28-12-2025, 10:50 PM
ఎపిసోడ్ 7
ఇంటికి వచ్చిన హిర్వాణి తో "ఈ కేస్ ఇంపాక్ట్ అర్థమయింది. రేపు అభిర్ రిలీజ్ అవుతాడు." అని చెప్పింది వసుధర.
మిథున్ నుంచి మెసేజ్ రావడంతో డిన్నర్ కి వెళ్లి వీడియో కాల్ లో అర్ణ ని చూసాడు హిర్వాణి.
*********************
వీడియో కాల్ లో అర్ణని చూస్తూ "మేడమ్! మీరు నా నుంచి ఏమి వినాలి అనుకుంటున్నారో అడగండి." అంటూ వినయంగా చెప్పాడు హిర్వాణి.
"మా తాత గారికి మీకు ఉన్న డీల్ ఏమిటో నేను తెలుసుకోవాలి ఏమీ లేదు అని మాత్రం చెప్పకండి. ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది.'
'ఇండియాలో మా తాతగారు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? అక్కడికి వస్తే అరెస్టు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా?" డౌట్ గా అడిగింది అర్ణ.
"మేడం! తాతయ్య గారి మీద కేసు ఉంటే ఇన్ని రోజులు ఉండనిస్తానా ఎప్పుడో క్లోజ్ చేయించేవాడిని అలాంటిదేమీ లేదు." అన్నాడు హిర్వాణి.
"మరి ఇండియా లో మాకు ఉన్న ఇష్యూ ఏమిటి? లాయర్లకి, గ్యాంగ్ స్టార్స్ కి పేమెంట్ ఎందుకు చేస్తున్నారు? నాకు క్లారిటీ కావాలి త్వరలో ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ క్లోజ్ చేయాలి, ఆ డిల్స్ మొత్తం మీ చేతుల మీదే జరగాలి అనుకుంటున్నాను." అంది అర్ణ.
"థాంక్యూ మేడం! ఈ విషయం గురించి ఎక్కడ నోరు విప్పనని మీ తాత గారికి మాటిచ్చాను, కానీ మీరు ఆ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అది కాకుండా మిథున్ సార్ ముందు నన్ను కూర్చో పెట్టారు కాబట్టి చెబుతున్నాను.'
'12 సంవత్సరాల క్రితం ఒకరోజు మీ తాతగారు నాకు ఫోన్ చేసి NIA ఆఫీసర్ మురళి జోషి మర్డర్ జరిగింది ఆ కేస్ లో ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి జైలుకి పంపించాలి.'
'అతను జైల్లో ఉన్న విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు అతను జీవితం జైల్లోనే ముగిసిపోవాలి ఈ డీల్ చేయడం నీవల్ల అవుతుందా అని అడిగారు.'
'నేను మీ తాత గారితో డీల్ చేసుకొని అభిర్ అనే పదహారేళ్ల పిల్లాడిని ఆ కేసులో ఇన్వాల్వ్ చేశాను, బాల నేరస్తుడు కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత బయటికి వస్తాడు.'
అందుకే అతనికి 18 సంవత్సరాలు అని సర్టిఫికెట్ సృష్టించి తీహార్ జైల్ కి పంపించి ఈ కేస్ బెంచ్ మీదకి కూడా రాకుండా చేసి 12 సంవత్సరాలుగా అతన్ని లోపలే ఉంచగలిగాను.'
'ఈ కేస్ గురించి కానీ, అభిర్ జైల్లో ఉన్న విషయం గురించి గానీ బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం మిచల్ అనే గ్యాంగ్ స్టర్ కి పేమెంట్ ఇచ్చి ఈ కేస్ గురించి తెలిసిన వాళ్లందర్నీ చంపించేసాము.'
'కానీ ఈ కేసు మళ్లీ రి ఓపెన్ అయ్యి సిబిఐకి అప్పగించారు అభిర్ బెయిల్ మీద బయటకి వస్తున్నాడు." అని చెప్పాడు హిర్వాణి.
"ఓకే! ఆ అభిర్ ఎవరు? 16 సంవత్సరాలు ఉన్న ఒక పిల్లడికి భయపడి మా తాతగారు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది?" డౌట్ గా అడిగింది వర్ణ.
"నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదు మేడమ్! అభిర్ కోసం ఇప్పటివరకు ఎవరు రాలేదు, సెక్యూరిటీ అధికారి ఎంక్వైరీలో కూడా అతను నోరు తెరిచి ఏ విషయం మాట్లాడలేదు.'
'ఇప్పుడు బెయిల్ కూడా ఒక లాయర్ చొరవతో వస్తుంది అతనికి ఆ లాయర్ కి కూడా ఎటువంటి సంబంధం లేదు." అని చెప్పాడు హిర్వాణి.
