్చర్యపోతూ పూజారి గారు అంటుంది.  పక్కనే ఉన్న విక్రమ్ ముసిముసిగా నవ్వుకుంటాడు.

ఏమైందమ్మా అని పూజారి గారు అడగగానే అలా దీవించేసారేంటండి అంటుంది.  అందులో తప్పేముంది అమ్మ అది అమ్మ ఆశీర్వాదం నా నోట పలికించింది.

అయినా మీరిద్దరూ చూడచక్కగా ఉంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు తల్లి అని లోపలికి వెళ్ళిపోతారు. నా పక్కన ఎవరున్నారా అని చూస్తే పక్కనే విక్రమ్ కనిపిస్తాడు.

వెంటనే బిగుసుకుపోతుంది. ఏమైంది అవని అలా బిగిసిపోయారు అని కదుపుతాడు. ఏమీ లేదు మీరేంటి ఇక్కడ అని తడబడుతుంది.

ఏ గుడికి మీరు ఒక్కరే రావాలని రాసిపెట్టి ఉందా ఏంటి మేము రావచ్చు కదా అని అడుగుతాడు.  ఈ వెటకారాలకి ఏమీ తక్కువ లేదు.

నేను అలా అడగలేదండి. మీరు  ఎంత సేపు అయింది వచ్చి అని అడుగుతున్నాను  అనుకుంటూ మనసులో పూజారి గారు దీవించింది ఈయన వినేశారా ఏమిటి కొంపతీసి పూజారి గారి మా ఇద్దరిని కలిపి దీవించారా అని కంగారుగా అమ్మవారి వైపు చూసి ఏంటి అమ్మ నీ పరీక్ష నాకు అనుకుంటూ చూస్తుంది.

విక్రమ్ అవిని తో ఎందుకండి అమ్మవారిని అంత ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అడుగుతాడు. నేనేమి ఇబ్బంది పెట్టానండి అంటే...

మరి వచ్చినప్పుడు నుంచి అమ్మవారిని చూస్తూమీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. మనసులోనే ఏదో చాలా గట్టిగా కోరేసుకుంటున్నారు కదా అది ఏదైనా సరే తీరాలి అని నేను కోరుకుంటున్నాను సరేనా అని రండి  వెళదాము అని వెనక్కి తిరుగుతాడు.

అప్పటివరకు ఆవేశంగా ప్రదక్షిణాలు చేసిన అవిని కి ఇంకా కాళ్లు సహకరించడం లేదు. చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి.

అడుగు తీసి అడిగి వేయడానికి కూడా మోకాళ్లు సహకరించడం లేదు. మెల్లిగా గోడ పట్టుకుని నిలబడి ఉంటుంది.

అవిని పరిస్థితి అర్థం అయిన విక్రమ్ పక్కకు వచ్చి ఏమీ తెలియనట్టుగానే.. ఏమైంది అవని గారు అని అడుగుతాడు.

ఏమీ లేదు మీరు వెళ్ళండి నేను ఇంకా కొంచెం సేపు గుడిలో కూర్చుని వస్తాను అని చెబుతుంది. ఈరోజు నాకు వర్క్ పెద్ద ఎక్కువ లేదండి కలిసే వెళదాము. రండి కూర్చుందాము అని అక్కడే కూర్చోబెడతాడు.

ప్రొద్దుట  నుంచి అవని ఏమీ తినలేదు అని వెళ్లి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు.  అయ్యే ఈ రోజు నేను ఉపవాసం అండి. ఏమి తినను అని చెబుతుంది.

పోనీ లిక్విడ్స్ ఐనా తీసుకుంటారా అని అడిగితే.. అవి కూడా తాగనండి అని  చెబుతుంది. ఇంత కటిక ఉపవాసం చేయాల్సినంత కష్టం ఏమొచ్చిందండి మీకు అని కొంచెం కోపంగానే అడుగుతాడు.

దానికి అవని తలదించుకుని మా వారికి చిన్న కష్టం వచ్చింది. ఆ కష్టం తొందరగా తీరిపోవాలి అని నేను ఉపవాసం చేస్తున్నాను అంతే అని చెబుతోంది.

మావారు అని అవని చెప్పిన దానికి విక్రమ్ ఫేసులో కనీ కనపడిన ఒక చిన్న నవ్వు వస్తుంది. మీ వారు ఎవరో గాని చాలా లక్కీ పర్సన్ అండి.

నేను ఇక్కడి నుండి వెళ్లేలోపు మాత్రం మీవారిని కలిసే వెళ్లాలి అని చెబుతాడు. కష్టమండి ఆయన సీక్రెట్ వర్క్ లో ఉంటారు కదా ఎప్పుడు వస్తారో తెలియదు అని కంగారుగా చెబుతుంది.

ఎప్పుడు వస్తే అప్పుడే పరిచయం చేయండి ఇప్పుడు కంగారు ఏముంది అని అక్కడ పూజారి గారిని పిలిచి ఇంత దీక్ష చేసిన వాళ్ళు లిక్విడ్స్ ఐనా తీసుకోవచ్చా అని అడుగుతాడు.

పర్వాలేదు బాబు కొబ్బరి నీళ్లు తెచ్చి పట్టించండి.మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి తల్లి. అప్పుడే మళ్లీ మనం ఏమైనా చేయగలుగుతాము.

అమ్మ ఎప్పుడూ కడుపు మార్చుకోమని చెప్పదు అని చెప్పి కొబ్బరి నీళ్లు తెచ్చి పట్టించండి బాబు అని చెప్పి వెళ్ళిపోతారు.

చూశారా ఆయన కూడా చెబుతున్నారని చెప్పి కిందకు వెళ్లి కొబ్బరి బోండాలు కొట్టించుకుని తీసుకువచ్చి తాగండి అని ఇస్తాడు.

థాంక్స్ అని చెప్పి కొబ్బరి నీళ్లు తాగుతుంది. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా అని అడుగుతుంది.

దానికి విక్రమ్ సమాధానం ఏమిటి?
కథ కొనసాగుతుంది...
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - Yesterday, 08:01 AM



Users browsing this thread: ramanasv, 5 Guest(s)