Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#47
ఎపిసోడ్ 15


నీలమ్ ని  ఆఫీసులోనే ఉండమని చెప్పి రోషిని తీసుకురావడానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు అభిర్.

కోర్టులో ఉన్న హిరణ్య దగ్గరికి వెళ్లి ముందు అభిర్ గురించి తెలుసుకోమని చెప్పాడు శ్రీకర్.

******************

శ్రీకర్ చెప్పిన మాటకి ఆలోచనలో పడి హడావిడిగా వెనకాలే కారు దగ్గరికి వెళ్లి "ఆఫీసర్! మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?" అంటూ లేని నవ్వుని తెచ్చుకుంటూ అడిగాడు హిరణ్య.

ఆ మాటకి కార్ డోర్ తీసి వెనక్కి తిరిగి "గ్రేట్ క్రిమినల్ లాయర్ హిరణ్యగారిని ఇప్పటివరకు ఎవరు భయపెట్టలేకపోవచ్చు!'

'కానీ మిమ్మల్ని మీ వెనకాల ఉన్న వాళ్ళని భయపెట్టడానికి ఒకడు సిద్ధమవుతున్నాడు అది మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది." అంటూ కార్డ్స్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు శ్రీకర్.

అంతలో అక్కడికి వచ్చి "సార్! నెక్స్ట్ కేసు మనదే!" అని చెప్పాడు జూనియర్.

"ఈరోజు ఏ కేసుకి నేను హాజరవ్వడం లేదు మీరు చూసుకోండి." అంటూ టెన్షన్ గా ఆఫీసు రూమ్ లోకి వెళ్లి కూర్చుని ఆలోచిస్తూ

"ఈ ఆఫీసర్ ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాడు కచ్చితంగా ఏదో ఉంది." అంటూ కేసు ఫైల్ తీసి చూస్తూ

"అసలు! అభిర్ ఎవరో తెలియకుండనే డబ్బు వస్తుంది కదా అని ఒప్పుకున్నాను బానే ఉంది. కానీ అతను బయటికి వచ్చిన తర్వాత చంపమని చెప్పడానికి ముకుల్ గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు.'

'ఆరోజు గోకుల్ ని, మురళి జోషి ని చంపింది కూడా అభిర్ కాదు మరి అతనికి ముకుల్ గారికి మధ్య ఉన్నది ఏమిటి? నేను ఈ విషయాలు ఏమి తెలుసుకోకుండా డబ్బు కోసం అనవసరంగా ఈ కేసులోకి ఎంటర్ అయ్యానా!'

అంటూ చెమటలు తుడుచుకుంటూ "అభిర్ ఎవరో ముందు తెలుసుకోవాలి." అనుకుంటూ ఫోన్ తీసి వణుకుతున్న చేతులు చూసుకుని "నేను ఏంటి ఇంత భయపడుతున్నాను." అంటూ టెన్షన్ గా కాంటాక్ట్స్ లో నెంబర్స్ వెతుకుతూ

"హమ్మయ్య! దొరికింది." అనుకుని ఫోన్ చేసి రింగ్ అవడంతో "వీడేంటి లిఫ్ట్ చేయడం లేదు." అంటూ కంగారుగా చూస్తూ ఉన్నాడు హిరణ్య.

కాసేపటికి ఫోన్ లిఫ్ట్ చేసి "ఎవరు మాట్లాడేది?" అంటూ గంభీరమైన గొంతుతో అడిగాడు అటు వైపు వ్యక్తి.

"మిస్టర్ జనార్దన్! నేను క్రిమినల్ లాయర్ హిరణ్య ని మాట్లాడుతున్నాను." అని చెప్పాడు హిరణ్య.

"హలో లాయర్ గారు బాగున్నారా? మీతో మాట్లాడి చాలా కాలం అయింది కదా గొంతు గుర్తుపట్టలేదు, అవును నా నెంబర్ మీ దగ్గర ఇంకా ఉందా?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.

ఆ మాట విని ఊపిరి పీల్చుకుని "నాకు ఒక్కసారి టచ్ లోకి వస్తే జీవితకాలం గుర్తించుకుంటాను ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు?" అని అడిగాడు హిరణ్య.

"ముకుల్ నంద గారి పుణ్యమా అని బానే ఉన్నాను మాల్దీవులు లో రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఈ మధ్య వరకు బిజినెస్ బానే ఉంది  ఇండియా దెబ్బతో బిజినెస్ పూర్తిగా పడిపోయింది." అన్నాడు జనార్ధన్.

"ఓకే! ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీకు కాల్ చేశాను, 12 సంవత్సరాల క్రితం ముకుల్ గారు చెప్పారని మీరు నాకు ఒక కుర్రాడిని చూపించారు అతని వివరాలు కావాలి." అని అడిగాడు హిరణ్య.

"ఆ విషయం గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?" అంటూ హుషారుగా మాట్లాడేవాడు కాస్తా డల్ గా అడిగాడు జనార్దన్.

