30-12-2025, 08:30 PM
Part - 17
నాన్న అని మళ్ళీ పిలుస్తాడు. చెప్పు అని ముభవంగా అంటారు. ప్లీజ్ నాన్న మీరు ఆలా మాట్లాడికండి. చాలా బాధగా ఉంది.
ఇంత వయసు వచ్చిన నీకే ఇలా ఉంటే.. మరి అవని పరిస్థితి ఏమిటి అని గట్టిగ అడుగుతారు. నేను ఎప్పుడు సెపరేట్ గా చూడలేదు. అన్నీ ఇచ్చాను అనుకున్నాను.
నీ మాటలో ఉన్న కాన్ఫిడెన్స్ చెబుతుంది నువ్వు చెప్పింది ఎంత నిజమో. సరే గాని ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతారు.
ప్లీజ్ నాన్న మీరు వచ్చేయండి. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మమ్మల్ని కూడా తల్లిదండ్రులు కాదు అని చెబితే వినమంటావా అని అడుగుతారు.
నేను ఎందుకు అలా చెబుతాను నాన్న అని బాధగా అడుగుతాడు. మరి అవని విషయంలో ఏం జరిగింది మరి అంటే... మౌనమే సమాధానం అవుతుంది.
సరే ఉంటాను అని శేషగిరి గారు అనగానే... ప్లీజ్ నాన్న రండి. మీ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము అని అంటాడు.
సరే మేము వస్తాము అవిని ఎక్కడుందో వెతికి వెనక్కి తీసుకొస్తావా అని సూటిగా అడుగుతారు. అవని నా కూతురే కదా నాన్న తీసుకొస్తాను.
అవిని తనికి నచ్చిన వాడితో వెళ్ళిపోయింది కదా! ఆ వ్యక్తిని కూడా తీసుకువచ్చి ఇద్దరికి మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేస్తాను అని చెబుతాడు.
అవని నచ్చిన వాడితో వెళ్ళిపోయింది అని నీకు ఎవరు చెప్పారు అని గట్టిగా అడుగుతారు. ఆరోజు ఇంటిలో అంత గొడవ జరిగింది కదా!
ఉదయ్ చెప్పాడు కదా అంటే.. ఉదయ్ ఎవరు అని అడుగుతారు. భార్గవి కి మేనల్లుడు అనగానే.... మరి అవని ఎవరు అని అడుగుతారు. నా కూతురు అని చెబుతాడు.
మేనల్లుడు మీద ఉన్న నమ్మకం కూతురు మీద లేదా అని గట్టిగా అడుగుతారు. నీ మేనల్లుడు మీద నీకు నమ్మకం ఉండొచ్చు గాని.. నా మనవరాలు మీద నాకు చాలా నమ్మకం ఉంది .
సరే నీ మాట ప్రకారం మేము అక్కడకు వస్తాము. కాకపోతే నాదొక కండిషన్ అంటారు. చెప్పండి అనగానే మీ ఇంటిలో ఎవరికీ తెలియకుండా అవని గురించి ఎంక్వయిరీ చేపించు.
నీ భార్య కూడా తెలియడానికి వీల్లేదు అలాగే మేము చెప్పింది మాత్రమే మీరు ఇంట్లో చేసేటట్టు అయితేనే మేము వస్తాము లేకపోతే మేము ఇక్కడ మీరు అక్కడ ఉండండి.
మా గౌరవం తగ్గించుకోవాలని మాకు లేదు అని కరాకండిగా చెప్పేస్తారు. దానికి ధనుంజయ్ లేదు నాన్న మీరు చెప్పినట్టే చేస్తాను.
ముందే చెబుతున్నాను మా గౌరవానికి ఎటువంటి ఇబ్బంది కలిగిన మీ ఇంటి నుంచి మేము బయటకు వచ్చేస్తాము అని గంభీరంగా చెబుతారు.
మీ ఇల్లు అని అంటారు ఏంటి నాన్న అది మన ఇల్లు. నా మనవరాలు గురించి నువ్వు పూర్తి నిజాలు తెలుసుకునేంతవరకు అది మీ ఇల్లే అవుతుంది ధనుంజయ్ అని గట్టిగానే చెబుతారు.
