Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#48
ఎపిసోడ్ 16


శ్రీకర్ చెప్పిన దానికి అయోమయంలో పడి అభిర్ ఎవరో తెలుసుకోవడం కోసం జనార్ధన్ కి కాల్ చేశాడు హిరణ్య.

ఇండియాలో ప్రాపర్టీ విషయము ఎటువంటి ప్రాబ్లం లేదు అని సుజిత్ చెప్పడంతో హిరణ్యకి ఫోన్ చేసి అభిర్ ని తనకి హెల్ప్ చేసే వాళ్ళని చంపించేయమని చెప్పింది వర్ణ.

వసుంధర తో కలిసి NIA చీఫ్ ఆనంద్ మిలింద్ ని కలవడానికి బయలుదేరాడు శ్రీకర్.

*******************

NIA ఆఫీసులో తన చాంబర్ లో ఉన్న ఆనంద్ దగ్గరికి వెళ్లి "జైహింద్ సార్! ఐ యాం శ్రీకర్ సిబిఐ! వారు వసుంధర అడ్వకేట్!'

'ఒక కేసు విషయమై మిమ్మల్ని మీట్ అవ్వడానికి వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాను ఈరోజుకి కుదిరింది." అంటూ వినయంగా చెప్పాడు శశ్రీకర్.

"ప్లీజ్ సిట్ డౌన్! మా దగ్గర నుంచి సిబిఐ కి ఏ కేసు ట్రాన్స్ఫర్ అవ్వలేదే!" డౌట్ గా అడిగాడు ఆనంద్.

"నో సార్! 12 ఇయర్స్ బ్యాక్ మీ ఆఫీసర్ మురళి జోషి మర్డర్ కేస్ ఉంది కదా! అది రీ ఓపెన్ చేసి సిబిఐకి ప్రిఫర్ చేశారు దాని గురించి మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి." అన్నాడు శ్రీకర్.

"ఓకే! చెప్పండి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలి?" అని అడిగాడు ఆనంద్.

"ఆ కేసులో ముద్దాయిగా అరెస్టు అయిన అభిర్ గురించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా?" అని అడిగాడు శ్రీకర్.

"వన్ మినిట్!" అంటూ కంప్యూటర్లో చూస్తూ "అతని గురించి మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈ మర్డర్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు ఏదో పర్సనల్ ఇష్యూస్ అనుకుంటా!" అన్నాడు ఆనంద్.

"కానీ సార్! తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తుల్ని అండమాన్ కి పంపించాలని ఒక ప్రపోజల్ పెట్టారు కదా! మరి ఆ లిస్టులో అభిర్ పేరు ఎందుకు యాడ్ చేశారు?" డౌట్ గా అడిగింది వసుంధర.

"అవునా?" అంటూ అనుమానంగా చూస్తూ బెల్ కొట్టి "సత్య ప్రసాద్ ని లోపలికి రమ్మను." అని చెప్పాడు ఆనంద్.

కాసేపటికి లోపలికి వచ్చి "జైహింద్ సార్!" అన్నాడు సత్యప్రసాద్.

లిస్ట్ చూపించి "దీంట్లో 160 నెంబర్ లో ఉన్న అభిర్ అనే ఖైదీ ఎవరు? తనని కూడా అండమాన్ జైలుకి పంపించాలి అని ఎందుకు ప్రిఫర్ చేశారు?'

'అతని మీద మురళి మర్డర్ కేస్ కాకుండా ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా?" అంటూ సీరియస్ గా చూస్తూ అడిగాడు ఆనంద్.

ఆ మాటకి నీళ్లు నమూలుతు "మన ఆఫీసర్ ని చంపిన కేసులో అరెస్టు అయ్యాడు కదా అని లిస్టులో యాడ్ చేశాము." అంటూ కంగారుగా చెప్పాడు సత్యప్రసాద్.

"ఈ కేస్ ఫైల్లో ముద్దాయి పేరు అభిర్ అని లేదు, కానీ ఆ అబ్బాయి పేరు మీకు ఎలా తెలిసింది?" డౌట్ గా చూస్తూ అడిగాడు శ్రీకర్.

ఆనంద్ వైపు చూసి "సార్! మేము లిస్ట్ రెడీ చేసినప్పుడు అతని పేరు మెన్షన్ చేయలేదు, కాని ఇంకా ప్రాబ్లం పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అని జైల్ కి లెటర్ సెండ్ చేశాము.'