"ఆ కుర్రాడు బెయిల్ మీద బయటికి వచ్చాడు కేసు మళ్ళీ రీఓపెన్ అయింది సిబిఐ కి హ్యాండ్ అవుర్ చేశారు.'

'NIA  ఆఫీసర్ మర్డర్ కేస్ కాబట్టి నన్ను కూడా ఎంక్వయిరీకి  పిలవచ్చు అందుకే ఆ కుర్రాడి డీటెయిల్స్ తెలుసుకుంటే మంచిది కదా అని మీకు కాల్ చేశాను." అన్నాడు హిరణ్య.

"అవునా? ఈ విషయం ముకుల్ గారికి తెలుసా?" డౌట్ గా అడిగాడు జనార్ధన్.

"హా.. తెలుసు!  ఆ కుర్రాడిని భయపెట్టడానికి ఒక గ్యాంగ్ కి సుపారీ ఇచ్చారు వాడిని చంపేయమని చెబితే నా మాట వినడంలేదు.'

'అసలు! ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? నాకు పేరు కూడా తెలియదు ఈమధ్య అతని పేరు అభిర్ అని తెలిసింది." అంటూ చిరాకుగా అడిగాడు హిరణ్య.

"అభిర్ కోసం ఎవరైనా వచ్చారా?" అనుమానంగా అడిగాడు జనార్ధన్.

"ఆ కుర్రాడు జైల్లో ఉన్నాడని బయటకి తెలిస్తేనే కదా ఎవరైనా రావడానికి, ఇప్పటివరకు ఏ న్యూస్ ఛానల్ లో రాకుండా చూసుకున్నాను.'

'కానీ ఈ కేసు మనం ఓడిపోతే మాత్రం అన్ని చానల్స్ లో స్టోరీలుగా వేస్తారు, ఇంతకీ ఆ కుర్రాడు గురించి మీరు నాకు ఒక్క ముక్క కూడా చెప్పలేదు."  అన్నాడు హిరణ్య.

"నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను." అంటూ ఫోన్ పెట్టేసాడు జనార్ధన్.

ఫోన్ కట్ అవడంతో ఆశ్చర్యంగా చూస్తూ "ఇంతకీ అభిర్ ఎవరు? కొంపతీసి గోకుల్ కి పుట్టిన కొడుకు కాదు కదా! ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం లేదు కదా!" అనుకున్నాడు హిరణ్య.

*******************

కోర్టు నుంచి బయటకు వచ్చి శ్రీకర్ తో కలిసి కారులో వెళుతూ నీలమ్ తో ఫోన్లో మాట్లాడి

"అభిర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది." అని చెప్పి ఫోన్ పెట్టేసి 

శ్రీకర్ వైపు చూస్తూ "మీరు హిరణ్యని మీట్ అయినట్లు ఉన్నారు ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్పారా ఏంటి? ఈరోజు ఏ కేసుకి హాజరు అవ్వలేదు. " డౌట్ గా అడిగింది వసుంధర.

"ఈ కేస్ ఫైల్ స్టడీ చేసిన తర్వాత అసలు అభిర్ ఎవరో హిరణ్యకి అయ్యినా తెలుసా లేదా అని డౌట్ వచ్చి కొంచెం బెదరగొడదామని వెళ్లి గాలిలో బాణం వేశాను.'

'ఆ బాణం కరెక్ట్ గా వెళ్లి తగిలింది హిరణ్య ఈ కేసు డబ్బు కోసం మాత్రమే ఒప్పుకున్నాడు అభిర్ ఎవరో అసలు ఈ కేసులో తనని ఎందుకు ఇన్వాల్వ్ చేశారో  తెలియదు అనుకుంటా అందుకునే కాస్త కంగారు పడ్డాడు నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్ అయింది." అన్నాడు శ్రీకర్.

"అంటే! ఈ కేసు వెనకాల చాలా పెద్ద వాళ్ళ హస్తం ఉంది అందుకే డీటెయిల్స్ కూడా అడగకుండా డబ్బు కోసం ఒప్పుకుని ఉంటాడు, ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము?" డౌట్ గా అడిగింది వసుంధర.

"NIA చీఫ్ ఆనంద్ మిలింద్ గారు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు కలవడానికి వెళుతున్నాము మురళి జోషి చనిపోయే ముందు ఏ కేసులో వర్క్ చేశాడో తెలుసుకోవాలి.'

'అప్పుడే ఈ కేసులో అభిర్ ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఎవరు ఇన్వాల్వ్ చేసారు, అసలు అబీర్ ఎవరో అనే విషయం కూడా మనకి తెలుస్తుంది." అన్నాడు శ్రీకర్.

గుడ్ స్టెప్! ఈ కేసులో మనకి ఒక మంచి లీడ్ దొరుకుతుంది. " అంది వసుంధర.

"అంతేకాదు! మురళి జోషి భార్య చెప్పినట్లు తన భర్తను చంపిన వ్యక్తిని ఎవరో ఐదుగురు వచ్చి చంపేశారు అని చెప్పింది.'

'ఈ కేసులో ఆ విషయమే లేదు అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరు అతన్ని చంపింది ఎవరో కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను." అన్నాడు శ్రీకర్.