అలాగే అవని రజిత కూతురు మా మనవరాలు అవుతుంది కానీ.. నీ కూతురు అవ్వదు అని చెబుతారు..
నాన్న మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు. అవిని గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేపిస్తాను. భార్గవికి కూడా చెప్పను.
అలాగే మీరు, అమ్మా ఎలా చెబితే అలాగే ఇంట్లో అందరం నడుచుకుంటాము అని చెప్పి. బ్రతిమాలి ఒప్పిస్తాడు.
సరే అయితే మేము మధ్యాహ్నం నుంచి బయలుదేరుతామని ఫోన్ పెట్టేసి భార్య వంక చూస్తారు. సత్యవతి గారు మౌనంగానే ఉంటారు.. ఏమైందే అలాగా ఉన్నావు అంటే...
భార్గవి మన ముందు మంచిగా ఉంటూ ఇంత విషం కక్కుతుంది అని అనుకోలేదు అని బాధపడుతుంది.. ఏమి చేస్తాము మనకి తెలియకుండా జరిగిపోయింది కదా ఇప్పుడు నుండి చూద్దాము అని చెప్పి రెడీ అవ్వు బయలుదేరాలి అని చెప్తారు.
బెంగళూరు....
అవని పొద్దుటే లేచి ఫ్రెష్ అయ్యి ముగ్గు వేయడానికని ఫ్లాట్ బయటకు వస్తుంది. అప్పటికే విక్రమ్ జాగింగ్ కి వెళ్ళిపోతాడు. రెండు ఫ్లాట్లకి సరిపడే విధంగా ఒకటే ముగ్గు వేస్తుంది.
ముగ్గుని చూసుకుని పర్ఫెక్ట్ అనుకుంటూ చూస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ అని ఒక వాయిస్ వెనకనుండి వినపడుతుంది.
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ విక్రమ్ అంటాడు సీరియస్గా విక్రమ్ చూస్తూ ఉంటాడు. అవిని తడబడుతూ ముగ్గు వేసాను అని చెబుతుంది.
విక్రమ ముగ్గు ఒకసారి చూసి మీ ఫ్లాట్ ముందు వేసుకుంటే సరే.. మా ఫ్లాట్ కూడా కలిపి వేసేసారు ఎందుకు అని అడుగుతాడు.
అంటే.. ఈరోజు నేను పెద్ద ముగ్గు వేసాను అది అలా అలా మీ ఫ్లాట్ వరకు వచ్చేసింది అని చెప్పి లోపలికి వెళ్లడానికి అడుగులు వేస్తుంది.
విక్రమ్ వెంటనే ఎక్స్క్యూజ్మీ అనే పిలుస్తాడు చెప్పండి అంటే.. మీ పేరు అని అడుగుతాడు.
అవని అని చెబుతుంది ముందు వెనక ఏమీ లేదా అని అడిగితే.. నేను ఒక అనాధని అని చెబుతోంది.
ఆ మాటకి విక్రమ్ పిడికిలి బిగిస్తాడు. ఓ అవునా కానీ మిమ్మల్ని చూస్తే పెళ్లైన వాళ్ళ లాగా కనిపిస్తున్నారు అని అడుగుతాడు.
గబగబా మెడ చెక్ చేసుకుంటుంది. నల్లపూసలు ఏమైనా బయటకు వచ్చేసినాయి అని.. దానికి విక్రం నేను ఆడవాళ్లు తప్పుగా చూడను.
నీ నుదుటను ఉన్న కుంకం చూసి అడుగుతున్నాను అంటాడు. దానికి అవని మీరు తప్పుగా చూస్తారని నేను అనలేదండి అని తలదించుకుంటుంది
చెప్పండి మీరు అనాధ అంటున్నారు. చూస్తే పెళ్లి అయిన వాళ్ళ లాగా ఉన్నారు అని మళ్ళీ రెట్టిస్తాడు.
.
దానికి అవని పెళ్ళికి ముందు నేను ఒక అనాధని పెళ్లయిన తర్వాత మా వారు వర్క్ చాలా సీక్రెట్ గా చేయాలి.
అందుకనే ఆ డీటెయిల్స్ ఏమి బయటికి చెప్పనండి అని చెప్పి స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతుంది పర్వాలేదు బాగానే కవర్ చేస్తున్నావ్ అనుకుంటూ.. లోపలికి వెళ్ళిపోతాడు.
