Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#40
ఎపిసోడ్ 12


పాట్నాలో ఉన్న మురళీ జోషి భార్య కూతుర్లలతో కలిసి ఇంటికి వచ్చి చనిపోయిన టమిని తన రెండు చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చూపించి బతికించాడు అబీర్.

*********************

రోషిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతున్న టామీని  ఆశ్చర్యంగా చూస్తూ " చనిపోయిన టామీ మళ్ళీ ఎలా బ్రతికింది?" అంటు అభిర్ వైపు విచిత్రంగా చూసింది నీలమ్

మాట్లాడకుండా సైలెంట్ గా ఇంటిలోకి వెళుతున్న అభిర్ ని చూసి "జైల్లో ఉన్నపుడు నేను కూడా అతని దగ్గర ఒక మీరకల్ గమనించాను.'

'నన్ను చంపడానికి వచ్చిన టెర్రరిస్టుల్ని కంటి చూపుతో కదలకుండా చేయగలిగాడు అతని దగ్గర ఏదో శక్తి ఉంది." అని చెప్పాడు సందీప్ రావు.

"చాలా విచిత్రంగా ఉంది ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అసలు ఇతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు?" డౌట్ గా చూస్తూ అన్నాడు శ్రీకర్.

"ఇంత శక్తి ఉండి కూడా జైల్ నుండీ వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడు అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది." అంటూ అనుమానంగా చూస్తూ అంది వసుంధర.

ఇంట్లోకి వెళుతున్న అబీర్ దగ్గరికి సంతోషంగా వెళ్లి "ఆ రోజు నా కూతురు సుమతిని బతికించింది కూడా నువ్వే కదూ" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది గీత.

"అవును!" అని చెప్పాడు అభిర్.

"అంటే! మా డాడ్ నీకు తెలుసు కదా! మరి ఆయన్ని ఎందుకు కాపాడలేదు?" అంటూ ఏడుస్తూ అడిగింది సుమతి.

"అతను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు అలాంటి వాళ్ళని నేను కాపాడలేను." అన్నాడు అభిర్.

"మరి ఏ పాపము చేయని మేము కూడా శిక్ష అనుభవిస్తున్నాము కదా!"  అంటూ ఆవేశంగా అడిగింది సుమతి.

"తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు మనకి కూడా వర్తిస్తాయి, వాళ్ల వల్ల వచ్చిన సుఖన్ని, సంతోషాన్ని అనుభవించినప్పుడు బాధ కూడా అనుభవించాలి." అన్నాడు అభిర్.

"మా డాడ్ చేసిన తప్పు ఏమిటి?" అని ఏడుస్తూ అడిగింది మురళి జోషి చిన్న కూతురు ప్రణతి.

"ఆ తప్పు మీరు తెలుసుకోకుండా ఉంటేనే మీ జీవితం సుఖంగా ఉంటుంది." అంటూ ఇంటిలోకి వెళ్ళిపోయాడు అభిర్.

'మురళి జోషి చనిపోయే ముందు ఏ కేసులో వర్క్ చేశాడో తెలుసుకుంటే అభిర్ ఎవరో తెలుస్తుంది.' అని మనసులో అనుకున్నాడ శ్రీకర్.

"మనల్ని భయపెట్టడానికి చూస్తున్నారు అంటే ఈ కేసు మనం గెలవబోతున్నాము, అభిర్ నిరపరాధి అని తీర్పు వచ్చేవరకు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి." అంది వసుంధర.

********************

లండన్ ఆఫీసు ఛాంబర్ లో ఉన్న అర్ణ దగ్గరికి సీరియస్ గా వస్తు "ఇండియా గురించి నిన్ను పట్టించుకోవద్దని చెప్పాను కదా! సుజిత్ ని ఎందుకు పంపించావు?" అంటూ కోపంగా చూస్తూ అడిగాడు ముకుల్ నంద.

"తాతయ్య! నిన్ను టెన్షన్ పెట్టిన వాడిని ప్రశాంతంగా ఉంచడం నాకు ఇష్టం లేదు అది ప్రశాంత్ మిశ్రా అయ్యినా! ఇండియాలో నిన్ను ఇబ్బంది పెట్టేవాడైనా సరే!" అంటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది అర్ణ.

"బేబీ! సింహం స్థానంలోకి రావడానికి కాపుకాసి అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడానికి గుంటనక్క రెడీగా ఉంటుంది. అలాంటివాడు ప్రతాప్ మిశ్ర! వాడిని మూర్ఖంగా నమ్మకు." అని చెప్పాడు ముకుల్ నంద.

"తాతయ్య! ఎన్ని పన్నాగలు పన్నీనా సింహం స్థానంలోకి గుంట నక్క రాలేదు కదా! ఒక్క పంజా దెబ్బ తగిలితే అడ్రస్ లేకుండా పోతుంది.'

"అలాగే! నంద గ్రూప్ ని టచ్ చేయాలని ఎవరు చూసినా వాళ్ళకి అదే గతి పడుతుంది నేను మీ మనవరాలే నన్ను తక్కువ అంచనా వేయకండి." అంది అర్ణ.

"నీ గురించి నీ పట్టుదల గురించి నాకు బాగా తెలుసు! నిన్ను చూస్తుంటే మీ నాన్నే గుర్తుకు వస్తాడు అందుకే నిన్ను ఇండియా విషయంలో ఎంటర్ చేయడం నాకు ఇష్టం లేదు." అన్నాడు ముకుల్ నంద.

"ఇండియాలో డాడ్ ని చంపేశారని 12 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాళ్ళకి భయపడుతున్నారా? ఆయన చంపిన వాళ్ళని మీరు అంత తేలిగ్గా ఎందుకు వదిలేసారు? అసలు చంపింది ఎవరు?" అంటూ అనుమానంగా అడిగింది అర్ణ.

"ఆ విషయాలన్నీ నీకు తెలియాల్సిన టైమ్ లో కచ్చితంగా చెబుతాను ఈ లోపు నేను చేయవలసింది చేస్తాను. ఇండియాలో మనం ఎప్పుడూ అడుగు పెడతామ అని చాలా కళ్ళు ఎదురు చూస్తుఉంటాయి.'

'సుజిత్ ని మన బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూడమను ఇంక ఏ విషయంలోను ఎంటర్ అవ్వకూడదని చెప్పు!" అంటూ అక్కడి నుంచి వెళుతూ వెనక్కి తిరిగి

"నువ్వు లాయర్ హిరణ్యతో మాట్లాడిన విషయం కూడా నాకు తెలుసు అందుకే చెబుతున్నాను." అంటూ వెళ్ళిపోయాడు ముకుల్ నంద.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "సుజిత్ విషయం తెలిసింది అంటే ఓకే! కానీ నేను లాయర్ తో మాట్లాడిన విషయం తాతయ్యకి ఎలా తెలిసింది?" అంటూ

ఆలోచిస్తూ హిరణ్య కి కాల్ చేసి "నేను లండన్ నుంచి అర్ణ మాట్లాడుతున్నాను మన మధ్య మీటింగ్ అయిన విషయం తాతయ్య గారికి ఎలా తెలిసింది?" అని అడిగింది అర్ణ.

"మేడం! మిథున్ సార్ మీకు ఇప్పుడు ఫ్రెండ్ ఏమో! వాళ్ళ తాతగారు మీ తాత గారు ఎప్పటినుంచో ఫ్రెండ్స్! ముకుల్ గారు ఒక గీత గీసారు అంటే మిథున్ సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు దానిని దాటరు.'

'ఆది కాకుండా మీ ఫ్యామిలీ ఇండియాలో బిజినెస్ ఆపడం వల్ల ఎక్కువ లాభం పొందింది మిథున్ సార్ ఫ్యామిలీ ఇంకా ఎవరు చెప్పారో మీకు చెప్పనవసరం లేదనుకుంటా!" అంటు నవ్వుతూ అన్నాడు హిరణ్య.

