Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#35
ఎపిసోడ్ 9


లండన్ కి వచ్చిన తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఇండియా విషయం చెప్పి సుజిత్ ని పంపించడానికి అందర్నీ ఒప్పించింది అర్ణ.

"ఇండియా మీద అర్ణ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను." అని చెప్పాడు రఘురామ్.

*******************

ఉదయం నిద్ర లేచి రూమ్ లో అభిర్ కనపడకపోవడంతో కంగారుగా సందీప్ దగ్గరకు వెళ్లి "సార్! రూమ్ లో అభిర్ లేడు." అంటూ టెంక్షన్ గా చూస్తూ చెప్పాడు శక్తి దాస్.

"అవునా? చెప్పకుండా బయటకు వెళ్లొద్దని మరీ మరీ చెప్పాను అతని దగ్గర ఫోన్ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళాడో చూడండి అతనికి ఏదైనా జరిగితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి." అన్నాడు సందీప్.

"అన్నయ్య! పాప, కుక్క పిల్లా కూడా కనబడడం లేదు." అటు కంగారుగా అంది నీలమ్.

"ఒకవేళ రోషిని తీసుకుని అభిర్ బయటకి వెళ్ళాడా?"  అంటూ కంగారుగా బయటికి వచ్చింది వసుంధర.

అంతలో మంత్రలు వినపడడంతో అటువైపుగా వెళ్లి కృష్ణుడు విగ్రహం ముందు రోషినితో కలిసి కూర్చోని పూజ చేస్తున్న అభిర్ ని చూసి ఊపిరి పీల్చుకుని "ఇక్కడే ఉన్నారు ఎవరు కంగారు పడకండి." అన్నాడు సందీప్.

అభిర్ చదువుతున్న మంత్రాలు విని "చాలా స్పష్టంగా చదువుతున్నాడు." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అంది వసుంధర.

"సార్" ఈ మంత్రాలు ఎక్కడ విన్నట్లు లేదు చాలా కొత్తగా ఉన్నాయి." డౌట్ గా చూస్తూ అడిగాడు శక్తి దాస్.

"అభిర్ చదువుతున్నవి మంత్రాలు కాదు వేదం!" అంటూ దగ్గరకు వెళ్లి రోషిని తల మీద చేయి వేసి నవ్వుతూ చూసాడు సదీప్ రావు.

"అభిర్ కి వేదం కూడా వచ్చా అంటే అతను బ్రాహ్మణుడా!" అంది వసుంధర.

"వేదాలు బ్రాహ్మణులు మాత్రమే కాదు ఎవరైనా చదవచ్చు ఇంత స్పష్టంగా మా తాతగారు చదివేవారు." అంటూ చెట్ల మీద ఉన్న పక్షులను చూసి

"అంటూ చూడండి వేదం వింటూ పక్షులు కూడా కదలకుండా ఉన్నాయి." అని చూపించాడు సందీప్ రావు.

"అభిర్ దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి అసలు ఇతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కావడం లేదు." అంది నీలమ్.

"అబీర్ నోరు తెరిస్తేనే కానీ మనకి ఏ విషయం తెలియదు, మనం లంచ్ తర్వాత  మురళి జోషి భార్య దగ్గరికి వెళదాము.'

'ఈలోపు నువ్వు అబీర్ ని బయటికి తీసుకువెళ్లి అతనికి కావలసిన బట్టలు తీసుకో!" అని చెప్పింది వసుంధర.

అక్కడికి వస్తున్న అభిర్ వైపు చూసి "చాలా చక్కగా చదువుతున్నావు వేదం ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడిగింది నీలమ్.

"మా నాన్నగారు నేర్పించారు." అంటూ చెట్ల మీద ఉన్న పక్షులని చూసి "మనం ఒకసారి బయటికి వెళ్లి వాటికి ఆహారం తీసుకురావాలి." అన్నాడు అభిర్.

"నీకు పక్షులంటే చాలా ఇష్టం అనుకుంటా?" అని అడిగింది వసుంధర.

"నాకు కల్మషం లేని మనసు ఉన్న ఏ జీవి అయ్యినా ఇష్టమే మేడం!" అంటూ లోపలకి వెళ్ళాడు అభిర్.

లోపలికి వెళుతున్న అభిర్ ని చూసి "డిఫరెంట్ పర్సన్! ఇలాంటి వాళ్లు రేర్ గా ఉంటారు ఇంత కష్టం తనకి రాకుండా ఉండాల్సింది." అంది వసుంధర.

ఆ మాట విని వెనక్కి తిరిగి "దేవుడు మనకి కష్టం ఇచ్చాడు అంటే అది తట్టుకునే శక్తి మనలో ఉందని అర్థం!" అన్నాడు అభిర్.

"ట్రిపికల్ మైండ్! అతనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం!" అంటూ నీలమ్ కి కార్డ్ ఇచ్చి "అభిర్ కి ఏం కావాలంటే అవి తీసుకో!" అన్నాడు సందీప్.

