31-12-2025, 11:19 PM
(This post was last modified: 31-12-2025, 11:20 PM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 19
ధనుంజయ్ అడిగిన దానికి సత్యవతి గారు ఏంట్రా ఏమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతున్నవు అని అంటారు.
నేను నిజంగానే అడుగుతున్నాను అమ్మ అవని భోంచేయాలి అంటే పనిచేయడం ఏంటి.. ఇంట్లో ఇంతమంది సర్వెంట్స్ ఉండగా అవని పని చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అని అడిగితే...
అది మమ్మల్ని అడుగుతావేంటి నీ ముద్దుల భార్యని అడుగు. నువ్వు చెప్పావని తనే మాకు అందరికీ చెప్పింది అని భార్గవి వంక చూస్తారు.
భార్గవికి టెన్షన్ తో చెమటలు పడతాయి. బాబొయ్ ఈవిడ ఏంటి ఇలా ఇరికించేసింది. ఇప్పుడు నేను ఈయనకి ఏమని చెప్పాలి అన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది.
చెప్పు భార్గవి ఏం చెప్పావు నువ్వు అని గట్టిగా అడుగుతాడు. నేనేమీ చెప్పలేదండి అని నాంచుతుంది . దానికి సత్యవతి గారు అదేంటి భార్గవి అలా అంటావు.
ఈ ఇంట్లో ఉండాలి అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. కచ్చితంగా వంట మాత్రం చేయాలి. ఒకరోజు గార్డెనింగ్, ఒక రోజు ఇంటి పని అని ఏదో ఒకటి చేస్తేనే నువ్వు ఇంట్లో ఉంటావు అని మీ నాన్నగారు చెప్పమన్నారు అని చెప్పావు కదా అని గట్టిగా అడుగుతారు. పాపం అవన్నీ చిన్నపిల్ల ఎన్నిసార్లు చేయి కాల్చుకుందో అని బాధగా అంటారు
ధనుంజయ్ కి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. నిజం చెప్పు భార్గవి అని గట్టిగా అరుస్తారు. దానికి భార్గవి చెమటలు తుడుచుకుంటూ అంటే... పనులు వస్తాయని అలా చెప్పాను అంతేనండి.
శిల్ప కు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడుగుతారు. దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ ఉంటది.
ధనుంజయ్ తల్లిదండ్రులు వంక చూస్తాడు. వాళ్ళు చూసిన అసహ్యకరమైన చూపుకి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాక తలదించుకుని లోపలికి వెళ్ళిపోతాడు.
లోపలికి వెళుతూ భార్గవిని చూస్తే ఈరోజు నుంచి వంట నువ్వే చేయాలి. నువ్వు కాక ఎవరితోనైనా చేయించినట్టు నాకు తెలిస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు.
సత్యవతి గారు భార్గవి వంక కోపంగా చూస్తూ వెళ్లి వంట చేయ్యి మాకు చాలా ఆకలిగా ఉంది పదండి అని చెప్పి భర్త చెయ్యి పుచ్చుకొని గదిలోకి వెళ్ళిపోతుంది.
గదిలోకి వెళ్ళిన ధనుంజయ్ బట్టలతోనే షవర్ కింద నుంచోని అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా..
అవని విషయంలో చాలా జరిగింది. అవిని నాకు రజిత ఇచ్చిన ప్రేమ గుర్తు. తెలియకుండానే అవని విషయంలో చాలా నిర్లక్ష్యం చేశాను అనుకుని...
గబగబా ఫ్రెష్ అయ్యి తండ్రి రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ నాక్ చేస్తాడు. అప్పుడే భార్గవి స్నాక్స్ టీపుచ్చుకొని అక్కడికి వస్తుంది.
నేను తీసుకెళ్తాను లోపలికి.. వెళ్లి నైట్ డిన్నర్ పని చూడు అని చెప్పి విసుగ్గా ప్లేట్స్ తీసుకుని లోపలికి వెళ్తాడు.