"అవునా? చాలా విచిత్రంగా ఉంది. మా నాన్నగారు గోకుల్ నంద గారు ఎలా చనిపోయారో ఎవరు చంపారో మీకు తెలుసా?" అని అడిగింది అర్ణ.
"ఆరోజు మురళి జోషి చనిపోయిన ప్లేస్ లోనే మీ నాన్నగారి బాడీ కూడా ఉంది. ఆయన్ని చాలా దారుణంగా నరికి చంపారు ఒంటి మీద 72 కత్తిపోట్లు ఉన్నాయి.'
ఈ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేయమని మీ తాతగారు చెప్పారు అందుకని ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్లు సృష్టించాము.'
'నాకు తెలిసి ఆ ఇద్దరిని కచ్చితంగా ఐదు ఆరుగురు కలిసి చంపి ఉంటారు ఒక్క మనిషి వల్ల అలా చంపడం సాధ్యం కాదు.'
'ఈ కేస్ మొత్తాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేయడం వల్ల నిజమైన హంతకులు ఎవరు అనేది మీ తాత గారికి ఆ దేవుడికి మాత్రమే తెలియాలి. " అన్నాడు హిర్వాణి.
"మన మీటింగ్ విషయం తాత గారికి తెలియాల్సిన అవసరం లేదు, ఈ కేస్ విషయం లో మా తాతగారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి.'
'టైమ్ వచ్చినప్పుడు నేను ఎంటర్ అవుతాను, ఈ లోపు అభిర్ గురించి ఏ విషయం తెలిసినా నాకు ఇన్ఫామ్ చేయండి.'
'మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మిథున్ ని అడగండి చాలు అయిపోతుంది." అంటూ కాల్ కట్ చేసింది అర్ణ.
లాప్టాప్ క్లోజ్ చేసి దూరంగా ఉన్న మిథున్ వైపు చూసి "సార్! మేడం కాల్ నుంచి వెళ్ళిపోయారు." అన్నాడు హిర్వాణి.
"ఓకే!" అంటూ అక్కడికి వస్తూ "మీరు మాట్లాడిన అర్ణ నంద గ్రూప్ కి వారసురాలు మాత్రమే కాదు ఆ కంపెనీకి కాబోయే చైర్మన్!'
'తన తెలివికి నేను కూడా సరెండర్ అయిపోయాను జాగ్రత్తగా వాడుకోండి మీ ఫ్యూచర్ బ్రైట్నెస్ తగ్గదు." అన్నాడు మిథున్.
"ఓకే సార్! డిన్నర్ కు పిలిచి మంచి ట్రేట్ ఇవ్వడమే కాకుండా మంచి డీల్ కూడా ఇచ్చారు." అంటూ స్మైల్ ఇచ్చాడు హిర్వాణి.
"ఓకే! మళ్లీ కలుసుకుందాము వెళ్లేటప్పుడు ఆ వైన్ బాటిల్ తీసుకువెళ్లండి మీరు ఇష్టంగా తాగడం చూశాను." అన్నాడు మిథున్.
"థాంక్యూ సార్!" అంటూ కార్ లో ఇంటికి వెళుతూ ఫోన్ చేసి "నమస్తే సార్! ఆబీర్ కి బెయిల్ వచ్చింది. మిచల్ రెండు రోజుల్లో ఢిల్లీకి వస్తున్నాడు వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతాడు." అన్నాడు హిర్వాణి.
"అవునా? లాయర్ వసుంధర తో డీల్ కుదరలేదా?" అని అడిగాడు ముకుల్.
"నో సార్! ఆవిడకి డబ్బు ఎక్కువైతే మాయరోగం వస్తుందంట!" అన్నాడు హిర్వాణి.
"ఈ కేసు వెనకాల నేను ఉన్న విషయం ఎప్పటికీ బయటకు రాకూడదు వస్తే మిచల్ కి మరో 100 కోట్ల ట్రాన్స్ఫర్ చేస్తాను." అంటూ ఫోన్ పెట్టేసాడు ముకూల్ నంద.
కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ "పెద్ద వాళ్ళతో డీలింగ్ అంటే డబ్బుతో పాటు డేంజర్ కూడా వెనకాలే ఉంటుంది. అసలు ఆ అభిర్ గాడితో ఈ ముసలోడికి ప్రాబ్లం ఏమిటో ఇప్పటివరకు అర్థం కాలేదు." అనుకుంటూ ఇంటి దగ్గర దిగాడు హిర్వాణి.
******************
ఉదయం జైలుకి వచ్చి బెయిల్ పేపర్స్ సబ్మిట్ చేసి అభిర్ ని రిలీజ్ చేయించి తీసుకువెళ్లడానికి ప్రిపేర్ అయ్యారు వసుంధర, నీలమ్ లు.