"ఓకే ఇట్స్ ఆల్ రైట్! ప్రాబ్లం లేదు తాత గారికి నేను అర్థమయ్యేటట్లు చెప్పాను ఇంక ఇండియా విషయంలో నేను ఎంటర్ అయ్యానాని ఆయనకు అర్థమైంది.'

'కాబట్టి ఇకనుంచి  డైరెక్ట్ గానే మాట్లాడుతాను ఆ జైల్లో ఉన్నవాడి మేటర్ ఏమైంది?" అని అడిగింది అర్ణ.

"మేడం! అతనికి బెయిల్ వచ్చింది బయట ఉన్నాడు వాడిని భయపెట్టడానికి మిచల్ గ్యాంగ్ కి మీ తాతగారు సుపారీ ఇచ్చారు కచ్చితంగా భయపడి మళ్లీ జైల్లోకి వెళ్ళిపోతాడు." అన్నాడు హిరణ్య.

"అవునా? ఈ విషయం గురించి అంతగా ఆలోచించాలా? వాడిని వాడికి హెల్ప్ చేసిన వాళ్ళని ఈ భూమి మీదే లేకుండా చేయమనండి.'

'ఇండియాలో మా తాత గారిని టెన్షన్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు." అని చెప్పింది అర్ణ.

"మేడం!  మీ తాతగారు అలా ఎందుకు చెప్పారో కొంచెం ఆలోచించండి. భయపెట్టడానికి ట్రై చేస్తున్నాము కుదరకపోతే నెక్స్ట్ చేసేది అదే! ఇంతకీ మీ మనిషి ఇండియా ఎప్పుడు వస్తున్నాడు?" అని అడిగాడు హిరణ్య.

"ఈరోజు ఈవినింగ్ కి ఇండియాలో ల్యాండ్ అవుతాడు  ఇక నుంచి నేను చేయవలసిన పని మొదలవుతుంది." అంటూ ఫోన్ పెట్టేసింది అర్ణ.

*********************

లండన్ నుంచి ఇండియాకి వచ్చి డిల్లీ లో ఉన్న నంద గ్రూప్ గెస్ట్ హౌస్ కి వెళుతూ ఫోన్ చేసి "డాడ్! నేను ఇండియాలో అడుగు పెట్టాను అర్ణ చెప్పినట్టు ఫస్ట్ లాయర్ ని మీట్ అవ్వనా? లేక రాజన్ ని మీట్ అవ్వనా?" అని అడిగాడు సుజిత్.

"ఇండియాలో ఉన్న నంద గ్రూప్ ఇండస్ట్రీస్ మీద ఆస్తులు మీద మొదటగా మనకి గ్రిప్ రావాలి తరువాత లాయర్ తో పని అప్పటి వరకు అవసరం లేదు.'

'ఫస్ట్ రాజన్ కి కాల్ చేసి మీట్ అవ్వు! అలాగే అక్కడ వరదరాజులు అని నా పాత ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇప్పుడు సెంటర్ మినిస్టర్!'

'నువ్వు ఇండియాకు వస్తున్నవని చెప్పాను అతన్ని కూడా ఒక్కసారి వెళ్లి మీట్ అవ్వు మనకు ఉపయోగపడతాడు." అని చెప్పాడు ప్రతాప్ మిశ్రా.

"ఓకే డాడ్! గెస్ట్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఇద్దరికీ కాల్ చేసి మాట్లాడుతాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి అర్ణకి కాల్ చేసాడు సుజిత్.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఇండియాలో ల్యాండ్ అయ్యావా?" అని అడిగింది అర్ణ.

"యా జస్ట్! ఇప్పుడే ల్యాండ్ అయ్యాను గెస్ట్ హౌస్ కి వెళుతున్నాను." అన్నాడు సుజిత్.