లోపలికి వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. ధనుంజయ్ ని చూసిన సరే ఏమీ మాట్లాడకుండా తల పక్కకు తిప్పుకుంటారు.
ప్లీజ్ నాన్న మీరు అలా చేయకండి చాలా కష్టంగా ఉంది అంటే.. నువ్వు అవని విషయం లో ఇదే కదా చేసావు.
ఇంత వయసు వచ్చిన నీకే బాధగా ఉంటే చిన్నప్పటి నుంచి నీ ప్రేమ కోసం చూసినా అవిని కి ఎంత బాధగా ఉంటది రా! అని తల పక్కకు తిప్పుకుంటారు.
ధనుంజయ్ సిగ్గుతో తలదించుకుంటాడు. నేను ఏది కావాలని చేయలేదు.
అవిని నీ చూడగానే రజిత గుర్తొచ్చి బాధ వచ్చేది. ఆ బాధతోనే అవిని నీ దగ్గరికి తీసుకోలేదు కానీ అవని అంటే నాకు చాలా ఇష్టం నాన్న అని చెబుతాడు.
చేతల్లో లేని నీ బోడి ఇష్టం ఎవరికి కావాలి రా! అలా అనుకుంటే నీకు భార్గవి ని చూసినప్పుడు కూడా ఇది రజిత స్థానం కదా అని.. భార్గవి కూడా దూరంగా ఉండాలి కదా!
మరి ఎలాగా శిల్ప కన్నారు అని సూటిగా అడుగుతారు. నాన్న అని అహం దెబ్బతిన్నట్టుగా చూస్తాడు .
నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా ధనుంజయ్ గంభీరంగా అడుగుతారు. మీరు అందరూ చేసిన తప్పులకి బలైపోయింది మాత్రం నా మనవరాలు.
ఇంక మీరు దయచేయండి అక్కడ మీ ముద్దుల భార్య ఎదురు చూస్తూ ఉంటాది అని వెటకారంగా అంటారు.
ప్లీజ్ నాన్న మీతో మాట్లాడాలని వచ్చాను. నన్ను కొంచెం మాట్లాడనిస్తారా అని రిక్వెస్ట్ చేస్తాడు. మాకైతే నీతో మాట్లాడడం అసలు ఇష్టం లేదు.
ఏదో మాట్లాడాలి అంటున్నావు కదా తొందరగా మాట్లాడు బయటికి వెళ్ళు అని చాలా కరాకండిగా చెప్పేస్తారు.
ఎందుకు నాన్న మీరు అంత రేష్ గా మాట్లాడుతున్నారు అని బాధగా అడిగితే.. మనమేదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది అంటారు అదే కర్మఫలం.
మనం చేసిన దానికి భగవంతుడైనా ప్రార్థిస్తే క్షమిస్తాడేమో గాని కర్మ మాత్రం క్షమించదు అంటారు. నువ్వు చేసిన పనులు నీకే తిరుగు వస్తున్నాయి.
కన్నవాళ్ళ నుంచి నిరసన వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అని.. ఇంతకీ విషయం ఏంటో చెప్పు నిన్ను ఇంతసేపు ఎదురుగుండా చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది అని అసహ్యంగా మాట్లాడుతారు.
తన చేసిన తప్పు తనకి ఎదురుగుండా కనబడుతుంటే బాధగా కళ్ళు మూసుకొని. నేను అవని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెబుతాడు.
మంచిది వెళ్ళు అంటారు. ప్లీజ్ నాన్న నేను చెప్పేది పూర్తిగా అవలేదు ఇబ్బందిగా తండ్రిని చూస్తూ అవిని చదివిన కాలేజ్ ఎక్కడ చెప్పండి నాన్న అంటే..