అవని లోపలికి వెళ్లి ఎత్తిన బాటిల్ దించకుండా వాటర్ తాగేసి... నేను ఆయన డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే.. నా డీటెయిల్స్ అన్నీ ఈయనకి చెబుతున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవని అని తనకు తానే సర్థి చెప్పుకుంటుంది.
ఈలోపు నేహా లేచి వచ్చి ఏంటి అవని ఇంత పొద్దున్నే ఫ్రెష్ అయ్యావు ఈరోజు అని అడుగుతుంది. అలాగేమీ లేదు కాలేజ్ టైం అవుతుంది కదా అని చెప్పి గబగబ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది.
కరుణ ప్రిపేర్ చేస్తది కదా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే ప.. ర్వాలేదు ఖాళీగా ఉన్న బోర్ కొడుతుంది.
కరుణ వస్తే మిగిలిన పని చేస్తుంది అని చెప్పి ఈ రోజు కూడా టిఫిన్ అన్ని ఎక్కువ చేస్తుంది మళ్లీ అన్నీ ఒక బౌల్లో సర్థి వెళ్లి విక్రమ్ ఫ్లాట్ డోర్ నాకు చేస్తుంది.
ఈసారి విక్రమే డోర్ తీస్తాడు. అబ్బా ఈయన వచ్చారు. ఏం చెప్పాలి అనుకుంటూ టిఫిన్ అని ఆ బౌల్స్ అందిస్తుంది.
ఎందుకు మిస్ మీరు మా కోసం ఇలాగ ఫుడ్ రెడీ చేసేస్తున్నారు అంటే... మీరిద్దరూ బ్యాచిలర్స్ అనుకుంటా..
కుక్ ని కూడా పెట్టుకున్నట్లేరు అందుకనే చేసి ఇచ్చాను. అపార్ట్మెంట్లో ఉన్న బ్యాచులర్స్ అందరికీ మీరే వండిస్తున్నారా అని పైనుంచి కిందకి చూస్తూ అడుగుతాడు.
దానికి అవని ఉక్రోషంగా ఎందుకు చేస్తాను అని అడుగుతుంది. మరి మాకు ఎందుకు చేసి ఇచ్చారు అని అడుగుతాడు.
దానికి అవిని తడబడుతూ ఈ ఫ్లాట్లో ఉన్న అన్నయ్య నిన్న వచ్చి సిస్టర్ లాగా ఉన్నావు పాలు పొంగించండి అని అడిగారు.
అందుకే అన్నయ్య ఆకలితో ఉంటే బాగోదు కదా అని అన్నయ్యతో పాటు మీరు ఉన్నారు కదా అని ఇద్దరికీ చేసి తెచ్చాను అని ప్లేట్ చేతిలో పెట్టేసి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది.
కోయి కోయి ఎన్ని రోజులు చెప్తావో ఈ కహానీలు నేను వింటాను అనుకుంటూ... టిఫిన్స్ పుచ్చుకొని లోపలికి వెళ్తాడు
ఎవరు బావ అని శ్రీ వస్తే... ఇంకెవరు మీ చెల్లె అనే టిఫిన్స్ అక్కడ పెడతాడు. నిజం చెప్పేయొచ్చు కదా బావ నీ కోసమే వచ్చాను అని అంటే... నేను చెప్పను.
తనంతట తానే చెప్పాలి ఏం జరిగిందో అన్నది అవి. అవని తోనే చెప్పిస్తాను. నేను రెడీ అయి వస్తాను అని వాష్ రూమ్ లోకి వెళ్తాడు
ఏం టిఫిన్ పంపించిందా అని ఓపెన్ చేసి చూస్తాడు. పెసరట్టు, ఉప్మా ఇడ్లీ, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి విత్ సాంబార్ తో ఉంటుంది.
అబ్బా ఇన్ని టిఫిన్సా!! మా బావ మాత్రం మచ్చేసుకుని పుట్టాడు. అవిని వచ్చిన తర్వాత మాత్రం ఎక్స్ట్రా వర్కౌట్స్ చేయాల్సిందే.
