30-12-2025, 08:26 PM
ఎపిసోడ్ 10
తన దగ్గర ఉన్న స్టోన్ అమ్మి డబ్బులతో పక్షులకు ఆహారం తీసుకుని ఇంటికి వచ్చి మురళి జోషి ఇంటికి నేను కూడా వస్తాను అని అభిర్ అడగడంతో ఓకే అన్నాడు శ్రీకర్.
******************
లండన్ ఫంక్షన్ కంప్లీట్ అవడంతో బయలుదేరూతు "గ్రాండ్ పా! నువ్వు దేని గురించి టెన్షన్ పెట్టుకోకు, నీ మాట కాదని ఇక్కడ ఏమి జరగదు నువ్వు ఏం చెప్పినా చేయడానికి మేము రెడీగా ఉంటాము." అన్నాడు విష్ణు.
"నాకు తెలుసు! నా వారసులు అంతటి సమర్థులే! సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మిమ్మల్ని ఎప్పటికీ హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాను ఉంచుతాను.'
'ఏమి ఆలోచించకుండా సంతోషంగా వెళ్లి రండి మీ చేతుల్లో నంద గ్రూప్ స్థిరంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది." అన్నాడు ముకుల్ నంద.
ఫ్యామిలీ మెంబర్స్ ని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసి "ఈరోజే సుజిత్ ఇండియా బయలుదేరుతున్నాడు ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు చెబుతూ ఉంటాను.'
'తొందరపడి మీరెవరు ఇండియా విషయాలలో ఎంటర్ అవ్వకండి ఏదైనా డౌటు ఉంటే నేను క్లారిఫై చేస్తాను." అని చెప్పింది అర్ణ.
"ఓకే!" అంటూ బాయ్ చెప్పి ఎవరీ ఫ్లైట్ వైపు వాళ్ళు వెళ్ళిపోయారు.
మహేష్ తో కలిసి ప్రతాప్ మిశ్రా ఇంటి దగ్గరకు వచ్చి "అంకుల్! మీకు చెప్పినట్లే ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను." అంటూ సుజిత్ వైపు చూసి
"ఈవెనింగ్ ఫ్లైట్ కి ఇండియా బయలుదేరు నువ్వు ఏం చేసినా సరే నాకు చెప్పకుండా చేయకూడదు, ప్రాపర్టీ సేల్ విషయంలో నీదే ఫైనల్ డెసిషన్!'
'తాతగారిని ఒప్పించే పని నేను చూసుకుంటాను ఇండియా వెళ్ళగానే లాయర్ హిర్వాణి ని మీట్ అవ్వు!" అంటూ పేపర్స్ ఇచ్చింది అర్ణ.
"ఓకే డన్!" అంటూ సంతోషంగా పేపర్స్ తీసుకున్నాడు సుజిత్.
"ఒకవేళ అక్కడ నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా ఫ్రెండ్ మిథున్ ని మీట్ అవ్వు!" అంటూ కార్డ్ ఇచ్చాడు మహేష్.
"ఓకే షూర్!" అంటూ కార్డ్ తీసుకుని "మీరు ఇండియా వచ్చే అవసరం లేకుండానే అంత క్లియర్ చేసుకుని వస్తాను." అన్నాడు సుజిత్.
"బెస్ట్ ఆఫ్ లక్!" అంటూ మహేష్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అర్ణ.
సుజిత్ వైపు సంతోషంగా చూస్తూ "మనం అనుకున్నది సాధించాము ఇంక జరగాల్సింది చూడాలి, నువ్వు ఇండియా వెళ్ళగానే రాజన్ కి ఫోన్ చెయ్!'
'అక్కడ జరిగేది ఏదీ కూడా ముకుల్ నందకి తెలియకుండా చూసుకో త్వరలోనే నందా గ్రూప్ కి పోటీగా మిశ్రా గ్రూప్ మార్కెట్లోకి రావాలి." అంటూ కసిగా అన్నాడు ప్రతాప్ మిశ్ర.
*********************
ఢిల్లీ హోటల్లో రూమ్లో వెయిట్ చేస్తూ హిర్వాణి కి కాల్ చేశాడు మిచల్.
ఫోన్ లిఫ్ట్ చేసి "హలో! నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను రూమ్ దగ్గరకి వచ్చేసావా?" అని అడిగాడు హిర్వాణి.
"రూమ్ లో నుంచి మాట్లాడుతున్నా సార్! నా మనుషులందరూ నోయిడా లో ఉన్నారు మీరు డీటెయిల్స్ చెప్పడం ఆలస్యం ఎంటర్ అవుతారు." అన్నాడు మిచల్
"ఓకే ఫైవ్ మినిట్స్!" అంటూ ఫోన్ పెట్టేసి హోటల్ రూమ్ కి వెళ్లి ఫోటో చూపిస్తూ "ఇతని పేరు అభిర్! రెండు రోజుల క్రితం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.'