ఆశ్చర్యంగా అంటే నీకు నీ కూతురు ఏం చదివిందో తెలియదు అనుకున్నాను కానీ... ఎక్కడ చదివిందో కూడా తెలియదా అని ఏం తండ్రి వి రా బాబు నువ్వు అని అవిని చదివిన కాలేజ్ పేరు చెప్పి, తను చేసిన కోర్స్ గురించి కూడా చెప్పి ఇంకా వెళతావా నువ్వు అని తెలుపు వంక చూపిస్తారు.
ధనుంజయ్ చాలా బాధగా బయటకు వచ్చి గార్డెన్ లో కూర్చుంటాడు. పిల్లలు ఇద్దరి చిన్నప్పుడు విషయాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
అవని ఫస్ట్ బర్త్ డే తర్వాత తను అసలు సెలబ్రేట్ చేయడమే గుర్తులేదు. ఆరోజు రాగానే ఎప్పుడు భార్గవి రజిత అక్క చనిపోయిన రోజు అని గుర్తు చేయడం. తన ఆ బాధలో ఉండిపోవడం.
శిల్ప బర్త్డే మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం. అవని బిక్కు బిక్కు మంటూ చూడడం. ఎక్కువగా తన రూమ్ లో ఉండిపోవడం గుర్తు వచ్చి బాధగా కళ్ళు మూసుకుంటాడు.
మూసిన కనురెప్పల నుంచి కన్నీళ్లు జారుతూ ఉంటాయి. నాకు తెలియకుండానే అవని విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను.
రేపు కాలేజీకి వెళ్లి కనుక్కోవాలి. అసలు నిజంగా అవిని కి బాయ్ఫ్రెండ్ ఉన్నాడా లేక అవిని విషయంలో ఏమైనా జరిగిందా.. ఎవరైనా కావాలని చేసి ఉన్నారు అని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలు తోడేస్తాను అని నుదురు రుద్దుకుంటాడు.
భార్గవి వచ్చి ఏవండీ వంట అయిపోయింది బోంచేతురు గాని రండి. అత్తయ్య, మావయ్య కూడా వెయిట్ చేస్తున్నారు అంటే.. మీరు చేసేయండి నాకు ఆకలిగా లేదు అని చెబుతాడు.
రండి సాయంత్రం నుంచి కూడా మీరు ఏమి తినలేదు కదా అంటే.. ప్లీజ్ భార్గవి నన్ను విసిగించకుండా వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు.
ఈయన ఇంకా అదే మూడులో ఉన్నట్టున్నారు. మనకు ఎందుకులే అనుకుని, అలాగే అని చెప్పి వెళ్లి పెద్దవాళ్ల ఇద్దరికీ వడ్డించి వాళ్ళు భోంచేసిన తర్వాత భార్గవి కూడా భోజనం చేస్తుంది.
ధనుంజయ్ గార్డెన్ లో ఎంతసేపు కూర్చున్నాడు అతనికి తెలియదు.
బెంగళూరు...
కాలేజ్ నుంచి వచ్చిన అవని హాల్లో కూర్చుని పొద్దున జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది అమ్మో విక్రమ్ గారి తో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆయన విషయాలు అడుగుదామంటే నా విషయాలు వన్ బై వన్ అడుగుతున్నారు. ఇలాగా ఉంటే ఎప్పుడూ నేనే చెప్పేసేటట్టు ఉన్నాను.
విక్రమ్ గారికి దూరంగా ఉండటమే దీనికి బెటర్ సొల్యూషన్ అనుకుంటుంది.
నేను అసలు వాళ్ళ ఫ్లాట్ వైఫై చూడను నా పని ఏదో నేను చూసుకుని కామ్ గా ఉంటే సరిపోతుంది. అప్పుడు వాళ్లు నన్ను డిస్టర్బ్ చేయరు.
కానీ ఎలా విక్రమ్ గారి గురించి తెలుసుకోవడం అంతా బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఇలాంటి చిన్న ఫ్లాట్లో ఎందుకు ఉంటున్నట్టు...
