Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#45
ఎపిసోడ్ 14


రాజన్, మినిస్టర్ వరదరాజులు, ల్యాండ్ డీల్ చేసే అరుల్ లని మీట్ అయ్యాడు సుజిత్.

ట్రూ ఛానల్ ఆఫీస్ దగ్గరకు వస్తున్న నీలమ్ ని చూసి తన మనుషులని ఎటాక్ చేయమని పంపించాడు మిచల్.

*********************

స్కూటీ మీద వస్తూ ఎదురుగా ఉన్న మనుషుల్ని చూసి బండి స్లో చేసి మొబైల్ తీసి న్యూస్ ఛానల్ గ్రూప్ లో, ఫ్యామిలీ గ్రూప్ లో లొకేషన్  షేర్ చేసి హెల్ప్ అని మెసేజ్ పెట్టింది నీలమ్.

దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న మొబైల్ లాక్కుని "ఏంటి! సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నావా? దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు." అంటు నవ్వుతూ అన్నాడు మిచల్ మనిషి.

ఎదురుగా ఉన్న నలుగురి వైపు అనుమానంగా చూస్తూ "ఎవరు మీరు? మీ గురించి నేనేమైనా న్యూస్ టెలికాస్ట్ చేసానా?" డౌట్ గా అడిగింది నీలమ్.

"మేము ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వము." అంటూ బైక్ కీస్ తీసుకుని "మీ ఇంటి దగ్గర అంత చికాకు జరిగినా ధైర్యంగా ఆఫీస్ కి బానే వచ్చావు, ఆ జైలు నుంచి రిలీజ్ అయినోడి మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి?" అన్నాడు నలుగురిలో ఒకడు.

"ఓహో! మీరు అభిర్ ఫ్యాన్స్ ఆ...!" అంటూ వీడియో తీస్తున్న వాడి వైపు చూసి "కెమెరా నా వైపు తిప్పు నేను మాట్లాడింది మిమ్మల్ని పంపించిన వాడు వినాలి కదా!'

'అయినా! భయపడుతుంది నేను కాదు మీరు! అందుకే మూసుగులు వేసుకొని వచ్చారు." అంటూ వెటకారంగా చూస్తూ అంది నీలమ్.

ఆ మాట విని కోపంతో ముసుగు తియ్యబోతున్న తన మనిషి దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని కిందకు లాగి నీలమ్ వైపు చూస్తూ

"మీడియా అని పొగర? మీ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ వార్నింగ్! ఆ అభిర్ కి హెల్ప్ చేయడం గురించి మర్చిపోండి లేకపోతే ఇంకా వార్నింగ్ ఇవ్వడం ఉండదు.'

'మీ అన్నయ్య జైలర్ కదా వెళ్లి మిచల్ గ్యాంగ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారని చెప్పు అతనికి నా గురించి బాగా తెలుసు!" అంటూ

స్కూటీ స్టార్ట్ చేసి ట్యాంక్ లో అగ్గిపుల్ల వేసి ముందుకు వదిలి తన మనుషులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిచల్.

అంతలో వీడియో తీస్తూ పరిగెత్తుకుంటూ నీలమ్ దగ్గరికి వచ్చి "బానే ఉన్నావు కదా!" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మిచల్ గ్యాంగ్ వైపు చూసి

"ఎవరు వాళ్ళు? మూసుగులు వేసుకొని వచ్చి బెదిరిస్తున్నారు." డౌట్ గా అడిగాడు ఆఫీస్ కొలీగ్.

"ఆ విషయం గురించి చెబుతాలే కానీ ముందు కాలిపోతున్న నా బండిని వీడియో తీయండి." అంది నీలమ్.

శంకర్ తో కలిసి కారులో స్పీడ్ అక్కడికి వచ్చి  కాలిపోతున్న బండి వైపు చూస్తూ నీలమ్ దగ్గరకు వచ్చి "ఎవరు చేసింది?" అంటూ కోపంగా అడిగాడు సందీప్.

"మిచల్ గ్యాంగ్! నీకు బాగా తెలుసు అంట కదా! అభిర్ కి హెల్ప్ చేయకూడదు అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు." అని చెప్పింది నీలమ్.

"ఈ కేసులో మిచల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిందా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ

"సరే! నువ్వు ఆఫీస్ కి వేళ్ళు ఈ విషయం గురించి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకు నేను చూసుకుంటాను." అన్నాడు సందీప్.

"ఓకే అన్నయ్య!" అంటూ అక్కడికి వచ్చిన తన కొలీగ్స్ తో కలిసి ఆఫీస్ కి వెళ్ళింది నీలమ్.