 'సబ్ జైలర్ నితీష్ ఆ పేరు యాడ్ చేసి పంపించారు మన ఆఫీసర్ ని చంపిన కేసులో ఉన్నాడు కదా అని మేము కూడా ఓకే అన్నాము." అంటూ నెమ్మదిగా చెప్పాడు సత్యప్రసాద్.

"స్టుపిడ్స్! ముందు లిస్టులో అతని పేరు డిలీట్ చేసి ఫ్రెష్ లిస్ట్ కోర్టుకి సబ్మిట్ చేయండి." అంటూ సీరియస్ గా చెప్పాడు ఆనంద్.

"సార్! ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మురళి జోషి చనిపోయే ముందు ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యోడో చెప్పగలరా?" అని అడిగాడు శ్రీకర్.

"మా డిపార్ట్మెంట్ గురించి నీకు తెలియని ఏముంది సపరేట్ గా ఒక కేసు అంటూ ఏమీ ఉండదు." అంటూ కంప్యూటర్లో చూస్తూ

'మురళి చనిపోయే ముందు అసలు ఏ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు త్రీ మంత్స్ గా సిక్ లీవ్ లో ఉన్నాడు." అని చెప్పాడు ఆనంద్.

"ఓకే సర్ థాంక్యూ!" అంటూ వసుంధర తో కలిసి అక్కడి నుంచి బయటికి వచ్చి కారులో వెళుతు

"మురళీ జోషి భార్య గీత చెప్పిన దానిబట్టి అతను కేసు నిమిత్తం బయటకు వెళ్లి మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు అని చెప్పింది.'

'కానీ డిపార్ట్మెంట్లో అతను సిక్ లివ్ లో ఉన్నట్లు ఉంది అంటే అనఫిషియల్ గా ఏదో చేసాడు." అన్నాడు శ్రీకర్.

"ఈ కేసులో మనం ఇంకా ముందుకు వెళ్లడానికి 12 సంవత్సరాల అయిపోయింది అప్పుడు అతనితో పాటు ఉన్నది ఎవరో కూడా మనకి తెలియదు.'

'అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ చనిపోయారు ఇంకా దీని గురించి ఏదైనా చెప్పాలి అంటే అభిర్ నోరు విప్పితేనే మనకి తెలుస్తుంది." అంది వసుంధర.

"ఎస్! అతను నోరు విప్పాలి అంటే ఈ కేసు నుంచి బయటికి రావాలి అప్పుడే మాట్లాడుతాడు." అన్నాడు శ్రీకర్.

**********************

ఉదయం ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో నిద్ర మత్తులో నుంచి లేచి చూసి "ముకుల్ గారు ఫోన్ చేస్తున్నారేంటి!" అంటూ కంగారుగా లిఫ్ట్ చేసి "గుడ్ మార్నింగ్ సార్!" అన్నాడు హిరణ్య.

"ఆ కుర్రాడి గురించి డీటెయిల్స్ అడగకూడదని ఈ కేసు ఒప్పుకునే ముందే మీకు చెప్పాను కదా! మళ్లీ జనార్ధన్ కి ఎందుకు ఫోన్ చేశావు?" అంటూ కోపంగా అడిగాడు ముకుల్.

"సారీ సార్! మీరు చెప్పింది అంతా ఓకే కానీ ఈ కేసు ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీలో ఉంది ఆ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి మురళి జోషి తో పాటు మరొక వ్యక్తి చనిపోయాడు అతను గురించి మీకు తెలుసా అని అడిగాడు.'

'నేను కవర్ చేస్తూ మీకు ఎవరో  రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అటువంటిదేమీ లేదు అని చెప్పాను వెళుతూ వెళుతూ అభిర్ గురించి ముందు తెలుసుకోండి అన్నాడు.'

'ఈ కేసులో వాళ్ళకి ఏదైనా లీడ్ దొరికిందేమోనని ఆ అబ్బాయి గురించి తెలుసుకోవడానికి జనార్ధన్ కి కాల్ చేశాను అంతే తప్పితే నాకు వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేదు." అన్నాడు హిరణ్య.

"అవునా? అక్కడ మరొక వ్యక్తి చనిపోయాడు అన్న విషయం ఆ సిబిఐ ఆఫీసర్ కి ఎలా తెలిసింది ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా బతికి ఉన్నారా?" డౌట్ గా అడిగాడు ముకుల్.

"నాకు తెలిసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరూ లేరు సార్! కానీ ఈ మేటర్ బయటికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు." అంటూ టెన్షన్ గా చెప్పాడు హిరణ్య.

