01-01-2026, 09:28 AM
ఎపిసోడ్ 11
లండన్ నుంచి పేపర్స్ తీసుకుని ఇండియాకి బయలుదేరాడు సుజిత్.
ఢిల్లీ లో హీర్వాణిని కలిసి అభిర్ డీటెయిల్స్ తీసుకుని ముకుల్ నంద తో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరాడు మిచల్.
పాట్నలో ఉన్న మురళి జోషి భార్య మర్డర్ చేసింది అబీర్ కాదని చెప్పడంతో "ఆ విషయం కోర్టులో చెప్పమని అడిగింది." వసుంధర.
********************
వసుంధర, శ్రీకర్ వైపు చూసి "మేము పాట్నలో ఉన్నట్లు మీకు ఎలా తెలిసింది?" డౌట్ గా అడిగింది గీత.
"ఆ విషయం నేను చెప్తాను సుమతి మీ అమ్మాయె కదా!" అని అడిగింది నీలమ్.
ఇంటి లోపలికి వస్తూ "నా పేరే సుమతి! ఇంతకీ మీరందరూ ఎవరు?" అంటూ అనుమానంగా చూస్తూ అడిగింది సుమతి.
"మీ అమ్మాయి సుమతి ట్రూ ఛానల్ లో జర్నలిస్ట్ పోస్ట్ కోసం అప్లై చేసింది అప్లికేషన్ హెడ్ ఆఫీస్ లో ఉన్న నా దగ్గరికి వచ్చింది.'
'డాటర్ ఆఫ్ ఖాళీగా ఉండడంతో మెయిల్ పంపించాను తన రిప్లై లో మురళి జోషి గారి డీటెయిల్స్ మీ డీటెయిల్స్ రాసింది.'
'నేను ఆల్రెడీ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను అందుకే వెంటనే నాకు అర్థమై మీ అడ్రస్ తెలుసుకున్నాను." అని చెప్పింది నీలమ్.
సుమతి వైపు కోపంగా చూస్తూ "మీ నాన్నగారి పేరు ఎక్కడ వాడకూడదని చెప్పానా? ఇప్పుడు చూసావా మళ్లీ మనం ప్రమాదంలో పడబోతున్నాము." అంటూ వసుంధర వైపు చూసి
"నేను ఇప్పటివరకు చాలా కోల్పోయాను మళ్లీ ఇప్పుడు నా బిడ్డల్ని కూడా కోల్పోవాలి అనుకోవడం లేదు. ఆ అబ్బాయి జీవితం అన్యాయమవుతుంది అని అర్థమైంది.'
'కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను నాకు నా కుటుంబమే ముఖ్యం! నా భర్తను చంపిన వాళ్ళు చాలా పెద్ద వాళ్లని నాకు తెలుసు!'
'వాళ్ళని ఎదిరించి మీరు కూడా మమ్మల్ని కాపాడలేరు ఇంక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈరోజే ఇక్కడి నుంచి ఎవరి కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోతాము." అంటూ ఇద్దరి కూతుర్లని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ చెప్పింది గీత.
"డాడ్ ని చంపిన వాళ్ళకి భయపడి ఇంకా ఎన్నాళ్లు దాక్కుకుంటాము మేమిద్దరం జీవితాంతం ఇలా భయపడుతూ ఉండాల్సిందేనా?" అంటూ కోపంగా అడిగింది సుమతి.
"అంటే! మీ భర్తని చంపింది ఎవరో మీకు తెలుసు! కానీ వాళ్లకి భయపడి మీరు చెప్పడం లేదు కదూ?" డౌట్ గా అడిగాడు శ్రీకర్.
ఆ మాట విని తల్లి వైపు చూస్తూ "నిజంగా డాడ్ ని చంపిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా?" అంటూ అనుమానంగా అడిగింది సుమతి.
"నాకు తెలుసు! కానీ ఆ విషయం బయటికి చెప్పిన ఇప్పుడు ఉపయోగం లేదు ఎందుకంటే అతను కూడా ఆరోజే నా కళ్ళ ముందు చనిపోయాడు.'
'నేను అక్కడే ఉంటే ఈ గొడవలో నా పిల్లల జీవితం ఎక్కడ నాశనమవుతుందోనని భయపడి దూరంగా పారిపోయాను కానీ అమాయకుడైన ఆ అబ్బాయిని కాపాడడానికి కోర్టులో సాక్ష్యం చెబుతాను.'
'కానీ వాళ్ళు వెంటనే నన్ను చంపేస్తారు అప్పుడు నా పిల్లలకి దిక్కు ఎవరు నేను లేకుండా ఇద్దరు ఎలా బతుకుతారు?" అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది గీత.
ఆ మాట విని గీత దగ్గరకు వచ్చి "అమ్మ! మీ భర్త చావుకి మీ బాధకి కారణం అయింది నేను కాదని మీకు తెలిసింది నాకు అది చాలు, మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనవసరం లేదు." అంటూ
జేబులో నుంచి పాకెట్ తీసి సుమతి చేతిలో పెట్టి "దీంట్లో 30 లక్షలు ఉన్నాయి నన్ను మీ కొడుకుగా భావించి ఇవి తీసుకోండి. వీటితో మీ బాధ తీరిపోతుంది అని నేను చెప్పలేను.'
'కానీ ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి ప్రశాంతంగా ఉండండి ఈ కేసులో నుంచి నేను ఎలాగైనా బయటికి వస్తాను." అన్నాడు అభిర్.
"అభిర్! నువ్వేం చేస్తున్నావు ఆవిడ సాక్ష్యం చెప్పకపోతే నువ్వు ఈ కేసులో నుంచి ఎప్పటికి బయటికి రాలేవు." అంటూ కంగారుగా చెప్పింది వసుంధర.
"మేడం! కోర్టులో సాక్ష్యం ఎప్పుడు చెప్పాలో చెప్పండి చాలు! ఆ టైమ్ కి మా అమ్మగారిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించి నా అన్నను ఈ కేస్ నుంచి బయటకు తీసుకొస్తాను." అంది సుమతి.
"అవును సార్! నాకు దేవుడు ఇచ్చిన కొడుకుని కాపాడుకుంటాను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా బిడ్డల్ని ఆ బాబు చూసుకుంటాడు అనే నమ్మకం నాకు కలిగింది." అంటూ సుమతి చేతిలో డబ్బులు తీసుకుని అభిర్ చేతిలో పెట్టింది గీత.
శ్రీకర్ వైపు చూసి "సార్! వీళ్లు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు మనతోపాటు తీసుకువెళ్లి పోదాము." అన్నాడు అభిర్.
"నో ప్రాబ్లం! మనం వచ్చిన విషయం ఎవరికీ తెలియదు." అన్నాడు శ్రీకర్.
"మీరు చెప్పింది నిజమే! కానీ వీళ్లు ఇక్కడ ఉంటున్న విషయం వాళ్లకి కచ్చితంగా తెలిసే ఉంటుంది మనం కలిసి వెళ్ళమని తెలిస్తే వెంటనే వీళ్ళ ప్రాణాలు పోతాయి." అన్నాడు అబీర్.
"అంటే! ఈ కేసు వెనకాల ఉన్న వాళ్ళ గురించి నీకు కూడా తెలుసు కదా! మరి వాళ్ల గురించి మా దగ్గర ఎందుకు నోరు తెరవడం లేదు." డౌట్ గా అడిగాడు శ్రీకర్.
"నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతాను మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. మీరు వీళ్ళని కాపాడడానికి ప్రయత్నించి అసలైన నేరస్తులకి శిక్షపడేలాగా చేయాలి అనుకుంటున్నారు.'
'కానీ ఒకరోజు మీకు సడన్గా ఫోన్ వచ్చింది మీ భార్య పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్నారు వీళ్ళని వదిలేసి వెళితేనే కానీ వాళ్ళు ప్రాణాలతో ఉండరు అప్పుడు మీరేం చేస్తారు? మీ భార్య పిల్లలు వదులుకుంటారా? వీళ్ళని వదిలేస్తారా?" అని అడిగాడు అభిర్.
"సారీ! ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను." అన్నాడు శ్రీకర్.
"ఈ ప్రశ్నకి ఇక్కడ ఉన్న మీరు ఎవరు సమాధానం చెప్పలేరు అందుకే వాళ్ళ గురించి నేను కూడా మీకు చెప్పలేదు." అన్నాడు అభిర్.
"అలా అయితే! ఎప్పటికీ వాళ్ళని మనం ఏమి చేయలేమా? ఇలా బాధని దిగమించుకుని జీవితాంతం బతకడమేనా!" అంటూ కోపంగా అడిగింది సుమతి.
"కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలం చెబుతుంది మీ గుండెల్లో ఉన్న బాధ తీరే రోజు తప్పకుండా వస్తుంది." అంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు అభిర్.
శ్రీకర్ వైపు చూసి "మనం ఈ కేసులో నుంచి ఆబీర్ ని ముందు బయటికి తీసుకువద్దాము తర్వాత వేరే విషయాల గురించి ఆలోచిద్దాము." అని చెప్పింది వసుంధర.
"ఓకే!" అంటూ గీత వాళ్ళ వైపు చూసి "మేడం! మీరు త్వరగా బయలుదేరండి ఢిల్లీ వెళ్ళిపోదాము." అన్నాడు శ్రీకర్.
కారు దగ్గరికి వచ్చి భర్తకి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి "కాసేపట్లో ఢిల్లీ స్టార్ట్ అవుతున్నాము." అని చెప్పింది వసుంధర.