అభిర్ తో కలిసి హడావుడిగా అక్కడికి వచ్చి జరిగింది చూసి శ్రీకర్ కి కాల్ చేసి చెప్పాడు శక్తిదాస్.

"ఓకే! అక్కడే ఉండండి నేను వస్తున్నాను." అంటూ ఫోన్ పెట్టేసాడు శ్రీకర్.

అభిర్ వైపు చూసి "నీకు మిచల్ ఎవరో తెలుసా?" అని అడిగాడు సందీప్.

"ఆ పేరు ఎప్పుడు నేను వినలేదు అసలు ఇంతకీ అతను ఎవరు? ఈ పని చేసింది అతనేనా?" డౌట్ గా అడిగాడు అభిర్.

"ఎస్!" అంటూ అక్కడికి వస్తున్న శ్రీకర్ ని చూసి "అబీర్ కేసులో మిచల్ గ్యాంగ్ ఎంటర్ అయింది. ఇంటి దగ్గర ఎటాక్ చేసింది కూడా వాళ్లే! ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు." అన్నాడు సందీప్.

"అవునా?" అంటూ తనతో పాటు వచ్చిన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ని చూపించి "ఏసీపి దయ!  ఈ కేసులో తనని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను." అంటూ ఆఫీస్ లోపలికి వెళ్తున్న అభిర్ ని చూపించి "అతనే రిలీజ్ అయిన మనిషి!" అని చెప్పాడు శ్రీకర్.

న్యూస్ ఛానల్ ఆఫీస్ లోపలికి వెళుతున్న అబీర్ వైపు చూస్తూ "అసలు ఎవరు అతను? మిచల్ లాంటి ఒక మాఫియా లీడర్ ఎంటర్ అయ్యేంత అతని దగ్గర ఏముంది?'

'ఆ గ్యాంగ్ చిన్నచిన్న పనులు ఒప్పుకోరు అమౌంట్ కూడా భారీగానే తీసుకుంటారు అంత పెద్ద తలకాయలు ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారు?" అంటూ అనుమానంగా అడిగాడు దయ.

"ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారో ఇప్పటివరకు మేము కనిపెట్టలేకపోయాము, ఈ కేసును డీల్ చేస్తుంది మాత్రం క్రిమినల్ లాయర్ హిరణ్య!'

'టుడేస్ లో ఈ కేసు హియరింగ్ ఉంది అందుకనే అంత కంగారు పడుతున్నారు ఎలాగైనా అబీర్ ని జైల్ లోనే ఉంచడానికి ట్రై చేస్తున్నారు." అన్నాడు శ్రీకర్.

"మిచల్ గ్యాంగ్ సుపారీ తీసుకుని మనుషుల్ని లేపేస్తారు కానీ ఇలా బెదిరించరు." అన్నాడు దయ.

"ఒకవేళ అదే నిజమైతే డైరెక్ట్ గా అభిర్ మీద ఎటాక్ చేసి చంపేయచ్చు కదా! ఎందుకు భయపెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు." డౌట్ గా అడిగాడు సందీప్.

"సుపారీ ఇచ్చిన పార్టీ అతన్ని చంపకుండా భయపెట్టమని మాత్రమే చెప్పి ఉంటుంది. మీ సిస్టర్ తో కంప్లైంట్ ఇప్పిస్తే ఆ గ్యాంగ్ ని పట్టుకోడానికి ఆఫీసర్స్ ని పంపిస్తాను." అన్నాడు దయ.

"నో! ఈ కేసులో నుంచి అభిర్ బయటికి వచ్చేవరకు ఏమి జరిగిన ఎలాంటి కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు దీనిని సాకుగా చూపించి కేసును పెండింగ్ లో ఉంచి మాఫియా తో లింక్ పెట్టి  బెయిల్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు." అన్నాడు సందీప్.

"ఓకే మీ ఇష్టం! కానీ ఆ గ్యాంగ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు కోసం ఏమైనా చేస్తారు." అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు దయ.

శక్తిదాస్  వైపు చూసి "మీరు అభిర్ ని తీసుకుని ఇంటికి వెళ్ళండి నేను ఒక్కసారి లాయర్ హిరణ్యని మీట్ అవ్వాలి." అన్నాడు శ్రీకర్.

"ఓకే సార్!" అంటూ అభిర్ కోసం ఆఫీసు లోపలికి వెళ్లారు ఇద్దరు.

"మిస్టర్ శ్రీకర్! మురళి జోషి భార్యాపిల్లలు మన దగ్గర ఉన్న విషయం హిరణ్యకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు వాళ్ల ప్రాణాలకు చాలా ప్రమాదం!" అన్నాడు సందీప్.