లేకపోతే బాగా లావు అయిపోతాడు అనుకుంటూ తొందరగా రా బావ... ఆకలి దంచేస్తుంది.
వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అని కంగారు పెడుతూ ఉంటాడు. వస్తున్నాను అని చెప్పి వచ్చి కూర్చుంటాడు.
ఎందుకు బావ అవని ఇన్ని వెరైటీస్ చేసింది అంటే... నేను ఏమి తింటానో కరెక్ట్ గా తెలియదు కదా! హెల్తీ డైట్ అంటనేమో అని ఇవి చేసింది.
చెక్ చేసుకుంటూ వెరైటీస్ మార్చుతూ ఉంటది చూస్తూ ఉండు అని చెబుతాడు. అవని, నేహా రెడి అయ్యి బయటకు వస్తారు.
నేహా ఆఫీస్ కి స్టార్ట్ అవుతుంది. అవని కాలేజ్ కి వెళ్లడానికి అని బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటుంది. అవిని నుంచున్న బస్టాప్ వైపు నుంచే విక్రమ్, శ్రీ వెళ్తూ ఉంటారు
విక్రమ్ కార్ బస్ స్టాప్ దగ్గర ఆపి అవిని నీ చూస్తాడు అవని వీళ్ళని పట్టించుకోకుండా టైం అయిపోతుంది అని బస్సు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా రాలేదేంటి అని...
విక్రమ్ హలో అవని గారు అని పిలుస్తాడు. ఎవరా అని చూస్తే అక్కడ విక్రమ్ కనిపిస్తాడు.
నన్ను తెగ ఫాలో అవుతున్నారు. ఇది అనుకోకుండా జరుగుతుందా లేదా కావాలనే చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది..
అవిని గారు మిమ్మల్ని పిలుస్తున్నాం ఎక్కడ ఆలోచిస్తున్నారు అని మళ్లీ గట్టిగా అడుగుతాడు.
చెప్పండి అనగానే ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే... కాలేజ్ కి వెళ్ళాలి కదా కాలేజ్ బస్సు ఇంకా రాలేదని చూస్తున్నాను అని చెప్తుంది.
మీ కాలేజ్ ఎక్కడ అని అడిగితే టు స్ట్రీట్ స్ అవుట్ సైడ్ ఉంటుంది అని చెబుతుంది.. మేము అటు సైడ్ వెళ్తున్నాము రండి డ్రాప్ చేస్తాము అంటే...
పర్వాలేదు సార్ అంటుంది. నేనేమీ మీకు ఊరికే లిఫ్ట్ ఇవ్వడం లేదు. మాకు మంచి ఫుడ్ పెడుతున్నారు మాకు తెలిసిన అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇస్తున్నాము అంతే అని క్యాజువల్ గా చెప్తాడు.
ఆ మాటలకి అవిని కి కోపం వచ్చి అంటే నేను ఫుడ్ పెట్టాను కాబట్టి మీరు నాకు లిఫ్ట్ ఇస్తున్నారా అని అడుగుతుంది.
నేను అలా ఏమీ అనలేదే అంటాడు విక్రమ్. మరి మీరు అన్నదానికి అర్థం ఏంటండి అని ఇంకా కోపంగా అడుగుతుంది.
కారులో కూర్చుని మీకు కావాల్సిన అర్ధాలు తీసుకోండి. వచ్చి ఎక్కండి అందరూ ఇక్కడ మనల్ని చూస్తున్నారు అని సీరియస్గా అంటాడు. అవని చుట్టూ చూస్తుంది. అక్కడున్న ఇద్దరు, ముగ్గురు వాళ్ళ వంకే చూస్తుంటే ఇబ్బందిగా అనిపించి వెళ్లి కార్ ఎక్కుతుంది.
కార్లో శ్రీ ని చూసే హాయ్ అన్నయ్య అంటుంది. హాయ్ అమ్మ అనగానే.. అన్నయ్య మీ పేరు నాకు తెలియదు అనగానే.. శ్రీ అని చెప్తాడు.
విక్రమ్ మరి నన్ను అడగరా అంటే.. నాకు తెలుసు అని ఫ్లో లో అనేస్తుంది . ఎలా తెలుసు అని అడుగుతాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)