"ఓకే కేర్ ఫుల్! అక్కడ జైలర్ నా ఫ్రెండ్! ఏదైనా అవసరమైతే కాల్ చెయ్!" అని చెప్పాడు సందీప్ రావు.
"సరే! పాప కాలేజ్ నుంచి వచ్చే టైమ్ కి ఇంటికి వెళ్ళండి." అంటూ ఫోన్ పెట్టేసి అభిర్ ఉన్న కార్లో ముగ్గురిని ఎక్కించి అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరింది వసుంధర.
********************
ఢిల్లీ తన మనుషులతో కలిసి సందీప్ రావు ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు కనిపించకపోవడంతో గార్డెన్లో పనిచేస్తున్న మనిషిని పిలిచి "అందరూ ఎక్కడికి వెళ్లారు?" అని అడిగాడు మిచల్.
"డ్యూటీ కి వెళ్లారు సాయంత్రానికి కానీ రారు మీరు ఎవరో చెప్పండి వచ్చిన తర్వాత చెప్తాను." అన్నాడు వర్కర్.
"నువ్వు ఇక్కడ ఎంత కాలంగా పని చేస్తున్నావు?" అని అడిగాడు మిచల్.
"నేను పది సంవత్సరాలుగా వీరి దగ్గరే పని చేస్తున్నారు పర్వాలేదు చెప్పండి ఒకవేళ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే నాకు ఇవ్వండి నేను ఇస్తాను." అన్నాడు వర్కర్.
"అవునా?" అంటూ తన మనుషులు వైపు చూసి "వీడిని చావు దెబ్బలు కొట్టండి కానీ చంపకండి మనమంటే వాళ్ళకి భయం రావాలి." అంటూ కోపంగా చూస్తూ చెప్పాడు మిచల్.
ఆ మాట విని వర్కర్ ని రక్తం వచ్చేటట్లు కొట్టి కింద పడేసారు మిచల్ మనుషులు.
"నన్ను చంపకండి పిల్లలు కలవాడిని!" అంటూ దండం పెడుతున్న వర్కర్ దగ్గరికి వెళ్లి
"మీ మేడంతో, సార్ తో చెప్పు! ఆ అభిర్ గాడు బయట ఉన్నంతకాలం ఇదే జరుగుతుంది." అంటూ అరుస్తూ మీదకి వస్తున్న టమిని చూసి
కాలితో గట్టిగా తన్ని "చచ్చింది కుక్క లేకపోతే ఆరుస్తు నా మీదికి వస్తుందా?" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిచల్.
**************
సాయంత్రానికి ఇంటికి చేరుకొని ఒంటినిండా బ్యాండేజ్స్ తో ఉన్న వర్కర్ ని, టింకు ముందు కూర్చుని ఏడుస్తున్న రోషిని ని చూసి కంగారుగా లోపలికి వెళ్లి భర్త వైపు చూస్తూ "ఏమైంది?" అంటూ అనుమానంగా అడిగింది వసుంధర.
"ఈ కేసు నుంచి తప్పుకొని అభిర్ ని మళ్లీ జైలుకి పంపించకపోతే ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.'
'సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాను సిసి ఫుటేజ్ తీసుకువెళ్లారు ఎవరో తెలుసుకుంటామని చెప్పారు." అన్నాడు సదీప్ రావు.
"మేడం! టమి చనిపోయింది తీసుకువెళ్తానంటే పాప వద్దు అని ఏడుస్తుంది మీరైనా చెప్పండి." అన్నాడు శంకర్.
అభిర్ దగ్గరికి వచ్చి "అంకుల్! టమి చనిపోయింది అంటున్నారు కాదు దానికి జ్వరం తగిలి నిద్ర పోతుంది మనం హాస్పిటల్ కి తీసుకువెళదాము త్వరగా రండి." అంటూ ఏడుస్తూ అడిగింది రోషిని.
అక్కడికి వచ్చి "మేడం! మీరు టెన్షన్ పడకండి ఇక్కడ కూడా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను సిసి ఫుటేజ్ చూసి వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను." అంటూ వర్కర్ వైపు చూసి
"ఇక్కడకు వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా?" అని అడిగాడు శ్రీకర్.
"లేదు సార్! నాకు తెలిసి వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు భాష కూడా వేరే విధంగా ఉంది." అన్నాడు వర్కర్.
ఏడుస్తున్న రోషిని తల మీద చెయ్యి వేసి "ఏడవకు టమికి ఏమి అవ్వదు." అంటూ శంకర్ చేతిలో ఉన్న కుక్క పిల్లని తీసుకుని రెండు చేతులతో ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకున్నాడు అభిర్.
కాసేపాటకి అభిర్ చేతిలో నుంచి కిందకి దూకి రోషిని వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న టమిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.
"హై...! టమికి జ్వరం తగ్గిపోయింది." అంటూ సంతోషంగా ఎగురుతూ ఉంది రోషిని

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)