"ఓకే! నువ్వు బిజినెస్ విషయాలు మాత్రమే చూసుకో లాయర్ ని కలవాల్సిన అవసరం లేదు అవసరమైనప్పుడు నేనే చెబుతాను." అంది అర్ణ.

"ఓకే! నువ్వు ఎలా చెప్తే అలాగా! రేపటి నుంచి మన ఫ్యాక్టరీలు మొత్తం విజిట్ చేస్తాను ఒక్కొక్కటి లైన్ లో పెడతాను." అని చెప్పాడు సుజిత్.

"ఓకే గుడ్!" అంటూ ఫోన్ పెట్టేసింది అర్ణ.

గెస్ట్ హౌస్ కి వెళ్లి రిలాక్స్ అయ్యి మందు తాగుతు రాజన్ కి కాల్ చేసి "హలో! నేను ప్రతాప్ మిశ్రా గారి అబ్బాయి సుజిత్! ఇండియాకి వచ్చాను మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి." అన్నాడు సుజిత్.

"నాన్నగారు చెప్పారు ఆల్రెడీ మీరు దిగిన గెస్ట్ హౌస్ చుట్టూ నా మనుషులు సెక్యూరిటీగా ఉన్నారు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి మార్నింగ్ అక్కడ ఉంటాను." అన్నాడు రాజన్.

"అవునా? చాలా ఫాస్ట్ గా ఉన్నారే! ఓకే బాయ్ మార్నింగ్ కలుద్దాము." అంటూ ఫోన్ పెట్టేసి ప్రాపర్టీస్ ఫైల్ చూస్తూ

"ఈ ముసలోడు ఇక్కడ ఇన్ని ఆస్తులు వదిలేసి లండన్ ఎందుకు వచ్చినట్లు!" అనుకుంటూ  వరదరాజులకి కాల్ చేసి

"హాయ్ అంకుల్! ఐ యాం సుజిత్ మిశ్ర! మిమ్మల్ని ఒక్కసారి మీట్ అవ్వాలి అనుకుంటున్నాను." అన్నాడు సుజిత్.

"హ..! ప్రతాప్ మిశ్రా కొడుకువి కదా! లండన్ నుంచి  వచ్చేసావా? రేపు ఇంటికి లంచ్ కి వచ్చాయ్ కలుద్దాము." అని చెప్పాడు వరదరాజులు.

"ఓకే అంకుల్ థాంక్యూ!" అంటూ ఫోన్ పెట్టేసాడు సుజిత్.

అంతలో అక్కడికి వచ్చి "హాయ్ సర్! మై నేమ్ ఇస్ రియా! మీ పర్సనల్ అసిస్టెంట్! మీరు ఇండియాలో ఉన్నంతకాలం మీతోనే ఉంటాను." అంటూ స్మైల్ ఇస్తూ  స్టైల్ గా చెప్పింది రియా.

"ఓకే!" అంటూ కళ్ళు ఆర్పకుండా రియా వైపు చూస్తూ "ఇండియాలో పర్సనల్ అసిస్టెంట్లు ఇంత అందంగా ఉంటారా?" నవ్వుతూ అన్నాడు సుజిత్.

"థాంక్యూ సర్! లండన్ నుంచి బాస్ వస్తున్నారంటే ఇంక ఎంత పెద్దవారో అనుకున్నాను, ఒక యంగ్ బాస్ వస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు." అంటూ సిగ్గుపడుతూ చెప్పింది రియా.

సిగ్గు పడుతున్న రియాని చూసి "ప్లీజ్ సీట్! నా పర్సనల్ అసిస్టెంట్ గా మిస్ ఇండియా ఉంటుందని నేను కూడ ఎక్స్పెక్ట్ చేయలేదు." అంటూ మాటలు కలిపాడు సుజిత్.
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 01-01-2026, 09:29 AM



Users browsing this thread: 1 Guest(s)