అక్కడికి తన ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి వచ్చి "గుడ్ మార్నింగ్ లాయర్ గారు! ఐ యాం శ్రీకర్ సీబీఐ! ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ అయ్యాను.'
'వీళ్లిద్దరు నా అసిస్టెంట్స్ శక్తిదాస్, కుమార్ ఈ కేస్ కంప్లీట్ అయ్యేంతవరకు అబీర్ తో పాటు ఉంటారు." అంటూ పేపర్స్ ఇచ్చాడు శ్రీకర్.
"అభిర్ మా ఇంటి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లోనే ఉంటాడు వీళ్లు కూడా అతనితోపాటు అక్కడే ఉండొచ్చు తొందరలోనే ఈ కేసు కంప్లీట్ అవుతుంది." అని చెప్పింది వసుంధర.
"మీకు మా కోపరేషన్ తప్పకుండా ఉంటుంది అలాగే ఆబిర్ కోపరేషన్ కూడా ఉంటే ఈ కేసు ఇంకా స్పీడ్ గా క్లోజ్ చెయ్యొచ్చు!" అంటూ బయటికి వస్తున్న అభిర్ వైపు చూసి
"ఈరోజు నుంచి నీతో పాటు ఈ ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు, నువ్వు వీళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావని తెలిస్తే వెంటనే నీ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది.'
'అలాగే! మీడియా ముందు గాని సోషల్ మీడియాలో గాని ఈ కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు." అని చెప్పాడు శ్రీకర్.
"ఓకే సార్!" అంటూ తనతో పాటు ఉండే ఇద్దరి ఆఫీసర్స్ ని చూసి, ఎదురుగా ఉన్న వసుంధర వైపు చూస్తూ స్మైల్ ఇచ్చి నమస్కారం చేశాడు అభిర్.
కవర్ తీసి టేబుల్ మీద పెడుతూ "అభిర్! నువ్వు జైలుకి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న వస్తువులు." అని ఇచ్చాడు సందీప్ రావు.
కవర్ తీసుకుని జేబులో పెట్టుకొని శంకర్ వైపు చూసి "బాబాయ్! వెళుతున్నాను మళ్లీ ఇక్కడికి రాను, మొక్కలని జాగ్రత్తగా చూసుకో!" అని చెప్పాడు అభిర్.
"సరే! రోజు నీళ్లు పోస్తాను జాగ్రత్తగా వెళ్ళిరా! రోజు వచ్చి కలుస్తూ ఉంటాను." అంటూ సంతోషంగా చెప్పాడు శంకర్.
కాసేపటికి ఇంటి దగ్గరికి చేరుకుని అవుట్ హౌస్ చూపిస్తూ "అభిర్! ఈరోజు నుంచి కేస్ కంప్లీట్ అయ్యేవరకు ఈ ఇంటిలోనే ఉండాలి తరువాత నీ ఇష్టం!" అని చెప్పింది వసుంధర.
"ఓకే మేడం!" అంటూ ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి కళ్ళు మూసుకుని "చాలా ప్రశాంతంగా ఉంది." అని చెప్పాడు అభిర్.
"శక్తి దాస్, కుమార్! మీకోసం ఇక్కడే సపరేట్ గా రూమ్ ఉంది ఏది అవసరమైన నాకు చెప్పండి." అంది వసుంధర.
"ఓకే మేడం! మీరు ఈ కేస్ డీల్ చేశారు అంటే న్యాయం అబీర్ వైపు ఉందని అర్థం అయింది. మా డ్యూటీ ప్రకారం మేము ఇక్కడ ఉంటాము మా వల్ల ఎవరికి డిస్టబెన్స్ ఉండదు." అని చెప్పాడు శక్తిదాస్.
"సారీ అబీర్! నీ డాక్యుమెంటరీని టీవీలో టెలికాస్ట్ చేయలేకపోయాను కానీ ఎప్పటికైనా నీ స్టోరీ మొత్తం ఒక సీరియల్ లాగా తీసి అందరికీ చూపిస్తాను." అంటు నవ్వుతూ చెప్పింది నీలమ్.
అక్కడికి వచ్చి "హాయ్ అంకుల్!" అంటూ కృష్ణుడి బొమ్మ అభిర్ చేతిలో పెట్టి "వెల్కమ్ టు మై హోమ్! ఇది నా ఫ్రెండ్ పేరు టామీ అది కూడా మీకు హాయ్ చెబుతుంది." అంది రోషిని.
కృష్ణుడి బొమ్మ తీసుకొని రోషిని తల మీద చేయి వేసి "మీ అమ్మాయికి కూడా మీలాగా మంచి మనసు ఉంది మూగజీవిని తను ఫ్రెండ్ గా చేసుకుంది." అంటూ సంతోషంగా చూస్తూ చెప్పాడు అభిర్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)