"ఈ కేసు ఎలాగైనా మీరు గెలవాలి అభిర్ జైల్లోనే ఉండాలి దానికోసం ఎంత ఖర్చు అయిన పర్వాలేదు ప్రతి ఒక్కరి నిజాయితీకి ఒక రేటు ఉంటుంది." అన్నాడు ముకుల్.

"సార్! నేను ఒకటి చెప్తాను అభిర్ జైల్లోనే ఉంచాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతనికి వెనక ముందు ఎవరూ లేరు లేపేస్తే సరిపోతుంది కదా! మీరు ఊ.. అంటే ఇప్పుడే మిచల్ కి కాల్ చేస్తాను." అన్నాడు హిరణ్య.

"అభిర్ జైల్లో ఉన్న విషయం బయట ప్రపంచానికి తెలుసా! పోనీ ఈ కేస్ గురించైనా, అతను బెయిల్ మీద బయటకు వచ్చిన విషయమైనా బయట ప్రపంచానికి తెలుసా!" అని అడిగాడు ముకుల్.

"నో సార్! ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా పడ్డాము చాలా ఖర్చు కూడ చేశాము." అన్నాడు హిరణ్య.

"మరి అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరని నీకు ఎలా తెలుసు! నేను చెప్పినట్లు మాత్రమే చెయ్!'

'నా మనవరాలు మాట విని రాంగ్ స్టెప్ వెయ్యకు ఆఫీసర్ సంగతి నేను చూసుకుంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముకుల్.

"అంటే నా గెస్సింగ్ కరెక్ట్! అభిర్ కచ్చితంగా నంద వారసుడు." అనుకుని టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి మిచల్ కి కాల్ చేసాడు హిరణ్య.

ఫోన్ లిఫ్ట్ చేసి "లాయర్ గారు  చెప్పండి? ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు." డౌట్ గా అడిగాడు మిచల్.

"12 సంవత్సరాల క్రితం ఈ కేసు కు సంబంధించిన వాళ్ళ లిస్ట్ ఇచ్చి చంపమని చెప్పాను కదా! దాంట్లో ఎవరైనా మిగిలారా? అందరూ చచ్చారా!" అంటూ అనుమానంగా అడిగాడు హిరణ్య.

"మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం అందరూ చచ్చారు ఆఖరికి ఆ మురళి జోషి భార్యను సెక్యూరిటీ అధికారి స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇంటికి వెళుతుండగా చంపేసాను." అన్నాడు మిచల్.

"అవునా? నువ్వు చంపింది మురళి జోషి భార్యను కాదు నేను సెట్ చేసిన డమ్మీ భార్యని అంటే వాడి భార్య పిల్లలు ఇంక బతికే ఉన్నారు.'

'వాళ్ల ద్వారానే ఆఫీసర్ కి విషయం తెలిసి ఉంటుంది నాకు తెలిసి రేపు కోర్టు దగ్గరికి వాళ్ళు కచ్చితంగా వస్తారు." అంటూ కంగారుగా అన్నాడు హిరణ్య.

"టెన్షన్ పడకండి సార్! నా మనుషులు లాయర్ ని ఆఫీసర్ ని ఫాలో చేస్తూన్నారు ఆ లాయర్ ఇంటిదగ్గర ఎవరో కొత్తగా ముగ్గురు ఆడవాళ్లు వచ్చారని తెలిసింది వాళ్లే మురళీ జోషి ఫ్యామిలీ అనుకుంటా!" అన్నాడు మిచల్.

"అయితే! వాళ్లు రేపు కోర్టుకి రాకూడదు ఏం చేస్తావో ఎంతమందిని పంపుతావో నాకు తెలీదు ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోవాలి.'

'ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి మిస్టేక్ చేసామని పెద్దాయనకి తెలిసిందో మనం ఉండము." అన్నాడు హిరణ్య.

"నో ప్రాబ్లెమ్ సార్! అక్కడికి నా మనుషులని కాకుండా వేరే బ్యాచ్ ని పంపుతాను." అన్నాడు మిచల్.

"ఓకే! చాలా జాగ్రత్తగా చేయాలి ఎక్కడ ఈ కేసు మాట బయటికి రాకూడదు వాళ్లు వేరే ప్రాబ్లంలో చనిపోయినట్లు ఉండాలి సిబిఐ వాళ్ళకి కూడా అనుమానం రాకూడదు." అన్నాడు హిరణ్య.

"ఓకే సార్! నేను చూసుకుంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మిచల్.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 04-01-2026, 11:31 PM



Users browsing this thread: 1 Guest(s)