"మీరు టార్గెట్ చేయాల్సింది ఇతననే! ఈ ఫోటోలో వున్న వాళ్ళు అతనికి షెల్టర్ ఇచ్చిన ఫ్యామిలి! ఈ ఇద్దరు అతనికి సెక్యూరిటీ గా ఉండే ఆఫీసర్స్!" అంటూ ఫోటోలు చూపిస్తూ డీటెయిల్స్ చెబుతూ ముకుల్ నందకి కాల్ చేసి
"సార్! మిచల్ వచ్చాడు అందరి ఫోటోలు డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా ఉన్నాడు." అని చెప్పాడు హిర్వాణి.
"మిచల్! నువ్వు ఏమీ చేస్తావో నాకు తెలియదు అభిర్ కి, అతనికి షెల్టర్ ఇచ్చిన ఫ్యామిలీకి భయమంటే ఏమిటో చూపించాలి.'
'ఆ భయం ఎలా ఉండాలి అంటే అభిర్ బయట ఉండడం కన్నా జైల్లో ఉండడమే బెటర్ అనిపించాలి." అన్నాడు ముకుల్.
"సార్! టైమ్ వేస్ట్ ఎందుకు మీరు ఇంకొక 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే అందర్నీ లేపేసి వెళ్ళిపోతాను మళ్లీ ఈ ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా ఉంటుంది." అంటూ సింపుల్ గా చెప్పాడు మిచల్.
"సార్! మిచల్ చెప్పింది కరెక్ట్! నేను కూడా ఒక కేసు గురించి రెండోసారి ఆలోచించడం ఇదే ఫస్ట్ టైమ్! మళ్లీ మనకి ఈ ఆలోచన లేకుండా ఉంటుంది." అన్నాడు హిర్వాణి.
"మిచల్! నీతోపాటే ఎంతమంది వచ్చారు." అని అడిగాడు ముకుల్ నంద.
"హిర్వాణి సార్ చాలా క్రిటికల్ కేస్ అన్నారు అందుకే 50 మంది దాకా వచ్చాము కానీ ఇక్కడ పొజిషన్ చూస్తుంటే ఒక పదిమంది సరిపోతారు అనిపిస్తుంది." అన్నాడు మిచల్.
"ఫస్ట్! అభిర్ ని భయపెట్టడానికి ట్రై చెయ్! అతను భయపడ్డాడు అని నీకు అనిపిస్తే అప్పుడు చెప్పు చంపడానికి 100 కోట్లు కాదు ఐదు వందల కోట్లు ఇస్తాను.'
'లాయర్ చెప్పినట్లు నీ టార్గెట్ అభిర్ కాదు ఆ ఫ్యామిలీ అప్పుడే అతను భయపడతాడు." అంటూ ఫోన్ పెట్టేసాడు ముకుల్ నంద.
"ఈ డబ్బున్న వాళ్ళకి ఎవరిని చూసినా భయమే! ఫస్ట్ భయపెట్టడానికి ట్రై చెయ్ కుదరకపోతే చంపేయ్! నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే హామీ నాది!'
'ఫస్ట్ టైమ్ ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాను." అంటూ కోపంగా అన్నాడు హిర్వాణి.
"ఓకే సార్!" అంటూ ఫోటోలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు మిచల్.
"ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను ఎట్టి పరిస్థితుల్లో నా పేరు గానీ ముకుల్ గారి పేరు గాని బయటకి రాకూడదు." అని చెప్పాడు హిర్వాణి.
"నా గురించి మీకు తెలియదా?" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు మిచల్.
*********************
మురళి జోషి భార్య అడ్రస్ కి వెళుతూ "నీలమ్! నువ్వు కరెక్ట్ గానే తెలుసుకున్నావా? ఇటువంటి ఏరియాలో ఆవిడ ఉంటుందంటావా? చాలా మాస్ ఏరియా లాగా ఉంది." డౌట్ గా చూస్తూ అడిగింది వసుంధర.
"నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్!" అంటూ ఒక ఇంటి దగ్గర ఆగి "ఈ అడ్రస్ ఉన్న ఇల్లు ఇదే!" అని చెప్పింది నీలమ్.
ఇంటిని చూస్తూ "ఒక NIA ఆఫీసర్ భార్య ఇటువంటి పరిస్థితుల్లో ఉందా? చూస్తుంటే చాలా బాధగా ఉంది." అంటూ కుమార్ వైపు చూసి "లోపల ఎవరైనా ఉన్నారేమో చూడు." అన్నాడు శ్రీకర్.
"ఓకే సార్!" అంటూ డోర్ కొడుతూ "లోపల ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు కుమార్.
డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వాళ్లకు వైపు కంగారుగా చూస్తూ "అమ్మ! ఎవరో ఆఫీసర్స్ వచ్చినట్లు ఉన్నారు." అంటూ భయంగా లోపలికి వెళ్ళిపోయింది మురళి జోషి కూతురు.
"అవునా?" అంటూ హడావుడిగా బయటకు వచ్చి చూసి "ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు?" కంగారుపడుతూ అడిగింది మురళి జోషి భార్య.
"మీరు ఆఫీసర్ మురళి జోషి భార్య గీత గారు కదా! నా పేరు వసుంధర లాయర్! మీతో కొంచెం మాట్లాడాలి." అంది వసుంధర.
"నాకు మురళి జోషి ఎవరో తెలియదు." అంటూ డోర్స్ క్లోజ్ చేసింది గీత.
"మేడమ్! మీ భర్తను చంపిన వ్యక్తి కూడా మాతో పాటు ఉన్నాడు మీకు అతని మీద కోపం లేదా? అతనికి శిక్ష పడాలని మీరు అనుకోవడం లేదా?" అంటూ గట్టిగా అరిచాడు శ్రీకర్.
ఆ మాటకి కంగారు శ్రీకర్ వైపు చూసి "నువ్వు చేస్తుంది ఏమిటి?" కోపంగా చూస్తూ అడిగింది వసుంధర.
"మేడం! కొన్ని నిజాలు బయటికి రావాలి అంటే ఎమోషన్ ని టచ్ చేయ్యాక తప్పదు ప్లీజ్ వెయిట్!" అన్నాడు శ్రీకర్.
కాసేపాటకి డోర్ ఓపెన్ చేసి "నా భర్తను చంపిన నేరస్తుని పట్టుకోడానికి మీకు 12 సంవత్సరాలు పట్టిందా? ఎక్కడ ఉన్నాడు?" అంటూ కోపంగా అడిగింది గీత.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "ఆ రోజే అతనిని అరెస్టు చేశారు అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు మీరు వచ్చి ఒక్క సాక్ష్యం చెబితే చాలు జీవితాంతం జైల్లోనే ఉంటాడు." అంటూ అబీర్ ని చూపించాడు శ్రీకర్.
"అవునా?" అంటూ అభిర్ వైపు చూసి "ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు నా భర్త చంపిన మనిషిని నా కళ్ళారా చూశాను ఎప్పటికీ మర్చిపోను." అంటూ ఏడుస్తూ చెప్పింది గీత.
"మీరు చెప్పింది నిజమేనా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "మరి మీ భర్తను చంపిన కేసులో 12 సంవత్సరాలుగా అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు హంతకుడు ఎవరో మీకు తెలుసా?" అని అడిగింది వసుంధర.
ఇంటి లోపలికి తీసుకువెళ్లి "నా భర్తను చంపిన మనిషిని చూడడం అదే మొదటిసారి కానీ అతని ఫేస్ ని ఎప్పటికీ మర్చిపోను అసలు ఈ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు." అంది గీత.
"మరి అబీర్ హత్య చేశాడు అని మీరు కన్ఫామ్ చేసినట్లు స్టేట్మెంట్లో ఉంది." డౌట్ గా అడిగాడు శ్రీకర్.
"నా భర్తను చంపిన కేసు కోర్టులో ఉన్న విషయం కూడా నాకు తెలియదు ఆరోజు నా ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయాను." అని చెప్పింది గీత.
"ఓ మై గాడ్! ఈ కేసు మొత్తం ఫ్రాడ్! ఆ ఫైల్ లో ఉన్న ప్రతి విషయం అబద్ధమే! అన్యాయంగా ఈ కేసులో అభిర్ ని బలి పశువుని చేశారు." అంటూ కోపంగా అంది వసుంధర.
గీత వైపు చూస్తూ "మేడం! మీ భర్తని ఎందుకు చంపారో తెలుసా?" అని అడిగాడు శ్రీకర్.
"నాకు ఆ విషయాలు ఏమీ తెలియదు కానీ ఆయన చనిపోవడానికి ముందు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎలాగైనా దీన్ని సరి చేయాలి అంటూ బాధపడుతూ ఉండేవారు కానీ ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు." అంటూ బాధపడుతూ అంది గీత.
"మీరు మాతో పాటు వచ్చి కోర్ట్ లో జరిగిన విషయం చెప్పి ఒక అమాయకుడిని ఈ కేసు నుంచి రక్షించండి అన్యాయంగా 12 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడు." అని చెప్పింది వసుంధర.
సైలెంట్ గా ఉన్న గీత వైపు చూసి "మీ ఫ్యామిలీని సేఫ్ గా ఉంచే బాధ్యత మాది." అన్నాడు శ్రీకర్.
"అసలు మేము ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలిసింది?" అంటూ అనుమానంగా చూస్తూ అడిగింది గీత.

Rate " ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)