*********************

రాజన్, రియాతో కలిసి ఫ్యాక్టరీలు చూడడానికి వెళ్లి అక్కడ ఉన్న మేనేజర్స్ తో మాట్లాడి  దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ చూస్తూ

"రాజన్! మీ సెక్యూరిటీ వాళ్లు ముందుగా ఇక్కడికి వచ్చారు కదా! ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా? మన కంపెనీలకు ఎగనిస్ట్ గా ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు సుజిత్.

"నో ప్రాబ్లం సార్! మాకైతే ఎటువంటి త్రెడ్ కనిపించలేదు,
మీ నాన్నగారు చెప్పినట్లు ఇక్కడ ప్రాబ్లం కూడా ఏమి లేదు అంత సవ్యంగానే ఉంది.'

'ఒక విధంగా చెప్పాలంటే మా సెక్యూరిటీ ఏజెన్సీకి మీరు డబ్బులు ఇవ్వడం కూడా వేస్ట్!" అంటు నవ్వుతూ అన్నాడు రాజన్.

ఆ మాటకి స్మైల్ ఇస్తూ "ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి ఇప్పుడే వస్తాను." అంటు దూరంగా వెళ్లి అర్ణ కి కాల్ చేసాడు సుజిత్.

ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ సుజిత్! హౌ ఆర్ యు? ప్రాపర్టీస్ విసిటింగ్ లో ఉన్నావా?" అని అడిగింది వర్ణ.

"ఎస్! ఈరోజు మూడు ఫ్యాక్టరీలు విజిట్ చేశాను, కొన్ని ప్రాపర్టీస్ విజిట్ చేశాను మనం అనుకున్నట్లు ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు అంతా ప్రశాంతంగానే ఉంది.'

'మీ తాతగారు ఎందుకు వీటి గురించి పట్టించుకోవడం లేదో నాకైతే అర్థం కావడంలేదు." అన్నాడు సుజిత్.

"అవునా?" అంటూ కాసేపు ఆలోచించి "ఏదైనా ఒక ప్రాపర్టీ ఇమీడియట్ గా సెల్ కి పెట్టు అప్పుడు ప్రాబ్లం ఏదైనా ఉంటే బయటకి వస్తుంది." అని చెప్పింది అర్ణ.

"ఓకే! గూర్ గామ్ లో ఉన్న ప్రాపర్టీ సెంటర్ మినిస్టర్ వరదరాజులు గారు అడిగారు నువ్వు ఓకే అంటే మాట్లాడుతాను." అన్నాడు సుజిత్.

"ఓకే క్యారీ ఆన్! కొంచెం తక్కువైనా పర్లేదు ఫస్ట్ ఒక ప్రాపర్టీ మనం సేల్ చేయాలి ఆ పనిలో ఉండు." అని చెప్పింది అర్ణ.

"ఓకే బాయ్!' అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసాడు సుజిత్.

"ఇండియాలో అంతా బానే ఉంటే మరి తాతగారు ఎందుకు భయపడుతున్నారు అక్కడికి వెళ్ళకూడదు అని ఎందుకు చెబుతున్నారు.'

'ఒకవేళ ఆ జైల్లో ఉన్న వాడి వల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా?" అనుకుని హిరణ్యకి కాల్ చేసింది అర్ణ.

ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే మేడం! కేసు హియరింగ్ కి ఇంకా టుడేస్ ఉంది." అన్నాడు హిరణ్య.

"ఆ విషయం నాకు తెలుసు! ఆ జైల్లో ఉన్న మనిషి గురించి ఏదైనా తెలిసిందా?" అని అడిగింది అర్ణ.

"నో మేడం! ఈ కేసు చాలా పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది సిబిఐ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు లాయర్ అని చూడకుండా నన్ను కూడా ఎంక్వయిరీ చేయడానికి ఈరోజు ఒక ఆఫీసర్ వచ్చాడు.'

'మీరేమీ అనుకోకపోతే ఒక విషయం చెప్తాను నాకు తెలిసి వాడు మీ నాన్నగారి రెండో ఫ్యామిలీకి పుట్టిన వాడు అనుకుంటా!'

'ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుంది అని తనని మీ తాతగారు చంపించలేక జైల్ లోనే ఉంచమంటున్నారు అనుకుంటున్నాను." అన్నాడు హిరణ్య.

"అవునా? శత్రు శేషం అయిన ఉండొచ్చు కానీ ఇటువంటి బంధాలు ఉండకూడదు అవసరమైతే అమౌంట్ నేను ఇస్తాను వాడిని వాడికి హెల్ప్ చేసే వాళ్ళందరినీ లేపేయమని మిచల్ కి చెప్పండి.'

'ఇండియాలో మన వర్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇటువంటి టైమ్ లో ఇలాంటి చిల్లర టెన్షన్స్ ఉండకూడదు." అంది అర్ణ.

"ఓకే మేడం! ఇప్పుడే మిచల్ కి కాల్ చేస్తాను." అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసాడు హిర్వాణి.
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 04-01-2026, 11:30 PM



Users browsing this thread: 1 Guest(s)