"అవసరం లేదు సార్! నా దగ్గర ఉన్న వస్తువుని అమ్మేస్తాను." అంటూ పాకెట్ లోనుంచి స్టోన్ ఉన్న లాకెట్ ని బయటికి తీశాడు అభిర్.

"బాబు అబీర్! ఆ రాయిని ఎవరు తీసుకోరు ఆ సంచిలో బంగారపు ఉంగరాలు ఉన్నాయి కదా వాటిని తీసుకుంటారు." అన్నాడు శక్తి దాస్.

"ఈ ఆరు బంగారపు ఉంగరాలు అమ్మేవి కాదు ఇవి చేరవలసిన చోటు వేరే ఉంది." అంటూ రోషిని చేతికి ఇచ్చి  "నీ బొమ్మలు తో కలిపి వీటిని కూడా ఆడుకో!" అన్నాడు అభిర్.

"థాంక్యూ అంకుల్!" అంటూ కవర్ పట్టుకుని ఇంట్లోకి ఊరికింది రోషిని.

డ్రెస్ ఇస్తూ "ఇవి అన్నయ్య బట్టలు వేసుకో! మనం బయటికి వెళ్తున్నాము కదా కొత్తవి తీసుకుందాము." అంది నీలమ్.

బట్టలు తీసుకుంటూ "మీరు నాకు చేసిన సహాయానికి తప్పకుండా రుణం తీర్చుకుంటాను." అన్నాడు అభిర్.

కారులో శక్తి దాస్, కుమార్ తో పాటు అభిర్ తీసుకుని వెళ్ళుతు "ఆ స్టోన్ నీ దగ్గరే ఉంచుకో దానిని ఎవరు కోనరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి." నవ్వుతూ అంది నీలమ్.

"ఈ రాయి విలువ తెలిసిన వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు మీకు తెలిసిన షాపు దగ్గరికి వెళ్ళండి." అన్నాడు అభిర్.

"సరే నీ ఇష్టం!" అంటూ డైమండ్ జ్యువెలరీ దగ్గర కారు ఆపి "ఈ షాప్ ఢిల్లీలోనే పెద్దది ఇతను వదిన క్లైంట్ కూడా మనల్ని మోసం చేయకుండా కరెక్ట్ గా చెబుతాడు." అంది నీలమ్.

"సరే మేడమ్! మీ ఇష్టం!" అంటూ స్టోన్ నీలమ్ చేతిలో పెట్టాడు అభిర్.

"నన్ను పేరు పెట్టి పిలువు మేడం అంటే నేను ఏదో పెద్దదానిలాగా ఫీల్ అయిపోతున్నాను, నాకు కూడా సేమ్ నీ ఏజ్ 28 ఇయర్స్!" అంటూ నవ్వుతూ షాపులోకి వెళ్ళింది నీలమ్.

వెనకాల వెళుతూ "మేడం! మీరు కూడా ఏంటి ఆ రాయిని ఎవరు కొంటారు కనీసం దాంట్లో మెరుపు కూడా లేదు." అన్నాడు కుమార్.

"నాకు కూడా తెలుసు! కానీ అభిర్ ఆశ ని ఎందుకు చంపడం ఒక్కసారి అడిగి అతని ముందే చెప్పిస్తే అర్థమవుతుంది కదా!" అంటూ లోపలికి వెళ్లి షాప్ ఓనర్ వైపు చూసి

"సెట్ జి అచ్చ హై! మేము కొనడానికి రాలేదు ఒక వస్తువుని అమ్మడానికి వచ్చాము." అంటు నవ్వుతూ స్టోన్ ని టేబుల్ మీద పెట్టింది నీలమ్.

"నమస్తే మేడమ్! మీరు ఎందుకు వచ్చినా సరే వెల్కమ్ పలుకుతాము లేకపోతే మా షాపుని మీరు టీవీలో చూపించరు కదా!" అంటు స్టోన్ తీసుకుని చూస్తూ

"మేడం! దీని చుట్టూ ఉన్న లాకెట్ బంగారం కాదు ఈ స్టోన్ వ్యాల్యూ ఎంత ఉంటుందో ఇప్పుడే చెబుతాను." అంటు లోపలికి వెళ్ళాడు షాపు ఓనర్.

అభిర్ పక్కకి వెళ్లి కూర్చుని డిస్ప్లేలో వస్తువులు చూపిస్తూ "వజ్రాలు అంటే అవి చూడు ఎలా మెరుస్తున్నాయో!" అన్నాడు శక్తీ దాస్.

"అవునా?" అంటూ చూస్తూ "అటువంటి రాళ్లు నీ దగ్గర ఉన్నాయా?" అని అడిగాడు అభిర్.

"నాకు అంత సీన్ లేదు పేరుకే పెద్ద ఆఫీసర్ ని నెలాఖరు వచ్చింది అంటే జేబులో చిల్లిగవ్వ ఉండదు." అంటూ డల్ గా చెప్పాడు శక్తి దాస్.

లోపలి నుంచి వస్తూ స్టోన్ ని ఒక ప్లేట్లో పెట్టి "మేడం ఈ స్టోన్ ఎక్కడ కొన్నారు? ఎంతకి కొన్నారు?" అని అడిగాడు షాప్ ఓనర్.

"ఆ స్టోన్  నా ఫ్రెండ్ ది!" అంటూ అభిర్ ని చూపించి "తనకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారంట! పర్వాలేదు ఉన్న విషయం చెప్పండి ప్రాబ్లం లేదు." అంది నీలమ్.

"నా ఉద్దేశం అది కాదు వసుంధర మేడం మాకు చాలా హెల్ప్ చేశారు మీ దగ్గర తీసుకున్న వస్తువులో మాకు లాభం అవసరం లేదు.'

'ఈ స్టోన్ కి వ్యాల్యూ కట్టడం చాలా కష్టం! ప్రెసెంట్ 50 లాక్స్ క్యాష్ ఇస్తాను, అమ్మిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను, కానీ ఈ స్టోన్ కి బిల్లు ఉండదు కనుక మీ ఫ్రెండ్ తో ఒక లెటర్ ఇప్పించాలి." అన్నాడు షాపు ఓనర్.

"ఓకే!" అంటూ అభిర్ వైపు ఆశ్చర్యంగా చూసింది నీలమ్.

షాపు ఓనర్ చెప్పింది విని డ్రింక్ తాగుతూ పోలమారి దగ్గుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు కుమార్, దాసులు.

"వన్ మినిట్! వదినకి ఒక మాట చెప్పి అమౌంట్ తీసుకుంటాను." అని చెప్పి కాల్ చేసి వసుంధర కి విషయం చెప్పింది  నీలమ్.

"అవునా? నిజంగా అంత వాల్యూ ఉందా? కేసు ఫైల్ లో అరెస్టు చేసినప్పుడు అభిర్ మెడలో ఉంది అని రాశారు, అంటే ఆ స్టోన్ తనదే ఫార్ధార్ గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు." అని చెప్పింది వసుంధర.

"ఓకే!" అంటూ పేపర్ మీద మేటర్ రాసి అభిర్ తో సంతకం పెట్టించి షాప్ ఓనర్ కి ఇచ్చి క్యాష్ తీసుకుని "వెళదామా? దానిని అమ్మిన తర్వాత మిగతా క్యాష్ ఇస్తారు." అని చెప్పింది నీలమ్.

"సరే!" అంటూ వెళ్లి కార్ లో కూర్చున్నాడు అభిర్.

మాల్ కి వెళ్లి బట్టలు కొంటూ "అభిర్! అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కేసులో ఎలా ఇరుక్కున్నావు? నీకు చెప్పాలి అనిపిస్తేనే లేకపోతే ఇంకా ఎప్పుడు అడగను." అంది నీలమ్.

"సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతాను, కానీ నేను మీకు హాని చేసే వాడిని మాత్రం కాదు! మధ్యాహ్నం మీతో పాటు నేను కూడా మురళి జోషి భార్య దగ్గరికి వస్తాను." అన్నాడు అభిర్.

"మేడమ్! అభిర్ అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది ఒప్పుకోకండి." అంటూ స్లోగా చెప్పాడు శక్తి దాస్.

"ఓకే!" అంటూ అభిర్ వైపు చూసి "వదినని అడిగి చెప్తాను మనతో పాటు ఈ కేస్ ఎంక్వయిరీ చేసే ఆఫీసర్ గారు కూడా వస్తారు ఆయన కూడా ఒప్పుకోవాలి కదా!" అంది నీలమ్.

"సరే! రోషినికి కూడా బట్టలు తీసుకోండి." అని చెప్పి బట్టలు తీసుకుని పక్షులకు వేసే ఆహారం తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చాడు అభిర్.

ఇంటికి వస్తున్న నీలమ్ వైపు చూసి "నీకోసమే వెయిట్ చేస్తున్నాము శ్రీకర్ కూడా వచ్చాడు నువ్వు రెడీ అయితే వెళదాము." అంది వసుంధర.

"వదిన మనతో పాటు ఆ ఇంటికి అభిర్ కూడా వస్తానని అడిగాడు తీసుకువెళదామా?" అని అడిగింది నీలమ్.

"నో ప్రాబ్లం మేడమ్! తీసుకురండి అభిర్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే కొన్ని నిజాలు కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది." అన్నాడు శ్రీకర్.

"ఓకే!" అంటూ అభిర్ తో కలిసి మురళి జోషి ఇంటి దగ్గరికి బయలుదేరారు అందరు.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 30-12-2025, 08:22 PM



Users browsing this thread: 1 Guest(s)