ఒకవేళ ఉన్నారే అనుకో తనతో పాటు భార్య కూడా రావాలి కదా అనుకుంటుంది.
భార్య అని శిల్ప ని గుర్తు చేసుకోగానే అవని మనసంతా ఏదో చేదు తిన్నట్టుగా ఫీల్ అవుతుంది. తనకు తానే మళ్లీ సర్ది చెప్పుకొని..
నా వరకు మాత్రమే విక్రమ్ నా భర్త కానీ... ఆయన దృష్టిలో శిల్ప ఆయన భార్య. ఎంత విచిత్రంగా ఉందో మా బంధం అనుకుని విరక్తిగా నవ్వుకుని కిచెన్లోకి వెళ్లి టీ పెట్టుకుని తాగుతుంది.
అప్పుడు మైండ్ కొంచెం ఫ్రెష్ గా అనిపించి రిలాక్స్ అవుతుంది. కాసేపు వెళ్లి పడుకుని సాయంత్రం ఆరు అవుతుందిగా లేచి వస్తుంది.
ఫ్రెషయ్య దీపారాధన చేసి కిచెన్ లోకి వెళుతుంది. ఏం కుక్ చేయాలా అని ఆలోచిస్తుంది.
అవని కి తెలియకుండానే మళ్ళీ విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సాయంత్రం ఏం తింటారు.
మధ్యాహ్నం లంచ్ చేసి ఉంటారా లేదా? చేయకపోతే చాలా ఆకలిగా ఉంటారు అనుకొని.. కంగారుపడుతూ రేపటి నుండి లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేయాలి.
ఇప్పుడు ఆకలితో ఉండి ఉండొచ్చు కదా అనుకుని జీరా రైస్, చపాతీ, గుత్తి వంకాయ కూర, పెరుగు చట్నీ, కీర, క్యారెట్ స్లైస్ కట్ చేసి బట్టర్ మిల్క్ కూడా చేసేసి రెడీ చేస్తుంది .
విక్రమ్ ఫ్లాట్ వంక చూస్తూ వీళ్ళు ఇంకా రాలేదేంటి అని మాటిమాటికి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది.
ఇదంతా సీసీలో చూస్తున్న విక్రమ్ కోర మీసాలు కింద ఉన్న పెదవులపై సన్నటి చిరునవ్వు వస్తుంది. అది చూసిన శ్రీ ఏంటి బావ నీలో నువ్వు తెగ నవ్వుకుంటున్నావు అంటే..
నీ చెల్లి చేసే ఫీట్లు చూసి నవ్వురాక ఇంకేం వస్తుంది అంటాడు. ఏం చేసింది అని అనుమానంగా అడిగితే...
మనం ఇంకా రాలేదు అని లోపలికి బయటికి కాలు గాలిన పిల్లి లాగా తిరుగుతుంది అని నవ్వుతాడు.
నీకెలా తెలుసు బావ అంటే.. చెప్పాను కదా నాకు అవిని గురించి తెలిసినప్పుడే తన చుట్టూ నా మనుషులని పెట్టేసాను అని...
తనకు తెలియకుండానే వాళ్ళు ఫ్లాట్లో కూడా కెమెరా పెట్టాను. ఇప్పుడు మనం వెళ్లే దాకా అలాగే తిరుగుతా ఉంటుంది. పదా వెళదాము అని చెప్పి బయలుదేరుతారు.
విక్రమ్ని ఫ్లాట్ దగ్గర చూడగానే అవని ఫేసులో సంతోషం విరబూస్తుంది. అది అంతా విక్రమ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు.
మనసులో నా పైన ఇంత ప్రేమ ఉంచుకొని కూడా నాకు దూరంగా వచ్చేసావు కదా! చెప్తా నీ పని అనుకుని ఫోను వస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ చెప్పు శిల్పా అంటాడు.
ఆ మాట వినగానే అవని మొహం డల్ అయిపోతుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)