"ఓకే!" అంటూ కార్ లో స్పీడ్ గా వెళ్ళాడు శ్రీకర్.

ఛానల్ ఆఫీస్ లో తన ఛాంబర్ లో ఉన్న నీలమ్ దగ్గరికి వెళ్లి "నువ్వు బానే ఉన్నావు కదా!" అని అడిగాడు అభిర్.

"ఐ యాం ఓకే! కానీ చాలా బాధగా ఉంది. నా ఆఫీస్ లో మొత్తం 60 మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్ లో హెల్ప్ చేశాను.'

'అందరూ నా ఫ్రెండ్స్ అనుకున్నాను కాని గ్రూప్ లో హెల్ప్ అని మెసేజ్ పెడితే ముగ్గురు మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళ లైట్ తీసుకున్నారు." అంటూ డల్ గా చెప్పింది నీలమ్.

"ఒక్కటే గుర్తుంచుకో! డబ్బు ఉందని, తెలివి ఉందని, పదవి ఉందని స్నేహం చేయకూడదు మనల్ని ఆపదలో కూడా ఆదుకునే వాడితోనే స్నేహం చేయాలి." అన్నాడు అభిర్.

"కరెక్ట్! ఇప్పుడే నాకు నిజమైన స్నేహితులు ఎవరో తెలిసింది." అంటూ స్మైల్ ఇచ్చింది నీలమ్.

"నేను కాలేజ్ దగ్గరికి రోషినిని తీసుకు వస్తాను అప్పటివరకు ఇక్కడే ఉండు అందరం కలిసి ఇంటికి వెళదాము." అని చెప్పి అక్కడకు వచ్చిన కుమార్ వాళ్లతో పాటు కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు అభిర్.

******************

కోర్టు దగ్గర తన ఛాంబర్ లో ఉన్న హిరణ్య దగ్గరికి వెళ్లి "హాయ్ సర్! ఐ యాం శ్రీకర్ సిబిఐ! అభిర్ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నేనే!" అని పరిచయం చేసుకున్నాడు శ్రీకర్.

"హ.. తెలుసు! మిమ్మల్ని కలిసే టైమ్ ఇంకా రాలేదు అందుకే మీకు ఇంకా ఫోన్ రాలేదు." అంటూ పొగరుగా చెప్పాడు  హిరణ్య.

"మిమ్మల్ని కలిసే టైమ్ నాకు వచ్చింది అందుకే వచ్చాను." అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శ్రీకర్.

"నా ఛాంబర్ కి వచ్చి నా ముందు కూర్చుని ఇలా మాట్లాడుతున్న ఫస్ట్ ఆఫీసర్ మీరే! నా గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా!" అంటూ పొగరుగా అన్నాడు హిరణ్య.

"మీ గురించి డీటెయిల్ గా తర్వాత తెలుసుకుంటాను, కాని నాకు ఒక విషయం గురించి డీటెయిల్ గా చెప్పాలి.'

'12 సంవత్సరాల క్రితం మురళి జోషితో పాటు మరొక వ్యక్తి చనిపోయాడు ఆ విషయం బయట ప్రపంచానికి కూడా తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశారు.'

'ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా నేను తెలుసుకున్నాను ఆ విషయం గురించి పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చాను." అంటూ హిరణ్య కళ్ళలో కంగారు చూస్తూ చెప్పాడు శ్రీకర్.

"ఆరోజు మురళి జోషి ఒక్కడే చనిపోయాడు అతన్ని అభిర్ చంపేడు ఆ విషయం మురళీ జోషి భార్య కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఆ ప్లేస్లో ఇంకెవరో చనిపోలేదు." అంటూ కంగారుగా అన్నాడు హిరణ్య.

"అంటే! ఈ కేసు ఫైల్ చేసింది మిమ్మల్ని లాయర్ గా అపాయింట్మెంట్ చేసుకుంది మురళి జోషి భార్య అంటారు." డౌట్ గా అడిగాడు శ్రీకర్.

"ఎస్! ఈ కేస్ ఫైల్ చేసింది  నన్ను లాయర్ గా అపాయింట్ చేసుకుంది మురళి జోషి భార్య!" అన్నాడు హిరణ్య.

"గుడ్! ఈ కేసులో ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటున్నారు అంతేకదా!" అన్నాడు శ్రీకర్.

"ఎస్!" అన్నాడు హిరణ్య.

"ఓకే థాంక్యూ!" అంటూ అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి "అసలు! అబీర్ ఎవరో తెలుసా? ముందు అతని గురించి పూర్తిగా తెలుసుకోండి." అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీకర్.
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 03-01-2026, 07:06 AM



Users browsing this thread: